ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ స్టీఫెన్‌సన్‌ రాజీనామా | Au Vc Prasad Reddy And Registrar Stephenson Resigned | Sakshi
Sakshi News home page

ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ స్టీఫెన్‌సన్‌ రాజీనామా

Published Fri, Jun 28 2024 4:07 PM | Last Updated on Fri, Jun 28 2024 4:19 PM

Au Vc Prasad Reddy And Registrar Stephenson Resigned

ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ స్టీఫెన్‌సన్‌ రాజీనామా చేశారు. రాజీనామా చేయాలంటూ ప్రసాద్‌రెడ్డి, స్టీఫెన్‌పై టీడీపీ నేతలు నుంచి ఒత్తిడి తీసుకురావడంతో వారు రాజీనామా చేశారు.

సాక్షి, విశాఖపట్నం: ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ స్టీఫెన్‌సన్‌ రాజీనామా చేశారు. రాజీనామా చేయాలంటూ ప్రసాద్‌రెడ్డి, స్టీఫెన్‌పై టీడీపీ నేతలు నుంచి ఒత్తిడి రావడంతో వారు రాజీనామా చేశారు.

నిన్న వీసీ ఛాంబర్‌ ముందు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు ఓవరాక్షన్‌ చేశారు. ప్రసాద్‌రెడ్డి రాజీనామా చేయాలంటూ ఛాంబర్‌ వద్ద నిరసనకు దిగారు. కొన్ని రోజులుగా వీసీని భయబ్రాంతులకు గురిచేసే విధంగా టీఎన్ఎస్ఎఫ్‌ నేత ప్రణవ్ గోపాల్ వ్యవహరించారు

గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధిలో ప్రసాద్ రెడ్డి తనదైన ముద్ర  వేశారు. ఆయనను ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా ముద్ర వేసి టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి 2019లో మొదటిసారి వీసీగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి చాలా ధైర్యంగా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.

కాగా, తక్షణమే తన పదవి రాజీనామా చేయాలంటూ ప్రసాద్‌ రెడ్డికి గత కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్‌ కూడా వచ్చాయి. ప్రసాద్‌ రెడ్డిని వీసీ పదవికి  తక్షణమే రాజీనామా చేసి విదేశాలకు వెళ్లిపోవాలని లేకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటామంటూ బెదిరింపులకు దిగారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement