
సాక్షి, తిరుమల: అలిపిరి నుంచి తిరుమలకు బస్ డ్రైవింగ్ గేమ్ పేరిట విడుదలైన ఓ యాప్ తిరుపతిలో కలకలం సృష్టించింది. ప్లే స్టోర్‌లో రూ.179 చెల్లించి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని, గేమ్ గెలిస్తే 20 శ్రీవారి లడ్డూలు గెలిచినట్లని నిర్వహకులు ప్రచారం చేశారు. డ్రైవర్ యాప్‌పై హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ డ్రైవింగ్ యాప్‌పై టీటీడీ విజిలెన్స్ విచారణ చేపట్టింది. నిర్వహకుడు సురేష్ పరారీలో ఉన్నాడు. ప్లే స్టోర్ నుంచి యాప్‌ను అధికారులు డిలీట్ చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment