అమెరికా రైల్లో ‘పింగ్ పాంగ్’ | Couple Playing Ping Pong In New York Train | Sakshi
Sakshi News home page

అమెరికా రైల్లో ‘పింగ్ పాంగ్’

Published Tue, Jul 2 2019 6:10 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

Couple Playing Ping Pong In New York Train  - Sakshi

న్యూయార్క్‌: సాధారణంగా ప్రయాణికులు రైల్లో కూర్చొని లేదా పడుకొని ప్రయాణిస్తారు. కానీ న్యూయార్క్‌లోని ఓ జంట రైల్లో ఏకంగా పింగ్ పాంగ్ (టేబుల్‌ టెన్నిస్‌) ఆడుతూ ప్రయాణం చేసింది. ఇందుకు సంబంధిచిన వీడియోను అమెరికన్‌ కవయిత్రి మేరీ కార్ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. రద్దీగా ఉండే రైళ్లలో ఇలాంటి ఆటలను న్యూయార్క్‌ వాసులుగా తాము ప్రోత్సాహించమని మెజారిటీ నెటిజన్లు అభిప్రయపడుతున్నారు. వీడియోలో పింగ్‌ పాంగ్‌ ఆడిన వారికి చురకలు అట్టించేలా కామెంట్లు పెడుతున్నారు. అయితే మేరీ పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు 10వేల రీట్వీట్లు, 60 వేలకు పైగా లైక్‌లు రావడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement