
భోపాల్: భారత్ జోడో యాత్రలో భాగంగా సోదరుడు రాహుల్ గాంధీతో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కలిసి నడిశారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రోహిన్‌తో కలిసి గురువారం రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు.
చెల్లెలితో కలిసి నడుస్తున్న ఫోటోను ట్విటర్‌లో షేర్ చేసిన రాహుల్.. ''మనం కలిసి నడిస్తే అడుగులు మరింత బలపడతాయంటూ'' పేర్కొన్నారు. ప్రియాంక వాద్రా భారత్ జోడోలో పాల్గొనడం ఇదే తొలిసారి. సోనియాగాంధీ కర్ణాటకలో రాహుల్‌తో కలిసి నడిశారు.
रास्तों से लड़कर हमने कई मुक़ाम बनाए हैं। साथ हैं तो यकीन है, मंज़िल ज़रूर पाएंगे। pic.twitter.com/hDuIdsVoNr
— Rahul Gandhi (@RahulGandhi) November 24, 2022
సెప్టెంబర్ 7న మొదలైన భారత్ జోడో యాత్ర.. నవంబర్ 23న మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది. రాష్ట్రంలో ఐదు లోక్‌సభ, 26 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పదకొండు రోజులపాటు భారత్ జోడో యాత్ర కొనసాగనుంది.
చదవండి: (కల్లలైన కలలు.. భర్త వివాహేతరసంబంధం.. మహిళా టెక్కీ ఆత్మహత్య)