
న్యూఢిల్లీ: పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తో భారత్ తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధమైన తరుణంలో బీఎస్ఎఫ్ జవాన్ ఒకరు పాక్ సైన్యం చేతిలో బందీ అయ్యారు. అనుకోకుండా పంజాబ్‌లోని ఫెరోజ్‌పూర్ బోర్డర్ దాటిన క్రమంలో పీకే సింగ్ అనే జవాన్ ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. దీనిపై పాకిస్తాన్ సైన్యంతో భారత్ సైన్యం చర్చలు జరుపుతుంది.
పాక్ చేతిలో బందీగా మారిన భారత్ జవాన్ ను సురక్షితంగా విడిచిపెట్టాలని బీఎస్ఎఫ్ అధికారులు.. పాక్ బోర్డర్ సెక్యూరిటీ అధికారిని కోరారు. అది యాధృచ్ఛికంగా జరిగిన ఘటనేనని, సదరు జవాన్ కావాలని పాక్ బోర్డర్ లో అడుగుపెట్టలేదనే విషయాన్ని తెలిపినట్లు భారత్ కు చెందిన బీఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.