
వాతావరణం
ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం మధ్యాహ్నం వరకు పాక్షికంగా, ఆ తర్వాత వైవిధ్యంగా మేఘావృతమవుతుంది.
‘ఇందిరమ్మ’ నిర్మాణాల్లో వేగం పెంచాలి
నిర్మల్‌టౌన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో వేగం పెంచాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల మా ర్కింగ్ ప్రక్రియ, తాగునీటి సమస్య తదితర అంశాలపై ఆమె సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటివరకు పూర్తిచేసిన ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ వివరాలు, తాగునీటి సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల గురించి మండలాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తొలి దశ లబ్ధిదారుల మార్కింగ్ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని, పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలని ఆదేశించారు. లబ్ధిదా రుల అర్హతలు, జీవో వివరాల గురించి ఇంది రమ్మ ఇళ్ల కమిటీ సభ్యులకు అవగాహన క ల్పించేందుకు మండల స్థాయిలో అవగాహ న కార్యక్రమాలు నిర్వహించాలని సూచించా రు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తితే వెంటనే స్పందించాలని, బోర్లు, చే తిపంపులకు మరమ్మతు చేపట్టాలని తెలిపా రు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు తాగునీటి సరఫరాను పర్యవేక్షించాల ని, భూగర్భజలాల లభ్యత తక్కువగా ఉన్న మండలాల్లో అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. ఉదయం 7నుంచి 11గంటల వ రకే ఉపాధిహామీ పనులు చేపట్టాలని, పని ప్రదేశాల్లో తాగునీరు, టెంట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపా రు. జిల్లాలోని 117 ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధిహామీ నిధులతో చేపట్టిన 228 మరుగుదొడ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. మరుగుదొడ్లు లేని మండల కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాలని సూచించా రు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు క లెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవోలు రత్నకళ్యా ణి, కోమల్‌రెడ్డి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, వీసీలో ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కలెక్టర్ అభిలాష అభినవ్
అధికారులతో సమీక్ష