తలనొప్పి అన్నాడు.. తీరా చూస్తే ! | engineering Student Suicide in Anna Nagar | Sakshi

తలనొప్పి అన్నాడు.. తీరా చూస్తే !

Sep 21 2017 8:12 PM | Updated on Jul 11 2019 6:33 PM

తలనొప్పి అన్నాడు.. తీరా చూస్తే ! - Sakshi

తలనొప్పి అన్నాడు.. తీరా చూస్తే !

ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అన్నానగర్‌:  ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్లూవేల్‌ క్రీడ ప్రభావమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన తేని జిల్లాలో చోటుచేసుకుంది.  వివరాలివి.. జిల్లాలోని సిప్పాలకోటకు చెందిన బాలమురుగన​ కుమారుడు రఘువరన్‌(21). ఇతను కోయంబత్తూర్‌లోని ప్రైవేట్‌ కాలేజీలో ఇంజనీరింగ​ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.

హాస్టల్లో ఉండి కాలేజీకి వెళుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రఘువరన్‌ కళాశాల నుంచి ఇంటికి వచ్చాడు.  రాత్రి తలనొప్పిగా ఉందని చెప్పి బెడ్‌రూంకు వెళ్లి పడుకున్నాడు. బుధవారం ఉదయం 11 గంటలైనా గది నుంచి బయటకు రాలేదు. కుటుంబసభ్యులు తలుపు పగులగొట్టి చూస్తే రఘువరన్‌ ఉరివేసుకుని శవంగా వేలాడుతూ కనిపించాడు.

అతని ఎడమ చేతిపై గాయం ఉంది. దీంతో బ్లూవేల్‌ గేమ్‌లో నిమగ్నుడు కావడం వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్గం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని మనూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గత నెల ఆంధ్రాలో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో రఘువరన్‌ బంగారు పతకాన్ని సాధించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Photos

View all
Advertisement