సాధారణంగా ప్రయాణికులు రైల్లో కూర్చుంటారు లేదా పడుకొని ప్రయాణిస్తారు. కానీ న్యూయార్క్‌లోని ఒక రైల్లో ఓ జంట ఏకంగా పింగ్ పాంగ్ (టేబుల్ టెన్నిస్) ఆడుతున్న వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ అమెరికన్ కవయిత్రి మేరీ కార్ ఈ వీడియోను ‘ రైల్లో ఓ జంట ఒక టేబుల్‌పై పింగ్ పాంగ్ ఆటను ప్రారంభించారంటూ ’ ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. కాగా ఈ వీడియోపై నెటీజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.