
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య, ఎంపీ ప్రతిభా వీరభద్ర సింగ్‌ను నియమించారు. కుల్దీప్ సింగ్ రాథోర్ స్థానంలో ఆమెను నియమించారు. దీంతోపాటు రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా హర్ష మహాజన్, రాజేందర్ రాణా, పవన్ కాజల్, వినయ్‌కుమార్‌ను సోనియా నియమించారు. స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా ఆనంద్ శర్మ, ప్రచార కమిటీ చైర్మన్‌గా సుక్వీందర్ సింగ్, సీఎల్‌పీ లీడర్‌గా ముకేశ్ అగ్నిహోత్రి నియమితులయ్యారు.
చదవండి: (నవనీత్ కౌర్-రాణా దంపతులపై సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు)