
వాహనాలన్నీ ఓరుగల్లు వైపే
ప్రధాన చౌరస్తాగా మారిన రంగధాంపల్లి..
సిద్దిపేటజోన్/ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణలు భారీగా తరలివెళ్లారు. నిజామాబాద్, రాజన్న సిరిసిల్లా, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సిద్దిపేట, మెడ్చల్ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చే వాహనాలన్నీ రంగధాంపల్లి చౌరస్తా నుంచి ఓరుగుల్లు వైపు పయణమయ్యాయి. వేలల్లో వాహనాల రాకతో సిద్దిపేట పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా, రంగధాంపల్లి చౌరస్తాల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు, అంబులెన్స్‌లు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పార్టీ జెండాల ఆవిష్కరణ
జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిలు పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు. పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న సర్కిళ్లను గులాబి తోరణాలతో అలంకరించారు. రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే హరీఽశ్‌రావు నివాళులు అర్పించి ఎల్కతుర్తికి భారీ వాహనాలతో తరళివెళ్లారు.
క్యాంపు కార్యాలయంలో సందడి
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సందడి నెలకొంది. సభ స్థలికి వెళ్లే మార్గం సిద్దిపేట గుండా కావడంతో సమీపంలోని వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు. మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు మార్గమధ్యంలో హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక్కడే అల్పాహారం చేశారు.

వాహనాలన్నీ ఓరుగల్లు వైపే

వాహనాలన్నీ ఓరుగల్లు వైపే