
సాక్షి,అనంతపురం:ఇచ్చిన అన్ని హామీలను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ అమలు చేశారని,నవరత్నాలను నిక్కచ్చిగా అమలు చేసిన ఘనత ఆయనదేనని అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంతవెంకట్రారామిరెడ్డి అన్నారు. బుధవారం(జనవరి29) ఆయన మీడియాతో మాట్లాడారు.
‘సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు చేతులెత్తేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంత మోసం చేస్తారా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబుకు అవగాహన లేదా? సూపర్‌సిక్స్ హామీలకు చంద్రబాబు,పవన్ కళ్యాణ్ నైతిక బాధ్యత వహించాలి.
సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోతే ఉద్యమం తప్పదు. ప్రజలు అధైర్య పడొద్దు. వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన పోరాడుతుంది’అని అనంతవెంకట్‌రామిరెడ్డి తెలిపారు.
గుమ్మనూరు జయరాం ఆగడాలు పెరిగిపోయాయి
‘మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం. వార్తలు రాసే జర్నలిస్టు లను రైలు పట్టాలపై పడుకోబెతారా? ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆగడాలు మితిమీరి పోతున్నాయి.
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై గుంతకల్లు పోలీసులు దాడి చేశారు. రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది.బాధితులపైనే హత్యాయత్నం కేసు కేసులు నమోదు చేస్తున్నారు.టీడీపీ ప్రజాప్రతినిధుల చెప్పు చేతుల్లో పోలీసులు పనిచేస్తున్నారు’అని అనంతవెంకట్రామిరెడ్డి ఫైరయ్యారు.
