
సాహితీరంగంలో కవియాత్ర ప్రశంసనీయం
నిర్మల్‌ఖిల్లా: సమాజంలో సాహితీరంగంపై జిల్లా కవులు ప్రజానీకాన్ని చైతన్యవంతం చేస్తున్నతీరు ప్రశంసనీయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. కవియాత్ర సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 20న ఖమ్మం జిల్లాలో కవియాత్ర నిర్వహణ విజయవంతంగా పూర్తిచేసుకున్నందున శనివారం జిల్లాకేంద్రంలోని స్థానిక ప్రభు త్వ విశ్రాంత ఉద్యోగుల సంఘంభవనంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంసీ.లింగన్న మాట్లాడుతూ.. కవియాత్ర ద్వారా సామాజిక చైతన్యం కలిగిస్తున్న ప్రముఖ కవులు కారం శంకర్, డాక్టర్ బి.వెంకట్ సేవలను కొనియాడారు. కవియాత్ర సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కారం శంకర్ బి.వెంకట్ మాట్లాడుతూ.. కవియాత్రకు విశేషమైన స్పందన రావటం హర్షణీయమన్నారు. ఖమ్మంలోని వికాసవేదిక సాహిత్య సంస్థ ప్రతినిధులు వెంకటస్వామి నాయుడు, లెనిన్ శ్రీనివాస్ ఖమ్మం కవియాత్రకు సహకరించారన్నారు. 25 కిలోమీటర్ల యాత్రలో 100 మందికిపైగా కవులు, కవయిత్రులు మండుటెండను సైతం లెక్కచేయకుండా పాల్గొని కవితా గానం చేశారన్నారు. ఈ యాత్రలో బౌద్ధారామంలో మూడు పుస్తకాలను, రెండు సీడీలను ఆవిష్కరించామని వివరించారు. కవియాత్ర చైర్మన్ కారం నివేదిత, సాహితీవేత్తలు, కళాకారులు అంబటినారాయణ, ఎట్టెం రజిత, పోలీస్ భీమేశ్, కడారి దశరథ్, దేవీప్రియ, ఎంఏ.గఫార్, పవన్‌కుమార్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ‘ఆదర్శ’ పరీక్ష
కుంటాల: ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు ఆది వారం(27న) ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నారు. కుంటాల ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో 100 సీట్ల కోసం 370, ఏడో తరగతి కోసం 78, 8వ తరగతి కోసం 63, 9వ తరగతి కోసం 61, పదో తరగతిలో ప్రవేశానికి 14 మంది దరఖాస్తు చేసుకున్నారని ప్రిన్సి పాల్ నవీన్‌కుమార్ తెలిపారు. ఉదయం ఆరో తరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. ఈమేరకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.