గోడెక్కిన బస్సు!
తిరుమలలోని పాపవినాశనం ఘాట్‌రోడ్డు మార్గంలో శుక్రవారం తృటిలో పెద్దప్రమాదం తప్పింది. తిరుమల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మధ్యాహ్నం 38మంది ప్రయాణికులతో పాపవినాశనం నుంచి తిరుమలకు బయలుదేరింది. మార్గమధ్యంలోని ఆకాశగంగ సమీపంలో ఎదురుగా వచ్చిన సుమోను తప్పించబోయి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో అదుపుతప్పిన బస్సు సుమారు వందమీటర్లు ముందుకు దూసుకెళ్లి కుడివైపున ఉన్న పిట్టగోడను ఢీకొని ఆగింది. అప్పటికే బస్సు ముందు చక్రాలు లోయవైపు గాలిలో ఉన్నాయి. ప్రయాణికలు భయాందోళనతో వణికి పోయారు. 40 అడుగుల లోయలో బస్సు పడిఉంటే భారీగా ప్రాణనష్టం జరిగేది. తర్వాత క్రేన్ సాయంతో బస్సును పక్కకు తీశారు.
- సాక్షి, తిరుమల