
చంద్రబాబు కాపు సామాజిక వర్గానికి చేసిన మేలు ఏమైనా ఉందా? అంటూ ప్రశ్నించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.
సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబు కాపు సామాజిక వర్గానికి చేసిన మేలు ఏమైనా ఉందా? అంటూ ప్రశ్నించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. గురువారం ఆయన తాడేపల్లిగూడెంలో ‘కాపు నేస్తం’ భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ, సీఎం జగన్ పాలనలో ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయన్నారు. నాలుగేళ్ల పాలనలో రూ.1492 కోట్లను కాపు సోదరీమణులకు అందించిన ఘనత సీఎం జగన్‌ది అని మంత్రి కొనియాడారు.
‘‘కాపులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. కాపులను అణగదొక్కేందుకు ముద్రగడ కుటుంబాన్ని హింసించారు. రైలుకు నిప్పు పెట్టించి కాపులపై బాబు దొంగ కేసులు పెట్టించాడు. పవన్‌కు డబ్బులు సంపాదించడం తప్ప వేరే ఆలోచన లేదు. నమ్ముకున్న కాపుల పరువు తీసిన వ్యక్తి పవన్’ అంటూ మంత్రి సత్యనారాయణ మండిపడ్డారు.
చదవండి: లోకేష్ సన్నిహితుడు గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో ఐటీ సోదాలు