Game
-
ఏఐ తోడుంటే.. విజయం మీవెంటే..
ఆన్లైన్ గేమర్ల గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఏఐ-ఆధారిత అసిస్టెంట్ ‘కోపైలట్ ఫర్ గేమింగ్’ను మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించింది. ఇది ఆన్లైన్లో ప్లేయర్లకు సమయాన్ని ఆదా చేయడం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడం, ఇతర స్నేహితులు, గేమింగ్ కమ్యూనిటీలతో కనెక్ట్ అవ్వడంలో సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ ఏఐ టూల్‌కు సంబంధించిన విషయాలు పంచుకున్నారు.నైపుణ్యాలు పెంచేందుకు..కోపైలట్ ఫర్ గేమింగ్ అనేది గేమింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి, రియల్-టైమ్‌లో గేమర్లకు మద్దతుగా నిలిచేందుకు, వారి గేమింగ్ నైపుణ్యాలు పెంచేందుకు ఉద్దేశించిన ఏఐ ఆధారిత టూల్. ఈ ఏఐ అసిస్టెంట్ ప్లేయర్లకు మరింత వేగంగా గేమ్స్ సెట్ చేయడానికి, వారి ప్రాధాన్యతల ఆధారంగా కొత్త టైటిల్స్‌ను సిఫారసు చేయడానికి, అవసరమైనప్పుడు గేమ్‌లో సహాయాన్ని అందించడానికి తోడ్పడుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. కోపైలట్ ఫర్ గేమింగ్ ప్రారంభంలో ఎక్స్ బాక్స్ ఇన్ సైడర్ ప్రోగ్రామ్ ద్వారా మొబైల్లో అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇతర ప్లాట్‌పామ్‌లకు త్వరలో దీన్ని విస్తరిస్తామని పేర్కొన్నారు.With Copilot for Gaming, you can jump back into games faster, get real-time coaching, and stay connected... all on your own terms. Excited for what the team has in store! pic.twitter.com/18Ll2D25i1— Satya Nadella (@satyanadella) March 13, 2025ఇదీ చదవండి: మల్టీప్లెక్స్ స్టాక్ పంట పండింది..?ఈ ఏఐ అసిస్టెంట్‌ను సామర్థ్యం, అడాప్టబిలిటీ, పర్సనలైజేషన్ అనే మూడు ప్రధాన సూత్రాలకు అనుగుణంగా నిర్మించినట్లు కంపెనీ పేర్కొంది. ప్లేయర్ల అభిరుచులకు తగినట్లుగా గేమ్‌లను సెర్చ్ చేయడానికి, డౌన్లోడ్ చేయడానికి, వాటిని అప్డేట్ చేయడానికి సమయాన్ని ఆదా చేయడం, ప్లేయర్లు ఆటపైనే దృష్టి పెట్టేలా చేయడం దీని ఉద్దేశం. గేమింగ్ కోసం కోపైలట్ ప్లేయర్ నియంత్రణలో ఉంటుందని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. -
క్లాసికల్ అంటేనే ఇష్టం
న్యూఢిల్లీ: చదరంగంలో ఎన్ని ఫార్మాట్లు వచ్చినా... క్లాసికల్‌కు ఉన్న ప్రాధాన్యత వేరని ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ అన్నాడు. ఇటీవలి కాలంలో అన్నీ ఫార్మాట్లలో సత్తా చాటుతున్న గుకేశ్... తనకు స్వతహాగా సంప్రదాయ క్లాసికల్ గేమ్ అంటేనే ఎక్కువ ఇష్టమని వెల్లడించాడు. ‘ఏ ఫార్మాట్లో ఆడాలి అనే దాని గురించి పెద్దగా ఆలోచించను. ఫ్రీ స్టయిల్ ఉత్తేజకరమైన ఫార్మాట్... ఆడేటప్పుడు ఎంతో బాగుంటుంది. ఇప్పటి వరకు ఫ్రీస్టయిల్ విభాగంలో రెండు టోర్నీలు మాత్రమే జరిగాయి. ఇప్పుడే దానిపై వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుంది. ఫ్రీస్టయిల్ ఫార్మాట్ మరింత ఆదరణ పొందాలని కోరుకుంటున్నా. అదే సమయంలో క్లాసికల్ విభాగానికి ఉన్న ప్రాధాన్యత వేరు. ఘన చరిత్ర ఉన్న క్లాసికల్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ అన్నిటి కంటే అత్యున్నతమైంది. క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్కు ఫ్రీస్టయిల్ అదనం. నేను అన్నింట్లో ఆడాలని అనుకుంటున్నా’ అని గుకేశ్ శనివారం ఓ కాన్క్లేవ్లో అన్నాడు. వచ్చే నెల 7–14 వరకు జరగనున్న పారిస్ అంచె ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్‌స్లామ్ టూర్లో పాల్గొననున్నట్లు గుకేశ్ వెల్లడించాడు. ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్తో పాటు 12 మంది గ్రాండ్‌మాస్టర్లు పాల్గొంటున్న ఈ చెస్ గ్రాండ్‌స్లామ్ తొలి అంచె జర్మనీ పోటీల్లో విన్సెంట్ కెయిమెర్ విజేతగా నిలిచాడు. కెరీర్ తొలి నాళ్లలో ఎదుర్కొన్న ఆరి్థక కష్టాలను గుకేశ్ కాన్ క్లేవ్లో గుర్తుచేసుకున్నాడు. టోర్నమెంట్లలో పాల్గొనేందుకు డబ్బులు లేని సమయంలో తల్లిదండ్రుల స్నేహితులు అండగా నిలిచారని అన్నాడు. ‘ఒకప్పుడు పోటీలకు వెళ్లేందుకు తగినంత డబ్బు లేకపోయేది. కుటుంబ సభ్యులు ఎంతో ప్రయతి్నంచి నిధులు సమకూర్చేవారు. నిస్వార్ధపరమైన కొందరి సాయం వల్లే ఈ స్థాయికి వచ్చా. ఇప్పుడు ఆరి్థక ఇబ్బందులు తొలగిపోయాయి’ అని గుకేశ్ అన్నాడు. కొవిడ్–19 ప్రభావం తర్వాత దేశంలో చెస్‌కు మరింత ఆదరణ పెరిగిందని గుకేశ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ 100 మంది చెస్ ప్లేయర్లలో భారత్ నుంచి 13 మంది ఉన్నారని అది చదరంగంలో మన ప్రగతికి చిహ్నమని గుకేశ్ అన్నాడు. వీరందరికీ దారి చూపింది విశ్వనాథన్ ఆనంద్ అని... ఆయన బాటలోనే మరింత మంది గ్రాండ్‌మాస్టర్లు వచ్చారని పేర్కొన్నాడు. దేశంలో చెస్‌కు మంచి ఆదరణ లభిస్తోందని... స్పాన్సర్లతో పాటు ప్రభుత్వాలు కూడా అండగా నిలుస్తున్నాయని గుకేశ్ వివరించాడు. -
పోసాని అరెస్ట్ విషయంలో ఏపీ పోలీసులు గేమ్!
-
మస్క్ కొత్తగా గేమింగ్ స్టూడియో!
రాజకీయ ప్రమేయంలేని గేమింగ్ వ్యవస్థ ఉండాలని ఎక్స్ సీఈఓ ఇలాన్‌మస్క్ అన్నారు. మస్క్ ఆధ్వర్యంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ‘ఎక్స్ఏఐ’ సాయంతో త్వరలో ఏఐ ఆధారిత గేమింగ్ స్టూడియోను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. గేమింగ్ పరిశ్రమలో పెద్ద సంస్థల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ ఈ రంగాన్ని తిరిగి గొప్పగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ విభాగంలోని ప్రవేశిస్తున్నట్లు స్పష్టం చేశారు.ఆవిష్కరణలు కరవుగేమింగ్ పరిశ్రమలో మైక్రోసాఫ్ట్, సోనీ వంటి దిగ్గజ కంపెనీలతో పోటీ పడాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు మస్క్ తెలిపారు. ఈ పరిశ్రమలో ఆవిష్కరణలు లేక స్తబ్దత నెలకొందన్నారు. ఎక్స్ఏఐ ద్వారా ఈ పరిశ్రమను తిరిగి గొప్పగా తీర్చిదిద్దుతామన్నారు. డొజికాయిన్ గేమింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు బిల్లీ మార్కస్ ఇటీవల ఈ రంగంపై స్పందిస్తూ ఈ పరిశ్రమలో కార్పొరేట్ ఆధిపత్యం అధికమైందన్నారు. ఆయా సంస్థల వ్యక్తిగత ఆసక్తుల వల్ల ‘మానిప్యులేటివ్’ కార్యకలాపాలు ఎక్కువవుతున్నాయని చెప్పారు. మార్కస్ వ్యాఖ్యలను మస్క్ అంగీకరిస్తూ ‘చాలా గేమ్ స్టూడియోలు పెద్ద సంస్థల యాజమాన్యంలో ఉన్నాయి. గేమింగ్ పరిశ్రమను మళ్లీ గొప్పగా చేయడానికి ఎక్స్ఏఐ గేమ్ స్టూడియోను ప్రారంభించబోతోంది. రాజకీయ ప్రమేయంలేని గేమింగ్ వ్యవస్థ ఉండాలి’ అని తెలిపారు.ఎక్స్‌బాక్స్‌పై విమర్శలుమైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలోని గేమింగ్ బ్రాండ్ ‘ఎక్స్‌బాక్స్’లో వివక్షతతో కూడిన పద్ధతులను అనుసరిస్తున్నట్లు ఇటీవల విమర్శలొచ్చాయి. కొన్ని గేమ్‌ల్లో నల్లజాతీయులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, తెల్లవారిని ఆయా గేమ్‌ల్లో తక్కువ చేసి చూపిస్తున్నట్లు ఆరోపణలొచ్చాయి. దాంతో మస్క్ తన ఎక్స్ ఖాతాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను ట్యాగ్ చేస్తూ ‘ఇది చట్టవిరుద్ధం’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: అదానీ అప్పులపై బ్యాంకులు సమీక్షఇరువైపులా సంభాషించే ఏఐమార్చి 2023లో మస్క్ ఎక్స్ఏఐను స్థాపించారు. దీన్ని ‘గ్రోక్’ ఏఐ సాయంతో అభివృద్ధి చేశారు. ఇరువైపులా సంభాషించేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. కృత్రిమ మేధ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి అమెరికాలోని టేనస్సీలోని మెంఫిస్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ కంప్యూటర్ను ఏర్పాటు చేసే ప్రణాళికలను సైతం కంపెనీ గతంలో ప్రకటించింది. -
'ఎలిమినేట్ అయితే చంపేస్తారు'.. స్క్విడ్ గేమ్ ట్రైలర్ చూశారా?
2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. కొరియన్లో తెరకెక్కించిన ఈ సిరీస్ ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్‌కు దక్కిన ఆదరణతో స్క్విడ్ గేమ్ సీజన్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా సీజన్-2 ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మొదటి సీజన్ లాగే ఆర్థికంగా ఇబ్బందులు పడే కొంతమంది వ్యక్తులు.. డబ్బు సంపాదించడం కోసం ఈ గేమ్‌లో భాగమవుతారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.తెలుగులోనూ విడుదలైన ట్రైలర్ ఆడియన్స్‌ను మరింత ఆకట్టుకుంటోంది. గ్రీన్ లైట్, రెడ్ లైట్ వంటి గేమ్స్ ఈ సీజన్లో చూపించనున్నారు. ట్రైలర్లో సన్నివేశాలు, ప్రమాదకరమైన గేమ్స్ చూస్తుంటే హారర్ థ్రిల్లర్ లాంటి ఫీలింగ్ వస్తోంది. గేమ్‌లో పాల్గొన్న వారంతా ప్రాణాలతో బయటపడతారా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ స్క్విడ్ గేమ్ సీజన్- 2 డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.అసలు ఈ స్క్విడ్ గేమ్ ఏంటంటే..జీవితంలో అప్పులపాలైన 456 మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ రెడ్‌లైట్, గ్రీన్‌లైట్, టగ్ ఆఫ్ వార్ లాంటి చిన్నపిల్లలు ఆడుకొనే పోటీలు నిర్వహిస్తారు. ఇందులో మొత్తం సిక్స్ గేమ్స్ ఉంటాయి. చివరి గేమ్ పేరే స్క్విడ్ గేమ్. అయితే ఈ గేమ్స్‌లో ఓడిపోయిన వారిని ఎలిమినేషన్ పేరుతో చంపేస్తుంటారు. సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. -
ప్యాడెల్ టెన్నిస్ ఆడేద్దాం..!
ఎప్పుడైనా ప్యాడెల్ టెన్నిస్ గురించి విన్నారా? టెన్నిస్ గురించి తెలుసు.. బ్యాడ్మింటన్ గురించి తెలుసు.. ఇంకా స్క్వాష్ గురించీ తెలుసు కానీ కొత్తగా ప్యాడెల్ టెన్నిస్ అంటే ఏంటి అనుకుంటున్నారా..? అవును ఇది చాలా కొత్త గేమ్.. కాకపోతే చాలా ట్రెండీ గేమ్. మెక్సికోలో పుట్టిన ఈ గేమ్ ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమే. కానీ మన హైదరాబాదీయులకు మాత్రం ఇది కాస్త కొత్త గేమ్ అనే చెప్పుకోవచ్చు. కానీ ఇటీవల కాలంలో ప్యాడెల్ టెన్నిస్‌పై నగరవాసుల్లో ముఖ్యంగా యువతలో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడిప్పుడే ప్యాడెల్ టెన్నిస్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్యాడెల్ టెన్నిస్ అంటే ఏంటి? సాధారణ టెన్నిస్‌కు, ప్యాడెల్ టెన్నిస్‌కు మధ్య వ్యత్యాసాలేంటి? ఎలా ఆడుతారు..? ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుందాం..! ప్యాడెల్ టెన్నిస్ కూడా టెన్నిస్ లాంటి ఆటనే. 1969లో మెక్సికోకు చెందిన ఎన్రిక్ కార్క్యూరా అనే క్రీడాకారులు ఈ గేమ్ కనిపెట్టాడు. టెన్నిస్, స్క్వాష్ ఆటల కలయికనే ఈ ప్యాడెల్ టెన్నిస్. టెన్నిస్‌లో ఉన్నట్టే అన్ని రూల్స్ ఉంటాయి. కోర్టు, రాకెట్, వాడే బాల్ ఇలా చాలా విషయాల్లో కాస్త వ్యత్యాసాలు ఉన్నాయి. సాధారణంగా టెన్నిస్ కోర్టులు పెద్ద పరిమాణంలో, ఓపెన్‌గా ఉంటాయి. అయితే ప్యాడెల్ టెన్నిస్ కోర్టులు మాత్రం కాస్త చిన్న పరిమాణంలో మూసేసి ఉంటాయి. 20 మీటర్ల పొడవుతో, 10 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. అదే టెన్నిస్ కోర్టులు మాత్రం 23 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. ప్యాడెల్ గేమ్‌లో కాస్త ఫన్నీ అనిపించే అంశం ఏంటంటే.. చిన్నప్పుడు డబుల్ స్టెప్ ఔట్ అనుకునేవాళ్లం కదా.. అలాగే ఇక్కడ కూడా ఒక్కసారి వెనుక ఉన్న గోడకు తగిలి.. మరోసారి కోర్టులో బౌన్స్ అయినా కూడా ఆట కొనసాగించవచ్చు. చాలా మంది గోడకు బంతి తగిలేలా చేసి స్ట్రాటజీలా ఆడుతుంటారు. అదే టెన్నిస్‌లో మాత్రం ఒకసారే బౌన్స్ కావాల్సి ఉంటుంది. ఇక, వెనుక గోడలకు తగిలితే ప్రత్యరి్థకే పాయింట్ దక్కుతుంది. ఇదో సోషల్ గేమ్..ప్యాడెల్ టెన్నిస్‌ను సోషల్ గేమ్ అంటుంటారు. ఎందుకంటే దీన్ని కచి్చతంగా ఇద్దరు ఆటగాళ్లు జట్టుగా ఆడాల్సి ఉంటుంది. అదే టెన్నిస్ మాత్రం సింగిల్స్, డబుల్స్ కూడా ఆడొచ్చు. ఇక, రాకెట్ విషయంలో టెన్నిస్‌కు, ప్యాడెల్ టెన్నిస్‌కు చాలా తేడా ఉంటుంది. టెన్నిస్ రాకెట్లో స్ట్రింగ్స్ ఉంటాయి. అదే ప్యాడెల్ టెన్నిస్ రాకెట్లో స్ట్రింగ్స్ ఉండవు. పొడవు విషయంలో కూడా టెన్నిస్ రాకెట్ కన్నా ప్యాడెల్ రాకెట్ చిన్నగా ఉంటుంది. వెడల్పు ఎక్కువగా ఉంటుంది. అయితే వాడే బాళ్లు చూడటానికి ఒకేలా కనిపించినా.. కాస్త తేడా ఉంటుంది. టెన్నిస్ బాల్స్ గట్టిగా ఉంటాయి. అదే ప్యాడెల్ టెన్నిస్ విషయంలో కాస్త మెత్తగా, తక్కువ పీడనంతో ఉంటాయి. ఆడే విధానంలో కూడా రెండు గేమ్స్ మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ముఖ్యంగా బాల్ సరీ్వంగ్ విషయంలో చాలా రూల్స్ ఉంటాయి.ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్.. మనదేశంలో క్రికెట్ తర్వాత దాదాపు అదే స్థాయిలో ఆదరణ పొందుతోన్న గేమ్ టెన్నిస్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్యాడెల్ టెన్నిస్ ఆడుతున్నా.. చూస్తున్నా కూడా చాలా ఫన్ ఉంటుంది. ఉత్కంఠతో పాటు ఎంటర్టైన్మెంట్ పక్కా అంటున్నారు ప్యాడెల్ టెన్నిస్ శిక్షకులు. హైదరాబాద్‌లో కూడా పలు అకాడమీలు ఈ ప్యాడెల్ టెన్నిస్ నేరి్పస్తున్నారు.ఇప్పుడే ట్రెండ్ అవుతోంది.. హైదరాబాద్‌లో ఇప్పుడిప్పుడే ప్యాడెల్ టెన్నిస్ గురించి అవగాహన పెరుగుతోంది. నేర్చుకునేందుకు యువత, పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. టెన్నిస్‌తో పోలిస్తే ప్యాడెల్ టెన్నిస్ గురించి చాలా మందికి తెలియదు. ప్యాడెల్ టెన్నిస్‌లో ఫిట్నెస్తో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది. కొన్ని మెళకువలతో నేర్చుకుంటే ప్యాడెల్ టెన్నిస్ ఆడటం సులువే. – ఎన్.జగన్నాథం, టెన్నిస్ ట్రైనర్ -
సృజనాత్మకతలో దూసుకుపోతున్న పరిశ్రమ
వీడియో గేమింగ్ పరిశ్రమ కంటెంట్, సృజనాత్మకతలో దూసుకుపోతోందని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్(ఐడీజీసీ)-2024 బుధవారం 16వ ఎడిషన్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)లో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గేమింగ్ డెవలపర్లు, గేమింగ్ స్టూడియోలు, ఇతర గేమింగ్ ఔత్సాహికులు తమ ఆలోచనలు పంచుకోనున్నారు.ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ..‘ప్రభుత్వం గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ రంగంలో అధిక నాణ్యత ప్రతిభావంతులను తయారు చేసేందుకు పని చేస్తోంది. ప్రపంచ గేమింగ్ రంగంలో ఇండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. వీడియో గేమింగ్, ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ, రియల్ మనీ గేమింగ్ ఇండస్ట్రీకి మధ్య స్పష్టమైన తేడా ప్రభుత్వానికి తెలుసు. వీడియో గేమింగ్ పరిశ్రమ కంటెంట్, సృజనాత్మకతలో ముందంజలో ఉంది’ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (జీడీఏఐ) ఛైర్పర్సన్ శ్రీధర్ ముప్పిడి మాట్లాడారు. వీడియో గేమ్ డెవలపర్లు, వీడియో గేమింగ్ స్టూడియోలు ఈ పరిశ్రమలో ఇతర వాటాదారులతో ప్రాతినిధ్యం వహించేలా అపెక్స్ బాడీగా జీడీఏఐ వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: 10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దుఈ ఈవెంట్ మొదటి రోజున 6000 కంటే ఎక్కువ మంది హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం నవంబర్ 15 వరకు జరుగుతుందన్నారు. ఐజీడీసీ 2024 100+ గ్లోబల్, లోకల్ గేమింగ్ డెవలపర్లు, పబ్లిషర్లు, సందర్శకులకు వేదికగా నిలుస్తుందన్నారు. -
క్రికెట్ కోచింగ్ కు.. క్యూ కడుతున్న విద్యార్థులు
-
రాజ్‌కోట్‌లో పెను విషాదం
రాజ్‌కోట్: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. వేసవి సెలవులు, వారాంతం కూడా కావడంతో సరదాగా ఆడుకునేందుకు వెళ్లిన నలుగురు చిన్నారులు సహా మొత్తం 27 మంది అగ్ని ప్రమాదానికి బలయ్యారు. నానా–మవా రోడ్డులోని టీఆర్పీ గేమ్ జోన్లో సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. అందరూ ఆటల్లో మునిగి ఉన్న వేళ ఆ ప్రాంతాన్ని ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. దీంతో, అందులో చిక్కుకుపోయిన వారంతా హాహాకారాలు చేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని దాదాపు ఐదుగంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంతోపాటు బలమైన గాలులు వీస్తున్న కారణంగా ఫైబర్ డోమ్ పూర్తిగా కుప్పకూలింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. శిథిలాలను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నట్లు రాజ్‌కోట్ కలెక్టర్ ప్రభావ్ జోషి చెప్పారు. ఇప్పటి వరకు 27 మృతదేహాలను వెలికితీశామన్నారు. పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయన్నారు. మృతదేహాలను, క్షతగా త్రులను వెంటనే ఆస్పత్రులకు తరలించామ ని చెప్పారు. ఘటన నేపథ్యంలో నగర వ్యాప్తంగా ఉన్న గేమింగ్ జోన్లు అన్నిటినీ వెంటనే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రమాదం సంభవించిన గేమ్ జోన్లో తక్షణమే సహాయ కార్యక్రమాలను చేపట్టాలని యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సీఎం భపేంద్ర పటేల్ తెలిపారు. ఘటనకు దారి తీసిన కారణాలపై సిట్‌తో ప్రత్యేక విచారణ చేయిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారంగా ప్రకటించారు. కాగా, రాజ్‌కోట్‌లో విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యజమాని అరెస్ట్టీఆర్పీ గేమ్ జోన్ యజమాని యువరాజ్ సింగ్ సోలంకీ, మేనేజర్‌తోపాటు మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఢిల్లీలో విజయానికి బీజేపీ ప్రణాళిక ఏమిటి?
దేశ రాజధాని ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలనూ కైవసం చేసుకోవాలనే ప్రణాళికతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉంది. ఆ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. బీజేపీకి కొత్త ఇబ్బందులను సృష్టించింది. అయినప్పటికీ బీజేపీ ఢిల్లీలోని అన్ని లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన తర్వాత అక్కడి ప్రభుత్వ పనితీరులో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అయితే ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ మరింత క్రియాశీలకంగా మారింది. అయితే ఇంతలో బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆప్ పార్టీకి చెందిన మరొకరిని సీఎం చేయాలని సలహా ఇచ్చారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఆదరణపై బీజేపీ పూర్తి నమ్మకంతో ఉంది. అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతున్న సమయంలోనూ ఢిల్లీ ప్రజలు 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాల్లో బీజేపీని గెలిపించారని బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా పేర్కొన్నారు. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేసినా, అది ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపదని, ఎందుకంటే గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి దాదాపు 57 శాతం ఓట్లు వచ్చాయని, అదే తీరు ఇప్పటికీ కొనసాగుతుందని బీజేపీ నేతలు నమ్మకంతో ఉన్నారు. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు మే 25న ఓటింగ్ జరగనుంది. ఈసారి బీజేపీ మనోజ్ తివారీకి చెందిన ఢిల్లీ లోక్ సభ స్థానం మినహా మిగిలిన ఆరు స్థానాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టింది. న్యూఢిల్లీ నుంచి కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మాస్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్, చాందినీ చౌక్ నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్, దక్షిణ ఢిల్లీ నుంచి రామ్‌వీర్ సింగ్ బిధూరి, పశ్చిమ ఢిల్లీ నుంచి కమల్జిత్ సెహ్రావత్, తూర్పు ఢిల్లీ నుంచి హర్ష్ మల్హోత్రా, వాయువ్య ఢిల్లీ నుంచి యోగేంద్ర చందోలియా బీజేపీ తరపున బరిలోకి దిగారు. -
అమెరికాలో కాజీపేట విద్యార్థి దుర్మరణం
కాజీపేట: ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశానికి వెళ్లిన ఓ విద్యార్థి వాటర్ గేమ్స్ ఆడుతుండగా జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణానికి చెందిన పిట్టల రాజగణేష్ కుమారుడు వెంకటరమణ (27) ఉన్నత విద్య కోసం గత ఏడాది ఆగస్టు 22న అమెరికా వెళ్లాడు. ఇండియానా యూని వర్సిటీలో మాస్టర్స్ ఇన్ ఇన్ఫార్మటిక్స్ కోర్సు చదువుతున్నాడు. ఈనెల 9న మిత్రులతో కలిసి వెస్ట్ఫ్లోరిడాకు వెళ్లి వాటర్ గేమ్స్ ఆడు తుండగా, వేరే వ్యక్తి వేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో వెంకటరమణ నీటిలో పడి మృతిచెందాడు. వెంకటరమణ మృతి విషయాన్ని భారత ఎంబసీ అధికారులు కుటుంబ సభ్యులకు సోమవారం రాత్రి తెలిపారు. మృతదేహం ఈనెల 18 లేదా 19న భారత్‌కు వస్తుందని సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. -
‘గో నిషా గో’ గేమ్ : వారి కోసమే, డౌన్లోడ్లతో దూసుకుపోతోంది
చాలామంది అమ్మాయిలకు బంగారు కలలు ఉంటాయి. అయితే రకరకాల కారణాల వల్ల ఆ కలలు సాకారం చేసుకోలేక పోతారు. ‘ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నా కలను సాకారం చేసుకుంటాను’ అనే పట్టుదల ఉంటే కలను నెరవేర్చుకోవడం అసాధ్యమేమీ కాదు. దిల్లీలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ‘నిషా’ కల్పిత పాత్ర. ‘గో నిషా గో’ గేమ్‌లో ప్రధాన పాత్ర. ‘నా ప్రయాణంలో ధైర్యమే నా ఆయుధం’ అనుకుంటే తడబడడం ఉండదు. అధైర్యం అసలే ఉండదు. దీనికి ఉదాహరణ నిషా. పందొమ్మిది సంవత్సరాల నిషా ఎన్నో కలలు కంటుంది. ఆ కలల దారిలో నిషాకు ఎదురైన అనుభవాలకు ‘గో నిషా గో’ అద్దం పడుతుంది. మొబైల్ గేమ్ ‘గో నిషా గో’ యువ యూజర్లకు మార్గ నిర్దేశం చేస్తుంది. బాల్య వివాహాలను నిరాకరించడం నుంచి ఆర్థిక స్వాతంత్య్రం వరకు కీలక అంశాలపై అవగాహన కలిగించే గేమ్ ఇది. డిజిటల్ గేమ్ ప్లాట్‌ఫామ్ ‘గేమ్ ఆఫ్ చాయిస్ నాట్ చాన్స్’ నుంచి వచ్చిన తొలి గేమ్ ‘గో నిషా గో’. ‘క్రియేటివ్ నాన్– ప్రాఫిట్ సంస్థ గర్ల్ ఎఫెక్ట్ భాగస్వామ్యంతో దిల్లీ, రాజస్థాన్, బిహార్‌లలోని రెండు వందల మందికి పైగా అమ్మాయిలతో మాట్లాడాం. కౌమారదశలో వారు ఎదుర్కొన్న సమస్యలపై ఎన్నో ప్రశ్నలు అడిగాం. రకరకాల సవాళ్లు ఎదురైనప్పుడు సలహాల కోసం ఎవరి దగ్గరకు వెళతారు... ఇలాంటివి ఎన్నో అడిగాం’ అంటుంది ‘గేమ్ ఆఫ్ చాయిస్–నాట్ చాన్స్’ కంట్రీ డైరెక్టర్ కవితా అయ్యగారి. రుతుస్రావం నుంచి సంతానోత్పత్తి వరకు ఎన్నో అంశాలపై అమ్మాయిలకు విశ్వసనీయమైన సమాచారం అందుబాటులో లేదనే విషయం కవిత బృందానికి అర్థమైంది. తాము ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడటానికి అమ్మాయిలు సంకోచించడం, సామాజిక కట్టుబాట్ల పేరుతో తల్లిదండ్రుల ఒత్తిడి... మొదలైన విషయాలను బృందం గ్రహించింది. ఏ సలహా దొరకక, ఏ దారి కనిపించక అయోమయంలో ఉన్న అమ్మాయిలకు ‘నిషా’ గేమ్ ఒక దారి చూపుతుంది. నైతికస్థైరాన్ని ఇస్తుంది. ఈ గేమ్ మెన్స్ట్రూయెల్ హెల్త్ హెల్ప్‌లైన్‌తో సహా రకరకాల ఆరోగ్య అంశాలకు సంబంధించిన ఉత్పాదనలు, సేవలు, మహిళల సమస్యలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి వీడియో లింక్‌లను అందిస్తుంది. ‘గో నిషా గో’ గూగుల్ ప్లేస్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉంది. అవగాహన పెంచుతోంది... ‘గో నిషా గో’ గేమ్ ఆడని వారితో పోల్చితే ఆడేవారిలో వివిధ విషయాలపై అవగాహన మెరుగు అవుతున్నట్లు అధ్యయన ఫలితాలు తెలియజేస్తున్నాయి. విషయ అవగాహనతో పాటు ఆత్మస్థైర్యం కూడా ఈ ఆట పెంచింది. ఈ గేమ్ ప్రభావంతో ఆగి΄ోయిన చదువును తిరిగి కొనసాగించిన వారు, ‘నాకు పై చదువులు చదువు కోవాలని ఉంది. ఇప్పుడే పెళ్లి వద్దు’ అని తల్లిదండ్రులతో ధైర్యంగా చెప్పిన వారు, ఆర్థిక స్వాతంత్య్రంపై దృష్టి పెట్టినవారు ఎంతోమంది ఉన్నారు. హోవార్డ్ డెలాఫీల్డ్ ఇంటర్నేషనల్(హెచ్‌డిఐ) ‘గేమ్ ఆఫ్ చాయిస్–నాట్ చాన్స్’ సోషల్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ కింద ‘గో నిషా గో’కు శ్రీకారం చుట్టింది. హెచ్‌డీఐ’ అనేది సామాజిక, పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలను అన్వేషించే మహిళల నేతృత్వంలోని బృందం. ‘మా అమ్మ తన కలలు, లక్ష్యాల పట్ల చాలా స్పష్టతతో ఉన్న వ్యక్తి. అమెరికాలో చదువుకోవాలనే కోరిక ఆమెకు ఉండేది. తన చదువు కోసం పెళ్లిని వాయిదా వేయాలని, గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాతే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో ధైర్యంగా చెప్పింది. తన కలల గురించి గట్టిగా నిలబడక΄ోతే ఆమె జీవితం మరోలా ఉండేది’ అంటుంది ‘హెచ్‌డిఐ’ కో–ఫౌండర్ సుసాన్ హోవార్డ్. వీడియో గేమ్స్ అంటే పవర్‌పుల్ వెపన్స్, పవర్ఫుల్ ఫైట్స్ మాత్రమేనా? ‘కాదు’ అంటుంది ఉమెన్ ఎంపవర్మెంట్కు పెద్ద పీట వేసిన ‘గో నిషా గో’ .పదిహేను నుంచి పందొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న అమ్మాయిలకు రుతుచక్రం, పెళ్లి, చదువు, కెరీర్... మొదలైన వాటి గురించి అవగాహన కలిగిస్తోంది ఫ్రీ మొబైల్ గేమ్ గో నిషా గో. ఈ గేమ్ అంతర్జాతీయ స్థాయిలో ‘బెస్ట్ సీరియస్ గేమ్’ అవార్డ్ గెలుచుకుంది...! -
టెట్రిస్ గేమ్‌ను జయించిన బాలుడు
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా వీడియోగేమ్ ప్రియులకు చిరపరిచితమైన టెట్రిస్ గేమ్‌ను 13 ఏళ్ల అమెరికన్ టీనేజర్ ఎట్టకేలకు మొత్తం పూర్తిచేశాడు. ఈ గేమ్ విడుదలైన దాదాపు 40 ఏళ్ల తర్వాత తొలిసారిగా.. చివరి 157వ లెవల్ దాకా ఆడి చరిత్ర సృష్టించాడు. ఓక్లహామాకు చెందిన ఈ బుల్లోడి పేరు విల్లీస్ గిబ్సన్. తాను సాధించిన రికార్డు చూసి తెగ సంబరపడిపోతున్నాడు. ‘మొదటిసారి ఆట మొదలెట్టినపుడు దీన్ని పూర్తి/క్రాష్ చేయగలనని అస్సలు అనుకోలేదు. గెలుపుతో నా చేతి వేళ్ల స్పర్శనూ నేను నమ్మలేకపోతున్నా’ అంటూ గేమ్ చిట్టచివరి 38 నిమిషాల వీడియోను మంగళవారం యూట్యూబ్‌లో గిబ్సన్ పోస్ట్చేశాడు. టెట్రిస్ గేమ్ ఇప్పటిదాకా కనీసం 70 విధానాల్లో 200కుపైగా అధికారిక వేరియంట్లలో విడుదలైంది. కిందకు పడిపోతున్న భిన్న ఆకృతుల ‘బ్లాక్’లను వరసగా కిందివైపు పేర్చడమే ఈ ఆట. ఇవి చదవండి: ఏఐ చెప్పిన చిలక జోస్యం...రోబో మనుషులు వస్తున్నారు! -
పులితో పెట్టుకున్న కోతి.. మరి ఏది గెలిచింది?
సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు తెగ అలరిస్తుంటాయి. ఇలాంటి కొన్ని వీడియోలు మనకు ఒకపట్టాన నమ్మశక్యం కాదు. తాజాగా ఇటువంటి వింత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన తర్వాత ‘ఇదేందిది’ అనకుండా ఉండలేరు. అలాగే నవ్వకుండానూ ఉండలేరు. మరి.. అంత వినోదం ఉంది ఈ వీడియోలో.. మనం కోతులకు సంబంధించిన వీడియోలను చూసేవుంటాం. అయితే ఇప్పుడు మనం చూడబోతున్న వీడియోలో ఈ కోతి చేష్టలు తారాస్థాయికి చేరాయనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన చాలా మంది.. కోతులకు నిజంగా ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఈ వైరల్ వీడియోలో ముందుగా పులులు అడవిలో విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యం కనిపిస్తుంది. అయితే అక్కడే చెట్టుపై నుంచి వేలాడున్న ఒక కోతి కిందినున్న పులిని తెగ ఆటపట్టిస్తుంటుంది. ఆ కోతి ఒకసారి పులి తోకను , మరోమారు దాని చెవిని పట్టుకుని లాగుతుంది. ఈ చేష్టలను పులి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అయినా ఫలితం లేకపోతుంది. ఈ కోతి చేష్టలు ఆ పులిని తెగ చికాకు పెడతాయి. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఆ వీడియోను చూసిన యూజర్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ఆ కోతి నిజంగానే పులితో ఒక ఆట ఆడుకున్నదని, ఇకపై ఆ పులులు కోతికి దూరంగా ఉంటాయంటూ కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: ‘టీమిండియా గెలిచేవరకూ మెతుకు ముట్టం’ Gibbons like to live dangerously pic.twitter.com/kNHbYI0TDd — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 16, 2023 -
క్రికెట్ వరల్డ్‌కప్ మ్యాచ్‌తో డబ్బు సంపాదన! ఎలాగంటే..
క్రికెట్ మ్యాచ్‌లో మనం ఎంచుకున్న జట్టే గెలవాలని బలంగా అనుకుంటాం. మైదానంలో క్రీడాకారులు ఆడుతుంటే ఊపిరి బిగబట్టి చూస్తూంటాం. టాస్ గెలిచినప్పటి నుంచి మ్యాచ్ చివరి బంతి ఆడే వరకు ప్రతిక్షణం ఉత్కంఠభరితంగానే సాగుతుంది. అయితే మనం కోరుకునే జట్టు గెలుపోటములు మాత్రం ఆటగాళ్ల నైపుణ్యం, వ్యూహ ప్రతివ్యూహాల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రపంచకప్ తరుణంలో అందరూ ఆటలోని మజాను ఆస్వాదిస్తుంటారు. అయితే క్రికెట్‌ను చూస్తూ ఆనందించడమే కాకుండా అది మనకు కొన్ని ఆర్థిక పాఠాలూ నేర్పుతుంది. వాటి గురించి ఆర్థిక నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు. అవి ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. ఆటలో ఎన్నో నిబంధనలు ఉంటాయి. కానీ విజయమే అంతిమ లక్ష్యం. అందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కచ్చితమైన అంచనాలతో ఆడాల్సిందే. పెట్టుబడులూ అంతే.. ఆర్థిక లక్ష్యాన్ని నిర్ణయించుకొని, దాన్ని చేరుకునేందుకు సరైన ప్రణాళిక లేకపోతే విజయం సాధించడం కష్టం అవుతుంది. ఆటగాళ్ల ఎంపిక చాలాముఖ్యం.. జట్టులోని ఆటగాళ్ల సెలక్షన్ బాగుంటేనే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. అందరూ బ్యాట్స్‌మెన్ లేదా బౌలర్లే ఉంటే ఎలా జట్టు గెలుపొందడం కష్టం అవుతుంది. అందుకే వైవిధ్యంగా ఉండాలి. పెట్టుబడుల విషయమూ అంతే. ఒకే తరహా పథకాలు, స్టాక్‌లపై ఆధారపడితే ఎప్పటికీ అనుకున్నది సాధించలేం. షేర్లు, బాండ్లు, ఫండ్లు, బంగారం ఇలా పలు పథకాలు ఎంచుకోవాలి. ఒకే బ్యాట్స్‌మన్‌పై ఎక్కువగా ఆధారపడటమూ మంచిది కాదు. ఈక్విటీల్లో ఏదో ఒక షేరులోనే మొత్తం పెట్టుబడిని కేటాయించడం వల్ల నష్టభయం పెరుగుతుంది. వికెట్‌ను కాపాడుకోవాలి... వికెట్‌ను కాపాడుకోవడం.. క్రికెట్లో కీలకం. మైదానంలో నిలదొక్కుకుంటేనే బాగుంటుంది. కానీ, పరుగులు తీయకుండా అలాగే కొనసాగడం కూడా నష్టం చేస్తుంది. దాంతో విలువైన బంతులు వృథా అవుతాయి. మొత్తం పెట్టుబడి సురక్షితంగా ఉండాలని భావిస్తూ మదుపు చేస్తే.. దీర్ఘకాలంలో సాధించేదేమీ ఉండదు. ద్రవ్యోల్బణం రాబడులను హరిస్తుంది. కేవలం ఫిక్స్డ్ డిపాజిట్లు, పొదుపు ఖాతాలనే నమ్ముకుంటే ఫలితం ఉండదు. రాబడి ఇచ్చే పథకాలు ఎంచుకోవాలి. లక్ష్యం మర్చిపోకుండా... ప్రత్యర్థిజట్టు ముందుగా బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని ఏర్పరుస్తుంది. భారీగా ఉండే లక్ష్యాన్ని ఛేదించడం కష్టమే అనిపిస్తుంది. బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని లక్ష్యం మరిచిపోయి హిట్టింగ్ ఎంచుకుని వికెట్ పోగుట్టుకుంటారు. చాలామంది మదుపరులు ఇలాంటి పొరపాటే చేస్తారు. ఆర్థిక లక్ష్యం మరిచిపోయి అధిక రాబడులపై ఆశపెంచుకుంటారు. ఫలితంగా ట్రేడింగ్ లేదా ఇతర మార్గాలను ఎంచుకుంటారు. ఆ తొందరపాటులో లాభాలు రాకపోగా పెట్టుబడినీ నష్టపోతారు. లక్ష్యం భారీగా ఉన్నప్పుడు.. క్రమశిక్షణతో ఒక్కో ఓవర్‌కు ఇన్ని పరుగులు అని స్థిరంగా సాధించినప్పుడే విజయం సాధ్యమవుతుంది. అదే తరహాలో క్రమానుగత పెట్టుబడులను కొనసాగించినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. తొలి ఓవర్లలో సాధ్యమైనన్ని పరుగులు సాధించాలి. సంపాదన ప్రారంభించిన వెంటనే వీలైనంత మదుపు చేసే ప్రయత్నం చేయాలి. ఒక చెత్త ఓవర్ ఆటను మలుపు తిప్పుతుంది. ఇదే తరహాలో మీ పెట్టుబడుల్లో పనితీరు బాగాలేని ఒక పథకం ఉంటే.. మొత్తం రాబడిపై ప్రభావం పడుతుంది. అలాంటి పథకాలను గుర్తించి, తొలగించాలి. మైదానంలో ఎన్నో అంశాలు క్రీడాకారుల దృష్టిని మరలుస్తాయి. కానీ, వారి లక్ష్యం మారదు. పెట్టుబడులు పెట్టేటప్పుడు వచ్చే అవాంతరాలను పట్టించుకోకుండా లక్ష్యం చేరుకునే వరకూ ఓపిక పట్టాలి. లక్ష్యానికి చేరువైనప్పుడు.. దూకుడుగా కాకుండా.. కాస్త నెమ్మదిగా ఆడుతుంటారు. ఇదే తీరుగా అనుకున్న మొత్తం సమకూరినప్పుడు నష్టభయం ఉన్న పథకాల నుంచి సురక్షిత పథకాల్లోకి పెట్టుబడులను మార్చుకోవాలి. జట్టు సభ్యులందరితో కలిసి కోచ్ ఒకసారి మ్యాచ్‌ను సమీక్షిస్తారు. ఇలాగే పెట్టుబడులనూ సమీక్షించుకుంటూ ఉండాలి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి. ఇదీ చదవండి: 127 ట్రక్కుల్లో 3 కోట్ల పత్రాలు పంపిన సుబ్రతా రాయ్ -
ప్రాణం తీసిన పబ్జీ గేమ్.. ఏకంగా సెల్ టవర్ ఎక్కి.. పైనుంచి..
సాక్షి, ఆదిలాబాద్: పబ్జీ గేమ్‌కు బానిసై ఏడాది క్రితం మానసిక స్థితి కోల్పోయిన ఓ యువకుడు సెల్ టవర్ పైనుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, ఎస్సై సునిల్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన దుర్వ జగదీశ్–మోహన్‌బాయి దంపతుల కుమారుడు వికాస్(19) ఇంటర్ మధ్యలోనే మానేశాడు. పబ్జీ గేమ్‌కు అలవాటు పడి ఇంట్లోనే ఉంటూ ఏడాది క్రితం మానసిక స్థితి కోల్పోయాడు. శనివారం రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కుటుంబసభ్యులు గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. రాత్రి దేవాపూర్ నుంచి ముత్నూర్ గ్రామానికి చేరుకొని గ్రామ సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి పైనుంచి కింద పడి మృతిచెందాడు. గ్రామస్తులు ఆదివారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మానసిక స్థితి సరిగా లేక సెల్‌టవర్ ఎక్కి పైనుంచి పడిపోవడంతోనే మృతిచెందినట్లు నిర్ధారించారు. తల్లి మోహన్‌బాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రూ.16,195 కోట్ల టాక్స్ నోటీసుపై హైకోర్టు స్టే
డెల్టాకార్ప్ సంస్థకు జారీ చేసిన రూ.16,195 కోట్ల జీఎస్టీ నోటీసుపై తుది ఉత్తర్వులు ఇవ్వకూడదని బొంబాయి హైకోర్టు గోవాబెంచ్ తేల్చి చెప్పింది. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉపశమనంతో డెల్టాకార్ప్ షేర్ హోల్డర్లకు తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది. గత నెలలో డెల్టాకార్ప్‌తో పాటు అనుబంధ సంస్థలకు దాదాపు రూ.23,000 కోట్ల మేర పన్ను చెల్లింపునకు సంబంధించిన నోటీసులు అందాయి. ముందస్తు అనుమతి లేకుండా రూ.16,195 కోట్ల పన్ను నోటీసుపై తుది ఉత్తర్వులు జారీ చేయరాదని బొంబాయి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 23న కంపెనీ, దాని అనుబంధ సంస్థలు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను బాంబే హైకోర్టు పరిశీలించింది. గేమింగ్, క్యాసినో వ్యాపారాలపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో జీఎస్టీ పన్ను రేట్లను సైతం భారీగా పెంచింది. ప్రస్తుతం ఈ రంగంలోని చాలా కంపెనీలు భారీ పన్ను నోటీసులతో సతమతమవుతున్నాయి. -
సాఫ్ట్వేర్ చిన్నారి! ఏకంగా వీడియో గేమ్‌లనే రూపొందిస్తోంది!
సాఫ్ట్వేర్ చిన్నారిప్రపంచమంతా టెక్నాలజీతోపాటు పరుగులు పెడుతోంది. అందుకే చిన్నా..పెద్దా తేడా లేకుండా అంతా స్మార్ట్ ఫోన్ల నుంచి కంప్యూటర్ల దాకా అన్నీ అవలీలగా వాడేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కోడింగ్ ద్వారా వివిధ రకాల అప్లికేషన్లు, గేమ్‌లు తయారు చేస్తుంటారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లలో కొంతమంది మాత్రమే వీటిని తయారు చేయగలరు. మిగతావారికి కోడింగ్ అంటే అర్థం కాని పెద్ద సబ్జెక్ట్‌గా చూస్తారు. అటువంటిది భారత సంతతికి చెందిన సీమర్ ఖురానా కోడింగ్‌ను మునివేళ్లతో పట్టి చకచక వీడియోగేమ్‌ను రూపొందించింది. అతిపిన్నవయసులో వీడియోగేమ్ రూపొందించి ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలైన వీడియోగేమ్ డెవలపర్‌గా గిన్నిస్ రికార్డుల్లో నిలిచింది. కెనడాలోని ఆంటారియోలో నివసిస్తోన్న భారత సంతతికి చెందిన పరాస్ ఖురానా కూతురే సీమర్. చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండే సీమర్ తన వయసు పిల్లలంతా వీడియోగేమ్‌లు ఆడుకుంటుంటే సీమర్ మాత్రం... తన సీనియర్లు చదివే పాఠాలు నేర్చుకోవడానికి ఆరాటపడేది. మ్యాథ్స్ అంటే మక్కువ ఎక్కువ ఉన్న సీమర్.. తన తరగతి కాకుండా పైతరగతి విద్యార్థులు చదివే లెక్కల పాఠాలు నేర్చుకోవాలనుకునేది. కానీ ఎవరూ నేర్పించేవాళ్లు కాదు. దీంతో యూట్యూబ్‌లో చూసి లెక్కలు నేర్చుకునేది. కిండర్ గార్డెన్ చదివే సీమర్ మూడోతరగతి లెక్కలు సులభంగా చేసేది. ఒకపక్క లెక్కలు చెబుతూనే కాగితాలతో క్రాఫ్ట్ తయారు చేసి ఆడుకుంటూ ఉండేది. ఇది గమనించిన సీమర్ తండ్రి కోడింగ్ క్లాసులను చూపించారు. కోడింగ్ నచ్చడంతో సీమర్ కోడింగ్ కూడా నేర్చుకోవడం మొదలుపెట్టింది. క్రమంగా కోడింగ్‌పై పట్టుసాధించేందుకు ప్రయత్నం మొదలు పెట్టింది. డాక్టర్ మాటలు విని... సీమర్ అక్క ఆరోగ్యం పాడవడంతో ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కను పరీక్షించిన డాక్టర్ జంక్ఫుడ్ని మానేయాలని చెప్పడంతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూనే హెల్దీ, జంక్‌ఫుడ్‌ల గురించి వీడియో గేమ్ తయారు చేయాలనుకుంది. దీనికోసం వారానికి మూడు క్లాసులకు హాజరవుతూ ఏడాదిలోపే కోడింగ్‌ను క్షుణ్ణంగా తెలుసుకుంది. ఆ తరువాత ‘హెల్దీఫుడ్ ఛాలెంజ్’ పేరిట వీడియో గేమ్‌ను తయారు చేసింది. జంక్ ఫుడ్ వల్ల ఏర్పడే ముప్పు, ఆరోగ్యకరమైన, సమతుల ఆహారం ఎలా తీసుకోవాలో ఈ వీడియోగేమ్ వివరంగా చెబుతుంది. ఈ యాప్‌ను తయారు చేయడానికి స్కూలు అయిపోయిన తరువాత రోజుకి రెండు గంటలపాటు సమయాన్ని కేటాయించేది సీమర్. ఇలా తన పేరుని గిన్నిస్‌బుక్‌లో ఎక్కించుకుంది. వీడియో గేమ్‌లే కాదు... లెక్కలు, కోడింగ్‌తోపాటు డ్యాన్స్, జిమ్నాస్టిక్స్, కరాటేలు కూడా నేర్చుకుంటోంది.‘సీమర్స్ వరల్డ్’ పేరుమీద యూ ట్యూబ్ ఛానల్ నడుపుతూ తనకొచ్చే వివిధ రకాల ఆటల ఐడియాలను షేర్ చేస్తోంది. టాలెంట్‌కు వయసుతో సంబంధంలేదనడానికి సిసలైన ఉదాహరణగా నిలుస్తోంది సీమర్. చిచ్చర పిడుగుల్లాంటి పిల్లలు వయసు కంటే పెద్ద చదువులు చకచకా చదివేసి, డిగ్రీ పట్టాలు పొందేస్తుంటారు. అయితే అంతకన్నా చకచకా అడుగులు వేసింది సీమర్. డిగ్రీలు చదవడం కాదు... ఏకంగా వీడియో గేమ్నే రూపొందించింది ఈ ఆరేళ్ల సిసింద్రీ సీమర్ ఖురానా. (చదవండి: ఏడు నిమిషాలపాటు గుండె ఆగిపోయింది..వైద్యపరంగా 'డెడ్'! కానీ ఆ వ్యక్తి..) -
మరో ‘పబ్జీ’ దారుణం: తల్లిదండ్రులపై దాడికి తెగబడి..
ఉత్తరప్రదేశ్‌లోని జాన్సీకి చెందిన ఒక యువకుడు పబ్జీ ఆడుతూ, తన మనసుపై నియంత్రణ కోల్పోయి, తల్లిదండ్రులను అత్యంత దారుణంగా చావబాదాడు. రోజూ పాలుపోసే వ్యక్తి వారి ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం వెలుగుచూసింది. పాలుపోసే వ్యక్తి వారి ఇంటిలోకి వెళ్లి చూడగా ఇంటి యజమాని, అతని భార్య రక్తపు మడుగులో అతనికి కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందించిన పాలుపోసే వ్యక్తి ఈ దారుణ ఘటన జాన్సీ పట్టణంలోని నవాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గుమనాబాద్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మీప్రసాద్(60) అతని భార్య విమల(55) కుమారుడు అంకిత్(28) ఉంటున్నారు. ఉదయం పాలుపోసే వ్యక్తి వారి ఇంటి తలుపు తట్టాడు. లోపలి నుంచి ఎటువంటి సమాధానం వినిపించలేదు. దీంతో అతను ఇంటిలోనికి వెళ్లి చూశాడు. అక్కడ రక్తపుమడుగులో లక్ష్మీప్రసాద్, విమల అతనికి కనిపించారు. వారి పక్కనే అంకిత్ కూర్చుని ఉన్నాడు. ఆసుపత్రికి చేరుకునేలోగానే.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ దంపతులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోగానే లక్ష్మీప్రసాద్ మృతిచెందగా, చికిత్స పొందుతూ విమల కన్నుమూసింది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడు అంకిత్‌ను అరెస్టు చేసి, అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులపై కర్రతో తీవ్రంగా దాడి ఈ కేసు గురించి పోలీసు అధికారి రాజేష్ మాట్లాడుతూ నిందితుడు అంకిత్ తన తల్లిదండ్రులపై కర్రతో తీవ్రంగా దాడి చేశాడని, ఫలితంగానే వారు మృతి చెందారని తెలిపారు. మానసిక స్థితి దెబ్బతినడంతోనే తాను అలా చేశానని అంకిత్ పోలీసుల ముందు తన తప్పు ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం పబ్జీ గేమ్ ఆడుతూ.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అంకిత్‌కు రెండేళ్లుగా మానసిక స్థితి సరిగా లేదు. నిత్యం పబ్జీ గేమ్ ఆడుతుంటాడు. ఈ గేమ్ కారణంగా అతని మానసిక స్థితి మరింత దిగజారింది. ఈ ఘటనలో అంకిత్ తొలుత తండ్రిపై, తరువాత తల్లిపై దాడి చేశాడని సమాచారం. ఇది కూడా చదవండి: టమాటాలను వదలి అవకాడోలపై పడుతున్న జనం! -
మరో ‘సీమా- సచిన్’.. ఆన్లైన్ గేమ్‌తో ప్రేమజంటకు రెక్కలు..
సీమా-హైదర్ల పబ్జీ ప్రేమ గురించి అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఇదేకోవలో ఫ్రీ ఫైర్ గేమ్ లవ్ స్టోరీ వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన 21 ఏళ్ల యువతి ఫ్రీ ఫైర్ గేమ్ అడుతూ బీహార్‌కు చెందిన ఒక యువకునితో పరిచయం ఏర్పరుచుకుంది. మాటలు, ముచ్చట్ల అనంతరం వీరి పరిచయం ప్రేమగా మారింది. అంతే.. వీరిద్దరూ ఇళ్ల నుంచి మాయమయ్యారు. దీనిపై అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేటి యువతీయువకులకు తమ ప్రేమికులను ఎంచుకునేందుకు సరికొత్త మార్గం తెరుచుకుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలైన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయాలు ఏర్పరుచుకుని, వాటిని ప్రేమలుగా మార్చుకుంటున్నారు. వీటికితోడు కొత్తగా ఆన్లైన్ గేమ్‌లు కూడా యువతీయువకుల ప్రేమలకు వేదికలవుతున్నాయి. పాకిస్తాన్ నుంచి వచ్చిన సీమా హైదర్, భారత్‌కు చెందిన సచిన్‌ల లవ్ స్టోరీ ప్రస్తుతం వార్తల్లో నానుతోంది. ఇదే నేపధ్యంలో ఇప్పుడు గోరఖ్‌పూర్‌లోనూ ఇటువంటి ప్రేమకథ వెలుగుచూసింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు గోరఖ్‌పూర్‌లోని పీపీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 21 ఏళ్ల యువతి ఉన్నట్టుండి ఇంటి నుంచి మాయమయ్యింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం రెండు రోజుల పాటు గాలించారు. ఈ నేపధ్యంలో తమ కుమార్తె ప్రియునితో వెళ్లిపోయిందని తెలుసుకున్నారు. ఈ విషయాన్ని వారు పీపీగంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అజ్ఞాత యువకునిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ఆ యువతి కోసం వెదుకులాట మొదలుపెట్టారు. పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్, నోయిడాకు చెందిన సచిన్‌ల ప్రేమకథ పబ్జీ గేమ్ ద్వారా ప్రారంభమయ్యింది. దీంతో సీమా తన నలుగురు పిల్లలతో పాటు నేపాల్ గుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి, చివరకు నోయిడాలోని తన ప్రేమికుని వద్దకు చేరింది. ఇదేవిధంగా గోరఖ్‌పూర్‌కు చెందిన ఒక యువతి బీహార్‌కు చెందిన ఒక యువకునితో ఫ్రీ ఫైర్ గేమ్ ద్వారా ప్రేమలో పడింది. దీంతో పట్నాలో ఉంటున్న తన ప్రేమికుడు సుజీత్ దగ్గరకు చేరుకుంది. ఫ్రీ ఫైర్‌గేమ్ ప్రేమికులిద్దరూ జూలై 31న ఇంటి నుంచి పరారయ్యారు. ఈ సందర్భంగా యువతి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుమార్తె చదువుకుంటున్నానని చెబుతూ, తమకు తెలియకుండా మొబైల్లో గేమ్ ఆడుతుంటుందని తెలిపారు. తాము కుమార్తెపై అంతగా దృష్టి పెట్టలేకపోయామని అన్నారు. ప్రియుడు ఆటోవాలా.. ఈ ఉదంతం గురించి పీపీగంజ్ పోలీసు అధికారి ఆశీష్ సింగ్ మాట్లాడుతూ మాయమైన యువతి కుటుంబ సభ్యుల నుంచి తమకు ఫిర్యాదు అందిందని, దాని ఆధారంగా కేసు నమోదు చేశామన్నారు. ఆ ప్రేమికుల గురించి వెదుకులాట ప్రారంభించామన్నారు. వీరి లొకేషన్ బీహార్‌లోని పట్నాను చూపిస్తున్నదన్నారు. ఆ యువకుడు పట్నాలో ఆటో నడుపుతుంటాడన్నారు. ప్రేమికులిద్దరినీ గోరఖ్‌పూర్ తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ కేసు ఇతర రాష్ట్రం పరిధిలో ఉన్నందున్న అనుమతులు అవసరమవుతాయన్నారు. ఆ యువతి మైనర్ అని, ఆమెకు 21 ఏళ్ల అని, ఆ ప్రేమికులతో మాట్లాడిన తరువాత మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు. ఇది కూడా చదవండి: నా చిలక తప్పిపోయింది.. వెతికిస్తే.. రివార్డు అంటూ పోస్టర్లు -
బీజీఎంఐ గేమ్ మళ్ళీ వచ్చేసింది.. కొత్త రూల్స్ ఇలా ఉన్నాయి!
BGMI Relaunched: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బీజీఎంఐ (బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా) గేమ్ ఎట్టకేలకు ఇండియాలో మళ్ళీ లాంచ్ అయింది. ఈ రోజు నుంచి గేమ్ మొదలైంది. బ్యాన్ అయిన సుమారు ఆరు సంవత్సరాల తరువాత ఈ గేమ్ మళ్ళీ భారతదేశంలో అడుగుపెట్టింది. దీనిని రీ-లాంచ్ చేయడానికి భారత ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ నుంచి అప్రూవల్ కూడా తీసుకుంది. కావున ఇప్పుడు లాంచ్ చేసింది. ప్రారంభ దశగా మూడు నెలలు అనుమతి పొందుతూ ప్రస్తుతం గేమ్ లాంచ్ చేసింది. ఆ తరువాత పరిస్థిని బట్టి కొనసాగించడమా? లేదా? అనే నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్న వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ వినియోగదారులు యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: ఆ స్కీమ్ గడువు మళ్ళీ పెంచిన హెచ్డీఎఫ్సీ - కస్టమర్లకు పండగే!) టైమ్ లిమిట్.. ఈ గేమ్ ఆడటానికి ఇప్పుడు డైలీ లిమిటెడ్ టైమ్ కేటాయించారు. కావున గేమ్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత 48 గంటల లోపు దశల వారీగా యూజర్లు లాగిన్ అవ్వవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న వారందరూ రెండు రోజుల్లోగా గేమ్ ఆడడం మొదలుపెట్టవచ్చని సమాచారం. యూజర్ల వయసుని బట్టి టైమ్ లిమిట్ ఉంటుంది. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు రోజుకి 6 గంటల పాటు ఆడుకోవచ్చు. ఆరు గంటల తరువాత లాగిన్ అకౌంట్ నుంచి గేమ్ ఆడలేరు. మళ్ళీ ఆ అకౌంట్ నుంచి ఆడాలంటే ఆ తరువాత రోజే ఆడాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: అవమానానికి గుణపాఠం.. తలపాగా రంగుకు తగ్గ రోల్స్ రాయిస్ కొన్న 'రూబిన్ సింగ్') 18 సంవత్సరాలకంటే తక్కువ వయసున్న పిల్లలు రోజుకి 3 గంటలు మాత్రమే ఈ గేమ్ ఆడుకోవచ్చు. అంతే కాకుండా ఆ వయసున్న పిల్లలు ఆడాలంటే పేరెంటర్ వెరిఫికేషన్ కూడా చాలా అవసరం. ఈ గేమ్ వెర్షన్లో నుసా అనే కొత్త మ్యాప్ కూడా యాడ్ అయ్యింది. జిల్లైన్స్, సూపర్ రీకాల్ ఫీచర్, టాక్టికల్ క్రాస్బో, టూ సీటర్ ఆఫ్ రోడ్ ఆల్ టెరిటరైన్ హెహికల్స్ కూడా గేమ్‌కు యాడ్ అయ్యాయి. కావున ఇది మునుపటికంటే చాలా అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాము. No more waiting, play like your heroes in the Battlegrounds! 🎙#BGMI #battlegroundsmobileindia #IndiaKiHeartbeat pic.twitter.com/VbPIRiS18Z — BattleGrounds Mobile India (@BattlegroundmIn) May 29, 2023 -
రోజా మేడం సార్ రోజా మేడం అంతే
-
Siddu Jonnalagadda : గేమింగ్ జోన్ ప్రారంభోత్సవంలో సందడి చేసిన డీజే టిల్లు (ఫొటోలు)
-
ఓటమి అవమానంతో.. ఏడుగురి ప్రాణాలు తీశాడు
క్రైమ్: ఆటలో ఓడిపోయాడు. అందరూ బిగ్గరగా నవ్వారు. ఆవేశంలో మళ్లీ ఆడాడు. ఈసారి చిత్తుగా ఓడాడు. దీంతో అక్కడున్నవాళ్లు హేళన చేస్తూ నవ్వారు. అది అతనికి పట్టరాని పిచ్చికోపం తెప్పించింది. ఆ క్షణికావేశంలో ఉన్మాదిగా మారిపోయి ఏడుగురి బలిగొన్నాడు. బ్రెజిల్లో దారుణం జరిగింది. పూల్ గేమ్ ఓడిన వ్యక్తి.. అందరూ నవ్వారనే కోపంతో తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అతనికి మరో వ్యక్తి సాయం చేశాడు. మృతుల్లో 12 ఏళ్ల బాలిక కూడా ఉంది. బ్రెజిల్ రాష్ట్రం మాటో గ్రోస్సోలోని సినోప్ నగరంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాల్పులకు తెగబడిన వ్యక్తి పేరు ఎడ్గర్ రికార్డో డె ఒలివెయిరా. సహనిందితుడి పేరు ఇజెక్వియాస్ సౌజ రిబెయిరోలు. ఇద్దరూ ఘటన తర్వాత ఓ కుగ్రామంలో తలదాచుకుని.. అక్కడి నుంచి మరో చోటుకి పరారైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్లో వైరల్ అవుతోంది. ఒలివెయిరా తొలుత ఓ వ్యక్తి చేతిలో పూల్ గేమ్ ఓడిపోయి 4,000 రియస్(776 డాలర్లు) పోగొట్టుకున్నాడు. ఆ కోపంలో అక్కడి నుంచి వెళ్లి.. ఇజెక్వియాస్ను వెంట తెచ్చుకున్నాడు. మళ్లీ ఆడదామంటూ.. గెలిచిన వ్యక్తికి సవాల్ విసిరాడు. అయితే ఈసారి కూడా గేమ్ ఓడిపోయాడు. ఈ క్రమంలో అక్కడున్నవాళ్లంతా బిగ్గరగా నవ్వడంతో కోపం ఆపుకోలేకపోయాడు. ట్రక్కులోకి వెళ్లి షాట్ గన్ తీసుకొచ్చి పూల్ ఓనర్‌తో సహా అక్కడున్న ఏడుగురిని కాల్చి చంపాడు. డబ్బులతో పాటు అక్కడే ఉన్న ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్‌ను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. పూల్ హాల్లోని సీసీటీవీలో కాల్పుల దృశ్యాలు వైరల్ అయ్యాయి. -
విల్లు అందుకుంటే ఇక విలయమే!
ఒక పెద్ద చెట్టు కింద నిల్చుంటాడు కథానాయకుడు. అది చెట్టు కాదని భయానకమైన మాన్స్టర్ అని తెలుసుకోవడానికి ఎంతో సేపు పట్టదు. ఒక కొండ పక్కన కూర్చొని ఉంటాడు హీరో...‘కొండ కదులుతున్నదేమిటి!’ అనే ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే అది క్రూరమైన మాన్స్టర్ అని తెలుసుకుంటాడు. పూలతోటల నుంచి మంచుఎడారి వరకు రకరకాల మాన్స్టర్లను బుక్వార్క్లాంటి యంత్రం సహాయంతో ఎలా ఎదుర్కొన్నాడు అనేదే వైల్డ్ హార్ట్స్ గేమ్. యాక్షన్–అడ్వెంచర్ వీడియో గేమ్ ‘వైల్డ్ హార్ట్’ నేడు విడుదల అవుతుంది. జపాన్‌కు చెందిన వీడియో గేమింగ్ కంపెనీ వొమెగా ఫోర్స్ దీన్ని రూపొందించింది. మాన్స్టర్ హంటింగ్ గేమ్స్‌లో చేయి తిరిగిన కొటారో హిరాట్ ఈ గేమ్‌కు డైరెక్టర్. అలనాటి ఫ్యూడల్ జపాన్ను స్ఫూర్తిగా తీసుకొని ‘అజుమి’ అనే మాయాప్రపంచాన్ని సృష్టించారు. భయంకరమైన మాన్‌స్టర్స్‌ను వేటాడే బాధ్యత ప్లేయర్స్‌పై ఉంటుంది. మోనస్టర్స్ను వేటాడడానికి వాగస, కలూనాలాంటి ఎనిమిది ఆయుధాలు ఈ గేమ్‌లో ఉంటాయి. బుక్వార్క్లాంటి యంత్రంతో ఎమిమీ దారిని బ్లాక్ చేయవచ్చు. ప్లాట్పామ్స్: పీఎస్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్, పీసీ మోడ్: సింగిల్ ప్లేయర్, మల్టీ ప్లేయర్ -
మోస్ట్ వాంటెడ్ గేమ్
ఒపెన్–వరల్డ్, యాక్షన్ రోల్–ప్లేయింగ్ గేమ్ ‘హాగ్వార్ట్స్ లెగసీ’ నేడు విడుదల అవుతుంది. హ్యారీపోటర్ నవలల ఆధారంగా అల్లుకున్న కథ ఇది. ఈ గేమ్‌లో ప్లేయర్స్ హాగ్వార్ట్స్ స్కూల్ ఆఫ్ విచ్‌క్రాఫ్ట్ క్లాస్‌లకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్లేయర్ క్యారెక్టర్ యుద్ధతంత్రాలలో నైపుణ్యం సాధించాల్సి ఉంటుంది. లియర్జర్ఫిగ్లాంటి కొత్త క్యారెక్టర్లను ఈ ఆటలో ప్రవేశ పెట్టారు. మూడు మంత్రదండాలలో ప్రతిదానికి తనదైన ప్రత్యేక శక్తి ఉంటుంది. హ్యారీపోటర్ అభిమానులకు ‘మోస్ట్ వాంటెడ్ గేమ్’ గా గుర్తింపు ΄పొందింది. జానర్స్: ఒపెన్ వరల్డ్ ఎంటర్టైన్మెంట్ నెరేటివ్ మోడ్: సింగిల్–ప్లేయర్ వీడియో గేమ్ ప్లాట్‌ఫామ్స్: పీసి, పీఎస్5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ -
విజయనగరం: కబడ్డీ ఆటలో యువకుడు మృతి
-
Viral Video: ‘మా..నిన్ను మేము ఓడిపోనివ్వం’.. మహిళకు పెంపుడు కుక్క సాయం!
-
లూడో గేమ్‌లో ఓటమి.. తనను తాను కుదువ పెట్టుకున్న మహిళ!
పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లలో మునిగిపోతున్నారు. చుట్టుపక్కల పరిస్థితులను మర్చిపోయేంతలా అందులో లీనమైపోతున్నారు. సమయం సందర్భం లేకుండా సోషల్ మీడియాను విచ్చిలవిడిగా ఉపయోగిస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్‌కు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ జూద వ్యసనంతో తనను తాను కుదవపెట్టుకుంది. పందెంలో యజమాని చేతిలో ఓడిపోవడంతొ అతనికి సొంతం అయిపోయింది. ఈ వింత సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రతాప్‌గఢ్‌లోని కొత్వాలి నగర్ దేవ్ కలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి రేణు అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఆరు నెలల క్రితం భర్త పనికోసం రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లాడు. అక్కడే ఇటుకలు తయారు చేసే కార్మికుడిగా పని చేస్తున్నాడు. అక్కడి నుంచి భార్యకు నిత్యం డబ్బులు పంపేవాడు. భర్త ఇచ్చిన డబ్బుతో వివాహిత తన ఇంటి యజమానితో రోజూ ఆన్లైన్ గేమ్ లూడోకు ఆడేది. మెల్లమెల్లగా ఆమె ఆ ఆటకు బానిసగా మారిపోయింది. అలా ఓ రోజు ఇద్దరి కలిసి ఆడుతూ పందెం వేసుకున్నారు. ఈ క్రమంలో మహిళ తన వద్ద ఉన్న డబ్బు మొత్తం అయిపోవడంతో ఏం చేయాలో తెలియక యజమానికి తనను తాకట్టు పెట్టి మరీ లూడో ఆడింది. తనపై తానే పందెం కాసిన ఈ ఆటలోనూ మహిళ ఓడిపోవడంతో చివరికి యజమాని దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో షాక్‌కు గురైన ఆమె భర్త ప్రతాప్‌గఢ్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య నిత్యం జూదం, ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బెట్టింగ్‌లో ఓడిపోవడంతో తన భార్య ఇప్పుడు ఇంటి యజమానితో కలిసి జీవిస్తోందని తెలిపాడు. అతన్ని విడిచిపెట్టి రావాలని కోరగా.. అందుకు ఆమె ఒప్పుకోవడం లేదని వాపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: విశాఖలో దారుణం.. మహిళను ముక్కలుగా నరికి, డ్రమ్ములో కుక్కి -
బిగ్ క్వశ్చన్: చంద్రబాబు చావు తెలివితేటలు..!
-
మొబైల్లో ‘ఫ్రీఫైర్ గేమ్’ ఆడనివ్వలేదని..
బంజారాహిల్స్ (హైదరాబాద్): పుట్టిన రోజు వేడుకలను ఆనందంగా జరుపుకోవాల్సిన రోజే ఓ బాలుడు ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.11 ఉదయ్‌నగర్ బస్తీలో నివసించే పోతరాజు ప్రశాంత్ (15) సమీపంలోని సరస్వతి హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. తండ్రి శ్రీనివాస్ కారు డ్రైవర్ కాగా, తల్లి స్వరూప అదే పాఠశాలలో ఆయాగా పని చేస్తున్నది. గత పది రోజుల నుంచి ప్రశాంత్ స్కూల్‌కు సరిగ్గా వెళ్లడం లేదు. సెలవులు అయిపోయిన తర్వాత కూడా స్కూల్‌కు వెళ్లకుండా తిరుగుతున్నావంటూ తల్లిదండ్రులు మందలించి ప్రశాంత్ నుంచి మొబైల్‌ఫోన్‌ను తీసేసుకు న్నారు. కాగా, సోమవారం తన పుట్టిన రోజు కావడంతో ప్రశాంత్ చాక్లెట్లు కొనుక్కోవడానికి తండ్రిని డబ్బులు అడగ్గా, రూ.200 ఇచ్చి అతను డ్యూటీకి వెళ్లిపోయాడు. తల్లి కూడా స్కూల్‌కు వెళ్లింది. అయితే పుట్టిన రోజు నాడు మొబై ల్‌ఫోన్ దగ్గర లేకపోవడం, స్కూల్‌కు వెళ్లాలని తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురావడంతో మనస్తాపానికి గురైన ప్రశాంత్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి మొబైల్ ఫోన్లో ‘ఫ్రీఫైర్’అనే గేమ్ ఎక్కువగా ఆడే అల వాటు ఉందని, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాద ని పోలీసుల దర్యాప్తులో తేలింది. మొబైల్ ఫోన్‌ను తల్లిదండ్రులు లాక్కోవడంతో ప్రశాంత్ దిగాలుగా మారా డని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆనంద్ మహింద్ర మనసు దోచిన 'కప్పు': ఫోటో వైరల్
ప్రముఖ పారిశ్రామికవేత్త సోషల్ మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ తరుచుగా మంచి మంచి వైరల్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోల నుంచి మంచి మంచి సందేశాలను కూడా ఇస్తుంటారు కూడా. అదే తరహాలో ఒక వైరల్ ఫోటో సోషల్ మాధ్యమంలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఆ ఫోటో ఆనంద్ మహింద్ర మనసును దోచింది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే...ఒక తెల్లటి కప్పు పై టిక్‌టాక్ గేమ్ ఒకటి ఉంది. అదేలా ఉందంటే... ఆ కాఫీ కప్పుపై 'థింక్ అవుట్ బాక్స్' అని ఉండి కింద గేమ్ అనుసంధానించి ఉంది. అది బాక్స్ అనే పదంలోని ఎక్స్‌తో అనుసంధానమయ్యి బాక్స్ నుంచి బయటపడే మార్గం చూపుతుంది. ఇది ఒక మంచి చక్కని సందేశాన్ని ఇచ్చిందంటూ... ఆనంద్ మహింద్ర ఆ కప్పును తెగ మెచ్చకుంటూ ఆ విషయాన్ని వివరించారు. ఈ మేరకు ఆయన ఆ సందేశం వివరిస్తూ...ఇది ఒక రకంగా మనం మన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేస్తోంది. నిజానికి మనం సమస్య లోనే ఉండిపోయి కాకుండా బయటగా ఉండి ఎలా బయటపడాలో అన్వేషించాలి అనే ఒక చక్కని సందేశాన్ని ఇస్తోంది. గెలిచే మార్గాలను అన్వేషించడం తోపాటు సమస్య నుంచి బయటపడే పరిష్కార మార్గాలు గురించి తెలియజేస్తోంది. అన్నారు. అంతేకాదు ఇది అద్భుతమైన కప్పు, వెంటనే తాను ఆ కప్పును తెచ్చుకుంటానంటూ ట్వీట్ చేశారు. నెటిజన్లు కూడా ఆయనతో ఏకభవిస్తూ ఔను ఇది మంచి సందేశాన్ని ఇచ్చింది. ఎలా తెలివిగా సమస్యలు పరిష్కరించుకోవాలో తెలియజేస్తోంది అంటూ ట్వీట్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. I’m going to get this mug. Clever. The solution to a problem often lies by joining the dots with something OUTSIDE your own ecosystem… pic.twitter.com/SedGrDN8B9 — anand mahindra (@anandmahindra) August 10, 2022 (చదవండి: Viral Video: ఆహా! కోటు వేసుకోవడం ఎంత కష్టమో... బైడెన్ చూస్తే తెలుస్తుంది) -
ఆ గేమ్ కూడా పాయే.. బ్యాన్ చేసిన గూగుల్, ఆపిల్ సంస్థలు!
దేశంలో యువతను ఎంతగానో ఆకర్షించి తన వైపుకు తిప్పుకుంది పబ్జీ గేమ్(PUBG Game). అయితే ఎంత ఆదరణ పొందిందో అంతే స్థాయిలోనే విమర్శలను ఎదుర్కొంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ గేమ్‌కు బానిసలా మారి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ పబ్జీ గేమ్‌ను బ్యాన్ చేసింది. ఆ తరువాత ఈ గేమ్ తన పేరు మార్చుకొని బీజీఎంఐ(BGMI)గా మళ్లీ దేశంలోకి ప్రవేశించింది. అయితే యాప్ నిర్వాహకులకు తాజాగా మరో సారి కేంద్రం ప్రభుత్వం షాకిచ్చింది. అసలేం జరిగింది.. క్రాఫ్టాన్ కంపెనీ బ్యాన్ అయిన పబ్జీని బీజీఎంఐ (BGMI) గేమ్‌గా మార్పు చేసి జూన్ 2021 రీలాంచ్ చేసింది. అతి తక్కువ కాలంలో ఈ గేమ్ పాపులర్ కావడంతో పాటు గూగూల్ ప్లేస్టోర్‌లో టాప్ 10 గేమింగ్ యాప్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ నెల ప్రారంభంలో ఈ గేమ్ 100 మిలియన్ రిజిష్టర్డ్ యూజర్లను పొందినట్లు బీజీఎంఐ ప్రతినిధులు కూడా వెల్లడించారు. అంతలో కేంద్ర ప్రభుత్వం ఈ గేమ్‌ని కూడా బ్యాన్ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. గూగుల్, ఆపిల్ సంస్థలు బీజీఎంఐ గేమ్‌ని తమ సంబంధిత యాప్ స్టోర్ల నుంచి తొలగించాయి. ఈ వ్యవహారంపై గూగుల్ స్పందిస్తూ వివరణ కూడా ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఈ బ్యాన్‌కి గల కారణాన్ని ప్రభుత్వం ఇంతవరకు వెల్లడించలేదు. చదవండి: Swiggy: స్విగ్గీ కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -
హైదరాబాద్‌లో యూట్యూబర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ క్రాంతినగర్‌లో యూట్యూబర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూట్యూబ్‌లో వ్యూస్ పెరగడం లేదంటూ డ్రిపెషన్‌తో డీనా అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ గ్వాలియర్‌లో డీనా ఇంజనీరింగ్ చదువుతున్నాడు. గేమ్ ఆడుతూ తన బాధను చెప్పుకున్న డీనా.. ఆ క్రమంలో ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించాడు. చదవండి: నిత్యపెళ్లికొడుకు మామూలోడు కాదు.. 13 మందిని పెళ్లి చేసుకొని.. యూట్యూబ్‌లో selflo గేమ్ ఛానెల్‌ను అతను నిర్వహిస్తున్నాడు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు 8 గంటల ముందే సూసైడ్ లెటర్‌ను డీనా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. డీనా తండ్రి రైల్వేలో ఉద్యోగం చేస్తుండగా.. తల్లి డీఆర్డీవోలో పనిచేస్తున్నట్టుగా సమాచారం -
ఆన్లైన్ గేమింగ్ ప్రియులకు కేంద్రం భారీ షాక్!
రిలాక్సేషన్ కోసం ఆడే ఆన్లైన్ గేమ్స్ ఇకపై మరింత ఖరీదు కానున్నాయి. ఆన్లైన్ గేమ్స్‌పై ప్రస్తుతం కేంద్రం విధిస్తున్న జీఎస్టీని పెంచనుంది. ఇప్పటికే జీఎస్టీ పెంపు అంశంపై జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ది ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా( ఐఏఎంఏఐ) ఆన్లైన్ గేమింగ్‌పై 18శాతం జీఎస్టీని కొనసాగించాలని జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది. ఒకవేళ జీఎస్టీ రేట్లను ఇంకా పెంచితే ఆ ప్రభావం గేమింగ్ ఇండస్ట్రీతో పాటు దేశ ఎకానమీపై పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే త్వరలో కేంద్రం పెంచనున్న జీఎస్టీ ఏ గేమ్స్‌కు వర్తిస్తుందనే అంశంపై క్లారిటీ లేదని ఐఏఎంఏఐ తెలిపింది. ఫ్రీగా ఆడే గేమ్స్‌తో పాటు డబ్బులు చెల్లించే ఆడి ఆన్లైన్ గేమ్స్‌పై జీఎస్టీ విధిస్తారా అన్న అంశంపై స్పష్టత రావాలంటే కొద్ది రోజు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీపై జీఎస్టీ పెంపు అంశం ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీని కలవరానికి గురిచేస్తుంది. జీఎస్టీని పెంచితే.. గేమింగ్ ఇండస్ట్రీ నష్టపోయే ప్రమాదం ఉందని ఆ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ షట్ డౌన్ అయితే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందనే అంచనా వేస్తున్నారు. మే 18లోపు జీఎస్టీపై క్లారిటీ జీఎస్టీ పెంపు అంశంపై సమీక్షించేందుకు మంత్రులతో కూడిన బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. ఈ బృందం సభ్యులకు చైర్మన్‌గా కాన్రాడ్ సంగ్మా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మంత్రుల బృందం ఇప్పటికే మే 2న తొలి సమావేశం నిర్వహించింది. మే18న రెండో దఫా భేటీ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న 18శాతం పన్నును 28శాతానికి పెంచేందుకు మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా కాన్రాడ్ సంగ్మా మాట్లాడుతూ..బుధవారం (మే18)న జరగనున్న సమావేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రాస్ గేమింగ్ రెవెన్యూ (జీజీఆర్)పై పన్ను వేయాలా..లేదంటే చట్ట ప్రకారం చర్య తీసుకోతగిన మొత్తం ప్రైజ్‌పై వేయాలా..? అన్నది చర్చిస్తామన్నారు. చదవండి👉నట్టింట ‘స్మార్ట్’ చిచ్చు! -
జియోగేమ్స్‌లో చోటా భీం
వేసవిలో పిల్లలకు వినోదం పంచేందుకు చోటా భీం మరోసారి మన ముందుకు రానున్నాడు. గ్రీన్‌గోల్డ్ యానిమేషన్ ప్రైవేట్ లిమిటెడ్, జియో గేమ్స్ సంయుక్తంగా సరికొత్త చోటా భీంను అందిస్తున్నాయి. జియో సెట్‌టాప్ బాక్స్, యాప్‌స్టోర్, ప్లేస్టోర్లలో జియో గేమ్స్ యాప్‌లో చోటా భీం గేమ్ అందుబాటులో ఉంది. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన యానిమేషన్ క్యారెక్టర్లలో చోటా భీం ఒకటి. -
సన్నీ లియోన్‌తో మంచు విష్ణు ఫన్నీ గేమ్, నెటిజనుల సందడి!
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరో మంచు విష్ణు శివబాలాజీ బాలీవుడ్ స్టార్ సన్నీ లీయోన్తో కలిసి ఒక గేమ్ ఆడారు. ఒకరి తరువాత ఫన్నీ గేమ్ ఆడుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సన్నీ ట్విటర్లో పోస్ట్ చేశారు. బాల్యంలో ఆడుకున్న ఆట గుర్తొచ్చిందంటూ కొందరు కమెంట్ చేయగా, మరింత ఫన్నీగా, మరికొందరు స్పందించారు. సన్నీ, మంచు విష్ణును భయపెట్టేందుకు ప్రయత్నించిన వీడియో ఇటీవల నెట్టింట హల్ చల్ చేసింది. కాగా విష్ణు తాజా చిత్రం గాలి నాగేశ్వరరావులో సన్నీ లియోన్ కీలక పాత్ర పోషిస్టున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపు కుంటోంది. ఈ క్రమంలో షూటింగ్ బ్రేక్‌లో సన్నీ, విష్ణు, బాలాజీ ఈ ఫన్నీ వీడియోతో సందడి చేశారు. Love this game!! pic.twitter.com/wyhr3wq5KV — Sunny Leone (@SunnyLeone) April 15, 2022 -
పబ్జీ ఆడొద్దన్నందుకు కుటుంబాన్నే కాల్చేశాడు..!
ఇస్లామాబాద్: సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆన్లైన్ క్లాసులు వినడానికి మొబైల్ ఫోన్లు కొనిస్తున్నారు. అయితే, కొందరు పిల్లలు వీటిని ఆటల కోసం, అశ్లీల వీడియోలు చూస్తూ ఫోన్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. అయితే, కొందరు పిల్లలు పబ్జీ ఆటలకు, ఇతరవాటికి బానిసలుగా మారి వికృతంగా ప్రవర్తిస్తున్నారు. పబ్జీ గేమ్‌కు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు బానిసలుగా మారిన విషయం మనకు తెలిసిందే. పబ్జీ ఆటకు బానిసలుగా మారి కొందరు తమ విచక్షణను కోల్పోతున్నారు. దీని కోసం.. కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొందరు ఆడొద్దని వారించిన వారిని చంపిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నహిద్ ముబారక్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కహ్నా ప్రాంతంలో ఉండేవాడు. ఈ క్రమంలో అతనికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, 14 ఏళ్ల అతని కుమారుడు కొన్ని రోజులుగా చదువుపై శ్రద్ధపెట్టడంలేదని అతని తల్లి వారించింది. అతను పబ్జీ ఆటను మానేయాలని హెచ్చరించింది. దీంతో విచక్షణ కోల్పోయిన బాలుడు.. తన తల్లితో సహా ఇద్దరు మైనర్ సోదరీమణులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు. ఆ తర్వాత సదరు బాలుడు.. ఇంటి బయటకు వచ్చి అలారం శబ్ధం చేశాడు. తన కుటుంబాన్ని ఎవరో చంపారని తెలిపాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కాగా, నహిద్ తన కుటుంబ రక్షణ కోసం లైసెన్స్డ్ రివాల్వర్‌ను తన ఇంట్లో పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల తర్వాత నిందితుడు గన్ను ఎక్కడ పారేశాడో తెలియలేదు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు. కాగా, పాక్ పత్రిక డాన్ ప్రకారం.. ఆన్లైన్ పబ్జీ గేమ్ సంబంధించి ఇది నాల్గవ నేరమని తెలిపింది. కాగా, డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే గేమింగ్ డిజార్డర్‌ను ఒక వ్యాధిగా గుర్తించింది. వీరు ఈ ఆటకు బానిసలుగా మారి తమ విచక్షణను కోల్పోయి విపరీతంగా ప్రవర్తిస్తారని తెలిపింది. చదవండి: బీజేపీని ఓడించడమే తమ ఉమ్మడి సంకల్పం: అఖిలేష్ యాదవ్ -
సరదా తీర్చిన ట్రూత్ ఆర్ డేర్.. జీవిత ఖైదు
లండన్: ఫన్ కోసం సరదాగా ఆడే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఓ యువకుడిని జైలు పాలు చేసింది. గేమ్‌లో భాగంగా సదరు యువకుడు తన నానమ్మను చంపేశాడు. ఈ సంఘటన రెండేళ్ల క్రితం జరగ్గా.. తాజగా కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించింది. ఆ వివరాలు.. లాంక్షైర్ కాన్స్టాబులరీ ప్రకారం, యూకేకి చెందిన టియర్నాన్ డార్న్‌టన్ అనే యువకుడికి రిస్కీ పనులు చేయడం అంటే చాలా ఇష్టం. థ్రిల్ కోసం ప్రాణాలు పణంగా పెట్టడానికే కాదు.. తీయడానికి కూడా రెడీనే. ఈ క్రమంలో 2018, మే 28న ఇలాంటి థ్రిల్లింగ్ పనికే పూనుకున్నాడు. స్నేహితులతో కలిసి ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నాడు. (చదవండి: దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్‌కి స్కర్టులతోనే వస్తాం!!) ఈ క్రమంలో తన వంతు వచ్చినప్పుడు డేర్ సెలక్ట్ చేసుకున్నాడు డార్న్‌టన్. దానిలో భాగంగా తన నానమ్మ మేరీ గ్రెగోర్ ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ సంఘటనలో మేరీ మరణించింది. న్యూమోనియా, ఊపిరిడకపోవడం వల్ల చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు, లాంక్షైర్ కాన్స్టాబులరీ ఉమ్మడి పరిశోధనలో సిగరెట్‌ని ఆర్పకుండా పడేయడం వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. ప్రమాదవశాత్తు మరణించినట్లు నివేదికలో పేర్కొన్నారు. మరి ఇప్పుడెలా బయటపడింది అంటే డార్న్టనే స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. కొన్ని రోజుల క్రితం డార్న్‌టన్ ఓ కౌన్సిలర్ని కలిశాడు. మాటలో మధ్యలో గతంలో తాను తన నానమ్మ ఇంటికే నిప్పు పెట్టానని.. ఈ ప్రమాదంలో ఆమె మరణించిందని తెలిపాడు. ఈ విషయాన్ని కౌన్సిలర్ పోలీసులుకు తెలపడంతో వారు కేసును రీఒపెన్ చేశారు. (చదవండి: ఇదేం ట్రెండ్రా నాయనా... డస్ట్‌బిన్ కవరే డ్రెస్సు.!) కేసు విచారణలో డార్న్‌టన్ సంచలన విషయాలు తెలిపాడు. ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌లో భాగంగా తానే తన నానమ్మ ఇంటికి నిప్పు పెట్టినట్లు వెల్లడించాడు. దీని తర్వాత మరో సారి కూడా ఇలాంటి పని చేసినట్లు తెలిపాడు. ఈ క్రమంలో 2021, మార్చిలో డార్న్‌టన్ మీద హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. కోర్టు డార్న్టన్కు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో పెరోల్ లభించాలంటే.. డార్న్‌టన్ కనీసం 15 సంవత్సరాలు జైలు జీవితం గడపాలి. ఆ తర్వాతే అతడికి పెరోల్ లభించనుంది. చదవండి: 17 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. గ్రాండ్‌గా విడాకుల పార్టీ -
స్నేహితుల మధ్య ‘లూడో గేమ్’ వివాదం
-
కంటి చూపుతో కాదు కత్తితో..
న్యూ మినీగేమ్స్, న్యూ టెక్నిక్స్, న్యూ ఎనిమీ టైప్స్తో యాక్షన్ ఎడ్వెంచర్ గేమ్ ‘ఘోస్ట్ ఆఫ్ తుషిమా డైరెక్టర్స్ కట్’ నేడు విడుదలవుతుంది. ఇకీ ద్వీపం నేపథ్యం ఉన్న ఈ బ్రాండ్ న్యూ ఎడిషన్‌ను మోస్ట్ రిక్వెస్టెడ్ ఫీచర్స్‌తో తీర్చిదిద్దారు. ఇక కత్తి యుద్ధాల గురించి చెప్పాల్సిన పని లేదు. మనకు ఇష్టమైన జిన్ సకై సమురాయ్ ఉండనే ఉన్నాడు. కొత్త విలన్లు కూడా పరిచయం అవుతున్నారు. ‘మీకు సవాలుగా నిలిచే గేమ్ ఇది’ అంటున్నాడు ఆర్ట్ డైరెక్టర్ జాసన్ కనెల్. ప్లాట్‌ఫామ్స్: ప్లేస్టేషన్ 4, ప్లేస్టేషన్ 5 -
గూగుల్‌లో ఈ బుల్లి డైనోసార్ ఎలా పుట్టిందో తెలుసా?
గూగుల్‌లో కనిపించే బ్రౌజర్ గేమ్ ‘డైనోసార్’ తెలుసు కదా. ఇంటర్నెట్ ఆగిపోగానే.. చాలామందికి అదొక టైంపాస్ యవ్వారంగా ఉంటోంది. అయితే ఆ గేమ్‌కు కొత్త హంగులు అద్దినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్వయంగా ప్రకటించాడు. ఇంతకీ ఈ Google Dinosaur Game కొత్త అప్డేట్ ఏంటంటే.. ఒలింపిక్స్ మినీ గేమ్స్. సాక్షి, వెబ్‌డెస్క్: అడ్డుగా వచ్చే ముళ్ల పొదల చెట్లు, పై నుంచి దూసుకొచ్చే పక్షులు. వాటిని తప్పించుకుంటూ పరుగులు తీసే బుల్లి డైనోసార్. స్పేస్ బార్‌తో ఈ గేమ్ కంట్రోలింగ్ ఉంటుంది. దాని సాయంతో డైనోసార్‌ను తప్పించి ముందుకు పరిగెత్తాలి. పోను పోను వేగం పెరుగుతూ పోతుంటుంది. అయితే ఈ గేమ్‌కు ఒలింపిక్స్ గేమ్స్ తరహా ఫీచర్స్‌ను చేర్చారు. ఆటలకు సంబంధించిన టీ-రెక్స్(డైనోసార్), ఒలింపిక్స్ మినీ గేమ్స్, ఒలింపిక్ ఫ్లేమ్, రింగులు, మెడల్స్.. ఇలాంటి ఫీచర్లను చేర్చారు. అయితే పిచాయ్ కంటే ముందే ఓ రెడ్డిట్ యూజర్ ఈ విషయాన్ని గుర్తించి అప్డేట్ ఇవ్వడం విశేషం. Might need to work on my surfing skills 🌊 chrome://dino/ pic.twitter.com/OqDn3RHLGg — Sundar Pichai (@sundarpichai) July 23, 2021 అంతరించిపోయిన డైనోసార్ల నుంచి ఓ బుల్లి గేమ్.. అదీ అందరికీ అందుబాటులో ఎలా ఉంటుందనే సెబాస్టియన్ గాబ్రియల్ ఆలోచన నుంచి పుట్టింది ఇది. 2014లో శాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన ఈ వెబ్ డిజైనర్ డైనోసార్ గేమ్‌ను లాంఛ్ చేశాడు. 70వ దశకంలో ప్రపంచాన్ని ఊపిన ఇంగ్లీష్ రాక్ బ్యాండ్ టీ రెక్స్ పేరు మీద ఈ గేమ్‌ను రూపొందించాడు సెబాస్టియన్. మొదట్లో ప్రాజెక్ట్ బోలన్ పేరుతో దీనిని మొదలుపెట్టాడు. మార్క్ బోలన్ ఎవరంటే.. టీ-రెక్స్ లీడ్ సింగర్. 2014 సెప్టెంబర్‌లో ఈ గేమ్ రిలీజ్ కాగా..పాత డివైజ్‌లలో పని చేయలేదు. దీంతో డిసెంబర్లో అప్డేట్ వెర్షన్‌తో రీ-రిలీజ్ చేశారు. పాయింట్లు దాటుకుంటూ పోతుంటే రంగులు కూడా మారుతుంది ఈ గేమ్. సగటున నెలకు 27 కోట్ల మంది(అంతకు మించే) ఈ గేమ్‌ను ఆడుతుంటారని గూగుల్ చెబుతోంది. తర్వాతి కాలంలో గేమ్‌కు అప్డేట్స్ రాగా.. డినో స్వార్డ్స్ అని కత్తులు, కటార్లు, గొడ్డలు తగిలించారు. ఆటలో కొంచెం అటు ఇటు తేడా జరిగినా ఆ ఆయుధాలు డైనోసార్‌ను బలి తీసుకుంటాయి. ఇక రంగు రంగుల టోపీలు, ఐకాన్లు కూడా ఈ బుల్లి డైనోసార్‌కు తగిలించుకుని ఆడే వీలుంది. తాజా ఒలింపిక్స్ అప్డేట్ ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌కి వర్తిస్తుందని గూగుల్ స్పష్టం చేసింది. టీ-రెక్స్ కూడా రూపాలు మారడంతో పాటు పరుగులు పెడుతుందని, ఫినిషింగ్ లైన్ లక్క్ష్యంగా గేమ్ భలేగా ఉందని సదరు రెడ్డిట్ యూజర్ వెల్లడించాడు. ఇంతకీ ఈ గేమ్ మాగ్జిమమ్ పాయింట్లు 99999 రీచ్ అయితే ఏమవుతుందో తెలుసా?.. మళ్లీ సున్నాకే వచ్చేస్తుంది. కాకపోతే ఈసారి డైనోసార్ వేగం శరవేగంగా ఉంటుంది. -
తిరుపతిలో డ్రైవర్ యాప్ కలకలం
సాక్షి, తిరుమల: అలిపిరి నుంచి తిరుమలకు బస్ డ్రైవింగ్ గేమ్ పేరిట విడుదలైన ఓ యాప్ తిరుపతిలో కలకలం సృష్టించింది. ప్లే స్టోర్‌లో రూ.179 చెల్లించి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, గేమ్ గెలిస్తే 20 శ్రీవారి లడ్డూలు గెలిచినట్లని నిర్వహకులు ప్రచారం చేశారు. డ్రైవర్ యాప్‌పై హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ డ్రైవింగ్ యాప్‌పై టీటీడీ విజిలెన్స్ విచారణ చేపట్టింది. నిర్వహకుడు సురేష్ పరారీలో ఉన్నాడు. ప్లే స్టోర్ నుంచి యాప్‌ను అధికారులు డిలీట్ చేయించారు. -
అలిపిరి నుంచి తిరుమల కు బస్ డ్రైవింగ్ గేమ్
-
ఆ అలవాటుకు బానిసయ్యా: అనుపమ
అందం అభినయం పుష్కలంగా ఉన్న హీరోయిన్ల జాబితాల ముందు వరుసలో ఉండే అనుపమ పరమేశ్వరన్ అదృష్టం పరంగా మాత్రం కాస్త వెనక ఉందనే చెప్పాలి. కెరీర్ మొదట్లో ‘ప్రేమమ్’, ‘అఆ’ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించినా, ఆ ఫేమ్‌ను నిలకడగా నిలబెట్టుకోలేకపోయింది. దీంతో ఇటీవల కెరీర్ పరంగా కాస్త స్లో అయ్యింది ఈ అమ్మడు. ఇక సినిమాల విషయం ఎలా ఉన్నా సోషల్‌మీడియాలో మాత్రం తన హవాను కొనసాగిస్తోంది ఈ కేరళ బ్యూటీ. తాజాగా అనుపమ ఒకదానికి బానిసలా మారిపోయినట్లు చెప్పగా ఆ వార్త నెట్టింట వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. ఓ వైపు నటన, మరో వైపు క్యూట్ లుక్స్‌తో ఉండే అనుపమకు ఇటీవల సినిమా ఆఫర్లు పెద్దగా లేవనే తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు నిఖిల్ సరసన 18పేజెస్, దిల్ రాజు బ్యానర్ లో ఆయన తమ్ముడు కొడుకు హీరోగా లాంచ్ అవుతున్న రౌడీ బాయ్స్ లో నటిస్తోంది. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య తానొక వ్యక్తిని ప్రేమించినట్లు, చివరకి బ్రేకప్ కూడా జరిగిందంటూ తెలిపిన అనుపమ.. తాజాగా ఇన్‌స్టాలో గిబ్బరిష్ గేమ్‌కు బానిసలా మారిపోయినట్లు తెలిపింది. ఈ ఆటలో కొన్ని విచిత్ర పదాలు మనకు స్క్రీన్‌పై కనపడతాయ్. అందులో మనం పలికే తీరును బట్టి నిజమైన ఆంగ్ల పదాలను కనిపెట్టేయవచ్చు. ఇప్పుడు ఈ ఆటని అనుపమ ఆడటం కాదండోయ్.. దానికి తాను ఎంతగానో బానిస అయినట్లు తెలిపింది. -
PUBG గేమ్ కి బానిసై బాలుడు ఆత్మహత్య
-
Review: అదరగొట్టిన బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్(పబ్జీ)
గేమింగ్ ప్రియులకు పబ్జీ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జై పబ్జీ అంటూ వాళ్లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. పబ్జీ మన దేశంలో యువతను బాగా అతుక్కుపోయేలా చేసుకున్న గేమ్. కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత కారణాల రీత్యా బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. బ్యాన్ విధించినప్పటికీ వీపీఎన్ సౌలత్‌తో ఇంకా ఆడుతూనే ఉన్నారు. అయితే, పబ్జీ మరో బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో అనేక ఆటంకాలు దాటుకొని జూన్ 18న విడుదల అయ్యింది. అయితే, దశల వారీగా ఇది అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఎంతో మంది గేమింగ్ ప్రియులు చాలా కాలం ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. దీంతో ఇప్పుడు వచ్చిన బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ ఎలా ఉంది? పబ్జీ మించి ఉంటుందా? లేక అప్పటి లాగే ఉంటుందా? అని ఆతృతతో ఉన్నారు. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా సైజ్ వచ్చేసి 700 ఎంబీ, అదనపు డేటా 1.77జీబీ. కాబట్టి, మీ స్మార్ట్ ఫోన్ లో మీకు అంత స్థలం ఉంటేనే ఇన్స్టాల్ అవుతుంది. చిరాకు తెప్పిస్తున్న హెచ్చరికలు క్రాఫ్ట్టన్ సెటప్ ప్రక్రియను చాలా ఎక్కువగా ఉంది. ఇది వాస్తవానికి గేమర్ల గోప్యత గురించి శ్రద్ధ తీసుకుంటున్నట్లు చూపిస్తుంది కానీ, వాస్తవానికి అదేమీ ఉండదు. ఉదా: మీరు 18 సంవత్సరాల కంటే పెద్దవారా లేదా అని మిమ్మల్ని అడుగుతుంది. అయితే, ఇందులో దానిని ధృవీకరించడానికి ఇన్ గేమ్ ప్రక్రియ అంటూ ఏమి లేదు. అదేవిధంగా, గేమ్ అడుతున్నప్పుడు రెగ్యులర్ ఆడియో హెచ్చరికలు వస్తున్నాయి. అది మీకు చాలా చిరాకు, కోపం తెప్పిస్తుంది. మీరు గేమ్ ఆడటం ప్రారంభించిన తర్వాత, అదే స్వరంతో ఎక్కువ గంటలు ఆడకూడదని మీకు గుర్తు చేస్తుంది. మీరు మ్యాచ్ ప్రారంభించిన ప్రతిసారీ ఇలానే జరుగుతుంది. ఆటగాళ్ళు ఒక నిర్దిష్ట సమయం ఆడిన తర్వాత ఈ హెచ్చరికలు వస్తే బాగుండేది. ప్లేయర్ డేటాను బదిలీ చేయవచ్చు ఇందులో మంచి విషయం ఏమిటంటే, మీరు పాత ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లే ఖాతా ద్వారా లాగిన్ అయితే డేటాను పబ్జీ నుంచి బదిలీ చేసుకోవచ్చు. ఈ గేమ్ ఇప్పుడు అల్ట్రా హెచ్ డీ, యుహెచ్ డీతో సహా చాలా గ్రాఫిక్స్ ఆప్షన్ ని అందిస్తుంది. నేను రెండు సార్లు గేమ్ ఆడిన రెండు సందర్భాలలో వెయిటింగ్ రూమ్ 45 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకోలేదు. అదే సాధారణంగా కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ అయితే మొబైల్ లో 70 నుంచి 90 సెకన్ల మధ్య ఉంటుంది. సుపరిచితమైన గేమ్ ప్లే గేమ్ ప్లే విషయానికి వస్తే, లొకేషన్ లు, గ్రాఫిక్స్ మొత్తం పబ్జీ మొబైల్ తరహాలోనే ఉంటుంది. మ్యాప్ కూడా పబ్జీ తరహాలోనే ఉంటుంది. దీనిలో భారతదేశంలోని నిర్ధిష్ట లొకేషన్ లు లేవు. ఇందులో మొదటి ప్రధాన మార్పు ఏమిటంటే గేమ్ లో ఎరుపుకు బదులుగా ఆకుపచ్చ రంగులో రక్తాన్ని చూపిస్తుంది. రంగులను మార్చుకోవచ్చు కానీ, ఎరుపు మాత్రం కాదు. అలాగే, ఆటగాళ్లు కాల్చినప్పుడు రక్తానికి బదులుగా ఆకుపచ్చ రంగులో చూపిస్తుంది. అలాగే, మీరు ఒక ఆటగాడిని కోల్పోతే, 'కిల్'కు బదులుగా పూర్తయింది అని వస్తుంది. ఈ గేమ్ ఆట టెన్సెంట్ వెర్షన్ నుంచి క్రాఫ్ట్టన్ తనను తాను వేరు చేయడానికి ప్రయత్నిస్తుంది. నేను ఎంఐ 11 అల్ట్రాలో ఈ గేమ్ అడినప్పుడు ఎటువంటి అంతరాయం కలగలేదు. మొత్తానికి మాత్రం మనం పబ్జీ గేమ్ ఆడిన అనుభూతి మాత్రమే వస్తుంది. వేరే గేమ్ ఆడిన అనుభూతి రాదు. మీరు ఈ గేమ్ అడినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో ఈ క్రింద కామెంట్ చేయండి. చదవండి: రైలు ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్త! -
BGMI టీజర్ విడుదల: గేమ్‌ను 2060లో విడుదల చేస్తావా ఏంటి?!
పబ్జీ గేమ్.. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా(BGMI) పేరుతో భారత్‌లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గేమ్‌ను డిజైన్ చేసిన క్రాఫ్టన్ సంస్థ ప్రీ-రిజిస్ట్రేషన్లు, అప్డేట్స్, దానికి సంబంధించిన ఓ టీజర్ విడుదల చేయడంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే గేమింగ్ లవర్స్ ఆసక్తికి అనుగుణంగా సదరు సంస్థ గేమ్‌ను విడుదల చేయడంతో విఫలమైందంటూ గేమింగ్ ప్రియులు పెదవి విరుస్తున్నారు. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాగా రానున్న పబ్జీ గేమ్ ను ఆడేందుకు ఔత్సాహికులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో ఈ గేమ్‌ను విడుదల చేసేందుకు పబ్జీ మాతృసంస్థ క్రాఫ్టన్ సంస్థ ప్రతినిధులు గేమ్‌ను రీ డిజైన్ చేసి విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ప్రి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభింభించారు. దీంతో గేమ్ లవర్స్ భారీ ఎత్తున రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అదే సమయంలో టీజర్‌ను విడుదల చేసింది. అయితే ఈ టీజర్ విడుదలతో గేమ్‌ను ఇన్స్టాల్ చేసుకొని ఆడేందుకు గేమింగ్ ప్రియులు ప్రయత్నించారు. కానీ ఆ గేమ్ ఇన్స్టాల్ చేసే ఆప్షన్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సంస్థ అధికారిక యూట్యూబ్ ఛానల్ కామెంట్ సెక్షన్లో ప్రి రిజిస్ట్రేషన్లు భారీ స్థాయిలో చేసుకుంటున్నారని ప్రచారం చేసుకోవడం కాదు.. గేమ్ ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్‌ను కూడా క్రియేట్ చేయాలి’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదు 2060 సంవత్సరం అయినా క్రాఫ్టన్ సంస్థ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా ప్రి రిజిస్ట్రర్ నౌ అని ప్రచారం చేసుకుంటుందని ట్రోల్ చేస్తున్నారు. కాగా, ప్రముఖ పబ్జీ గేమ్ మొబైల్ ఇన్ఫ్లుయెన్సర్ సాగర్ ఠాకూర్ ఇటీవల పబ్జీ మొబైల్ ఇండియన్ వెర్షన్ విడుదల తేదీని ప్రకటించి విషయం తెలిసిందే. జూన్ 18న విడుదల కానుందని బైనరీ కోడ్ ద్వారా ఆయన వెల్లడించారు. -
రూబిక్ క్యూబ్‌తో ప్రపంచ రికార్డు!
పెద్దవాళ్లు సైతం కష్టపడి పరిష్కరించే రూబిక్ క్యూబ్‌ను నేటితరం పిల్లలు ఇట్టే పరిష్కరిస్తూ ఔరా అనిపిస్తున్నారు. చిచ్చర పిడుగులాంటి ఎనిమిదేళ్ల అధర్వ ఒకేసారి మూడు రూబిక్ క్యూబ్‌లను పరిష్కరించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. బెంగళూరుకు చెదిన అధర్వ ఆర్భట్ ఒకేసారి చేతులు, కాళ్లు ఉపయోగించి మూడు రూబిక్క్యూబ్లను పరిష్కరించి గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. అంతేగాకుండా ‘వరల్డ్ బెస్ట్ మల్టీ టాస్కర్’ను కనుగొన్నామని గిన్నీస్ యాజమాన్యం నుంచి ప్రశంస అందుకున్నాడు. అధర్వ 2020 డిసెంబర్ 9న ఈ రికార్డు సృష్టించినప్పటికీ... తాజాగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ (జీడబ్ల్యూర్) అధికారిక యూట్యూబ్ చానెల్లో అధర్వ వీడియో పోస్టు చేయడంతో అతని రికార్డు వెలుగులోకి వచ్చింది. గిన్నిస్ యాజమాన్యం పోస్టు చేసిన వీడియోలో... అధర్వ ఒక్కో చేతిలో ఒక్కో రూబిక్ క్యూబ్నూ, రెండు కాళ్లతో ఒక రూబిక్ క్యూబ్‌ను ఒకేసారి పరిష్కరిస్తుంటాడు. అతని పక్కనే ఒక వ్యక్తి అధర్వ ఎంత సమయం లో పజిల్‌ను క్లియర్ చేస్తున్నాడో తెలిపే టైమర్ ను పట్టుకుని కూర్చుని ఉంటాడు. చాలా వేగంగా క్యూబిక్ పజిల్‌ను అటూ ఇటూ కదుపుతూ ఒక నిమిషం ఇరవైతొమ్మిది సెకన్లలోనే పూర్తిచేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా క్యూబ్ పజిల్ పరిష్కరించి రికార్డులు తిరగరాసిన అధర్వకు మన దేశానికి చెందిన కృష్ణంరాజు, చైనాకు చెందిన జియాన్యూ క్యూలు ప్రేరణ. వీరు గతంలో అత్యంత వేగంగా క్యూబిక్ పజిల్‌ను పూర్తిచేసి గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు. వీరికంటే వేగంగా పజిల్‌ను పూర్తిచేసి రికార్డు కొట్టాలనుకున్న అధర్వ ఆ దిశగా సాధన చేసి చివరికి తను అనుకున్నది సాధించాడు. 2017 నుంచి రికార్డు కోసం సాధన చేస్తున్న అధర్వ 2018లో రాష్ట్ర స్థాయి ‘ బెస్ట్ ట్యాలెంట్ ఆఫ్ కర్ణాటక’ లో పాల్గొని కాళ్లతో క్యూబ్స్‌ను పరిష్కరిస్తూ ఫైనల్స్ వరకు చేరుకుని వీక్షకులను ఆశ్చర్యపరుస్తూ విజయం సాధించాడు. అయితే ఈ పోటీ టాలెంట్‌ను ప్రదర్శించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మరింత కష్టపడి ప్రయత్నిస్తే గిన్నిస్ వరల్డ్ రికార్డు టైటిల్ గెలుచుకోవచ్చని అధర్వ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా కరోనా కాలంలో ఆన్లైన్ తరగతులు వింటూ..తన గిన్నిస్ రికార్డు కోసం సాధనం చేసేవాడు. ఈ క్రమంలోనే పలుమార్లు క్యూబ్‌లు పరిష్కరిస్తూ సర్టిఫికెట్లు కూడా అందుకున్నాడు. ‘‘పజిల్స్ అంటే ఎంతో ఇష్టం, వాటిని పరిష్కరించడం మరెంతో ఇష్టమని చెబుతూ.. కుటుంబ ప్రోత్సాహంతోనే తానీ స్థాయికి చేరుకున్నానని అధర్వ చెప్పాడు. -
సైబర్‌పంక్ 2077 గేమ్ వచ్చేసింది
గేమ్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘సైబర్‌పంక్ 2077 గేమ్’ నేడు అందుబాటులోకి వచ్చేసింది. సైబర్‌పంక్ 2077 కొద్దీ నెల క్రితం నుండి వాయిదా పడుతూ వస్తుంది. దీంతో గేమర్లు కోపంతో సైబర్‌పంక్ డెవలపర్లను ట్విట్టర్ వేదికగా బెదిరించిన విషయం కూడా అప్పట్లో వైరల్ అయింది. మొత్తానికి ఈ గేమ్ ని నేడు ఘనంగా విడుదల చేసింది. సైబర్‌పంక్ 2077 గేమ్ ఇప్పుడు ప్లేస్టేషన్, ఎక్స్‌బాక్స్, పిసి, గూగుల్ స్టేడియా, ఎన్విడియా జిఫోర్స్ నౌ క్లౌడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లతో సహా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఆడటానికి సిద్ధంగా ఉంది.(చదవండి: ఇంటర్ నెట్లో ఇవే టాప్ యాప్స్) ఈ గేమ్ ప్లేస్టేషన్, ఎక్స్‌బాక్స్ కన్సోల్‌ల కోసం రూ.3,499 వద్ద ప్రారంభించారు. అలాగే భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న పిసి వినియోగదారుల కోసం రూ.2,999 ధరను నిర్ణయించారు. ప్రత్యేకంగా, గేమర్స్ సైబర్‌పంక్ 2077 డిస్క్‌ను ఎక్స్‌బాక్స్, ప్లేస్టేషన్ వినియోగదారులకు అమెజాన్‌లో రూ.3,999కు లభించనుంది. అలాగే పిసి గేమ్ డిస్క్ అమెజాన్‌లో ధర రూ.2,499లో అందుబాటులో ఉంది. ప్లే స్టేషన్ 4 మరియు ఎక్స్‌బాక్స్ వన్ సిరీస్ కన్సోల్‌ల కోసం సైబర్‌పంక్ 2077 గేమ్ కొనుగోలు చేసిన వారు అదనపు ఖర్చు లేకుండా ప్లేస్టేషన్ 5 మరియు ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్ /ఎస్ లలో గేమ్ ను ఆడుకోవచ్చు. పీసీలో ఇది 70జీబీ డిస్క్ స్థలాన్ని తీసుకుంటుంది. పీసీలో 1080p, 1440p, మరియు 4K రిజల్యూషన్‌లో ఈ గేమ్ ను ఆడవచ్చు. ఈ గేమ్‌ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి పర్ఫ్మార్మెన్స్ కోసం సిఫార్సు చేసిన పీసీ రిక్వైర్మెంట్స్ ఏంటంటే.. 64 బిట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, డైరెక్ట్ఎక్స్ 12 వెర్షన్, ఇంటెల్ కోర్ ఐ7-4790 లేదా ఏఎండీ రైజెన్ 3 3200జీ ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్, ఎన్విడియా జీఈఫోర్స్ జీటీఎక్స్ 1060 6 జీబీ లేదా ఏఎండీ రేడియాన్ ఆర్9 ఫ్యూరీ గ్రాఫిక్స్ కార్డ్, 70 జీబీ స్టోరేజ్ ఉంటే సరిపోతుంది. ఇవి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా సైబర్‌పంక్ 2077ను ఎంజాయ్ చేయవచ్చు. -
పబ్జీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్
న్యూఢిల్లీ: పబ్జీ అభిమానులకు చేదువార్త. పబ్జీ తిరిగి సేవలను భారత్ లో తీసుకొచ్చేందుకు మరికొంత సమయం పట్టేలాగా ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి పబ్జీ కార్పొరేషన్ కి ఇంకా పూర్తీ స్థాయి అనుమతులు రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుతం నిషేధం విధించిన తర్వాత తిరిగి భారత్ లోకి "పబ్జీ మొబైల్ ఇండియా" పేరుతో గ్లోబల్ వెర్షన్ కి భిన్నంగా రావాలని ప్రయత్నిస్తుంది. దీంతో పబ్జీ అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. భారత్ దేశంలో పబ్జీ గేమ్ ని పూర్తీ స్థాయిలో తీసుకొచ్చేందుకు, అన్ని విధానాలను పూర్తీ చేసి ఈ నెల మొదటి వారంలో తీసుకురావాలని భావించింది. కానీ, దీనికి కేంద్ర ప్రభుత్వ శాఖ అయిన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) నుంచి పూర్తీ స్థాయి అనుమతులు మాత్రం రాలేదు. గతంలో నిషేధింపబడ్డ సంస్థలు తమ వ్యాపార లావాదేవీల కోసం మన దేశంలో ఒక కొత్త సంస్థను ఫ్లోట్ చేసి తీసుకురావడం సరైన విధానం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. ఒక వేళా తిరిగి రావడం అంత సులభం అయితే ఇదే భాటలో టిక్ టాక్ కూడా తిరిగి వచ్చేదని, ఇది దేశ భద్రతకు సంబందించిన విషయం అని తెలిపింది. దీంతో పబ్జీ గేమ్ కి భారత్ లోకి ప్రవేశించేందుకు మరింత సమయం పట్టేలా కనిపిస్తుంది. -
పబ్జీ టోర్నీలో గెలిస్తే రూ. 6 కోట్లు!
దేశ భద్రతా కారణాల దృష్ట్యా నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పబ్జీ గేమ్‌ని భారత్‌లో నిషేధించిన తరువాత తిరిగి "పబ్ జీ మొబైల్ ఇండియా" పేరుతో భారత మార్కెట్లోకి రావడానికి భారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరికొద్ది రోజుల్లో "పబ్జీ మొబైల్ ఇండియా" పేరుతో రాబోతున్న ఈ గేమ్ కోసం దేశంలో చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చైనాకు చెందిన ఈ పబ్జీ గేమ్ ఇండియన్ కంపెనీకి పేటెంట్ రైట్స్ ఇచ్చింది. దీంతో పబ్జీ తిరిగి భారత్‌లో తన కార్యకలాపాల్ని కొనసాగించనుంది. పబ్జీ మొబైల్ గేమ్‌ని అధికారికంగా ప్రారంభించటానికి ముందు పబ్జీ కార్పొరేషన్ తన ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. (చదవండి: ఈ యాప్ తో వేలల్లో సంపాదించండి) తాజాగా భారత పబ్జీ ప్రొఫెషనల్ గేమర్ అభిజిత్ అందారే ట్విటర్లో ఒక ప్రకటన చేసారు. పబ్జీ నిర్వహించబోయే టోర్నీలో గెలిచే ప్లేయర్లకు 6 కోట్ల రూపాయలు బహుమతిగా అందించనున్నారని తెలిపారు. ఇక పబ్జీ గేమ్‌ను ఇండియాలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు గేమ్‌ను డెవలప్ చేస్తున్న టైర్–1 డెవలపర్లకు రూ.40వేల నుంచి రూ.2లక్షల వరకు జీతాలు ఇస్తున్నట్లు ట్విటర్లో పేర్కొన్నారు. ఇటీవల ఈ గేమ్‌కి సంబంధించిన టీజర్ కూడా యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది పబ్జీ కార్పొరేషన్. కొత్తగా తీసుకొచ్చిన 'పబ్జీ మొబైల్ ఇండియా'లో భారత మార్కెట్‌కు తగ్గట్టుగా ఈ గేమ్‌ను డిజైన్ చేస్తోంది. -
పిల్లల కోసం.. కరోనా గేమ్
మీ పిల్లలు కరోనా జాగ్రతలు పాటించడం లేదా? అయితే వారితో ఈ గేమ్ ఆగించండి. మీకే ఎలా భద్రంగా ఉండాలో చెప్తారు. ఐఐటీ మద్రాస్ విద్యార్థులు పిల్లల్లొ అవగాహన పెంచడానికి ఐఐఎమ్ కోవిడ్ గేమ్‌ని రూపొందించారు. ఇది 12 ప్రాంతీయ భాషలో అందుబాటులో ఉంది. కోవిడ్-19 పై పిల్లల్లో అవేర్నెస్ కల్పించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదొక బ్రౌజర్ బేస్డ్ గేమ్ దీన్ని మోబైల్, టాబ్లెట్, లాప్టాప్, పీసీ ఎందులోనైనా ఆడొచ్చు. కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడటానికి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ గేమ్‌ని రూపొందించారు. ప్రసిద్ధ సూపర్ మరియో గేమ్‌ని ఆదర్శంగా తీసుకుని దీన్ని రూపొందించారు. ఒక నిమిషం పాటు సాగే కోవిడ్-19 ఆటలో గరిష్ట పాయింట్లు సాధించడానికి సరైన పనులు చేయాలి. ఎక్కువ పాయింట్లు సాధించినవారు విన్నర్. సరైన పనులు అంటే గేమ్‌లో పాత్రలు కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలి(మాస్క్ ధరించటం, శానిటైజర్ వాడటం, సోషల్ డిస్టెన్స్ పాటించడం ) ఇవి సరిగా పాటించినప్పుడల్లా ఒక పాయింట్ కలుస్తుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే పాయింట్లు కోల్పోతారు.ఐఐఎమ్ కోవిడ్ గేమ్‌ని వసుధ టీకే, ఎన్ఎస్ కీర్తి, శివప్రియ వెళైచామీ అనే విద్యార్థులు రూపొందించారు. ఈ గేమ్‌ని విద్యార్థులు జనవరి నుంచి మే మధ్య అందించే లెట్స్ ప్లే టూ లెర్న కోర్స్‌లో భాగంగా రూపొందించారు. ఈ కోర్సులో 30 మంది విద్యార్థులు పాలుపంచుకుని వివిధ అంశాలపై బోర్డ్ గేమ్స్ రూపొందించారు. ఇందులో ముగ్గురు కరోనా సంబంధిత గేమ్‌ని తయారుచేశారు. కొందరి అభిప్రాయం సేకరించిన తర్వాత గేమ్‌ని ఇంకొన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. సమాజానికి ఉపయోగపడే మరిన్ని గేమ్స్‌ని రూపొందిస్తామని విద్యార్థులు అంటున్నారు. -
ఈ ఆట గుర్తుందా? పేరు చెప్పగలరా?
న్యూఢిల్లీ : స్మార్ట్ ఫోన్ ప్రస్తుత సమాజాన్ని కట్టు బానిసల్ని చేసుకుందనడంలో అతిశయోక్తి లేదు. అవసరమున్నా లేకపోయినా.. అలవాటుగానైనా అరగంటకో సారి సెల్‌ఫోన్‌ను చేతుల్లోకి తీసుకునే వాళ్లు అనేకం. ఇక పిల్లలు ఆన్లైన్ గేమ్‌ల మోజుతో బయటకెళ్లటమే మానేశారు. అలా 10 ఏళ్ల క్రితం వరకు ఆడిన ఆటలు ప్రస్తుతం కనుమరుగయ్యాయి. వాటికి సంబంధించిన వీడియోలో, ఫొటోలో సోషల్ మీడియాలో దర్శనమిచ్చినపుడు.. ‘‘ అరే! ఈ ఆట మా చిన్నప్పుడు భలే ఆడేవాళ్లం’’ అనుకోవటం పరిపాటిగా మారింది. గతం తాలూకూ జ్ఞాపకాలను తలుచుకుంటూ నిట్టూర్పు విడవటం మామూలైంది. ఈ లిస్టులో సామాన్య ప్రజలే కాదు ఉన్నత అధికారులు కూడా చేరిపోయారు. ఐపీఎస్ అధికారి దీపాన్స్ కాబ్రా తాజాగా ఓ పాత ఆటకు సంబంధించిన ఫొటోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ ఈ ఆట గుర్తుందా? పేరు చెప్పగలరా?’’ అని నెటిజన్లను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ( హెడ్ ఫోన్లు వాడుతున్నారా? బీ కేర్‌ఫుల్ ) ఆట ఎలా ఆడతారంటే : కొంతమంది పిల్లలు ఒకరి వెనకాల ఒకరు చేరి చేతులు ఎత్తి పట్టుకున్న ఇద్దరు వ్యక్తుల మధ్య నుంచి తిరుగుతుంటారు. ఆ ఇద్దరు వ్యక్తులు పాడుతుండగా మిగిలిన పిల్లలు వారి చేతుల మధ్యనుంచి అలా రౌండ్లు తిరుగుతూనే ఉంటారు. పాట పాడటం పూర్తయిన వెంటనే ఆ ఇద్దరు చేతులు మూసేస్తారు. చేతుల మధ్య ఇరుక్కున్న వ్యక్తి అవుట్ అన్నమాట!. ఈ ఆటను ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా పిలుస్తారు. మరి మీ ఏరియాలో ఈ ఆటను ఏమని పిలిచేవాళ్లు.. ఏ పాట పాడేవాళ్లు.. ఓ సారి గతంలోకి వెళ్లి గుర్తు తెచ్చుకోండి!. Remember this game? Can you name it?#ThrowbackThursday #TBT #ChildhoodMemories #90sLife pic.twitter.com/cZv0DKYiWP — Dipanshu Kabra (@ipskabra) October 16, 2020 -
'నాన్నా'.. అని పిలవడమే మానేసింది
‘నాన్నా..’ అని పిలవడమే మానేసింది ఆ కూతురు తన తండ్రిని! ఇంట్లోని ముగ్గురు పిల్లల్లో చివరి అమ్మాయి. చివరి అమ్మాయి అంటే మరీ చిన్నమ్మాయి కూడా కాదు. ఇరవై నాలుగేళ్లు. ఒక తండ్రి తన కూతురికి పంచాల్సిన కనీస ప్రేమను కూడా పంచలేదని ఆ అమ్మాయి ఆవేదన. ‘ఆయన్ని నేనెంతో నమ్మాను. ఆయన్నుంచి ఎంతో ఆశించాను. కానీ నా నమ్మకాన్ని, ఆశను ఆయన అస్సలు పట్టించుకోలేదు‘ అని ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేసింది. లాక్డౌన్లో ఆ తండ్రీ కూతుళ్లు లూడో గేమ్ ఆడారు. ఆడిన ప్రతిసారీ కూతురు అని కూడా చూడకుండా ఆ తండ్రే గెలిచాడు. కూతురు కోసం కనీసం ఒక్కసారైనా ఆయన ఓడిపోలేదు. ఏ తండ్రయినా ఇలా చేస్తాడా.. అని మొదట ఆమె అలగడం వరకే చేసింది. తర్వాత ముభావంగా ఉండటం మొదలు పెట్టింది. చివరికి తండ్రితో మాట్లాడ్డమే మానేసింది. ఆమెకు కోపం రావడం సహజమే అనిపించేంతగా లూడో గేమ్‌లో ఆయన ఆమె టోకెన్స్‌ని కిల్ చేసేవారు. మిగతా ఇద్దరు పిల్లలు కూడా తండ్రి చేతిలో ఓడిపోయినా ఓటమిని మర్చిపోయారు. ఆమె మాత్రం ఓటమిని గుర్తుపెట్టుకొని తండ్రిపై కోపం పెంచుకుంటూ వచ్చింది. అలా ఫ్యామిలీ కోర్టు దాకా వచ్చింది. ఆమెను బయట కూర్చోబెట్టి ఫ్యామిలీ కోర్టు కౌన్సెలర్ సరితారజని తండ్రిని లోనికి పిలిచారు. ‘ఈకాలం పిల్లలు ఓటమిని అస్సలు తట్టుకోలేక పోతున్నారు. మీరు కనీసం ఒకసారైనా తన చేతిలో ఓడిపోవలసింది’ అన్నారు. ఆ తండ్రి తన ఉద్దేశం చెప్పాడు. ‘ఆటలో తండ్రీకూతుళ్లు ఉండరు. ప్రత్యర్ధులు మాత్రమే ఉంటారు. కూతురు కోసం తండ్రి ఓడిపోయి ఆమెను గెలిపించడమే ఆమెను నిజంగా ఓడించడం. ఆ ఓటమి కన్నా ఆమెను గెలిపించని ఓటమే ఆమెకు గౌరవం కదా’ అన్నారు. కూతురికి తగ్గ తండ్రి అనుకుని ఉండాలి ఆ కౌన్సెలింగ్ ఆఫీసర్. ఈ తండ్రీకూతుళ్ల సంవాదం భోపాల్‌లో జరుగుతోంది. -
ప్రాణం బలిగొన్న మొబైల్ గేమ్ వ్యసనం
గంగవరం (చిత్తూరు జిల్లా): మనస్తాపానికి గురైన ఓ బాలిక ఇంటిలో ఉరేసుకుని బలవన్మరణం చెందింది. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు కిలపట్ల గ్రామానికి చెందిన మణికంఠ కుమార్తె చైత్ర(12) రాయలపేట గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కరోనా కారణంగా పాఠశాలలు మూత పడటంతో అప్పటి నుండి ఇంటి వద్దనే ఉంటోంది. అమ్మ చేస్తున్న ఇంటి పనుల్లో సహాయ పడక పోగా రోజూ మొబైల్లో గేమ్ ఆడుకుంటూ టైంకి సరీగా భోజనం కూడా చేసేది కాదు. మొబైల్లో గేమ్ ఆడొద్దంటూ అప్పుడప్పుడూ తల్లి మందలించేది. ఈ నేపథ్యంలో బాలిక గురువారం రాత్రి ఇంటి మిద్దెపైన రూమ్‌లో ప్యానుకు చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. (చదవండి: దురాశకు పోయారు.. అడ్డంగా దొరికారు) మిద్దిపైకి కోపంగా వెళ్ళిన కుమార్తె ఎంతసేపటికీ కిందికి రాకపోవడంతో తల్లికి అనుమానం వచ్చి మిద్దింటి తలుపును ఎంత తట్టినా కుమార్తె తెరవలేదు. కిటికీలో నుండి చూడగా ప్యానుకు వేలాడుతున్న కుమార్తెను చూసి తల్లి ఒక్కసారిగా బిత్తరపోయి అరుపులు కేకలు పెట్టింది. ఆమె కేకలు విన్న పక్కింటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇంటి తలుపును బద్దలుకొట్టి ప్యానుకు వేలాడుతున్న బాలికను కిందికి దించి వెంటనే పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ బాలికకు చికిత్స అందించే లోపే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇండియన్ పబ్జీ...ఫౌజీ వచ్చేస్తోంది!
సాక్షి, న్యూఢిల్లీ: పబ్జీ సహా 118 చైనీస్ మొబైల్ యాప్ లపై కేంద్రం నిషేధం నేపథ్యంలో ఇండియన్ పబ్జీ వచ్చేస్తోంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ కొత్త యాక్షన్ గేమ్‌ను శుక్రవారం పరిచయం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా మల్టీప్లేయర్ యాక్షన్-గేమ్ ఫౌ-జీని ప్రారంభించినట్లు ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను ట్విటర్ లో పోస్ట్ చేశారు. వినోదంతో పాటు ఆటగాళ్ళు మన సైనికుల త్యాగాల గురించి కూడా తెలుసుకుంటారని అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పబ్జీకి ప్రత్యామ్నాయంగా ఫౌజీ పేరుతో ఇండియన్ యాప్ ను బెంగళూరుకు చెందిన ఎన్కోర్ గేమ్స్ రూపొందించింది. అక్షయ్ కుమార్ తోపాటు, పారిశ్రామికవేత్త, జీవోక్యూఐఐ ఫౌండర్, సీఈవో విశాల్ గోండల్ ట్వీట్ చేశారు. అంతేకాదు దీని ఆదాయంలో 20 శాతం నిధులను భారత్ కే వీర్‌కు విరాళంగా ఇస్తామని తెలిపారు. అయితే అధికారికంగా ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ వివరించలేదు. అలాగే ఈ గేమ్ మొబైల్ పరికరాలకే పరిమితం అవుతుందా లేదా పీసీ వెర్షన్ కూడా వస్తుందా అనేదానిపై కూడా స్పష్టత లేదు. కాగా1999 లో ఇండియా గేమ్స్ ను ప్రారంభించిన విశాల్ గోండల్ 2011లో దీన్ని డిస్నీకి విక్రయించారు. గత ఏడాది మార్చిలో ఎన్కోర్ గేమ్స్‌లో పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టారు. అలాగే స్టార్టప్‌కు వ్యూహాత్మక సలహాదారుగా కూడా పనిచేస్తున్నారు. Supporting PM @narendramodi’s AtmaNirbhar movement, proud to present an action game,Fearless And United-Guards FAU-G. Besides entertainment, players will also learn about the sacrifices of our soldiers. 20% of the net revenue generated will be donated to @BharatKeVeer Trust #FAUG pic.twitter.com/Q1HLFB5hPt — Akshay Kumar (@akshaykumar) September 4, 2020 In response to PM @narendramodi call of #AtmaNirbharApp, @nCore_games is proud to announce our action game Fearless And United: Guards FAU:G with mentorship from @akshaykumar 20% of net revenues donated to @BharatKeVeer trust for India's Bravehearts #JaiHind #FAUG #gaming pic.twitter.com/OZTKj2mdFl — Vishal Gondal (@vishalgondal) September 4, 2020 -
డేంజర్ గేమ్: 23వ అంతస్తు చివరి నుంచి..
సాక్షి, చెన్నై: అసలే లాక్డౌన్.. విశ్రాంతికే విసుగొచ్చేంత విరామం దొరికింది. ఇంట్లో ఎంతసేపని ఖాళీగా కూర్చుంటాం.. ఏదైనా ఆట ఆడుకుందామనుకున్నారు తమిళనాడులోని చెన్నైకు చెందిన అన్నాచెల్లెళ్లు. కానీ మామూలు ఆట ఆడుకుంటే కిక్కు ఉండదనుకున్నారో ఏమో కానీ ఏకంగా ప్రాణాలనే రిస్క్‌లో పెట్టే గేమ్ ఆడారు. ఎవరికి ఎక్కువ ధైర్యం ఉందో చూసుకుందామని పోటీ పెట్టుకున్నారు. అన్న కన్నా తనే ధైర్యవంతురాలని నిరూపించుకునేందుకు పద్నాలుగేళ్ల బాలిక 23వ అంతస్థు కొన నుంచి నడిచింది. (జూమ్ క్లాస్‌లో ఈ పిల్లాడేం చేశాడో తెలుసా?) అలా మూడు సార్లు నడుస్తూ ప్రమాదంతో ప్రయాణం చేసింది. ఈ భయానక సాహసాన్ని కొందరు కెమెరాలో చిత్రీకరించగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏమాత్రం కాలు జారినా పరిస్థితి ఘోరంగా ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆగస్టు 6న చెన్నైకు సమీపంలోని కేళంబక్కమ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు మైనర్ బాలికను, ఆమె సోదరుడిని హెచ్చరించి వదిలేశారు. (రజనీకాంత్ క్షమాపణ.. నిజమేనా?) -
కొడుకు మరణమే ఈ గేమ్ ఆవిష్కరణకు కారణం?
న్యూఢిల్లీ: పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఎంతగానో ఇష్టపడే గేమ్ "సబ్వే సర్ఫర్స్". గూగుల్ ప్లేస్టోర్‌లో 100 కోట్లకు పైగా డౌన్లోడ్లు సంపాదించుకున్న ఈ గేమ్ గురించి ఓ ఆసక్తికర వార్త అందరినీ అవునా! అని నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ట్విటర్లో తెగ వైరలవుతున్న ఈ వార్త సారాంశం ఏంటంటే.. 'ఓ వ్యక్తి కొడుకు రైలు ప్రమాదంలో మరణించాడు. దీంతో ఆయన తన కుమారుడి జ్ఞాపకార్థంగా ఈ గేమ్‌ను రూపొందించాడు'. నిజంగానే సబ్వే సర్ఫర్స్ ఆటలో ఓ కుర్రాడు రైలు పట్టాలపై పరుగెడుతూ ఉంటాడు. ఎదురుగా వచ్చే రైళ్లు ఢీ కొట్టకుండా, వెనకాల వచ్చే పోలీసుకు చిక్కకుండా పరుగెత్తుతాడు. ఈ క్రమంలో బంగారు నాణాలను, ప్రత్యేక బహుమతులను దక్కించుకుంటూ వెళ్తాడు. దీంతో నిజంగానే చనిపోయిన కొడుకు గుర్తుగా ఈ ఆట రూపొందించి ఉంటారని చాలామంది భ్రమపడుతున్నారు. (అమ్మాయ్.. ఎన్ని మార్కులొచ్చాయ్?) అయితే అది పూర్తిగా తప్పని రుజువైంది. ఈ అసత్య వార్తను మొదటి సారిగా ఎడోర్‌బెస్ట్‌లాడ్స్ జూలై 29న ట్వీట్ చేశారు. కానీ అంతలోనే నాలుక్కరుచుకుంటూ, తాను చెప్పినదాంట్లో నిజమెంతుందో తెలీదంటూ మరుసటి రోజే దాన్ని డిలీట్ చేస్తూ క్షమాపణ కోరారు. అయితే అప్పటికే అనేకమంది దీన్ని రీట్వీట్ చేస్తూ తెగ ప్రచారం చేశారు. దీంతో సబ్వే సర్ఫర్స్ సహ వ్యవస్థాపకులు సీబో(SYBO) ఈ వార్తను కొట్టిపారేశారు. వీధి సంస్కృతికి నివాళిగా కొత్తదనంతో ఈ ఆటను రూపొందించామని స్పష్టం చేశారు. సురక్షితమైన వాతావరణంలో ఇది సృజనాత్మకతతో పాటు వినోదాన్ని అందిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ ఆటను ఆదరిస్తున్నవాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. (ఆడపిల్ల ఉంటే రూ.24 వేలు: నిజమేనా?) నిజం: రైలు ప్రమాదంలో మరణించిన కొడుకు గుర్తుగా సబ్వే సర్ఫర్స్ రూపొందించలేదు. -
పిల్లల తెలివి మామూలుగా లేదు
-
వైరల్: పిల్లల తెలివి మామూలుగా లేదు
ఇంట్లోనే ఆడే ఆటలు(ఇండోర్) కొన్నైతే ఆరుబయట ఆడే(అవుట్ డోర్) ఆటలు మరికొన్ని. అయితే ఈ ఇండోర్ గేమ్స్‌లో కొన్ని ఆటలు కూర్చున్నచోట నుంచే ఆడినప్పటికీ వాటికి కొన్ని వస్తువులు అవసరపడుతాయి. అందులో 'స్నూకర్స్' గేమ్ ఒకటి. కొందరు పిల్లలు ఇటుకలు, కట్టెలతో స్నూకర్ బోర్డు, స్టిక్స్ తయారు చేశారు. దీని కోసం ఇటుకలను ఒక క్రమపద్ధతిలో సమానంగా పరిచి బోర్డు తయారు చేశారు. అనంతరం వాటిపై కొన్ని బంతులను వేసి ఉంచారు. ఆ తర్వాత ఓ బుడ్డోడు ఓ కట్టె పట్టుకుని బంతిని గురి చూసి కొడుతున్నాడు. అది నేరుగా వెళ్లి అక్కడున్న రంధ్రం(ఖాళీ ప్రదేశం)లో పడుతుంది. మిగతావాళ్లు అతడిని ఎంకరేజ్ చేస్తున్నారు. (అమ్మ కోసం ఆస్పత్రి గోడెక్కి కిటికీ దగ్గరే జపం) దీంతో మరింత ఉత్సాహంతో ఆ బుడ్డోడు మిగతా బంతులను కొడుతున్నాడు. పనిలో పనిగా బోర్డెక్కి మరీ ఆటాడటం నవ్వు తెప్పిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను లెఫ్టినెంట్ జనరల్ జ్ఞాన్ భూషణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరి ఆట సృజనాత్మకంగా ఉందని క్యాప్షన్ జోడించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పిల్లలు తమ ఆనందం కోసం ఎన్ని ప్రయోగాలైనా చేస్తారంటున్నారు నెటిజన్లు. అయినా ఆ పిల్లోడు ఎంతో అనుభవమున్నవాడిలా ఆడుతున్నాడంటూ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇంతకు ముందు కూడా ఓ చోట పిల్లలందరూ చతురస్రాకారంలో నిలబడి క్యారమ్‌బోర్డ్ ఆట ఆడుకున్న విషయం తెలిసిందే. (గుడ్డుపై వాక్యూమ్ క్లీనర్ ప్రయోగించాడు!) -
చచ్చిపోయినా ఫర్వాలేదనుకున్నా!
మెల్బోర్న్: క్రికెట్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన సర్ వివియన్ రిచర్డ్స్ తన సుదీర్ఘ కెరీర్లో ఏనాడూ హెల్మెట్ పెట్టుకోలేదు. ఎలాంటి భయం లేకుండానే బరిలోకి దిగిన అతను ఆ సమయంలో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బౌలర్లను చితక్కొట్టాడు. ఆటపై ఉన్న పిచ్చి ప్రేమే తనలో ధైర్యాన్ని నింపిందని రిచర్డ్స్ గుర్తు చేసుకున్నాడు. ‘క్రికెట్‌ను నేను విపరీతంగా ప్రేమించాను. ఎంతగా అంటే ఆడుతూనే చనిపోయి నా ఫర్వాలేదనుకునేవాడిని. క్రికెట్‌ను నేను ఎంచుకున్నాను కాబట్టి మైదానంలోనే కుప్పకూలినా అంతకంటే అదృష్టం లేదని భావించేవాడిని’ అని ఈ విధ్వంసక బ్యాట్స్‌మన్ వ్యాఖ్యానించాడు. ఆసీస్ ఆల్‌రౌండర్ షేన్వాట్సన్తో వీడియో సంభాషణ సందర్భంగా రిచర్డ్స్ ఈ మాటలు అన్నాడు. ‘ఇతర ఆటగాళ్లను చూసి నేను ఎప్పుడూ స్ఫూర్తి పొందేవాడిని. అత్యుత్తమ స్థాయిలో రాణించే మహిళలను కూడా అలాగే గౌరవించేవాడిని. ఫార్ములా వన్ రేసింగ్ కార్‌ను డ్రైవ్ చేసేవారిని చూస్తే అంతకంటే ప్రమాదకరం ఇంకేం ఉంటుందని అనిపించేది’ అంటూ వివ్ అన్నాడు. -
కోస్తా తీరంలో కంబళ.. ఎలా ఆడతారంటే
క్రికెట్, ఫుట్‌బాల్ టోర్నీలతో సమానంగా ఆదరణ. ఏడాదిపాటు దున్నపోతులు, పరుగువీరులకు శిక్షణ. గెలిస్తే దున్నలు, ఆటగాళ్లు, యజమానుల పేరు జిల్లాలో మార్మోగిపోతుంది. ఓడినవారు ఈసారి గెలవాలని మళ్లీ ప్రయత్నిస్తారు. ఒక గ్రామీణ క్రీడ కంబళ ఇప్పుడు అందరికీ హాట్ టాపిక్ అయ్యింది. కంబళ ఆటగాళ్లు ప్రపంచ పరుగు రికార్డులను అవలీలగా అధిగమిస్తుండడమే దీనికి కారణం. అంతేకాదు కంబళకు ఘనమైన వారసత్వ చరిత్ర కూడా ఉంది. కోస్తా జిల్లాల ప్రజల సంస్కృతిలో ఒక విడదీయలేని భాగం. సాక్షి, బెంగళూరు: బురద నీటిలో దున్నపోతులతో పోటీగా వంద మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలో పరుగెత్తి ప్రపంచ పరుగు పందెం విజేత ఉసేన్ బోల్ట్ రికార్డును బద్దలుకొట్టి మంగళూరుకు చెందిన శ్రీనివాసగౌడ, అలాగే నిశాంత్ శెట్టి అనే మరో కంబళ యువకుడు అదే 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.51 సెకన్లలో పరిగెత్తి శ్రీనివాసగౌడ రికార్డును బద్దలుకొట్టాడు. ఎన్నో ఏళ్ల కఠోర సాధన చేసినా ఈ స్థాయిలో రికార్డు సృష్టించడానికి పరుగు పందేల క్రీడాకారులు ఆపసోపాలు పడుతుంటే కంబళ పోటీల్లో అవలీలగా ఎలా సాధించేశారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. కంబళ ఆటగాళ్లకు ఇంతటి శక్తిసామర్థ్యాలు ఎలా వచ్చాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎలా ఆడతారంటే 100 మీటర్లు అంతకంటే ఎక్కువ దూరం ఉండే ట్రాక్‌లు సిద్ధం చేసి వాటిలో కొద్దిమేర బురదనీటిని నింపుతారు. తరువాత ఒకటి, లేదా జంట దున్నపోతులతో ఆటగాళ్లు రంగంలోకి దిగుతారు. ఎవరు వేగంగా అవతలికి చేరితే వారే విజేత. ఇది కూడా ఒక తరహా పరుగు పందెం అనే చెప్పాలి. అయితే సాధారణ ట్రాక్‌కు కంబళ ట్రాక్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. సాధారణ ట్రాక్‌లో వేళ్లు, పూర్తి కాళ్లను నియంత్రించుకుంటూ పరుగెత్తాల్సి ఉంటుంది. కానీ కంబళలో మడమలను నియంత్రించుకుంటూ పరుగెత్తాల్సి ఉంటుంది. తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది ఈ పోటీల్లో ఏడు రకాలున్నాయి. బారే కంబళ, కోరి కంబళ, అరసు కంబళ, దెవెరే కంబళ, బాలె కంబళ, కెరె కంబళ, కాద్రి కంబళలుగా విభజించారు. అయితే కంబళ క్రీడలో అన్ని కంబళలు పోటీ కంబళలు కావు. అందులో కొన్ని కంబళలు పోటీ కంబళలు కాగా మరికొన్ని పోటీ లేని సాధారణ కంబళలు. రెండు రకాల కంబళలను బురదనీటిలో నిర్వహిస్తారు. ఏడు రకాల కంబళలు కంబళ పోటీల్లో కొన్ని రకాల పోటీలను ప్రత్యేక విభాగాలుగా విభజిస్తారు. వాటిలో నెగిలు, హగ్గ, అడ్డా హాలేజ్, కేన్ హాలేజ్ ప్రధానమైనవి. ఒక్కో రకమైన కంబళకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. వాటి గురించి పరిశీలిస్తే.. నెగిలు చెక్క లేదా ఇనుముతో తయారు చేసిన ఒక రకమైన భారీ నాగలితో నిర్వహించే పోటీని నెగిలుగా గుర్తిస్తారు. ఈ భారీ నాగలిని దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఇందులో ఎంట్రీ స్థాయి, జూనియర్, సీనియర్ రౌండ్లు మాత్రమే ఉంటాయి. హగ్గ ఈ విభాగంలో పాల్గొనే దున్నలకు అనుభవం ఎక్కువగా ఉంటుంది. బలమైన తాడును దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఇందులో ఓ వ్యక్తి చేతిలో తాడుతో దున్నలను నియంత్రిస్తూ వాటితో పాటు బురదనీటిలో పరుగెత్తుతాడు. ఇందులోనూ సీనియర్, జూనియర్ రౌండ్లు ఉంటాయి. అడ్డా హాలేజ్ ఇది కాస్త కఠినంగానే ఉంటుంది. వంపు తిరిగిన చెక్కను దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఈ సమయంలో చెక్కపలకపై వ్యక్తి నిలబడి ఉంటాడు. దీంతో పోటీలో పాల్గొనే దున్నలు చెక్కతో పాటు వ్యక్తిని సైతం బురదనీటిలో వేగంగా లాక్కెళ్తాయి. ఇందులో కేవలం సీనియర్ రౌండ్ మాత్రమే ఉంటుంది. కేన్ హాలేజ్ ఈ రకం పోటీలు రసవత్తరంగా ఉంటాయి. ప్రత్యేకంగా తయారు చేసిన గుండ్రటి చెక్కను దున్నలకు కడతారు. చెక్కకు మధ్యలో రెండు ప్రత్యేక రంధ్రాలు ఏర్పాటు చేస్తారు. దున్నలు పరిగెత్తే సమయంలో ఈ రెండు రంధ్రాల నుంచి చిమ్మే నీటి ఎత్తు, వేగంతో విజేతను ఎన్నుకుంటారు. ఇందులో సూపర్ సీనియర్ రౌండ్ మాత్రమే ఉంటుంది. ఉడుపి, మంగళూరుకు ప్రత్యేకం కర్ణాటకలోని కరావళి ప్రాంతంగా పిలిచే ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ తదితర కోస్తా జిల్లాల్లో శతాబ్దాలుగా నిర్వహిస్తున్న క్రీడ కంబళ. తమ సంస్కృతికి ప్రతీకగా ప్రజలు ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. ఒక ఊరిని మించి మరో ఊరివారు పోటీలు ఘనంగా ఉండాలని శ్రమిస్తారు. నవంబర్ నెలలో మొదలయ్యే కంబళ సీజన్ మార్చి వరకు కొనసాగుతుంది. కంబళ సమితుల ఆధ్వర్యంలో కంబళ పోటీలు నిర్వహిస్తారు. అన్ని రకాల కంబళలు మూడు శతాబ్దాలకు పైగానే చరిత్ర ఉన్నవే. వీటిలో ఎక్కువ శాతం దక్షిణ కన్నడ జిల్లాలోనే నిర్వహిస్తుండగా కొన్ని కంబళలు సమీపంలోని ఉడుపి జిల్లాలో నిర్వహిస్తుంటారు. విజేతలకు బహుమానాల పంట కంబళలో పోటీల్లో గెలిచిన విజేతలను కొన్నిసార్లు నగదు బహుమానంతో మరికొన్నిసార్లు బంగారు నాణేలను బహుమానంగా అందించి సత్కరిస్తారు. గెలిచిన దున్నల యజమానులకూ పేరు లభిస్తుంది. ఆటగాళ్లు, చూసేవాళ్లలో కంబళ సాగుతున్నంతసేపూ ఉత్సాహం పొంగిపొర్లుతుంటుంది. కంబళ పోటీల కోసం దున్నలకు ప్రత్యేక శిక్షణనిస్తారు. శివుని భక్తుల ఆట కంబళ చరిత్ర శివునితో ముడిపడి ఉంది. పరమ శివునికి భక్తులైన నాథుల ప్రేరణతో కంబళ మొదలైనట్లు చెబుతారు. కంబళ క్రీడలు ప్రారంభమయ్యే ముందురోజు రాత్రి కొరగ తెగకు చెందిన పురుషులు కొరగ సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శిస్తారు. అందులో భాగంగా పంచకర్మగా భావించే మద్య, మాంస, మత్స్య, ముద్ర, మిథున క్రియలను పాటిస్తారు. దీంతోపాటు పానిక్కులుని అనే సాంస్కృతిక వేడుకను సైతం నిర్వహిస్తారు. -
పబ్జి ఓ డెత్ గేమ్..
-
పబ్జీ మత్తులో విద్యార్థి ఆత్మహత్య
-
పబ్జీ.. డేంజర్‌జీ
-పదో తరగతి వార్షిక పరీక్షల సమయంలో చదువుకోకుండా సెల్ఫోన్లో పబ్జీ ఆడుతుండడంతో తల్లి మందలించినందుకు మనస్తాపంతో మల్కాజిగిరి విష్ణుపురి ఎక్స్టెన్షన్ కాలనీకి చెందిన ఓ విద్యార్థి ఇంట్లో ఉరేసుకొని ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. - తాజాగా వనపర్తికి చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి పబ్జీ ఆటలో లీనమై నిద్రాహారాలు మానేయడంతో మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి కాలు, చేయి పడిపోయాయి. అచేతన స్థితిలో ఉన్న ఆ యువకుడు నగరంలోని సన్‌షైన్ ఆస్పత్రిలో చేరాడు. సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ పబ్జీ తాజాగా నగరంలోనూ విస్తరిస్తోంది. ప్రమాదకరమైన ఈ పబ్జీ ఆటకు బానిసై... అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులకు చేరుకుంటున్న యువకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ గేమ్ ఆడుతున్న వ్యక్తులు... ఇప్పుడు పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు.. ఆడొద్దని చెబితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హత్యలూ చేస్తున్నారు. తొలుత ‘పోకేమాన్’ అంటూ రోడ్డున పడిన యువత... ఆ తర్వాత బ్లూవేల్‌కు బానిసై ఆత్మహత్యలు చేసుకోవడం తెలిసిందే. ఇప్పుడదే కోవలో పబ్జీ వచ్చి చేరింది. ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది ఈ ఆట ఆడుతున్నారని, ఇందులో సుమారు 4 కోట్ల మంది నిత్యం యాక్టివ్‌గా ఉంటున్నారని అంచనా. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి కేశవర్ధన్(19) రాత్రి వేళల్లో పబ్జీ ఆటలో లీనమై నిద్రాహారాలు మానేయడంతో రక్తనాళాలు చిట్లిపోయి మెదడులో రక్తం గడ్డ కట్టింది. ఫలితంగా కాళ్లు, చేతులు పడిపోయి అచేతనా స్థితిలో ఈ నెల 26న నగరంలోని సన్‌షైన్ ఆస్పత్రిలో చేరాడు. దీంతో ‘పబ్జీ’ మరోసారి చర్చనీయాంశమైంది. ఆస్పత్రికి చెందిన న్యూరో ఫిజిషియన్ సకాలంలో గుర్తించి వైద్యం చేయడంతో యువకుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆటలో లీనమైతే అంతే... పబ్జీ అంటే ‘ప్లేయర్ అన్నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్’ అని అర్థం. దక్షిణ కొరియాలోని ఓ గేమింగ్ సంస్థ ఈ మల్టీ ప్లేయర్ గేమింగ్ యాప్‌ను రూపొందించింది. ఈ గేమ్ ఆడాలంటే ముందుగా పబ్జీ యాప్‌ను మొబైల్‌లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఐడీ లభిస్తుంది. అయితే, ఈ ఆటను సింగిల్‌గా కాకుండా జట్టుగా ఆడితేనే మజా ఉంటుంది. దీంతో కొంతమంది టీమ్‌లుగా ఏర్పడి మరీ ఈ గేమ్ ఆడుతున్నారు. ఈ గేమ్ ఆడే వ్యక్తులు సైనికులుగా మారిపోతారు. స్వయంగా యుద్ధ రంగంలోకి దిగి శత్రువులతో పోరాడుతున్నామనే భావనలో ఉంటారు. ఒకసారి ఆట మొదలైందంటే యుద్ధంలో ఉన్నట్లే. అప్రమత్తంగా లేకపోతే శత్రువులు చంపేస్తారు. దీంతో ఈ ఆటలో లీనమైనవారు పక్కన ఎవరున్నారు? ఏం జరుగుతుంది? అనే అంశాలనే కాదు చివరికి నిద్రాహారాలనే మరిచిపోతుంటారు. ఆటలో లీనమైతే మళ్లీ బయటకు రావడం కష్టమే. పైగా గ్రూప్‌తో కలిసి ఆడినప్పుడు మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఆట ఆడేవారు తమని తాము సైనికులుగా భావిస్తారు. ఇది గ్రూప్ వాయిస్ గేమ్ కావడంతో యుద్ధం చేస్తుంది తామేననే భావన ఏర్పడి, తెలియకుండానే ఈ గేమ్‌కు బానిసలుగా మారి.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ప్రముఖ మానసిక వైద్యనిపుణుడు డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. మానసిక సమస్యలు.. ఈ ఆటతో పిల్లల మానసిక, శారీరక స్థితి తీవ్రంగా దెబ్బతింటోందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. ఆటాడే సమయంలో వీరు ఇతరులను పట్టించుకోరు. గేమ్ నుంచి దృష్టి మరల్చితే శత్రువుల చంపేస్తారనే భయంతో పరిసరాలను మరిచిపోతుంటారు. ఏకాగ్రత లోపించి చదువులో వెనకబడి పోతుంటారు. ఆ సమయంలో ఎవరైనా ఫోన్ చేసినా, పిలిచినా పట్టించుకోరు. ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అసహనం ప్రదర్శిస్తారు. కొంతమంది కోపంతో ఊగిపోతారు. ఈ ఆటకు బానిసలైన యువత నిద్ర లేమి, కంటి చూపుతో బాధపడుతుంటారు. గంటల తరబడి ఒకేచోట కూర్చొని ఆడడంతో మానసిక సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో న్యూట్రిషన్ లెవల్స్ పడిపోయి డీహైడ్రేషన్‌కు లోనవుతుంటారు. మెదడులో క్లాట్స్ ఏర్పడి, చివరకు కాళ్లు, చేతులు పడిపోతుంటాయి. – డాక్టర్ వినోద్‌కుమార్, న్యూరోఫిజిషియన్, సన్‌షైన్ ఆస్పత్రి గేమ్‌ను నిషేధించాలి.. యువత రోజుకు 8–10 గంటలు ఈ ఆట ఆడుతోంది. దీనికోసం అన్ని పనులను వదులుకునే స్థాయికి వస్తున్నారు. దీంతో కొన్ని రాష్ట్రాలు ఈ గేమ్‌పై నిషేధం విధించాయి. ఇటీవల జమ్మూలో ఓ ఫిట్నెస్ ట్రైనర్ పబ్జీకి బానిసై పిచ్చివాడయ్యాడు. దీంతో అక్కడి ప్రభుత్వం పబ్జీని నిషేధించింది. గుజరాత్ ప్రభుత్వం స్కూళ్లలో ఈ ఆటను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు స్కూళ్లకు స్మార్ట్ ఫోన్లు తీసుకెళ్లరాదని ఆదేశించింది. వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) సైతం ఈ గేమ్‌పై నిషేధం విధించింది. మహారాష్ట్ర హైకోర్టు కూడా ఈ గేమ్‌ను నిషేధించింది. ఈ పబ్జీ గేమ్‌ను తెలంగాణలోనూ నిషేధించాలి. – అచ్యుతరావు, బాలల హక్కుల సంఘం -
వింత పోటీలో గెలిచిన లిథువేనియా జంట
ఫిన్లాండ్ : ఫిన్లాండ్ దేశం నిర్వహించిన 'వైఫ్ క్యారీంగ్' పోటీ టైటిల్‌ను లిథువేనియా దేశానికి చెందిన జంట గెలుచుకుంది. సొంకాజర్వీలో ఈ పోటిలో ఫ్రాన్స్, జర్మని ఆస్ట్రేలియాతో పాటు 12 దశాల నుంచి 12 జంటలు పాల్గొన్నాయి. వైటాటాస్ కిర్క్లియాస్కాస్, భార్య నెరింగా కిర్క్లియాస్కీన్లు 253.5 మీటర్ల దూరాన్నికేవలం 1 నిమిషం 6.72 సెకన్లలోనే పూర్తి చేసి చాంపియన్‌గా నిలిచారు. గెలిచిన ఈ జంటకి భార్య బరువుకు సమానంగా ఉండే బీరు బాటిల్‌ను హుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా కిర్క్లియాస్కాస్ మాట్లాడుతూ మేము గెలుస్తామని అనుకోలేదని, ఇది ఊహించని విజయమని అన్నారు. పోటిలో సెకండ్ స్టెజీకి వెళ్లాక నేను పరుగెత్తలెనేమో అనుకున్నాను, కాని నా భార్య ఇచ్చిన పోత్సాహంతోనే ఈ గెలుపు సాధ్యమైందని, తను ఏప్పుడూ నాకు ఉత్తమమైన భార్య అని అన్నారు. ఈ పోటిలో భర్త భార్యను ఎత్తుకుని ఓ పెద్ద కర్రపై నుంచి దూకుతూ వచ్చి నడుము లోతు వరకు ఉన్న నీటిలో పరుగెత్తాలి. అలాగే ఇందులో పోటి చేసే భార్య 17 ఏళ్ల వయస్సు ఉండి 49 కిలోల బరువు మాత్రమే ఉండాలి. ఇందులో పోటి చేసే జంట కచ్చితంగా వివాహితులై ఉండాలన్న నిబంధన లేదు, అవివాహితులు కూడా ఈ పోటిలో పాల్గోనవచ్చని ఈవెంట్ ఆర్గనైజర్లు తెలిపారు. -
అమెరికా రైల్లో ‘టేబుల్ టెన్నిస్’
-
అమెరికా రైల్లో ‘పింగ్ పాంగ్’
న్యూయార్క్: సాధారణంగా ప్రయాణికులు రైల్లో కూర్చొని లేదా పడుకొని ప్రయాణిస్తారు. కానీ న్యూయార్క్‌లోని ఓ జంట రైల్లో ఏకంగా పింగ్ పాంగ్ (టేబుల్ టెన్నిస్) ఆడుతూ ప్రయాణం చేసింది. ఇందుకు సంబంధిచిన వీడియోను అమెరికన్ కవయిత్రి మేరీ కార్ ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. రద్దీగా ఉండే రైళ్లలో ఇలాంటి ఆటలను న్యూయార్క్ వాసులుగా తాము ప్రోత్సాహించమని మెజారిటీ నెటిజన్లు అభిప్రయపడుతున్నారు. వీడియోలో పింగ్ పాంగ్ ఆడిన వారికి చురకలు అట్టించేలా కామెంట్లు పెడుతున్నారు. అయితే మేరీ పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు 10వేల రీట్వీట్లు, 60 వేలకు పైగా లైక్‌లు రావడం విశేషం. -
భర్త పబ్జీ గేమ్ వద్దనడంతో..
న్యూఢిల్లీ : పబ్జీ గేమ్ వద్దని భర్త వారించడంతో విడాకులు కోరిన భార్య ఉదంతం వెలుగుచూసింది. యూఏఈలో ఓ యువతి తన భర్త పబ్జీ గేమ్ ఆడవద్దని చెప్పడంతో ఆయనతో ఏకంగా విడాకులు కోరినట్టు గల్ఫ్ పోలీసులు వెల్లడించారు. తనకు కావాల్సిన వినోదాన్ని ఎంచుకునే హక్కును తన భర్త కాలరాశాడని ఆమె భగ్గుమన్నారు. పబ్జీ గేమ్‌ను తాను కేవలం తన స్నేహితులు, బంధువులతో ఆడతానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే తన భార్య స్వేచ్ఛను తాను హరించలేదని, కేవలం కుటుంబంతో సమయం వెచ్చించేందుకే పబ్జీకి దూరంగా ఉండాలని కోరానని భర్త వాపోయారు. పబ్జీ గేమ్ దుమారం చివరికి యువ జంట విడాకుల వరకూ వెళ్లడంతో గల్ఫ్ పోలీసులు విస్తుపోయారు. -
నేపాల్‌లో పబ్జీ బ్యాన్
ఖాట్మండు: పబ్జీ (ప్లేయర్ అన్నోన్స్ బ్యాటిల్‌గ్రౌండ్)గేమ్‌పై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. నేపాల్‌లోని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు, మొబైల్ ఆపరేటర్లు, నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లకు పబ్జీ గేమ్ స్ట్రీమింగ్‌ను బ్లాక్ చేయాలని నేపాల్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ (ఎన్టీఏ) ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే ఈ గేమ్‌ను గుజరాత్లో కూడా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. యూఏఈలో కూడా ఈ గేమ్‌పై నిషేధం విధించడానికి చర్చలు జరుగుతున్నాయి. నేపాల్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి అందిన సమాచారంతో ఈ గేమ్‌పై నిషేధం విధించినట్టు ఎన్టీఏ డిప్యూటీ డైరెక్టర్ సందీప్ తెలిపారు.చిన్నారులు, యువత ఈ గేమ్‌కు బానిసలుగా మారిపోతున్నారని చెప్పారు. దీంతో పిల్లలు చదువులకు ఈ గేమ్ ఆటంకంగా మారిందని తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయని చెప్పారు. -
హున్సలో పిడిగుద్దులాట
బోధన్‌రూరల్: హోలీ పండగను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్స గ్రామంలో గురువారం పిడిగుద్దులాట ఉత్కంఠగా సాగింది. ముందుగా గ్రామ శివారులో కుస్తీ పోటీలను నిర్వహించారు. హనుమాన్ మందిరం ఎదురుగా ఖాళీ ప్రదేశంలో పిడిగుద్దులాటకు వేదికను సిద్ధం చేశారు. 5 ఫీట్ల ఎత్తుతో ఉన్న బలమైన కర్రలను నిలిపి పొడువైన తాడును కట్టారు. కుస్తీ పోటీల అనంతరం పిడిగుద్దులాట ప్రక్రియను ప్రారంభించారు. డప్పు వాయిద్యాలతో గౌరవ సూచికంగా గ్రామ పెద్దలను వేదిక వద్దకు తీసుకువచ్చారు. అప్పటికే తాడుకు ఇరువైపులా గ్రామస్తులు రెండు వర్గాలుగా చీలిపోయి మోహరించి ఉన్నారు. పిడిగుద్దులాట కోసం ఏర్పాటు చేసిన తాడును ఎడమ చేయితో పట్టుకుని కుడి చేయి పిడికిలి బిగించి ఇరువర్గాలు కొట్టుకున్నాయి. ఆట ముగిసినట్టు గ్రామ పెద్దలు ప్రకటించిన వెంటనే గ్రామస్తులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. -
కబడ్డీలో బాలుర మధ్య ఘర్షణ.. ఒకరు మృతి
-
వామ్మో.. బ్లూ వేల్.!
► టీనేజర్ల ప్రాణాలు తీస్తోన్న వికృత క్రీడ ► టాస్క్‌ల పేరిట బ్లాక్‌మెయిలింగ్ ► ఆత్మహత్య చేసుకునే దాకా వదలరు ► తల్లిదండ్రుల అప్రమత్తతే పిల్లలకు శ్రీరామరక్ష అంటున్న పోలీసులు పుణె: మీ పిల్లలు ఆన్లైన్ గేములు ఆడుతున్నారా? ఐతే వారిని ఓ కంట కనిపెట్టండి. ఎందుకంటే.. బ్లూవేల్ అనే ఆట ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఇది ఆడినవారు దీనికి బానిసలవడం, తరువాత ఆత్మహత్య చేసుకోవడమే ఇందుకు కారణం. రష్యాకు చెందిన 23 ఏళ్ల మానసిక వ్యాధిగ్రస్తుడు ఈ వికృత క్రీడను రూపొందించాడు. 15 ఏళ్లలోపు విద్యార్థులే లక్ష్యంగా ఈ గేమ్ నిబంధనలు ఉండటం గమనార్హం. వీరికి లోకజ్ఞానం అంతగా లేకపోవడం, ప్రతీది తెలుసుకోవాలన్న కూతూహలం అధికంగా ఉండటమే ఈ ఆటకు బానిసలుగా మారుస్తోంది. నిన్న మొన్నటిదాకా ప్రపంచదేశాలని గడగడలాడించిన ఈ వికృతక్రీడ ఇప్పుడు మనదేశంలోనూ ప్రకంపనల్ని సృష్టిస్తోంది. మొన్న ముంబైలో 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడటంతో బ్లూవేల్ గేమ్ మనదేశంలోనూ ఉందన్న కలకలం రేగింది. మన్‌ప్రీత్ గేమ్‌కు బానిసయ్యాడు. రూల్స్‌లో భాగంగా ఆఖరు టాస్క్ విధించారు. దాని ప్రకారం.. భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలి. దానికి ముందు ఓ ఫోటోను నెట్లో అప్లోడ్ చేయాలి. అలాగే చేసి ప్రాణాలు తీసుకున్నాడు ఆ అమాయక బాలుడు. కన్నవారికి తీరనిశోకం మిగిల్చాడు. తాజాగా షోలాపూర్‌లోనూ దీని ఆనవాళ్లు వెలుగుచూడటం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. 9వ తరగతి విద్యార్థి ప్రవర్తనలో తేడాలు తల్లిదండ్రులు గమనించారు. ఓ రోజు లేఖరాసి అదృశ్యమవడంతో అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. బాలుడి ఫొటోతో గాలింపు మొదలుపెట్టిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. బ్లూవేల్ గేమ్ టాస్క్ పూర్తిచేయడానికి తాను ఆత్మహత్య చేసుకోవడానికి వెళుతున్నట్లు బాలుడు చెప్పడంతో వారు హతాశయులయ్యారు. తాజాగా ఇండోర్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన 13 ఏళ్ల విద్యార్థి స్కూలు బిల్డింగు మీద నుంచి దూకేందుకు ప్రయత్నించడం కలకలం రేగింది. తోటివిద్యార్థులు, ఉపాధ్యాయులు బలవంతంగా ఆపితేగానీ వారికి అతడిని నిలువరించడం సాధ్యపడలేదు. దీంతో పిల్లలకు ఆన్లైన్ గేమ్స్ అందుబాటులో ఉంచకూడదని తల్లిదండ్రులకు పోలీసులు సూచిస్తున్నారు. ఎప్పుడు మొదలైంది? ఆన్లైన్ వేదికగా సాగే ఆట. దీన్ని రూపొందించిన వ్యక్తి ఓ మెంటల్. వాడిని రష్యా పోలీసులు పట్టుకుని జైల్లో పెట్టినా.. అప్పటికే ఆన్లైన్లో అప్లోడ్ అవడంతో ప్రపంచమంతా పాకిపోయింది. అతడిలానే మానసికంగా గతితప్పినవాళ్లు దీన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం ఆందోళనకరంగా మారింది. ఏకంగా 130మందికి పైగా రష్యన్ టీనేజర్లు ఈ గేమ్ వల్ల ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. ఎలా ఆడతారు? బ్లూవేల్ ఆడాలంటే ముందు ఇందులో ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం 50 దశలు ఉంటాయి. టాస్క్‌లు అప్పగించేందుకు మెంటార్లు ఉంటారు. వీరు తొలుత చాలా సులభమైన టాస్క్‌లు అప్పజెబుతారు. టాస్క్ పూర్తికాగానే అందుకు సంబంధించిన ఫొటోలు అప్లోడ్ చేస్తే మరో దశకు చేరుకుంటారు. అలా ఆఖరు దశ 50 వ దశ. ఇందులో ఆత్మహత్య చేసుకోవాలి. చేసుకునే ముందు అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేయాలి. చేయకపోతే ఏం చేస్తారు? 1. మొదట్లో సులువైన పనులే అప్పజెబుతారు. 2. క్రమంగా డోసు పెంచుతూ పోతుంటారు. 3. తాము ఇదివరకు చేయని పనులు కావడంతో విద్యార్థులు సైతం ఉత్సాహంగా చేసుకుంటూ పోతారు. తీవ్రత పెరిగే కొద్ది అసభ్యకరమైన పనులు చేయమంటారు. ప్రతీదానికి ఆధారంగా ఫొటో తీసిపెట్టాలి. అపుడే, మరో టాస్క్ అప్పజెబుతారు. 5. జీవితంపై అవగాహన ఉన్న, తెలివైన విద్యార్థులు దీన్ని మధ్యలోనే వదిలేస్తున్నారు. కొందరు మాత్రం కొత్తటాస్క్పై ఆసక్తితో ఆడుతున్నారు. 6. మరికొందరు బ్లాక్‌మెయిలింగ్‌కు గురవుతున్నారు. టాస్క్‌లో భాగంగా అసభ్యకరమైన పనులు చేయించుకుని ప్రతీది ఫొటో అప్లోడ్ చేయమంటారు కాబట్టి.. గేమ్ మధ్యలో ఆపితే వాటిని ఆన్లైన్లో పెట్టి పరువు తీస్తామని బెదిరిస్తారు. దీంతో తల్లిదండ్రులకు చెప్పుకోలేక.. ఇష్టం లేకున్నా గేమ్‌లో కంటిన్యూ అవుతున్నారు. 7. బ్లూవేల్ ఆడుతున్నట్లు ఎవరికీ చెప్పకూడదు గేమ్రూల్స్లో ఇదే కీలకం. అందుకే, విద్యార్థులు చనిపోయే వరకు ఎవరూ గుర్తించలేకపోతున్నారు. ఎలా గుర్తించాలి? 1. ఈ గేమ్ ఆడే విద్యార్థులు అన్యమనస్కంగా ఉంటారు. ఎవరితో మాట్లాడరు, రాత్రుళ్లు మేల్కొంటారు. తమను తాము గాయపరుచుకుంటారు. 2. టాస్క్ పూర్తి చేసిన ప్రతీసారి ఏదో సాధించామని, అంతులేని ఆనందంతో కనిపిస్తుంటారు. 3. ఆందోళనతో, నిద్రలేమితో బాధపడుతుంటారు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. 4. నిత్యం ఆన్లైన్, ఇంటర్నెట్ కోసం వెంపర్లాడుతుంటారు. -
ప్రాణం తీసిన క్రికెట్ బాల్ వివాదం
-
ఏదైనా మన మంచికే!!
వాషింగ్టన్: ఆ మధ్య ఓ స్మార్ట్‌ఫోన్ గేమ్ బాగా పాపులర్ అయ్యింది. దాని పేరు పొకెమన్. ఫోన్లో ఈ గేమ్ ఆడడం కారణంగా ఎన్నో అనర్థాలు కూడా జరిగాయి. దీంతో చాలా దేశాలు ఆ గేమ్‌ను నిషేధించాయి కూడా.ఈ గేమ్ ఆడుతూ దేశాలు సరిహద్దులును కూడా దాటిపోయి కటకటాలపాలైన సందర్భాలున్నాయి. అయితే ఈ గేమ్‌తో ప్రయోజనాలు కూడా ఉన్నాయనే విషయం తాజా పరిశోధనలో తేలింది. పోకెమన్ గేమ్ ఆడినవారు తమకు తెలికుండానే చాలా బరువు తగ్గారట. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో బరువు తగ్గేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసే జనం.. రూపాయి ఖర్చు చేయకుండానే కేవలం పొకెమన్ ఆడడం వల్ల బరువు తగ్గినట్లు గుర్తించారట. కారణం... ఈ గేమ్‌లో పొకెమన్ బొమ్మల కోసం ఫోన్‌ను చేతిలో పట్టుకొని దానిని చూస్తూ అలా నడుచుకుంటూ వెళ్లిపోతారు. అలా తమకు తెలియకుండానే రోజువారీ నడక పెరిగిందని, శారీరక శ్రమ కూడా పెరిగిందని, ఫలితంగా బరువు తగ్గామని చెబుతున్నారు. ఈ గేమ్ ఆడేవారు రోజుకు సగటున 10వేల అడుగులు వేస్తున్నారంటే వారికి ఎంతగా మేలు జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
వైకుంఠపాళి గొడవ.. అన్నను చంపిన బాలుడు
-
పోలో వీరుడు..
పిసాపోలో జాతీయ జట్టుకు ఎంపికైన వీరగంగాధర్ తునిరూరల్ (తుని) : ప్రోత్సహం లభించడంతో.. క్రీడల్లో అసమాన ప్రతిభతో మట్టిలో ఒక మాణిక్యం దేదీప్యమానంగా వెలిగింది. మండలంలోని శివారు గ్రామం ఎన్.ఎస్.వెంకటనగరానికి చెందిన కొల్లు వీరగంగాధర్ పిసాపోలో క్రీడలో జాతీయ స్థాయిలో కీర్తి కిరీటాన్ని రెపరెపలాడించాడు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది జూన్‌లో ఫిన్లాండ్ దేశంలో నిర్వహించనున్న అంతర్జాతీయ పిసాపోలో పోటీల్లో ఈతడు పాల్గొననున్నాడు. ఆ పోటీల్లో కూడా ప్రతిభ చూపి దేశం, రాష్ట్రం, గ్రామానికి ఖ్యాతి తెస్తానంటున్నాడు. రెండు నెలల్లోనే అత్యుత్తమ ప్రతిభతో జాతీయ జట్టులో స్థానాన్ని పొందిన ఈతడు.. ఉపాధ్యాయులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. వ్యయసాయ కుటుంబంలో పుట్టిన వీరగంగాధర్కు ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రుల ప్రోత్సహం లభించింది. కబడ్డీ, లాంగ్ జంప్, చౌక్‌బాల్ పోటీల్లో ఇతడు రాణిస్తున్నాడు. పదో తరగతి పరీక్షల కోసం.. ప్రస్తుతం ఇతడు ఎన్.సూరవరం జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఫిన్లాండ్ దేశంలో ప్రసిద్ధి కెక్కిన పిసాపోలో క్రీడలో ఇతడికి పీఈటీలు రాజు, విక్టర్ శిక్షణ ఇచ్చారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రతిభ కనబర్చడంతో జాతీయ స్థాయిలో గత జనవరిలో జరిగిన పోటీల్లో ఉత్తమ ప్రదర్శనతో సిల్వర్ ట్రోఫీ, మెరిట్ సర్టిఫికెట్‌ను సాధించి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ఒలింపిక్స్‌లో ఆడడమే ధ్యేయం 2020లో పిసాపోలో ఒలింపిక్స్ క్రీడల్లో చేర్చే అవకాశం ఉన్నట్టు సెలక్టర్లు తెలిపారని, అందులోనూ పాల్గొని విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని వీరగంగాధర్ తెలిపారు. మంగళవారం నుంచి 15వ తేదీ వరకూ రాజస్థాన్‌లో నేషనల్ అకాడమీ ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ఇతడు పాల్గొనాల్సి ఉంది. అయితే పదో తరగతి పరీక్షలు సమీపించడంతో శిక్షణకు వెళ్లలేదు. ఈ విషయాన్ని పీఈటీల ద్వారా సెలక్టర్లకు తెలియజేస్తే.. మేలో జరిగే మూడో విడత శిక్షణకు హాజరయ్యేందుకు అంగీకరించారు. ఈ ఆటలో తొమ్మిది మంది ఆటగాళ్లు, ఇద్దరు అదనపు ఆటగాళ్లు ఉంటారన్నారు. జట్టులో రెండో స్థానంలో ఉన్నానన్నాడు. ఫిన్లాండ్ వెళ్లేందుకు పాస్‌పోర్టు, ఇతర ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు వెళ్లాలంటే రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు అవుతుందని, ఇందుకు ఉపాధ్యాయులు, గ్రామస్తుల సహకరిస్తున్నారని చెప్పాడు. ప్రభుత్వం సాయం అందిస్తే మరిన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లో పాల్గొని గుర్తింపు తీసుకువస్తానని ఇతడు అంటున్నాడు. -
చిరు చిత్రాలతో గేమ్
చిరంజీవి నటించిన 150 చిత్రాల్లో ప్రతి చిత్రాన్నీ ప్రేక్షకులకు తెలియజేయాలనే ఉద్దేశంతో రూపొందించిన గేమ్ ‘మెగా 150–బాస్ ఇన్ గేమ్’. చిరంజీవి అభిమా నులు సతీశ్‌బాబు ముత్యాల, ప్రసాద్ బొలిశెట్టి, పవన్ కొర్లపాటి, శేషు లొశెట్టి స్థాపించిన ‘ఎం యాప్ సోర్స్ డెవలప్మెంట్’ కంపెనీ ఈ గేమ్‌ని రూపొందించింది. దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత ‘దిల్’ రాజులు హైదరాబాద్‌లో ఈ గేమ్‌ని విడుదల చేశారు. ఈ గేమ్ రూపకర్తలు మాట్లాడుతూ –‘‘ఈ గేమ్‌లో 14 లెవల్స్ ఉంటాయి. రెండు వాల్యూమ్స్ కింద విడుదల చేస్తున్నాం. చిరంజీవిగారి 110 చిత్రాలను మొదటి వాల్యూమ్‌లో, మిగతా 40 చిత్రాలను రెండో వాల్యూమ్‌లో క్రియేట్ చేశాం. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు’’ అన్నారు. అభిమానులు రూపొందించిన ఈ గేమ్ సక్సెస్ కావాలని వీవీ వినాయక్, ‘దిల్’రాజు ఆకాంక్షించారు. -
చెట్టుపైకి పంది పిల్లను తీసుకెళ్లిన కోతి
-
సత్తాచాటిన పశ్చిమ
నారాయణపురం (ఉంగుటూరు) : సపక్‌తక్రా రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు సత్తాచాటింది. బాలుర జట్టు విజేతగా నిలిచింది. నారాయణపురం బాపిరాజు స్టేడియంలో రెండురోజులుగా జరుగుతున్న అండర్–19 సపక్ తక్రా బాల, బాలికల టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. శుక్రవారం జరిగిన తుది పోటీల్లో కర్నూలు జట్టు ద్వితీయ స్థానం దక్కించుకోగా కడప జట్టు తృతీయస్థానం పొందింది. బాలికల విభాగంలో నెల్లూరు జట్టు ఛాంపియ¯ŒSగా నిలిచింది. శ్రీకాకుళం దిృతీయ, పశ్చిమ గోదావరి తృతీయ స్థానాలు సాధించాయి. విజేతలకు సర్టిఫికెట్లు, పతకాలను అందజేశారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ వి.సోమశేఖర్ అధ్యక్షత వహించారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తిరుపణ్యం, సపక్‌తక్రా రాష్ట్ర పరిశీలకుడు ఎ. సుబ్బరాజు, ఈ పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి అద్దంకి ఐజాక్, జిల్లా ఒలింపిక్స్ అసోసియేష¯ŒS కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, జీఎంఎస్ కుమార్, రాజా, మూర్తి, శ్రీను, పాల్గొన్నారు. -
లెక్కలతో గేమ్స్ ఆడే యాప్
-
కబడ్డీ క్రీడను ప్రోత్సహించాలి
కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు నల్లగొండ టూటౌన్ : గ్రామీణ క్రీడ అయిన కబడ్డీని ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఐబీసీ, ఛత్రపతి శివాజీ కబడ్డీ అండ్ స్పోర్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల జరుగుతున్న కబడ్డీ పోటీలు ఆదివారం రెండో రోజూ కొనసాగాయి. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ క్రీడలతో పోటీతత్వం, శారీరక దారుఢ్యం పెరుగుతుందన్నారు. క్రీడాసంఘాలు గ్రామీణ క్రీడల వైపు యువతను మల్లించేలా కృషి చేయాలని కోరారు. అనంతరం మ్యాచ్ రిఫరీలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐబీసీ ఎండీ ఏచూరి భాస్కర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏచూరి శైలజ, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరేందర్‌రెడ్డి, పుల్లెంల వెంకటనారాయణగౌడ్, ట్రాఫిక్ సీఐ ఆదిరెడ్డి, డాక్టర్ నరహరి, రోహిత్, వేణు సంకోజు, సీపీఐ జిల్లా కార్యరద్శి మల్లేపల్లి ఆదిరెడ్డి, డాక్టర్ అనూష శ్రీనివాస్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. -
పవర్ పంచ్
బాక్సింగ్‌లో మెరుస్తున్న విద్యార్థులు, యువకులు కోచ్‌ల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ రాష్ట్ర, జాతీయస్థాయిలో గుర్తింపు హసన్‌పర్తి : బాక్సింగ్ ఆటంటే ప్రాణాలతో చెలగాటం.. ఆటలో క్రీడాకారుడు ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా ప్రత్యర్థి పంచ్‌కు కుప్పకూలుతాడు.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతాడు.. అయితే ఇలాంటి సాహసోపేతమైన క్రీడలో ప్రావీణ్యం సంపాదించి ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు జిల్లాకు చెందిన పలువు రు విద్యార్థులు. సమయస్ఫూర్తి, మెళకువల తో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తూ పతకాలు సాధిస్తూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సాధారణంగా అన్ని ఆటలకంటే బాక్సింగ్ విభిన్నంగా ఉంటుంది. ఈ క్రీడను నేర్చుకునే వారికి ధైర్యం, గుండె నిబ్బరం, బలం, ఆత్మ విశ్వాçÜం ఉండాలి. అందు కే బాక్సింగ్ శిక్షణ పొందేందుకు వచ్చే విద్యార్థులు, యు వకులకు కోచ్‌లు ముందుస్తుగా నియమ నిబంధనలు వివరిస్తారు. తర్వాత శిక్షణకు సన్నద్ధులను చేస్తుంటారు. అయితే పవర్ఫుల్ పంచ్‌లతో.. వ్యూహాత్మకంగా కొనసాగే ఆటలో జిల్లాకు చెందిన విద్యార్థులు, యువకులు రాటుదేలుతున్నారు. కాగా, హసన్‌పర్తి మండల కేంద్రాని కి చెందిన శీలం పార్థసారథి ప్రస్తుతం ధర్మసాగర్ మండలంలోని సాయిపేట జిల్లా పరిషత్ పాఠశాలలో వ్యాయా మ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అలాగే బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఈయన గతంలో బాక్సింగ్‌లో రాష్ట్ర, జాతీయస్థా యి పోటీల్లో రాణించి పలు పతకాలు సాధించారు. అయితే తనలాగే మరికొందరిని కూడా బాక్సింగ్‌లో తీర్చిదిద్దాలనే తపనతో ఆయన హసన్‌పర్తిలో రోజు సాయంత్రం వేళలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీంతో పాటు వేసవిసెలవుల్లో ఆసక్తి కలిగిన విద్యార్థులను చేరదీసి బాక్సింగ్‌లో శిక్షణ ఇస్తూ, మెళకువలు నేర్పిస్తున్నారు. కాగా, కోచ్ పార్థసారథి వద్ద శిక్షణ పొందిన వారి లో కె.సుమన్ డి. అరవింద్, కె. రాంచందర్, మహేంద ర్, రమేష్, దేవేందర్, అశ్విని, సోని జాతీయ, రాష్ట్రసా ్థయి పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించారు. అలాగే మరికొందరు జిల్లాస్థాయిలో రాణించారు. ఇదిలా ఉండగా, పార్థసారథి రెండు సార్లు జాతీయ జట్టు కోచ్‌గా, మరో రెండు సార్లు జాతీయ జట్టు అఫీషియల్‌గా వ్యవహరించారు. సూపర్.. శ్యాంకుమార్ హసన్పర్తికి చెందిన పోలు శ్యాంకుమార్ బాక్సింగ్‌లో తనదైన ప్రతిభ కనబరుస్తున్నాడు. పాఠశాల స్థాయి నుంచే బాక్సింగ్‌పై మక్కువ పెంచుకున్న ఆయన అందులో పట్టుసాధించి రాణిస్తున్నాడు. 2012లో విశాఖపట్టణంలో జరిగిన ఇన్విటేషన్ పోటీలకు, 2013లో హైదరాబా ద్లో జరిగిన స్కూల్ గేమ్స్ హాజరయ్యాడు. 2015లో హసన్‌పర్తిలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. 2016లో కరీంనగర్ జిల్లాలో జరిగిన స్కూల్ గేమ్స్ పోటీల్లో బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. వీటితోపాటు ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి సబ్‌జూనియర్ పోటీల్లో పాల్గొని సత్తాచాటాడు. ఈ సందర్భంగా శ్యాంకుమార్ మాట్లాడుతూ నాన్న అశోక్, కోచ్‌లు పార్థసారథి, సాంబరాజు ప్రోత్సాహంతో బాకి ్సంగ్లో రాణిస్తున్నానని చెప్పారు. ఆర్మీలో ఉద్యోగం సంపాదించి దేశానికి సేవ చేస్తానని ఆయన పేర్కొన్నారు. కాగా, శ్యాంకుమార్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రాణిస్తున్న రోహిత్ హసన్పర్తికి చెందిన రోహిత్ స్థాని క జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఆరో తరగతి నుంచే బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్న రోహిత్ అందులో రాణిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో 2012 లో విశాఖపట్టణంలో జరిగిన ఇన్విటేషన్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొని సత్తాచాటాడు. 2013లో హైదరాబాద్‌లో జరిగిన స్కూల్ గేమ్స్‌లో పాల్గొన్నాడు. 2014లో హైదరాబాద్‌లో జరిగిన స్కూల్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్, 2015లో హసన్‌పర్తిలో జరిగిన రాష్ట్ర స్థా యి సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొని సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది కరీంనగర్ జిల్లాలో జరిగిన స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకం సాధించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మనాన్న సాంబలక్ష్మి, గోపీ, కోచ్‌లు పార్థసారథి, సాంబరాజు ప్రోత్సాహంతో తాను బాక్సింగ్‌లో ప్రతి భ కనబరుస్తున్నానని చెప్పారు. ఒలింపిక్స్‌లో భారతదేశం తరపున పాల్గొనాలనేదే తన ఏకైక లక్ష్యమన్నారు. స్ట్రాంగ్ఫుల్.. సాకేత్ హసన్పర్తికి చెందిన శీలం సాకేత్ స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదుతున్నాడు. నాలుగో తరగతి నుంచే బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్న సాకేత్ అందులో తనదైన ప్రతిభ కనబరుస్తున్నాడు. ఇందులో భాగంగా 2012లో విశాఖ పట్టణంలో జరిగిన ఇన్విటేషన్ బాక్సింగ్ పోటీ ల్లో పాల్గొని సత్తాచాటాడు. 2013లో విశాఖపట్టణంలో జరిగిన స్కూల్ గేమ్స్‌లో పాల్గొని బంగారు పతకం సాధించాడు. 2014లో హైదరాబా ద్లో జరిగిన స్కూల్ గేమ్స్‌లో పాల్గొని సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. 2015లో హసన్‌పర్తిలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోచ్‌ల సహకారంతో బాక్సింగ్‌లో రాణిస్తున్నానని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో రాణించాలన్నదే తన లక్ష్యమన్నారు. శభాష్.. నరేందర్ హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన శీలం నరేందర్ ఆర్మీ లో ఉద్యోగం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే బాక్సింగ్‌పై మ క్కువ పెంచుకున్న ఆయన అందులో ప్రత్యేక శిక్షణ పొం దారు. ఈ మేరకు తండ్రి శీలం రాజలింగం, సోదరుల ప్రో త్సహంతో రెండు సార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించారు. ఆర్మీ తరపున ఆల్æఇండి యా బాక్సింగ్ పోటీల్లో పాల్గొని గోల్డ్‌మెడల్æసాధించారు. -
ఫుట్‌బాల్ క్రీడకు ఆదరణ తేవాలి
ఏఆర్ డీఎస్పీ సంజీవ్ జిల్లాస్థాయి ఫుట్‌బాల్ టోర్నీ ప్రారంభం ఖమ్మం స్పోర్ట్స్ : ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ క్రీడకు ఎంతో ఆదరణ ఉందని, దీనిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలో ఫుట్‌బాల్ క్రీడకు ఆదరణ పెరిగేలా ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని ఏఆర్ డీఎస్పీ పి.సంజీవ్ కోరారు. జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (డీటీసీ)లో జిల్లాస్థాయి లీగ్ ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను ఏఆర్ డీఎస్పీ పి.సంజీవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జిల్లాలో ఫుట్‌బాల్‌కు విపరీతమైన ఆదరణ ఉందని, ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు ఖమ్మం వచ్చారని గుర్తు చేశారు. ఇలాంటి క్రీడను అభివృద్ధి చేసేందుకు అసోసియేషన్ కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో ఫుట్‌బాల్ క్రీడకు పూర్వవైభవం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఆర్ ఆర్ఐ విజయ్‌బాబు, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి కె.ఆదర్శకుమార్, సీనియర్ ఫుట్‌బాల్ క్రీడాకారులు ఎండీ అక్తర్, శ్రీను, రాంబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. తొలి ఫలితాలు : జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లాస్థాయి లీగ్ ఫుట్‌బాల్ పోటీల్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌ల్లో వీవీపాలెం– సత్తుపల్లి జట్టుపై 2–0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఇల్లెందు– డీటీసీ ఫుట్‌బాల్ జట్టుపై 2–0 గోల్స్ తేడాతో, పాల్వంచ–ఖమ్మం పోలీస్‌గ్రౌండ్‌పై 1–0 గోల్స్ తేడాతో నెగ్గాయి. క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఏఆర్ డీఎస్పీ సంజీవ్ -
ఖేల్‌ఖతం..
షాద్‌నగర్ ఏరియాలో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ వివిధ రాష్ట్రాల వారు నివాసం ఉంటారు. ఎవరెవరు ఉంటారో పక్కింటివారికి కూడా తెలియదు. అందుకే ఈ ప్రాంతాన్ని సేఫ్ షెల్టర్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. –ఎన్కౌంటర్లో మాజీ మావోయిస్టు –నయీం హతం l–4గంటల పాటు కొనసాగిన ఆపరేషన్ l–నేర సామ్రాజ్య విస్తరణకు షాద్‌నగర్‌లో మకాం l–రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సష్టించిన ఎన్కౌంటర్ l–జిల్లాకు చెందిన పలువురు ప్రజాసంఘాల –నేతల హత్యకేసుల్లో నయీంకు ప్రధానపాత్ర ‘షాక్’నగర్ సోమవారం ఉదయం నుంచీ షాద్‌నగర్, పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. పోలీసుల తనిఖీలు, మీడియా హడావుడితో ఏం జరుగుతుందోనని పట్టణవాసులు ఆందోళనకు గురయ్యారు. గ్యాంగ్‌స్టర్ తమ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నాడని, ఈ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకున్నాడని, అతడు ఎన్కౌంటర్ అయ్యేంత వరకు స్థానికులకు తెలియకపోవడం గమనార్హం. నయీం ఎన్కౌంటర్ తరువాత పోలీసులు అదుపులోకి తీసుకున్న 11మంది కీలక నిందితులను ప్రత్యేకంగా విచారిస్తున్నట్లు తెలిసింది. నేర సామ్రాజ్యాధి నేత, మాజీ మావోయిస్టు, మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ నయీం రక్తచరిత్ర ఇక ముగిసింది.. నిత్యం తన వెంట ఎంతో మంది బలగం ఉన్నా ఒంటరిగానే కథ ముగించాల్సి వచ్చింది. ఒక్కడే ఉండి ఒంటరి పోరాటం చేసినా మత్యువును జయించలేపోయాడు. రాజధాని హైదరాబాద్‌లో నిఘా పెరగడంతో ప్రశాంతంగా ఉండే షాద్‌నగర్‌ను తన నేర సామ్రాజ్య విస్తరణకు అడ్డాగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిఘా ఉంచిన పోలీసులు సోమవారం తెల్లవారుజామున మట్టుబెట్టడంతో నయీం కథ ముగిసినట్లయింది. పోలీసుల బూట్ల చప్పుళ్లు, కాల్పుల మోతతో షాద్‌నగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. ప్రశాంతంగా ఉండే నగరం వార్తల్లోకెక్కింది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రశాంతతకు మారుపేరుగా ఉండి పారిశ్రామికంగా ప్రగతిపథంలో దూసుకెళ్తున్న షాద్‌నగర్ సోమవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. మాజీ మావోయిస్టు నేత, మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ నయీం ఎన్‌కౌంటర్‌తో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సష్టించింది. ఇదిలాఉండగా, జిల్లాలో ఇటీవల కాలంలో పెద్దగా మావోయిస్టు కార్యకలాపాలు ఏమీలేవు. మాఫియా ఆగడాలకు అవకాశమే లేదని జిల్లా ప్రజలు భరోసాతో ఉన్న సమయంలో నయీం తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించడానికి షాద్‌నగర్‌ను అడ్డాగా మార్చుకున్నాడని తెలుస్తోంది. నెలల తరబడి నయీం అనుచరులు షాద్‌నగర్ కేంద్రంగా ఉండి సెటిల్మెంట్లు, రియల్ఎస్టేట్ దందాలు, భూకబ్జాలకు పాల్పడినట్లు తెలిసింది. తమకు సహకరించని వ్యాపారులు, రియల్టర్లకు బెదిరిస్తున్న విషయం నయీం ఎన్కౌంటర్లో మరణించే దాకా బయటికి పొక్కకపోవడం విశేషం. తొలుత పీపుల్స్పార్టీలో చేరి తరువాత పార్టీని వీడి మావోయిస్టు నేతలను లక్ష్యంగా చేసుకుని నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న నయీం సుమారు 100కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడని, 40హత్యకేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నారు. షాద్‌నగర్‌లో సెఫ్టీగా అయిజ మండలానికి చెందిన పౌరహక్కుల నేత పురుషోత్తం, కనకాచారిని దారుణంగా హతమార్చడంతో పాటు పలువురి హత్యకేసుల్లో నయీం కీలక నిందితుడిగా ఉన్నాడు. షాద్‌నగర్‌ను నేరసామ్రాజ్యం అడ్డాగా మార్చుకోవడంపై పోలీసు అధికారులు పలు కోణాల్లో విశ్లేస్తున్నారు. హైదరాబాద్‌లోని తన నేరసామ్రాజ్యంపై నిఘా ఉండడంతో షాద్‌నగర్ సురక్షితంగా ఉంటుందన్న భావంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అయితే నయీం ఇక్కడ ఉన్నా షాద్‌నగర్‌లో ప్రాంతంలో ఉంటు న్న వ్యాపారులు, రియల్టర్ల జోలికి పెద్దగా వెళ్లకపోవడం విశేషం. స్థానికులను టార్గెట్ చేస్తే తన ఆశ్రయానికి ఇబ్బంది కలుగుతుందనే ఈ ప్రాంతంలో భూదందాలపై కల్పించుకోలేదని ప్రచారం జరుగుతోంది. అయితే ఇతర ప్రాంతాల వాసులకు మాత్రం ఇక్కడినుంచే ఫోన్లు చేసి బెదిరించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన ఓ రియల్ఎస్టేట్ వ్యాపారిని బెదిరించగా, బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు తీగలాగితే డొంక కదిలింది. అయితే సెల్‌ఫోన్ టవర్ ఆధారంగా నయీం రహస్య స్థావరాన్ని పోలీసులు తెలుసుకున్నారు. అతడి ప్రధాన అనుచరుడైన ఉస్నూర్ బాషా ఆశ్రయం ఇచ్చి నయీం దందాకు సహకరించేవాడని పోలీసులు చెబుతున్నారు. ఉగ్రసంస్థలతో లింల్ ఉగ్రవాద సంస్థలకు పేలుడు సామాగ్రిని అందజేయడం ద్వారా తమ సంబంధాలను పటిష్టం చేసుకున్నారని భావిస్తున్న ఆ కోణంలో నేరచరిత్రను పరిశీలిస్తున్నారు. నల్లగొండ జిల్లావాసి అయిన నయీం మహబూబ్‌నగర్ జిల్లాతో తన నేర సంబంధాన్ని కలిగి ఉన్నాడు. తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించడంతో పాటు హైదరాబాద్‌లో ఆశ్రయం పొందుతున్న జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ వంటి సంస్థలకు సహకరించాడన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆ వైపు కూడా పోలీసులు ఆరాతీస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా పోలీసు రికార్డుల్లో ఉన్న నయీం ఇతర దేశాలకు పారిపోకుండా జాతీయస్థాయిలో పోలీసులను అప్రమత్తం చేశారు. -
జూడో విస్తరణకు కృషి
మహబూబ్‌నగర్ క్రీడలు: ఇటీవలే జిల్లా జూడో అసోసియేషన్‌ను ఏర్పాటు చేశామని, ఈ క్రీడ విస్తరించేలా తగిన ప్రణాళికలు రూపొందిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు రామలక్ష్మయ్య అన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. జూడోకు ఒలింపిక్స్‌లో గుర్తింపు ఉందని, ఈ క్రీడకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. అందరి సహకారంతో జిల్లాలో జూడోను అభివద్ధి చేస్తామని అన్నారు. డివిజన్ల వారీగా జూడో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించే జూడో క్రీడాకారులకు తమ అసోసియేషన్ సహకారం ఉంటుందని వెల్లడించారు. రాష్ట్ర అసోసియేషన్ అవకాశం ఇస్తే త్వరలో జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ టోర్నీ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రస్థాయి అసోసియేషన్ జూడో టోర్నీలకు జిల్లాస్థాయిల్లో సెలక్షన్స్ నిర్వహించి ప్రతిభ కనబరిచేవారిని ఎంపిక చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా జూడో అసోసియేషన్ సలహాదారుడు రాజేంద్రసింగ్, వైస్ చైర్మన్ డేవిడ్, ప్రధాన కార్యదర్శి దూమర్ల నిరంజన్, ఈసీ సభ్యుడు మొగులాల్ పాల్గొన్నారు. -
ఖరీదైన ఫోన్లలో ఆ గేమ్ ఆడొద్దు..!
లండన్: ఖరీదైన మొబైల్ ఫోన్లలో పోకిమన్ గో గేమ్ ఆడుతున్న వారికి లండన్ పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. ఒళ్లు మరచిపోయి, చుట్టూ ఏం జరుగుతుందో కూడా చూడకుండా.. ఫోన్లలో తలదూర్చే వారిని దొపిడి దొంగలు ఇటీవల టార్గెట్‌గా చేస్తున్నారు. దీంతో పిల్లలు, పెద్దలను ఖరీదైన ఫోన్లలో పోకిమన్ గో ఆడుతూ వీధుల వెంట తిరగొద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నార్త్ లండన్ పార్క్‌లో ఇటీవల పోకిమన్ గో ఆడుతున్న ముగ్గురు టీనేజ్ పిల్లల ఫోన్లను దుండగులు దోచుకున్నారు. పిల్లల కణతలకు గన్ పెట్టి బెదిరించిన దుండగులు ఖరీదైన ఫోన్లను తీసుకొని పారిపోయారు. ఈ ప్రమాదకర గేమ్ ఆడేవారు 'తమ చుట్టూ ఏం జరుగుతుంది' అనే విషయం కూడా మరచి.. ఫోన్లలో పోకిమన్లను వెతికే పనిలో ఉంటున్నారు. దీంతో దోపిడిదారుల పని సులువౌతోందని పోలీసులు తెలిపారు. -
బుద్ధుడి సన్నిధిలో బుడతడు..
ఇక్కడ కనిపిస్తున్న బుడతడు బుద్ధుడి సన్నిధిలో సేద తీరుతున్నట్లు ఉంది కదూ.. ఇతని తల్లిదండ్రులు అమరావతి మండలంలోని ధరణికోట వద్ద పుష్కర పనుల కోసం వచ్చారు. పిల్లవాడి కోసం నాలుగు కర్రలు, దుప్పటితో పందిరి వేసి ఒక ఆటవస్తువు చేతిలో పెట్టారు. తర్వాత ఇదిగో ఇలా.. బుద్ధిగా ఆడుకుంటూ కనిపించాడు. ఫొటో: రూబెన్ -
ప్రపంచాన్ని ఊపేస్తున్న పోకేమాన్ గో
-
హరితహారంపై విద్యార్థులకు పోటీలు
కమాన్‌చౌరస్తా : హరితహారం విజయవంతం కావడంలో విద్యార్థుల పాత్ర కీలకమని జిల్లా విద్యాధికారి ఎస్.శ్రీనివాసాచారి అన్నారు. హరితహారంపై స్థానిక ధన్గర్‌వాడీ ఉన్నత పాఠశాలలో సోమవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 13 నియోజకవర్గాల నుంచి మొత్తం 26 మంది ఉపన్యాస, 26 మంది వ్యాసరచచ పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. విజేతలను రాష్ట్ర స్థాయికి పంపించనున్నట్లు చెప్పారు. పోటీలకు పర్యవేక్షకులుగా హుజూరాబాద్ ఉపవిద్యాధికారి కె.ఆనందం వ్యవహరించారు. న్యాయనిర్ణేతలుగా కేఎస్.అనంతాచార్య, గాజుల రవీందర్, నంది శ్రీనివాస్, కేబీ శర్మ, కె,ముకుంధం, ఎస్.శ్రీనివాస్, బీఎన్ఆర్ శర్మ వ్యవహరించారు. -
తంబోలా ఆడొద్దన్నందుకు కిరోసిన్ పోసుకొని..
పార్వతీపురం(విజయనగరం): తంబోలా ఆడొద్దని తండ్రి మందలించడంతో బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సీతానగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానిక ఏరియా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన యామలి ఈశ్వరరావు తన కుటుంబంతో పాటు ఐదేళ్ల కిందట ఉపాధి కోసం తిరుపతికి వలస వెళ్లాడు. గొల్లపల్లి గ్రామదేవత పండగ సందర్భంగా రెండు రోజుల కిందట సీతానగరం వచ్చాడు. పండుగ ముగియడంతో తిరిగి తిరుపతి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈశ్వరరావు కుమార్తె ఉమ శుక్రవారం ఉదయం ఎదురింట్లో జల్దీఫైవ్ ఆడుతుండగా గమనించిన తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో మనస్థాపానికి గురైన ఉమ ఇంటిలోకి వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు మంటలార్పి ఆమెను స్థానిక ఏరియూ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై బి. లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆధార్ బిల్లును చదరంగంగా మార్చారు!
ఆధార్ బిల్లును చదరంగం ఆటలా మార్చారని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం నుంచి అన్ని రకాల ప్రయోజనాలు, సబ్సిడీలు, సేవలు పొందేందుకు విశిష్ట గుర్తింపుగా ఉన్న ఆధార్ బిల్లు 2016ను చట్టబద్ధంగా మంజూరు చేయడంపై విపక్ష సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆధార్ బిల్లుపై చర్చించేందుకు మరో రెండు రోజులపాటు సమావేశాలను పొడిగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఆధార్ బిల్లును ద్రవ్యబిల్లుగా ప్రవేశ పెట్టడం చదరంగం ఆట చర్యగా ఉందని... బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి మెజారిటీ లేకపోయినా ఆధార్ బిల్లును ద్రవ్యబిల్లుగా ప్రవేశ పెట్టి ఆమోదింపజేశారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. మైనారిటీలో ఉన్న ప్రభుత్వం రాజ్యసభ ఆమోదంనుంచీ తప్పించుకునేందుకే ఆధార్ బిల్లును ద్రవ్య బిల్లుగా ప్రవేశ పెట్టిందని ఆరోపించాయి. బిల్లును చర్చించేందుకు మాత్రమే అవకాశం కలిగిన ప్రభుత్వం... చట్టబద్ధమైన మార్పులు చేర్పులు చేసే అవకాశం లేకపోవడంతోనే వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఒకవేళ సిఫార్పులు చేసినా లోక్ సభ ఆమోదించే అవకాశం లేకపోవడంతో ఆధార్ బిల్లును ద్రవ్య బిల్లుగా ప్రవేశ పెట్టింది. అయితే హౌస్ నుంచి ఆమోదం పొందిన ద్రవ్య బిల్లుపై 14 రోజుల్లోపల చర్చించాల్సి ఉంది. అయితే విపక్షాల చర్చలకు సమయం లేకుండా చేసి, దొడ్డిదారిన బిల్లును ఆమోదింపజేసుకునే నేపథ్యంలో మరో రెండురోజుల్లో సమావేశాలు ముగుస్తుండగా నేడు రాజ్యసభలో బిల్లును అధికారికంగా స్వీకరించే అకాశం ఉంది. అయితే ఎగువ సభలో ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని, ఆధార్ బిల్లును ప్రవేశ పెట్టిన తీరు చూస్తే అదే విషయం అర్థమౌతోందని సీపీఎం నేత సీతారాం ఏచూరి ఆరోపించారు. మరోవైపు చివరి మూడు సమావేశాలను పొడిగించి ప్రతిపక్షం అభ్యంతరాలను రికార్డు చేసే విధంగా బిల్లు రాజ్యసభలో చర్చించేందుకు అన్ని పార్టీల నాయకులు ఏర్పాటు చేసిన వ్యాపార సలహా కమిటీ లేదా బిఏసీ ద్వారా ఆధార్ బిల్లును ద్రవ్యబిల్లుగా ఆమోదింపజేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మార్చి 16తో పార్లమెంట్ సమావేశాలు ముగియనుండటంతో ఈ సమావేశాల్లో అతి తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంట్లో మంగళవారం ముగింపు ప్రసంగాలకే పరిమితమౌతుంది. మరోవైపు రాజ్యసభలో నేటి సాయంత్రం రైల్వే బడ్జెట్ పై చర్చ ముగించి, కేంద్ర బడ్జెట్ ను కొనసాగించనుంది. కేవలం రాజ్యసభ ఆమోదం నుంచి తప్పించుకునేందుకే ఎన్డీయే ప్రభుత్వం ఆధార్ బిల్లును ద్రవ్య బిల్లుగా తీసుకువచ్చిందని, ఇప్పటికైనా మరో రెండు రోజులపాటు సమావేశాలు పొడిగించి, ఆధార్ బిల్లుపై చర్చించే అవకాశం కల్పించాలని విపక్షాలు కోరుతున్నాయి. -
పేకాట రాయుళ్ల అరెస్ట్
రంగారెడ్డి: మీర్పేట్లోని టీచర్స్ కాలనీలో పేకాట స్ధావరంపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాటాడుతున్న ఆరుగుర్ని ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకొని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.54 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. -
'హైడ్ అండ్ సీక్' తో పిల్ల టెర్రరిస్టుల దాష్టీకం!
ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు తాజాగా పోస్టు చేసిన ఓ వీడియో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. ఓ పురాతన కోట లోపల బంధించిన ఖైదీలను పిల్ల టెర్రరిస్టులు పట్టుకునే హైడ్ అండ్ సీక్ ఆటలా కనిపిస్తున్నా... నిజంగానే వారిని పట్టి బలవంతంగా చంపే వికృత చర్యలతో వీడియోను చిత్రించారు. సిరియాలోని మారుమూల డేయిర్ ఆజోర్ ప్రావిన్స్ ప్రాంతంలో దాచిన ఖైదీలను వెతుకుతూ చారిత్రక కట్టడాల మధ్య వాళ్లు శోధిస్తున్న దృశ్యాలను వీడియోలో పొందుపరిచారు. చేతులు రెండూ వెనక్కు విరిచి కట్టిన బందీలను..కనిపిస్తే కాల్చి చంపేందుకు సిద్ధంగా... ఆ పిల్ల పిశాచులు ఓ తుపాకీతో వేచి చూస్తుండటం ఆ పురాతన కట్టడాల మధ్య వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి భయంకర దాడుల్లో పాల్గొన్న వారు చాలావరకూ ఉత్తర ఆఫ్రికా, తజకిస్తాన్ నుంచి వచ్చినవారిలా ఉన్నారు. ఒకరి వెంట ఒకరు చారిత్రక అల్ రభా కోట ప్రవేశ ద్వారంనుంచి వారి శిక్షకుడిని కలుసుకుని, వారు చెప్పినట్లు కోట లోపల దాచిన ఖైదీలను అన్వేషించి మట్టుబెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు పిల్ల టెర్రరిస్టులకు కావలసిన తుపాలకులను అప్పగించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న బందీలను లోపలి చీకట్లో కనుగొనేందుకు చిన్నదీపం వెలిగించి ఇచ్చారు. ఒకరి తర్వాత ఒకరు వారిని వెతికి...పని పూర్తి చేసి తిరిగి తమ ట్రైనర్ వద్దకు వచ్చి, అనంతరం ఆ తుపాకులను మరో బాల టెర్రరిస్టుకు ఇస్తే అతడు తిరిగి ఆట(వేట) ప్రారంభిస్తాడు. ఇలా ఖైదీలను వేర్వేరు ప్రాంతాల్లో తప్పించుకొనేందుకు వీలు లేనట్లుగా బంధించారు. చివరికి ఓ ఖైదీని నరికి చంపిన దృశ్యం కూడా వీడియోలో కనిపిస్తుంది. సిరియా ఇరాక్ లలో తమ ఉగ్రవాద కార్యకలాపాల కోసం వందలాదిమంది పిల్లలకు ఇస్లామిక్ స్టేట్ శిక్షణ ఇస్తున్న విషయం తెలిసి టర్కీ పోలీసులు అరెస్టు చేసిన వార్తలు గతంలో సంచలనం రేపాయి. తాజాగా బందీలను చంపేందుకు బాల టెర్రరిస్టులతో 'హైడ్ అండ్ సీక్' గేమ్ ఆడిస్తున్న వీడియో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. -
స్ట్రోక్‌ను గుర్తించే కొత్త పరీక్ష..!
వైద్యరంగంలో రక్త పరీక్షలు కీలకపాత్ర పోషిస్తాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, సీజనల్ వ్యాధుల లాంటి ఏ చిన్న సమస్య వచ్చినా ఆస్పత్రికి వెళ్తే ముందుగా రక్త పరీక్షలు చేయించడం.. వ్యాధి నిర్ధారణ చేయడం మనకు తెలుసు. అయితే ప్రాణాంతకమైన బ్రెయిన్ స్ట్రోక్ లాంటి పెద్ద సమస్య అయినా ఇప్పుడు కేవలం కొన్ని చుక్కల రక్తంతో తెలుసుకోవచ్చంటున్నారు సైంటిస్టులు. పది నిమిషాల్లో స్ట్రోక్‌ను గుర్తించే 'గేమ్ ఛేంజర్' గా ఈ కొత్త టెస్టును చెబుతున్నారు. సమస్యను త్వరగా గుర్తించగలిగితే అపాయం నుంచి ప్రాణాన్ని రక్షించడం సులభం అవుతుంది. అందుకే చవకైన, సులభంగా వ్యాధిని గుర్తించేందుకు కనిపెట్టిన ఈ కొత్త బ్లడ్ టెస్టును పరిశోధకులు 2018 లో అందుబాటులోకి తేనున్నారు. ఈ టెస్టులో ఎంజైమ్స్ పూత కలిగిన ప్లేట్లు.. స్ట్రోక్ తర్వాత రక్తంలో పెరిగే రసాయనాలను గుర్తించేందుకు ఉపయోగపడతాయని, త్వరితగతిన వైద్యం అందించగలిగితే వైకల్యాలు దరి చేరకుండా రోగులు దీర్ఘకాలం స్వతంత్రంగా బతికే అవకాశం ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు. బిగ్గెస్ట్ కిల్లర్ గా చెప్పే బ్రెయిన్ స్ట్రోక్... బ్రిటన్‌లో తీవ్రమైన వైకల్యాలకు ప్రధాన కారణమౌతోంది. దాదాపు 1.50 లక్షల మంది స్త్రీ, పురుషులు.. కండరాల బలహీనత, పెరాలసిస్ వంటి వ్యాధులతో జీవిస్తున్నారు. మెదడులో ఏర్పడే క్లాట్స్ వల్ల కలిగే స్ట్రోక్‌కు 3-4 గంటల్లోపు చికిత్స అందించగలిగితే నష్టాన్ని పరిమితం చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు మెదడులో రక్తస్రావాన్ని బట్టి స్ట్రోక్ ఎలాంటిదో గుర్తిస్తారు. అయితే ఆస్పత్రిలో స్కాన్ చేయకుండా మాత్రం చికిత్స అందించడం సాధ్యం కాదని, వ్యాధిని గుర్తించకుండా మందు వాడటం ఒక్కోసారి ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉంటుందని, అందుకే ఆ తేడాలను కీలకంగా గుర్తించి వైద్యం అందించాల్సి వస్తుందని పరిశోధకులు అంటున్నారు. అమెరికా కార్నెల్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ కొత్తరకం టెస్టును కనుగొన్నారు. అంబులెన్సులో కూడా ఈ టెస్టు చేసే అవకాశం ఉండటంతో ఖర్చు తగ్గడంతో పాటు, విలువైన సమయాన్ని ఆదా చేయచ్చంటున్నారు. గతంలోనూ బ్రెయిన్ స్ట్రోక్‌ను గుర్తించే రక్తపరీక్షలు ఉన్నా, అవి గంటల కొద్దీ సమయం తీసుకోవడంతో విస్తృతంగా వినియోగంలో లేవు. ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి రానున్న ఈ టెస్టు.. ఆధునిక టెక్నాలజీని వినియోగించడంతో కేవలం 10 నిమిషాల్లోనే ఫలితాలు ఇస్తుందని, కొన్ని చుక్కల రక్తంతోనే సాధ్యమౌతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరీక్షతో ప్రస్తుతం మెదడు ఏదైనా కారణాల వల్ల డ్యామేజ్ అయిందా? ఇతర అనారోగ్య కారణాలున్నాయా అన్న విషయాలను కూడా తెలుసుకోవచ్చంటున్నారు. ఈ రక్త పరీక్ష 2018లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, దీంతో ఎన్నో జీవితాలను రక్షించవచ్చని పరిశోధనలో పాల్గొన్న అలెక్స్ ట్రావిస్ చెబుతున్నారు. స్ట్రోక్‌తో బాధపడే రోగుల్లో మూడు వంతుల మంది ఇషెమిక్ స్ట్రోక్‌తో (మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్) బాధపడుతున్నారని పరిశోధనకు నేతృత్వం వహించిన రాయ్ కోహెన్ అంటున్నారు. సరైన సమయంలో వైద్యం అందించడం వల్ల మెదడుకు నష్టం తగ్గుతుందని, అత్యవసర చికిత్ప అందించే అవకాశం ఉంటుందని స్ట్రోక్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ షామిమ్ క్వాడ్రిక్ అంటున్నారు. ఈ కొత్త రక్తపరీక్షతో స్ట్రోక్ ను తెలుసుకోవడమే కాక.. డిమెన్షియా, క్యాన్సర్ల గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. -
టీడీపీలో ఆట మొదలైంది
ఇంతకూ రేవంత్‌కు ఏ పదవి! సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో ఆట మొదలైంది. పార్టీలో కీలకమైన పదవుల కోసం సీనియర్లు పోటీ పడుతున్నారు. ఒకింత ఆలస్యంగానైనా, పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ, తెలంగాణల్లో రాష్ట్ర కమిటీల ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టడంతో పదవి కోసం లాబీయింగ్ ఊపందుకుంది. ఈ వారాంతంలోగా పార్టీ పదవుల భర్తీ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు ఆశపడుతున్నారు. కాగా, తెలంగాణ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరిని చేస్తారనే అంశం ఆసక్తి రేపుతోంది. రాష్ట్ర విభజన తర్వాత అప్పటికప్పుడు ఏపీ కమిటీలో ఉన్న నేతలతోనే తెలంగాణకు ప్రత్యేక కమిటీని ప్రకటించారు. మాజీ మంత్రి ఎల్.రమణ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏర్పాటైన ఆ కమిటీ పదవీ కాలం మహానాడుతోనే ముగిసింది. కమిటీ కొత్త అధ్యక్షుడు, ఇతర కార్యవర్గ పదవులు ఎవరికి దక్కుతాయో ఇప్పటి దాకా సస్పెన్స్‌గానే ఉంది. తెలంగాణ రాష్ట్ర కమిటీకి కొత్త అధ్యక్షుడు, ఇతర పదవుల భర్తీపై పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్యులతో చర్చిస్తున్నట్లు తెలియగానే తెలంగాణ టీడీపీ నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు పడిపోయారు. మొదటి నుంచీ అధ్యక్ష పదవిపై కన్నేసిన, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఈ సారి ఎలాగైనా పదవి దక్కించుకోవాలన్న పట్టుదలతో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు. శాసన మండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు డబ్బులిస్తూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన రేవంత్.. ‘ఓటుకు కోట్లు’ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్‌పై బయట ఉన్న ఆయనపై ఉన్న షరతులను కూడా కోర్టు ఎత్తివేయడంతో ఇక, ఏ ఇబ్బందీ ఉండదన్న అభిప్రాయానికి వచ్చారని, తెలంగాణలో పార్టీకి తన అవసరమే ఎక్కువ ఉందని ఆయన సన్నిహితుల వద్ద కూడా అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే పనిలో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే మాట ఎత్తితే తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్న రేవంత్.. తనను తాను రాష్ట్ర స్థాయి నేతగా రుజువు చేసుకునే పనిలో పడ్డారని అంటున్నారు. అయితే, ఇప్పటికే ఓ సారి అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్.రమణ వెనకబడిన వర్గాల కోటాలో ఈసారీ తనకే అవకాశం వస్తుందన్న నమ్మకంతో ఉన్నారని అంటున్నారు. దీంతో అధ్యక్ష పదవి రేసులో ఈ ఇద్దరు నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరోవైపు టీ టీడీఎల్పీ నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీ పదవినీ ఆశిస్తున్నారు. ఆయన తొలి కమిటీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఈ సారి తనకు అవకాశం వస్తుందో రాదో అన్న బెంగ ఆయనలో ఉంది. అయినా, చివరి దాకా అధినేతను మెప్పించి పదవి పొందే ప్రయత్నమే చేస్తున్నారని చెబుతున్నారు. వర్గ సమీకరణలు కుదరక, ఒక వేళ రేవంత్‌రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వని పక్షంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇచ్చే అవకాశం లేకపోలేదని కూడా పేర్కొంటున్నారు. ఇదే జరిగితే ఎర్రబెల్లి, రేవంత్ మధ్య ఆధిపత్య పోరు తప్పక పోవచ్చని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలంగాణలో పార్టీ రోజురోజుకూ ఇబ్బందుల్లో పడుతున్న నేపథ్యంలో, తెలంగాణ సీఎం కేసీఆర్ పట్ల దూకుడుగా ఉండే రేవంత్‌రెడ్డి వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. ఓటుకు కోట్లు కేసులో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఇబ్బందులు పడ్డారన్న సానుభూతి పార్టీ అగ్ర నాయకత్వంలో ఉందని, ఇది ఒక రకంగా రేవంత్‌కు లాభించే అంశమని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఎల్.రమణ, ఎర్రబెల్లి, రేవంత్‌ల మధ్యే అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుని పదవులు దోబూచులాడుతున్నాయని పేర్కొంటున్నారు. వీరిలో అధినేత ఎవరి వైపు మొగ్గు చూపుతారు..? అది పార్టీలో ఎలాంటి అంతర్గత పోరాటానికి దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. -
'ఇదంతా టీఆర్ఎస్ పార్టీ డ్రామా'
-
సతుల దెబ్బలకు పతులు పరార్..!
ఖమ్మం: భార్యలు కొడుతుంటే భర్తలు లబోదిబో మంటూ పరుగులు తీస్తారు.. ఇదేదో కోపంతో చేసిన పనికాదు.. గిరిజన సంప్రదాయ డూండ్ క్రీడలో భాగం..! ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని తండాలు గురువారం రాత్రి ఇందుకు వేదికలుగా మారాయి. డూండ్ అంటే వెతకటం అని అర్థం. గత ఏడాది హోలీ నుంచి ఇప్పటి వరకు తండాలో పుట్టిన మగ శిశువును హోలీ రోజు తెల్లవారు జామున ఆడవాళ్లంతా కలసి ఒక చోట దాచి పెడ్తారు. తండాలో గేర్యాలు(మగవాళ్లు) కర్రలు చేతబట్టుకుని ఆ బాలుడిని డూండ్ (వెతకడం) చేస్తారు. పిల్లవాడు దొరికాక అంతా కలసి కామదహనం చేసి రంగులు పూసుకుంటారు. అనంతరం సాయంత్రం సదరు బాలుడి ఇంటి వద్ద గుమి కూడతారు. అక్కడ ఒక గుంజ చుట్టూ తినుబండరాలను బకెట్లలో ఉంచి తాళ్లతో వాటిని ఒకదానికొకటి బిగించి కడతారు. వాటి చుట్టూ మహిళలు పాటలు పాడుతూ కర్రలతో కాపలా ఉండగా మగవాళ్లు తినుబండారాలను తీసుకెళ్లటానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో భార్యల చేతిలో భర్తలు దెబ్బలు తింటారు. అదీ అసలు విషయం. (కారేపల్లి). -
మళ్లీ అర్జున్‌తో..?
దాదాపు పదిహేనేళ్ల క్రితం విడుదలైన ‘ఒకే ఒక్కడు’ చిత్రం ఇప్పటికీ అందరికీ గుర్తుంది. ఆ చిత్రంలో నటించిన అర్జున్, మనీషా కొయిరాలా జంట చూడముచ్చటగా అనిపిస్తుంది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ ‘గేమ్’ అనే ఓ కన్నడ చిత్రంలో జతకట్టే అవకాశం ఉందని సమాచారం. -
ఐడీ.. ఆడిందే ఆట!
వేములవాడ, సిరిసిల్ల ఏరియాల్లో ఐడీ పార్టీ సిబ్బందిలోని కొందరు ఇటీవల దసరా మాముళ్లకు దిగడం వివాదస్పదమైంది. జగిత్యాల డివిజన్లోని ఓ సర్కిల్లో ఐడీ పార్టీకి చెందిన సిబ్బంది కొందరు మట్కా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాల్లో జోక్యం చేసుకుని మామూళ్లు దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అనేక సర్కిళ్లలో ఇసుక అక్రమ రవాణా, గుడుంబా అమ్మకాలు వంటి అంశాల్లోనూ ఐడీ పార్టీ సిబ్బంది అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయన్న ఫిర్యాదులున్నాయి. కొన్ని చోట్ల ఐడీ పార్టీ సిబ్బంది ఉన్నతాధికారులతో సన్నిహితంగా ఉంటూ తమకు సరిపడని సిబ్బందిపై చాడీలు చెబుతున్నారన్న అనుమానాలు సిబ్బందిలో నెలకొంటున్నాయి. కోరుట్ల: సాధారణ పోలీసు సిబ్బందిలో కొందరిని ఎంపిక చేసి ఇన్విస్టిగేషన్ డిపార్ట్మెంట్ పేరిట ఐడీ పార్టీలు ఏర్పాటు చేయడం.. సదరు ఐడీ పార్టీల తీరు కొన్ని ప్రాంతాల్లో వివాదస్పదం కావడం తెలిసిందే. ఈ క్రమంలో డీజీపీ అనురాగ్‌శర్మ అన్ని ఐడీ పార్టీలను రద్దు చేసే యోచన చేయడం పోలీసు వర్గాల్లో చర్చనీయంగా మారింది. ప్రత్యేకమైన నేరాల పరిశోధన కోసం కాస్త చురుకైన సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చి ఐడీ పార్టీలను ఎంపిక చేయడం ఆనవాయితీ. ఈ ఐడీ పార్టీల సిబ్బంది కొన్ని సర్కిళ్లలో నేర పరిశోధనలో తమ చాకచక్యాన్ని ప్రదర్శించడం కన్నా.. తాము ప్రత్యేకమన్న రీతిలో ఆధిపత్య ధోరణితో వ్యవహరించడం సమస్యాత్మకంగా మారింది. దీంతో ప్రజల్లోనూ.. పోలీస్ సిబ్బందిలోనూ ఐడీ పార్టీలు వివాదాస్పదవుతున్నాయి. ఐడీ పార్టీలు అవసరం లేదన్న వాదనలు బలపడుతున్నాయి. పక్కతోవ పడుతున్నాయి.. ఐడీ పార్టీలను ఓ హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో ఏర్పాటు చేస్తుంటారు. జిల్లాలో మొత్తం 68 పోలీస్స్టేషన్లు, 18 సర్కిళ్లు ఉండగా దాదాపు అన్ని సర్కిళ్లలోనూ అక్కడి పోలీసు అధికారులు ఐడీ పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆయా సర్కిళ్ల పరిధిలో జరిగే భారీ చోరీలు, చైన్‌స్నాచింగ్‌లు, హత్యలు తదితర నేరాల విచారణలో ఈ ఐడీ పార్టీలు క్రియాశీలకంగా పనిచేసి నేరస్తులను పట్టుకోవడంపై దృష్టి పెట్టి అధికారులకు సహకరించాల్సి ఉంటుంది. ఈ విధుల నిర్వహణను పక్కనబెడుతున్న ఐడీ పార్టీ సిబ్బంది జిల్లాలోని చాలా చోట్ల ఆయా సర్కిల్ అధికారులకు మాముళ్లు వసూలు చేసి పెట్టే సొంత పార్టీలుగా మారిపోయాయి. అధికారుల అండ ఉండటంతో ఐడీ పార్టీల సిబ్బంది అదనపు సంపాదనకు అర్రులు చాస్తున్నారు. సిబ్బందిలో విభేదాలు పోలీసు సిబ్బందిలోనే కొందరికి ఐడీ పార్టీ పేరిట ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం అనేక ఠాణాల్లో సిబ్బంది మధ్య విభేదాలకు తావిస్తోంది. జిల్లాలోని కొన్ని సర్కిళ్లలో ఉన్న ఐడీ పార్టీ సిబ్బంది ఆయా సర్కిల్, ఠాణా ఉన్నతాధికారులతో సన్నిహితంగా ఉంటూ తమకు సరిపడని పోలీసు సిబ్బందిపై లేనిపోనివి కల్పించి చెబుతున్నారన్న అనుమానాలు సిబ్బందిలో నెలకొంటున్నాయి. ఇటీవల కోరుట్ల సెగ్మెంట్లోని ఓ ఠాణాలో పోలీసు సిబ్బంది ఐడీ పార్టీ తీరుపై అధికారులకు ఫిర్యాదు చేయడం విశేషం. ఇలా అనేక ఠాణాల్లో ఐడీ పార్టీతో సాధారణ సిబ్బందికి విభేదాలు ఉన్నాయన్న విషయం బహిరంగ రహస్యం. దీంతో పాటు ఐడీ పార్టీ సిబ్బంది చాలాచోట్ల ఏళ్ల తరబడి పాతుకుపోవడం గమనార్హం. ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన కానిస్టేబుళ్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సి ఉండగా ఐడీ పార్టీ సిబ్బందిలో పనిచేస్తున్న చాలామంది కానిస్టేబుళ్లు సర్కిల్ స్థాయి అధికారుల అండతో ఇతర ప్రాంతాలకు బదిలీ అయినప్పటికీమళ్లీ డెప్యుటేషన్ పేరిట పాత స్థానాలకు వచ్చి చేరుతున్నారు. ఇవన్నీ ఐడీ పార్టీలు వివాదస్పదం కావడానికి కారణమవుతున్నాయి. ఈ క్రమంలో ఐడీ పార్టీలు అవసరం లేదన్న నిర్ణయానికి డీజీపీ రావడం పట్ల పోలీసు వర్గాల్లోనే కొందరు హర్షం వ్యక్తం చేస్తుండటం విశేషం. -
వైకుంఠ పాళి!
వైకుంఠపాళి ఆటలో ఎక్కడ.. ఎప్పుడు.. ఏ దశలో పాము నోట్లో పడతారో ఆ ఆట ఆడేవారికే తెలియదు. పాములను తప్పించుకుంటూ పరమపదసోపానం అగ్రభాగానికి చేరుకోవడానికి అలుపెరగక శ్రమించాలి. రాజకీయమనే వైకుంఠపాళిలో నీతి, నిజాయితీ, విలువలు, విశ్వసనీయతకు తావే లేదని తమ చేతలతో చెబుతుంటారు కొందరు రాజకీయ నాయకులు. తమనెన్నుకున్న ప్రజలు విస్తుపోతారని తెలిసినా అధికార యావ కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. పక్క డివిజన్ కార్పొరేటర్ల భర్తలూ సంఘ సేవకుల జాబితాలో...ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రతిపాదించిన జాబితాలో ఇంకా పలు చిత్ర విచిత్రాలున్నాయి. ఏడో డివిజన్ కార్పొరేటర్ చంద్రకళ భర్త గోపాల్ పేరు 8వ డివిజన్ కమిటీలో సంఘ సేవకునిగా దర్శనమిచ్చింది. ఇక 12వ డివిజన్ కార్పొరేటర్ రంగాచారి అయితే.. అదే డివిజన్ కమిటీలో ఆయన సోదరుడు కృష్ణమాచారి ఉన్నారు. 41వ డివిజన్ కార్పొరేటర్ బంగారమ్మ కాగా.. ఆమె కుమారుడు వెంకటేశ్, 30వ డివిజన్ కార్పొరేటర్ హేమలత కాగా.. ఈమె భర్త శేఖర్, 50వ డివిజన్ కార్పొరేటర్ బిందుప్రియ కాగా.. ఈమె భర్త శేఖర్‌బాబు అవే డివిజన్ల కమిటీల్లో ‘సంఘ సేవకుల’ జాబితాలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి పొందేందుకైనా భార్యాభర్తలను ఒకే యూనిట్‌గా పరిగణిస్తారు. చివరకు భార్యాభర్తలు వృద్ధాప్య పింఛన్‌కు అర్హులైనా ఒక్కరికి మాత్రమే ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే.. పింఛన్ లబ్ధిదారుల ఎంపిక కమిటీలో మాత్రం భార్య కార్పొరేటర్ హోదాలో, భర్త ‘సంఘ సేవకుని’ హోదాలో ప్రతిపాదించడంలోని ఔచిత్యం ఏమిటో ఎమ్మెల్యేనే తెలపాలి. సాక్షి ప్రతినిధి, అనంతపురం : పింఛన్ లబ్ధిదారుల ఎంపిక కమిటీల నియామకంలో తెలుగు తమ్ముళ్ల వ్యవహారం ‘పేనుకు పెత్తనం ఇస్తే..’ అన్న సామెతను తలపిస్తోంది. ఈ కమిటీల్లో స్థానిక ప్రజాప్రతినిధికి తోడు ఇద్దరు స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ప్రతినిధులు, ఇద్దరు సంఘ సేవకులు ఉండాలని, వారి నియామకం అధికార పార్టీ నేతలు, జిల్లా మంత్రులు చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిబంధన పెట్టడం ‘పచ్చచొక్కాల’కు పట్టపగ్గాల్లేకుండా చేస్తోంది. ఈ వెసులుబాటును వినియోగించుకుని రౌడీషీటర్లను, నేరచరితులను కూడా ‘సంఘ సేవకుల’ జాబితాలో చేర్చేస్తున్నారు. -
సాక్షి స్పోర్ట్స్ 14th July 2014
-
సాక్షి స్పోర్ట్స్ 12th July 2014
-
సాక్షి స్పోర్ట్స్ 11th July 2014
-
సాక్షి స్పోర్ట్స్ 7th July 2014
-
సాక్షి స్పోర్ట్స్ 6th July 2014
-
సాక్షి స్పోర్ట్స్ 5th July 2014
-
సాక్షి స్పోర్ట్స్ 4th July 2014
-
సాక్షి స్పోర్ట్స్ 3rd July 2014
-
సాక్షి స్పోర్ట్స్ 2nd July 2014
-
సాక్షి స్పోర్ట్స్ 1st July 2014
-
సాక్షి స్పోర్ట్స్ 30th June 2014
-
సాక్షి స్పోర్ట్స్ 29th June 2014
-
సాక్షి స్పోర్ట్స్ 26th June 2014
-
సాక్షి స్పోర్ట్స్ 25th June 2014
-
సాక్షి స్పోర్ట్స్ 24th June 2014
-
సాక్షి స్పోర్ట్స్ 23rd June 2014
-
సాక్షి స్పోర్ట్స్ 20th June 2014
-
సాక్షి స్పోర్ట్స్ 19th June 2014
-
సాక్షి స్పోర్ట్స్ 18th June 2014
-
సాక్షి స్పోర్ట్స్ 7th June 2014
-
పుట్‌బాల్ పండగ
-
సాక్షి స్పోర్ట్స్ 5th June 2014
-
కుర్రాళ్ళోయ్....కుర్రాళ్ళోయ్...
-
సాక్షి స్పోర్ట్స్ 3rd June 2014
-
సాక్షి స్పోర్ట్స్ 31st May 2014
-
సాక్షి స్పోర్ట్స్ 30th May 2014
-
ఫ్రెంచ్ ఓపెన్ 14
-
సాక్షి స్పోర్ట్స్ 27th May 2014
-
నిను వీడని నీడను...
-
IPL అదుర్స్
-
నిను వీడని నీడను...
-
సాక్షి స్పోర్ట్స్ May 22nd 2014
-
సాక్షి స్పోర్ట్స్ 21st May
-
జల్లి కట్టు.. ఆట ముగిసింది
-
పిల్లలు పిడుగులు
-
సాక్షి స్పోర్ట్స్ 13th Nov 2013
-
సచిన్ ఖాతాలో మరో తిరుగులేని రికార్డు
-
సాక్షి స్పోర్ట్స్ 11th Nov 2013
-
మొనగాళ్లకు మొనగాళ్లు
-
సాక్షి స్పోర్ట్స్ 8th Nov 2013
-
సాక్షి స్పోర్ట్స్ 7th Nov 2013
-
Sakshi sports 31st Oct 2013
-
సాక్షి స్పోర్ట్స్ 29th Oct 2013
-
సాక్షి స్పోర్ట్స్ 21st Oct 2013
-
సాక్షి స్పోర్ట్స్ 19th Oct 2013
-
సాక్షి స్పోర్ట్స్ 11th Oct 2013
-
సాక్షి స్పోర్ట్స్ 1st Oct 2013
-
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ధోని వీరంగం