Tiger Eating Leopard In The Picture Goes Viral - Sakshi
Sakshi News home page

వేటగాడే వేటకు బలి.. అరుదైన దృశ్యం నెట్టింట వైరల్‌..

Published Sat, Apr 1 2023 8:36 PM | Last Updated on Sat, Apr 1 2023 9:53 PM

Tiger Eating Leopard In The Picture Goes Viral - Sakshi

బలహీనుడిపై బలవంతుడుపై చేయి సాధించడం తెలిసిందే.. అయితే ఇద్దరు బలవంతుల మధ్య పోటీ జరిగితే విజయం ఎవరి వైపు ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ అరుదైన ఘటన గురించి తెలుసుకోవాల్సిందే. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్క్‌లో చిరుతపులిని తింటున్న పులి చిత్రాన్ని నెట్టింట షేర్‌ చేశారు.

రణతంబోర్ నేషనల్ పార్క్‌లో అనూహ్యంగా ఒక పులి చిరుతను వేటాడింది. వాటి మధ్య జరిగిన బీకర పోరులో చిరుత పులి చేతిలో ఓడిపోయి ప్రాణాలు కోల్పోయింది. చిరుతను చంపిన పులి ఆ తర్వాత దాని మాంసాన్ని ఎంతో ఇష్టంతో తింటోంది. అందులో సఫారీకి వచ్చిన పర్యాటకులు కొందరు ఈ ఘటనను ఫోటో తీశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఈ ఫోటో చూసిన నెటిజన్లు పులి, చిరుతపులి మధ్య పోరాటం చాలా అరుదని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement