
సాక్షి,కరీంనగర్: బీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా భావించే కరీంనగర్‌లో ఆ పార్టీకి తాజాగా బిగ్ షాక్ తగలింది. ఆ పార్టీకి చెందిన కరీంనగర్ నగర మేయర్ సునీల్‌రావుతో పాటు 10 మంది కార్పొరేటర్లు కమలం తీర్థం పుచ్చుకోనున్నారు. శనివారం(జనవరి25) కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో వీరంతా బీజేపీలో చేరనున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్‌ఎస్ పార్టీకి ప్రతి ఎన్నికలోనూ కరీంనగర్ ప్రజలు అండగా నిలబడ్డారు. ఉప ఎన్నికల్లోనూ పార్టీకి ఘన విజయాలు అందించారు.2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కరీంనగర్ ప్రజలు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే గెలిపించారు.
అయితే తర్వాత ఏడాది 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి దెబ్బ పడింది. ఇక్కడి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎంపీగా బండి సంజయ్ ఘన విజయం సాధించి కేంద్ర మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో పార్టీకి కీలక నేతగా ఉన్న సునీల్‌రావు బీజేపీలోకి వెళుతుండడం పార్టీ వర్గాలను కలవరపరుస్తోంది.