నేను పిలిస్తే.. ఆయన పారిపోయారు : ఆధిత్య ఠాక్రేపై దేవ్‌రా సెటైర్లు | 'Why Is He Running Away?', Shiv Sena Candidate Milind Deora Comments On Aaditya Thackeray | Sakshi

నేను పిలిస్తే.. ఆయన పారిపోయారు : ఆధిత్య ఠాక్రేపై దేవ్‌రా సెటైర్లు

Published Sun, Nov 17 2024 12:21 PM | Last Updated on Sun, Nov 17 2024 2:59 PM

Why Is He Running Away, Milind Deora Comments On Aaditya Thackeray

ముంబై: నేను పిలిస్తే ఆయన ఎందుకు పారిపోతున్నారో నాకు అర్ధం కావడం లేదంటూ శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రేపై ఎంపీ మిలింద్‌ దేవ్‌రా సెటైర్లు వేశారు.

వచ్చే వారంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయా పార్టీల అభ్యర్థులు వారి ప్రత్యర్థుల్ని టార్గెట్‌ చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా సవాళ్లు ,విమర్శలు, ప్రతి విమర్శలతో కాకరేపుతున్నారు.

ఈ తరుణంలో శివసేన (యూబీటీ) వర్లీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిత్య ఠాక్రేపై పోటీ చేస్తున్న సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన వర్లీ అభ్యర్థి మిలింద్‌ దేవ్‌రా సెటైర్లు వేశారు.  

ఎన్నికల ప్రచారంలో భాగంగా మిలింద్‌ దేవ్‌రా.. కొన్ని రోజుల క్రితం, వర్లీ భవిష్యత్తు, ముంబై భవిష్యత్తు, మహారాష్ట్ర భవిష్యత్తుపై చర్చకు రావాలని ఆదిత్య ఠాక్రేని ఆహ్వానించాను. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆధిత్య ఠాక్రే ప్రజాస్వామ్యాన్ని నమ్ముతానని, దానిని బలోపేతం చేస్తున్నానని ప్రచారం చేశారు. ఇప్పుడే అదే విషయంపై చర్చకు రమ్మనమని పిలిచా. కానీ, తాను ప్రజాస్వామ్యానికి అనుకూలమని ఆదిత్య ఠాక్రే పారిపోతున్నారు. అలా ఎందుకు పారిపోతున్నారో? అని విమర్శలు గుప్పించారు.  

ఓట్లకు శివసేన (యూబీటీ) డబ్బు పంచుతోందని దేవ్‌రా ఆరోపించారు.  నిన్న, అతని ఆదిత్య ఠాక్రే పార్టీ డబ్బు పంపిణీ చేస్తుందని, ఇందుకోసం పెద్ద మొత్తంలో సీసీటీవీ పుటేజీలను అమర్చిందన్నారు. ఇదే విషయం ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ​ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే నాయకుడు ఆధిత్య ఠాక్రే’ అని దేవరా విమర్శలు గుప్పించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement