జల్లెడ పడితే.. ‘చీమల దండులా’ బయటకొచ్చారు! | Over 1000 illegal Bangladeshi immigrants detained | Sakshi
Sakshi News home page

జల్లెడ పడితే.. ‘చీమల దండులా’ బయటకొచ్చారు!

Published Sat, Apr 26 2025 5:12 PM | Last Updated on Sat, Apr 26 2025 6:04 PM

Over 1000 illegal Bangladeshi immigrants detained

అహ్మదాబాద్:  పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ జాతీయుల వీసాల రద్దు, వారిని తిరిగి వెనక్కి పంపించే చర్యలు కొనసాగుతున్న వేళ..  అక్రమంగా భారత్ లో నివసిస్తున్న విదేశీయులు వేల సంఖ్యలో బయటపడుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలో పోలీసులు నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ లో అక్రమంగా భారత్ కు వచ్చి ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి నివసిస్తున్న బంగ్లాదేశ్ కు చెందిన వారు వెయ్యి మందికి పైగా ఉన్నట్లు గుర్తించారు. 

కూంబింగ్  ఆపరేషన్ లో భాగంగా అక్రమ వలస దారుల వేరివేతకు శ్రీకారం చుడితే అహ్మదాబాద్, సూరత్ లలో కలిపి వెయ్యి మందికి పైగా అక్రమ బంగ్లా దేశీయులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వీ శనివారం తెలిపారు. అహ్మదాబాద్ లో నివసిస్తున్న బంగ్లాదేశీయులు 890 మంది కాగా, సూరత్ లో నివసిస్తున్న  బంగ్లా జాతీయులు 134 ఉన్నట్లు గుర్తించినట్లు హోంమంత్రి తెలిపారు. ఇది గుజరాత్ రాష్ట్రంలో అతిపెద్ద పోలీస్ ఆపరేషన్ అని ఆయన పేర్కొన్నారు.

స్వచ్ఛందంగా బయటకు రండి.. లేకపోతే

అక్రమ వలసదారులకు ఎవరైనా ఆశ్రయం ఇస్తే కఠినమైన చర్యలు ఉంటాయని సంఘ్వీ హెచ్చరించారు. ఎవరైనా ఇంకా ఉంటే స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఆపై తీసుకునే కఠిన చర్యలు దారుణంగా ఉంటాయన్నారు. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement