
తిరువనంతపురం: వాతావరణ శాఖ(ఐఎండీ) గుడ్‌న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు మరో 5 రోజుల్లో కేరళను తాకేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయని తెలిపింది. కేరళను తాాకిన తర్వాత రుతుపవనాలు సకాలంలో తర్వాత దేశమంతా విస్తరించేందుకు అవకాశాలున్నాయని పేర్కొంది.
ఈసారి దేశంలో సాధారణం, సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఈశాన్యంలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు పడతాయని వెల్లడించింది.
రానున్న ఐదురోజుల్లో పశ్చిమ తీరంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటకల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీల్లో హీట్‌వేవ్ పరిస్థితులు ఈ నెలాఖరువరకు కొనసాగుతాయని తెలిపింది.