
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అసలు దోషి ఎవరు? అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అసలు దోషి ఎవరు? అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ అవసరాల కోసం దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారన్నారు. 2018 నుంచి జరిగిన ఫిరాయింపులపై విచారణ జరగాలని, త్వరలో ఈ అంశంపై తాము సీబీఐకి ఫిర్యాదు చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు.
‘‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రెండు కోణాల్లో చూడాలి. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలను బాధితులుగా చూపిస్తున్నారు. మరి ఇందులో దోషి ఎవరు?. నేరం జరిగింది.. కానీ విచారణ తామే చేస్తాం అనడం ద్వారా టీఆర్ఎస్ లోపం బయటపడింది. నేరమే జరగలేదని అంటూనే సీబీఐ విచారణ అడగడం ద్వారా బీజేపీ లోపం బయటపడుతుంది. సీబీఐ విచారణ అనగానే బీజేపీ, సిట్ విచారణ అనగానే టీఆర్ఎస్ ఎందుకు సంకలు గుద్దుకుంటున్నాయని టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు.
చదవండి: ఎరలు.. దాడులు.. ‘విచారణ’ల రాజకీయం!