
- పవన్ నీ శాఖను నేను తీసుకుంటానని మరొక మంత్రి అంటే ఎలా వుంటుంది?
- పవన్ వ్యాఖ్యలు ప్రభుత్వానికి నష్టం
- లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అంటే సీఎం చంద్రబాబుని అన్నట్లు కాదా?
- మంద కృష్ణ మాదిగ ధ్వజం
విజయవాడ: ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోంమంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ నోటి నుంచి ఆ తరహా వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమంటూనే, మాదిగ మహిళ అనితను అవమానించినట్లే కదా అంటూ మండిపడ్డారు. ఈ విషయాన్ని తాము దృష్టిలో పెట్టుకుంటామని పవన్‌ను హెచ్చరించారు మంద కృష్ణ మాదిగ.
ఈరోజు(మంగళవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అనంతరం మంద కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. ‘ఇదే విధంగా పవన్ కళ్యాణ్ తన శాఖ సరిగా చేయలేదని ఇంకో మంత్రి అంటే ఎలా వుంటుంది. పవన్ కళ్యాణ్ కాపులకు పెద్దన్నఏమో.. మాకు కాదు. జనసేనకు కేటాయించిన బిసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంకో సీటు ఎందుకు ఇవ్వలేదు. జనసేన అందరి పార్టీనా కాదా?, కమ్మ కాపులే కాదు అందరూ జనసేనకు ఓట్లేశారు.
రిజర్వేషన్ మూడు సీట్లు మాలలకు ఇచ్చారు. పవన్ కల్యాన్‌ను నీ శాఖను నేను తీసుకుంటానని మరొక మంత్రి అంటే ఎలా వుంటుంది. ఎన్నికల సమయంలోనే పవన్ పట్ల మేము మా అసంతృప్తిని వ్యక్తం చేశాం. పవన్ వ్యాఖ్యలు ప్రభుత్వానికి నష్టం. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అంటే సీఎం చంద్రబాబుని అన్నట్లు కాదా? అంటూ ధ్వజమెత్తారు మంద కృష్ణ మాదిగ.
ఇవీ చదవండి: నేను హోం మంత్రినైతే పరిస్థితి మరోలా ఉంటుంది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఇది కదా జగన్ మార్క్ అంటే.. ప్రభుత్వ స్కూళ్లను చూసి పవన్ ఆశ్చర్యం!