
ప్రకటించిన సీఎం పుష్కర్ సింగ్ ధామి
బరెల్లీ: దేశంలోనే ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)ని మొట్టమొదటి సారిగా అమలు చేసే రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. తమ రాష్ట్రంలో ఈ జనవరిలోనే ఉమ్మడి పౌర స్మృతిని అమల్లోకి తేనున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. గురువారం బరెల్లీలో ఆయన 29వ ఉత్తరాయణి మేళాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..దేశానికి జీవజలాలను అందించే పవిత్ర శారద, గంగ, సరస్వతి, కావేరీ నదుల వంటిదే యూసీసీ కూడా అని ఆయన పేర్కొన్నారు. యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నది బీజేపీ ఎజెండాగా ఎప్పటి నుంచో ఉందని గుర్తు చేశారు. యూసీసీ బిల్లుకు గతేడాది ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలపగా మార్చిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకంతో చట్టంగా మారింది.