
న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులకు అంగీకారం తెలపడంలో రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్ విపరీతమైన జాప్యం చేస్తున్నారని కేరళ ప్రభుత్వం ఆక్షేపించింది. బిల్లులకు త్వరగా అంగీకారం తెలిపేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ లు చేసింది.
ప్రజల హక్కులను గవర్నర్ అగౌరవపరుస్తున్నారని పేర్కొంది. ప్రస్తుతం 8 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. వాటిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలియజేసింది. ఇవన్నీ ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులేనని ఉద్ఘాటించింది.