భద్రాచలం మీదుగా తూర్పుగోదావరి వరకు కొత్త రైల్వే లైన్‌: మంత్రి అశ్విని వైష్ణవ్‌ | Minister ashwini vaishnaw Says New Railway Lines In Telangana And AP | Sakshi

భద్రాచలం మీదుగా తూర్పుగోదావరి వరకు కొత్త రైల్వే లైన్‌: మంత్రి అశ్విని వైష్ణవ్‌

Published Sat, Aug 10 2024 3:16 PM | Last Updated on Sat, Aug 10 2024 3:19 PM

Minister ashwini vaishnaw Says New Railway Lines In Telangana And AP

సాక్షి, ఢిల్లీ: బెంగాల్‌లోని అసోన్‌సోల్‌ నుంచి వరంగల్‌ వరకు కొత్త రైల్వే కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విణి వైష్టవ్‌. రాబోయే ఐదేళ్ల కాలంలో దీన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు జరుగుతాయన్నారు.

కాగా, రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అసోన్‌సోల్ నుంచి వరంగల్ వరకు కొత్తగా రైల్వే కారిడార్ ప్లాన్‌ చేశాం. రూ.7,383 కోట్లతో మల్కాన్ గిరి నుంచి  పాండురంగపురం వరకు వయా భద్రాచలం మీదుగా తూర్పుగోదావరి వరకు నూతన రైల్వే లైన్‌కు శ్రీకారం చుట్టాము. ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నాము. బొగ్గు రవాణాకు ఈ కారిడార్‌ ఎంతగానో సహాయపడుతుంది. అలాగే, పవర్‌ ప్లాంట్‌కు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

ఇక, గోదావరి నదిపై కూడా ఒక బ్రిడ్జి నిర్మిస్తాం. ఏపీలో 85.5 కిలోమీటర్లు, తెలంగాణలో 19 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం చేపడుతున్నాం. తుపాను వంటి విపత్తుల సమయంలో ఈ లైన్‌లో రైల్వేలు నడుపుతాం. విశాఖ రైల్వే జోన్ కోసం చర్చలు జరుగుతున్నాయి అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement