
మహారాష్ట్రలోని ముంబైలో అటల్ సేతుపై నుంచి దూకి ఓ యువ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు డోంబవలికి చెందిన శ్రీనివాసన్ కురుటూరి (38)గా పోలీసులు గుర్తించారు. శ్రీనివాసన్ బుధవారం మధ్యాహ్నం 12.24 గంటలకు అటల్ సేతుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై న్హవా షెవా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
అటల్ సేతు వద్దనున్న సీసీటీవీ ఫుటేజీలో ఒక కారు అటల్ సేతు వద్ద అకస్మాత్తుగా ఆగడం, ఒక వ్యక్తి కారులో నుండి బయటకు వచ్చి వంతెన రెయిలింగ్‌పైకి వేగంగా ఎక్కి, సముద్రంలోకి దూకడం కనిపిస్తుంది. మృతుడు శ్రీనివాసన్ విదేశాల్లో ఉద్యోగం చేసేవాడని పోలీసులు గుర్తించారు. ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చి వ్యాపారం ప్రారంభించాడు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. పోలీసులు స్థానికుల సాయంతో సముద్రంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.