
బైక్‌ను ఢీకొట్టిన కారు
మహిళ మృతి, ముగ్గురికి గాయాలు
హత్నూర(సంగారెడ్డి): బైక్‌ను కారు బలంగా ఢీకొట్టడంతో మహిళ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన హత్నూర మండలం దేవులపల్లి గ్రామ శివారులో దౌల్తాబాద్ హత్నూర రోడ్డుపై ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుభాష్ కథనం మేరకు.. మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలం అజమర్రి గ్రామానికి చెందిన అమృత, కుమారుడు కృపాకర్, కోడలు అనూష, రెండేళ్ల మనవరాలుతో కలిసి కుమారుడి బైక్‌పై దౌల్తాబాద్ వైపు వెళ్తున్నారు. దేవులపల్లి శివారులోకి చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అమృత(45) అక్కడికక్కడే మృతి చెందగా కుమారుడు కృపాకర్, కోడలు అనూష, రెండేళ్ల మనవరాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.