పవర్ పంచ్
బాక్సింగ్ ఆటంటే ప్రాణాలతో చెలగాటం.. ఆటలో క్రీడాకారుడు ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా ప్రత్యర్థి పంచ్‌కు కుప్పకూలుతాడు.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతాడు.. అయితే ఇలాంటి సాహసోపేతమైన క్రీడలో ప్రావీణ్యం సంపాదించి ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు జిల్లాకు చెందిన పలువు రు విద్యార్థులు.
-
బాక్సింగ్‌లో మెరుస్తున్న విద్యార్థులు, యువకులు
-
కోచ్‌ల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ
-
రాష్ట్ర, జాతీయస్థాయిలో గుర్తింపు
హసన్‌పర్తి : బాక్సింగ్ ఆటంటే ప్రాణాలతో చెలగాటం.. ఆటలో క్రీడాకారుడు ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా ప్రత్యర్థి పంచ్‌కు కుప్పకూలుతాడు.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతాడు.. అయితే ఇలాంటి సాహసోపేతమైన క్రీడలో ప్రావీణ్యం సంపాదించి ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు జిల్లాకు చెందిన పలువు రు విద్యార్థులు. సమయస్ఫూర్తి, మెళకువల తో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తూ పతకాలు సాధిస్తూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
సాధారణంగా అన్ని ఆటలకంటే బాక్సింగ్ విభిన్నంగా ఉంటుంది. ఈ క్రీడను నేర్చుకునే వారికి ధైర్యం, గుండె నిబ్బరం, బలం, ఆత్మ విశ్వాçÜం ఉండాలి. అందు కే బాక్సింగ్ శిక్షణ పొందేందుకు వచ్చే విద్యార్థులు, యు వకులకు కోచ్‌లు ముందుస్తుగా నియమ నిబంధనలు వివరిస్తారు. తర్వాత శిక్షణకు సన్నద్ధులను చేస్తుంటారు. అయితే పవర్‌ఫుల్ పంచ్‌లతో.. వ్యూహాత్మకంగా కొనసాగే ఆటలో జిల్లాకు చెందిన విద్యార్థులు, యువకులు రాటుదేలుతున్నారు. కాగా, హసన్‌పర్తి మండల కేంద్రాని కి చెందిన శీలం పార్థసారథి ప్రస్తుతం ధర్మసాగర్ మండలంలోని సాయిపేట జిల్లా పరిషత్ పాఠశాలలో వ్యాయా మ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అలాగే బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.
ఈయన గతంలో బాక్సింగ్‌లో రాష్ట్ర, జాతీయస్థా యి పోటీల్లో రాణించి పలు పతకాలు సాధించారు. అయితే తనలాగే మరికొందరిని కూడా బాక్సింగ్‌లో తీర్చిదిద్దాలనే తపనతో ఆయన హసన్‌పర్తిలో రోజు సాయంత్రం వేళలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీంతో పాటు వేసవిసెలవుల్లో ఆసక్తి కలిగిన విద్యార్థులను చేరదీసి బాక్సింగ్‌లో శిక్షణ ఇస్తూ, మెళకువలు నేర్పిస్తున్నారు. కాగా, కోచ్ పార్థసారథి వద్ద శిక్షణ పొందిన వారి లో కె.సుమన్ డి. అరవింద్, కె. రాంచందర్, మహేంద ర్, రమేష్, దేవేందర్, అశ్విని, సోని జాతీయ, రాష్ట్రసా ్థయి పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించారు. అలాగే మరికొందరు జిల్లాస్థాయిలో రాణించారు. ఇదిలా ఉండగా, పార్థసారథి రెండు సార్లు జాతీయ జట్టు కోచ్‌గా, మరో రెండు సార్లు జాతీయ జట్టు అఫీషియల్‌గా వ్యవహరించారు.
సూపర్.. శ్యాంకుమార్
హసన్‌పర్తికి చెందిన పోలు శ్యాంకుమార్ బాక్సింగ్‌లో తనదైన ప్రతిభ కనబరుస్తున్నాడు. పాఠశాల స్థాయి నుంచే బాక్సింగ్‌పై మక్కువ పెంచుకున్న ఆయన అందులో పట్టుసాధించి రాణిస్తున్నాడు. 2012లో విశాఖపట్టణంలో జరిగిన ఇన్విటేషన్ పోటీలకు, 2013లో హైదరాబా ద్‌లో జరిగిన స్కూల్ గేమ్స్ హాజరయ్యాడు. 2015లో హసన్‌పర్తిలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. 2016లో కరీంనగర్ జిల్లాలో జరిగిన స్కూల్ గేమ్స్ పోటీల్లో బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. వీటితోపాటు ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి సబ్‌జూనియర్ పోటీల్లో పాల్గొని సత్తాచాటాడు. ఈ సందర్భంగా శ్యాంకుమార్ మాట్లాడుతూ నాన్న అశోక్, కోచ్‌లు పార్థసారథి, సాంబరాజు ప్రోత్సాహంతో బాకి ్సంగ్‌లో రాణిస్తున్నానని చెప్పారు. ఆర్మీలో ఉద్యోగం సంపాదించి దేశానికి సేవ చేస్తానని ఆయన పేర్కొన్నారు. కాగా, శ్యాంకుమార్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
రాణిస్తున్న రోహిత్
హసన్‌పర్తికి చెందిన రోహిత్ స్థాని క జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఆరో తరగతి నుంచే బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్న రోహిత్ అందులో రాణిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో 2012 లో విశాఖపట్టణంలో జరిగిన ఇన్విటేషన్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొని సత్తాచాటాడు. 2013లో హైదరాబాద్‌లో జరిగిన స్కూల్ గేమ్స్‌లో పాల్గొన్నాడు. 2014లో హైదరాబాద్‌లో జరిగిన స్కూల్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్, 2015లో హసన్‌పర్తిలో జరిగిన రాష్ట్ర స్థా యి సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొని సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది కరీంనగర్ జిల్లాలో జరిగిన స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకం సాధించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మనాన్న సాంబలక్ష్మి, గోపీ, కోచ్‌లు పార్థసారథి, సాంబరాజు ప్రోత్సాహంతో తాను బాక్సింగ్‌లో ప్రతి భ కనబరుస్తున్నానని చెప్పారు. ఒలింపిక్స్‌లో భారతదేశం తరపున పాల్గొనాలనేదే తన ఏకైక లక్ష్యమన్నారు.
స్ట్రాంగ్‌ఫుల్.. సాకేత్
హసన్‌పర్తికి చెందిన శీలం సాకేత్ స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదుతున్నాడు. నాలుగో తరగతి నుంచే బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్న సాకేత్ అందులో తనదైన ప్రతిభ కనబరుస్తున్నాడు. ఇందులో భాగంగా 2012లో విశాఖ పట్టణంలో జరిగిన ఇన్విటేషన్ బాక్సింగ్ పోటీ ల్లో పాల్గొని సత్తాచాటాడు. 2013లో విశాఖపట్టణంలో జరిగిన స్కూల్ గేమ్స్‌లో పాల్గొని బంగారు పతకం సాధించాడు. 2014లో హైదరాబా ద్‌లో జరిగిన స్కూల్ గేమ్స్‌లో పాల్గొని సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. 2015లో హసన్‌పర్తిలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోచ్‌ల సహకారంతో బాక్సింగ్‌లో రాణిస్తున్నానని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో రాణించాలన్నదే తన లక్ష్యమన్నారు.
శభాష్.. నరేందర్
హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన శీలం నరేందర్ ఆర్మీ లో ఉద్యోగం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే బాక్సింగ్‌పై మ క్కువ పెంచుకున్న ఆయన అందులో ప్రత్యేక శిక్షణ పొం దారు. ఈ మేరకు తండ్రి శీలం రాజలింగం, సోదరుల ప్రో త్సహంతో రెండు సార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించారు. ఆర్మీ తరపున ఆల్æఇండి యా బాక్సింగ్ పోటీల్లో పాల్గొని గోల్డ్‌మెడల్æసాధించారు.