
ఖాట్మండు: పబ్‌జీ (ప్లేయర్ అన్‌నోన్స్ బ్యాటిల్‌గ్రౌండ్)గేమ్‌పై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. నేపాల్‌లోని ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు, మొబైల్ ఆపరేటర్లు, నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్లకు పబ్‌జీ గేమ్ స్ట్రీమింగ్‌ను బ్లాక్ చేయాలని నేపాల్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ (ఎన్‌టీఏ) ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే ఈ గేమ్‌ను గుజరాత్‌లో కూడా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. యూఏఈలో కూడా ఈ గేమ్‌పై నిషేధం విధించడానికి చర్చలు జరుగుతున్నాయి.
నేపాల్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి అందిన సమాచారంతో ఈ గేమ్‌పై నిషేధం విధించినట్టు ఎన్‌టీఏ డిప్యూటీ డైరెక్టర్ సందీప్ తెలిపారు.చిన్నారులు, యువత ఈ గేమ్‌కు బానిసలుగా మారిపోతున్నారని చెప్పారు. దీంతో పిల్లలు చదువులకు ఈ గేమ్ ఆటంకంగా మారిందని తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment