
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బుర్రాబజార్ ఏరియా ఫల్పట్టి మచ్చువా అనే పండ్ల మార్కెట్ సమీపంలో ఉన్న హోటల్ రుతురాజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 14 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద మరణాల్ని కోల్‌కతా సీపీ మనోజ్ కుమార్ వర్మ అధికారికంగా ప్రకటించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి 8:15 గంటలకు జరిగినట్లు సమాచారం.
VIDEO | Kolkata hotel fire: Police Commissioner Manoj Verma says, "A fire incident was reported at Ritu Raj Hotel in Mechuapatti area at about 8:15 am on Tuesday evening. At least 15 casualties have been reported so far and several people were rescued from rooms and roof of the… pic.twitter.com/8YkIfq6oSe
— Press Trust of India (@PTI_News) April 30, 2025
ఈ దుర్ఘటనపై సీపీ మనోజ్ కుమార్ మాట్లాడారు.‘ అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన పద్నాలుగు మృతదేహాలను వెలికితీశాం. గాయపడిన బాధితులను మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాం. మంటలు అదుపులోకి వచ్చాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని అన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రాణాలతో బయటపడిన పలువురు ప్రమాదంపై మాట్లాడారు. ముందుగా హోటల్ కారిడార్లలో దట్టమైన పొగకమ్ముకుంది. ఆ తర్వాత కరెంట్ పోయిందని చెప్పారు. హోటల్‌లో ఉన్న పలువురు ప్రాణాల్ని రక్షించుకునేందుకు హోటల్ కిటికీలను పగలగొట్టి బయటపడేందుకు ప్రయత్నించారు. మరి కొంతమంది ప్రమాదం నుంచి బయటపడే దారిలేక అలాగే గదుల్లోనే ఉండిపోయారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకు సిబ్బంది వారిని రక్షించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు.