
తిరువనంత పురం : మరోసారి కేరళకు భారీ ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం వయనాడ్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో కేరళలోని ఎనిమిది జిల్లాలకు రెడ్ అలెర్ట్ వాతావరణ శాఖ. ఇక వయనాడ్,కోజికోడ్,మలల్లా, పాలక్కాడ్, ఇడేక్కి సహా ఎనిమిది జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే ప్రాజెక్ట్‌లు, డ్యాంలు నిండుకుండలా మారాయి. వరదల ధాటికి వయనాడ్ మృతుల సంఖ్య 94కి చేరింది. చలియాద్ నదిలోకి మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి.