
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో న్యూఢిల్లీ లోక్ కల్యాణ్ మార్గ్‌లో ప్రధాని మోదీ నివాసంలో రెండున్నర గంటల పాటు కొనసాగిన భద్రత వ్యవహారాల కేబినేట్ కమిటీ (Cabinet Committee on Security)సమావేశం ముగింది. 9:15 నిమిషాలకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రప్రభుత్వం తీసుకోబోయే చర్యలను వివరించనున్నారు.
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహరాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశంలో హోమ్ మంత్రి అమిత్ షా, ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్‌లు పాల్గొన్నారు. సీసీఎస్ సమావేశంలో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు, నావికా దళం అధిపతి త్రిపాఠి, సైన్యాధిపతి ద్వివేది, వైమానిక దళాధిపతి అమన్ ప్రీత్ సింగ్‌లు హాజరయ్యారు.
ఈ సమావేశంలో భద్రతా వ్యవహరాల కేబినెట్ కమిటీ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ముందే పహల్గాం దాడికి పాల్పడ్డ ముష్కరులకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు.
#WATCH | #PahalgamTerrorAttack | Delhi: Raksha Mantri Rajnath Singh says, "We lost many innocent lives in the cowardly act in Pahalgam. We are deeply distressed. I express my condolences to the families who lost their loved ones... I want to repeat India's resolve against… pic.twitter.com/OhuX8rkghy
— ANI (@ANI) April 23, 2025