
మళ్లీ అర్జున్‌తో..?
దాదాపు పదిహేనేళ్ల క్రితం విడుదలైన ‘ఒకే ఒక్కడు’ చిత్రం ఇప్పటికీ అందరికీ గుర్తుంది. ఆ చిత్రంలో నటించిన అర్జున్, మనీషా కొయిరాలా జంట చూడముచ్చటగా అనిపిస్తుంది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ ‘గేమ్’ అనే ఓ కన్నడ చిత్రంలో జతకట్టే అవకాశం ఉందని సమాచారం.