బరిలో తండ్రీకూతుళ్లు | - | Sakshi
Sakshi News home page

బరిలో తండ్రీకూతుళ్లు

Published Thu, Apr 4 2024 2:10 AM | Last Updated on Thu, Apr 4 2024 1:03 PM

కొరాపుట్‌: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తండ్రీ, కూతురు ఒకే పార్టీ తరుపున బరిలో దిగనున్నారు. నబరంగ్‌పూర్‌ లోక్‌సభ అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ తరుపున భుజబల్‌ మజ్జి, ఆ పార్లమెంట్‌ స్థానం పరిధిలోని డాబుగాం అసెంబ్లీ స్థానంలో ఆయన కుమార్తె డాక్టర్‌ లిఫికా మజ్జిలు పోటీ చేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి భుజబల్‌ 2000 సంవత్సరంలో కాంగ్రెస్‌ టిక్కెట్‌పై డాబుగాంలో పోటీచేసి గెలిచారు. అనంతరం 2004లో అదే స్థానంలో భుజబల్‌ ఓడిపోయారు. మరలా 2009లో గెలిపొంది, 2014, 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

రెండేళ్ల క్రితం జరిగిన మూడంచెల పంచాయతీ ఎన్నికల్లో డాక్టర్‌ చదువు పూర్తి చేసిన తన కుమార్తె లిఫికాను పోటీకి నిలిపారు. కాంగ్రెస్‌ పార్టీ తరుపున జిల్లావ్యాప్తంగా ఒక్క లిఫికా మాత్రమే గెలిపొందారు. ఈ ఏడాది ప్రారంభంలో భుజబల్‌ నబరంగ్‌పూర్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షునిగా నియమితులయ్యారు. తండ్రీ కూతుళ్ల గెలుపుపై కాంగ్రెస్‌ పార్టీ ఆశలు పెట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement