ఎగ్జిట్‌పోల్స్‌పై రాహుల్‌గాంధీ సంచలన కామెంట్స్‌ | Rahul gandhi Responded On Exit Polls | Sakshi

ఎగ్జిట్‌పోల్స్‌పై రాహుల్‌గాంధీ సంచలన కామెంట్స్‌

Published Sun, Jun 2 2024 5:40 PM | Last Updated on Sun, Jun 2 2024 5:53 PM

Rahul gandhi Responded On Exit Polls

న్యూఢిల్లీ: ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. అవి ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు కాదని మోదీ మీడియా పోల్స్‌ అని రాహుల్ మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలనేదానిపై చర్చించడానికి ఇండియా కూటమి నేతలు  సమావేశమయ్యారు. 

ఈ భేటీ అనంతరం రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి 295 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌ కేంద్రంలో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చాయి. ఇండియా కూటమి ప్రతిపక్ష హోదాతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని చెప్పాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement