
సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు తెగ అలరిస్తుంటాయి. ఇలాంటి కొన్ని వీడియోలు మనకు ఒకపట్టాన నమ్మశక్యం కాదు. తాజాగా ఇటువంటి వింత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన తర్వాత ‘ఇదేందిది’ అనకుండా ఉండలేరు. అలాగే నవ్వకుండానూ ఉండలేరు. మరి.. అంత వినోదం ఉంది ఈ వీడియోలో.. మనం కోతులకు సంబంధించిన వీడియోలను చూసేవుంటాం. అయితే ఇప్పుడు మనం చూడబోతున్న వీడియోలో ఈ కోతి చేష్టలు తారాస్థాయికి చేరాయనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన చాలా మంది.. కోతులకు నిజంగా ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
ఈ వైరల్ వీడియోలో ముందుగా పులులు అడవిలో విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యం కనిపిస్తుంది. అయితే అక్కడే చెట్టుపై నుంచి వేలాడున్న ఒక కోతి కిందినున్న పులిని తెగ ఆటపట్టిస్తుంటుంది. ఆ కోతి ఒకసారి పులి తోకను , మరోమారు దాని చెవిని పట్టుకుని లాగుతుంది. ఈ చేష్టలను పులి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అయినా ఫలితం లేకపోతుంది. ఈ కోతి చేష్టలు ఆ పులిని తెగ చికాకు పెడతాయి.
ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఆ వీడియోను చూసిన యూజర్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ఆ కోతి నిజంగానే పులితో ఒక ఆట ఆడుకున్నదని, ఇకపై ఆ పులులు కోతికి దూరంగా ఉంటాయంటూ కామెంట్ చేశారు.
ఇది కూడా చదవండి: ‘టీమిండియా గెలిచేవరకూ మెతుకు ముట్టం’
Gibbons like to live dangerously pic.twitter.com/kNHbYI0TDd
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 16, 2023