
ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆయన కార్యాలయానికి ఫోన్ చేసిన దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. 10 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు ఫోన్ చేశారు. శనివారం ఉదయం 11.30, 11.40 గంటలకు దుండగుల నుంచి ఫోన్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇది ఆకతాయి పని అయి ఉంటుందా? లేక ఎవరైనా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దుండగుడు ఉపయోగించిన ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.
చదవండి: 900 కిమీ దూరం.. గంటల వ్యవధిలోనే చనిపోయిన కవల సోదరులు..