Siddipet District News
-
గ్యాస్ ధరలు తగ్గించాల్సిందే
గజ్వేల్: గ్యాస్ ధరలు తగ్గించేవరకు పోరాటం కొనసాగిస్తామని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి హెచ్చరించారు. గురువారం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇష్టానుసారంగా గ్యాస్ ధరలను పెంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ సామాన్యుల నడ్డి విర్తుస్తోందని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఒక్కో సిలిండర్‌పై రూ.50 ధరను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్‌రెడ్డి, నియోజకవర్గ శాఖ అధ్యక్షులు అజహర్, పట్టణ అధ్యక్షులు నాగరాజు, మండల నాయకుడు అభిలాష్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు సమీర్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి గజ్వేల్‌లో ర్యాలీ, ప్రధాని దిష్టిబొమ్మ దహనం -
మల్లన్నను దర్శించుకున్న ప్రముఖులు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామిని మత్స్యశాఖ ఫెడరేషన్ చైర్మన్ మెట్టుసాయి, ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ముదిరాజు రాష్ట్ర నాయకులు గీస భిక్షపతి, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు. పోషకాహారంతోనే ఆరోగ్యం చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యార్థులు పోషక విలువలు ఉన్న ఆహార పదర్థాలను తినాలని.. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని సీడీపీఓ శారద అన్నారు. గురువారం ఇబ్రహీంనగర్ ఆదర్శ పాఠశాలలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషకాహార లోపం వల్లే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థులు మంచి పోషక విలువలు ఉన్న చిరుధాన్యాలను తీసుకోవాలన్నారు. రక్త హీనతకు గురి కాకుండా పల్లి పట్టీలు, బెల్లంతో తయారు చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. వ్యక్తిగత పరీశుభ్రత, ఆరోగ్య సమస్యలపై వివరించారు. విద్యార్థినులకు రక్త పరీక్షలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సతీష్, ఐసీడీఎస్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తొద్దు
● దొడ్డు, సన్నాలు వేర్వేరుగా లోడ్ చేయాలి ● కలెక్టర్ మనుచౌదరి మద్దూరు(హుస్నాబాద్): కేంద్రాలకు తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేయాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను, నిర్వాహకులను ఆదేశించారు. గురువారం మద్దూరు మండలం నర్సాయిపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసే అవకాశం ఉందని టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు అధిక ప్రాధాన్యతనిస్తూ బోనస్ కూడా ప్రకటించిందన్నారు. అందువల్ల వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని మద్దతు ధరతో పాటు, బోనస్ సైతం పొందాలని రైతులకు తెలిపారు. సెంటర్ చుట్టుపక్కల హార్వెస్టింగ్ అవుతున్న వరిధాన్య వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సన్న, దొడ్డు రకం వరి ధాన్యాన్ని లోడ్ చేసేటప్పుడు వేరువేరుగా చేయాలని సూచించారు. మిల్లర్ల వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. తూకం లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని ఆదేశించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల ప్రాథమిక వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, ఎంపీడీఓ, సిబ్బంది, రైతులు తదితరులు ఉన్నారు. వసతి గృహాల్లో మెనూ తప్పనిసరి ● నాణ్యమైన భోజనం అందించాలి ● అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రభుత్వం ప్రకటించిన మెనూను విఽధిగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ వసతి గృహ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. వసతి గృహంలోని స్టోర్ రూం, వంటగదిని పరిశీలించారు. ఈ సందర్భంగా గరిమా అగర్వాల్ మాట్లాడుతూ మెనూలో ఉన్న మిల్లెట్ బిస్కెట్, నెయ్యి తప్పని సరిగా వినియోగించాలన్నారు. విద్యార్థినుల వ్యాయామానికి జిమ్ ఏర్పాటు చేయాలన్నారు. నల్లా కనెక్షన్, లైబ్రరీలో బుక్స్ కావాలని విద్యార్థులు కోరగా వెంటనే మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమశాఖ అధికారి హమీద్, వసతి గృహ సంక్షేమ అధికారి శ్వేత తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాల.. కాదు పానశాల
సరస్వతీ నిలయమైన పాఠశాల ఏకంగా పానశాలగా మార్చేశారు. రాత్రి అయ్యిందంటే చాలు మోత్కులపల్లిలోని ప్రాథమిక పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారుతోంది. ఉదయం పాఠశాలకు వచ్చే విద్యార్థులు, టీచర్లకు పాఠశాల ప్రాంగణంలో ఎక్కడపడితే అక్కడ పడేసిన బీరు, కల్లు సీసాలు దర్శనమిస్తున్నాయి. కొన్నింటిని అక్కడే ధ్వంసం చేస్తుండటంతో ప్రాంగణంలోకి రావాలంటేనే జంకుతున్నారు. ప్రహరీ లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని గ్రామస్తులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. – అక్కన్నపేట(హుస్నాబాద్) -
అన్నదాత.. గుండె కోత
బాధిత రైతులను ఆదుకోండి ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేటజోన్: పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. గురువారం కలెక్టర్ మనుచౌదరి, వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్న, వరి, మామిడి పంట లను అకాల వర్షం తీవ్రంగా నష్టపరిచిందన్నారు. వ్య వసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ●వడగళ్ల బీభత్సం ●ఆరు నెలల కష్టం వర్షార్పణం ●వేల ఎకరాల్లో పంట నష్టం ఇంటిల్లిపాది రెక్కల కష్టం వర్షార్పణమైంది. పంట చేతికొచ్చే తరుణంలో అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వాన అన్నదాతను నిండా ముంచింది. ముప్పై ఏళ్లలో ఎన్నడూ చూడని రీతిలో నష్టం జరిగిందని రైతులు వాపోయారు. నంగునూరు, చిన్నకోడూరు మండలాల్లోని పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలుల ధాటికి కొన్ని గ్రామాల్లో చెట్లు నేలకూలగా, వడగళ్ల వానకు మామిడి కాయలు సైతం నేలరాలాయి. అలాగే మొక్కజొన్న, మిర్చి, టమాటా, కూరగాయ పంటలు నేలకొరిగాయి. నంగునూరు మండలంలోని 11 గ్రామాల్లో 3,869 ఎకరాలు, చిన్నకోడూరు మండలంలో 2,100 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. శుక్రవారం నుంచి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఏడీఏ పద్మ, ఏఓ గీత తెలిపారు. – నంగునూరు/చిన్నకోడూరు(సిద్దిపేట)30 ఏళ్లలో ఎన్నడూ చూడలే రెండు ఎకరాల్లో వరి పంట కోసి ఐకేపీ సెంటర్‌కు తెచ్చి ఆరబెట్టాను. రాత్రి కురిసిన వడగళ్ల దెబ్బకు వడ్లన్నీ బియ్యంగా మారాయి. ఇంత రాళ్లవాన, నష్టం 30 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు. – చంద్రయ్య, రైతు, పాలమాకుల -
అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యం కావాలి
చేర్యాల(సిద్దిపేట): అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పద్మశ్రీ , ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం మండల పరిధిలోని శభాష్‌గూడెంలో అంబేడ్కర్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంద కృష్ణ మాట్లాడుతూ కుల వ్యవస్థ కారణంగానే దేశంలో ఆర్థిక అసమానతలు ఏర్పడ్డాయన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశానికి ఉన్నత వర్గాల వారే ప్రధానులు అయ్యారని, ప్రస్తుతం మోదీ మాత్రమే బలహీన వర్గాల కుటుంబం నుంచి వచ్చారన్నారు. రాజ్యంగంలో కల్పించిన హక్కులతోనే నేడు దళితులు రాజకీయంగా ఎదుగుతున్నారన్నారు. దళితుల ఉన్నతి కి పాటు పడిన మహనీయుల్లో జ్యోతిరావుపూలే, సావిత్రీబాయి పూలే, అంబేడ్కర్ ఉన్నారన్నారు. మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి జగదేవ్‌పూర్(గజ్వేల్): మహానీయుల అడుగు జాడల్లో నేటి యువత నడువాలని మందకృష్ణ మాదిగ కోరారు. కుకునూర్‌పల్లి మండలం చిన్నకిష్టాపూర్‌లో జైభీమ్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయం లేన్నందున మీ గ్రామానికి మరోసారి వస్తానని, ఇక్కడే నిద్ర చేసి అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాములు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. మంద కృష్ణమాదిగ శభాష్ గూడెంలో విగ్రహావిష్కరణ -
అసంపూర్తి పనులు పూర్తి చేయిస్తాం
దుబ్బాక: ‘చెల్లింపులు అధికం.. సమస్యలు అనేకం.. అసంపూర్తిగా డబుల్ బెడ్రూంల నిర్మాణాలు’పేరిట ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈమేరకు బుధవారం జిల్లా హౌసింగ్ పీడీ దామోదర్‌రావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఇతర అధికారులతో కలిసి పట్టణంలోని డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా పలు బ్లాక్‌లలో డబుల్ బెడ్రూంలు అసంపూర్తిగా ఉండటంపై సంబంధిత కాంట్రాక్టర్‌తో పీడీ ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయిస్తామని, అలాగే అలాట్మెంట్ చేయకున్నా డబుల్ బెడ్రూంలలో ఉంటున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా అధికారులు వచ్చిన విషయం తెలుసుకొని ‘సాక్షి’ప్రతినిధి అక్కడికి వెళ్లగా అప్పటికే అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మా బ్లాక్‌లలోకి రాలేరని రోడ్డు వైపు మంచిగా ఉన్న వాటినే అధికారులు చూసి పోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణాలు పూర్తి కాకుండానే అడ్వాన్స్‌గా కాంట్రాక్టర్‌కు అధిక పేమెంట్ చేయడంపై సంబంధిత అధికారులు పారదర్శకంగా విచారణ చేపట్టాలని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ విషయం జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే త్వరలో కలెక్టర్‌ను కలిసి విన్నవిస్తామన్నారు.జిల్లా హౌసింగ్ పీడీ దామోదర్‌రావు -
బాబోయ్ బర్డ్ ఫ్లూ
ప్రజలకు వైద్య పరీక్షలు బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయిన పౌల్ట్రీ ఫాం పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యాధికారులు వైద్య పరీక్షలు చేస్తున్నారు. కోళ్ల నుంచి వ్యాధి ప్రజలకు సోకే అవకాశం ఉండటం వల్ల ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాల్ట్రీ ఫాం పరిసరాలకు ఎవరూ వెళ్లకుండా అక్కడ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేశారు.సామూహికంగా కోళ్ల పూడ్చివేత కాన్గల్ గ్రామ శివారులోని పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అవ్వడంతో ఆ పౌల్ట్రీ ఫాంలోని 1.45లక్షల కోళ్లను అధికారులు చంపి పూడ్చిపెడుతున్నారు. బుధవారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించారు. వారం రోజుల పాటు కొనసాగనుంది. బర్డ్‌ఫ్లూ సోకిన పౌల్ట్రీఫాంకు కిలోమీటర్ దూరంలో చికెన్, కోడిగుడ్ల విక్రయాలను నిషేధించారు. దీంతో పాటు వ్యాధి సోకిన ఫామ్‌కు కిలోమీటర్ సమీపంలోని పౌల్ట్రీ ఫాంలపై దృష్టి సారించారు.ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బర్డ్‌ఫ్లూ.. ఈ పేరు వింటేనే జిల్లా ప్రజలు జంకుతున్నారు. తొగుట మండల పరిధిలోని కాన్గల్ గ్రామంలోని లేయర్ ఫౌల్ట్రీలో మరణించిన కోళ్ల శాంపిల్‌ను ఈ నెల 4న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు పరీక్షల నిమిత్తం పంపించగా, 7న బర్డ్‌ఫ్లూ ఉందని రిపోర్టు వచ్చింది. దీంతో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు కాన్గల్ పౌల్ట్రీఫాంలో బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు ప్రకటించారు. బుధవారం నుంచి పౌల్ట్రీ ఫాంలో కోళ్లను సామూహికంగా చంపేసి పూడ్చిపెడుతున్నారు. జిల్లాలో 235 వరకు పౌల్ట్రీ ఫాంలు ఉండగా 92లక్షల వరకు కోళ్లు ఉన్నాయి. అయితే కొద్ది రోజులుగా బర్డ్ ఫ్లూ భయం జిల్లా వాసులను, పౌల్ట్రీ నిర్వాహకులను వణికిస్తోంది. కోళ్లు మృత్యువాత పడితే నిర్వాహకులు వెంటనే తమను సంప్రదించాలని పశుసంవర్ధకశాఖ అధికారులు కోరుతున్నారు. బర్డ్ ఫ్లూ కలకలంతో చికెన్, కోడిగుడ్ల విక్రయాలు, వినియోగం ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో చికెన్ సెంటర్లు బోసిపోయి కనిపిస్తున్నాయి.● కలకలం సృష్టిస్తున్న వైరస్ ● కాన్గల్‌లో నిర్ధారించిన పశుసంవర్ధకశాఖ ● బెంబేలెత్తుతున్న పౌల్ట్రీ నిర్వాహకులుటోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు జిల్లాలో బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ 85004 04016ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ సంబంధిత ఆనవాళ్లు ఉంటే ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు తెలిపారు. సందేహం ఉన్న పౌల్ట్రీ ఫామ్‌లో కోళ్ల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపించడంతో పాటు, సలహాలు, సందేహాలను నివృత్తి చేయనున్నారు. బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయింది జిల్లాలో కాన్గల్ గ్రామ శివారులోని ఓ పౌల్ట్రీ ఫాంలో బర్డ్‌ఫ్లూ నిర్థారణ అయింది. ఆ ఫాంలోని కోళ్లను చంపి పూడ్చే ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. జిల్లాలోని ఇతర పౌల్ట్రీ ఫాంలలో కోళ్లు మృత్యువాత పడితే నిర్వాహకులు వెంటనే తమను సంప్రదించాలి. వైరస్ సోకకుండా పౌల్ట్రీ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. –అశోక్‌కుమార్, జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ -
రథోత్సవం.. భక్తి పారవశ్యం
కొండపాక(గజ్వెల్): మండలంలోని కుకునూరుపల్లిలో వెలసిన సీతారామ చంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం గరుడ సేవా రథోత్సం కనుల పండువగా సాగింది. ఆలయ కమిటీ చైర్మన్ పొల్కంపల్లి నరేందర్ సేన ఆధ్వర్యంలో సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఘనంగా ఊరేగించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆలయ కమిటీ చైర్మన్ నరేందర్ మాట్లాడుతూ సంకల్ప బలంతోనే రఽథోత్సవం విజయవంతంగా ముగిసిందన్నారు. మాజీ సర్పంచ్ ఐలం సహకారంతో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు అమరేందర్, ఉప్పల రాజు, కొంతం రాజు, కనకయ్య, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.కనుల పండువగా గరుడ సేవా రథోత్సవం -
సుస్థిరాభివృద్ధిలో మన పల్లెలు
ప్రగతి ఆధారంగా పంచాయతీరాజ్ మార్కులుసాక్షి, సిద్దిపేట: పేదరిక నిర్మూలన, జీవనోపాధి పెంపు, ఆరోగ్యం, చిన్నారులకు అనుకూలమైన సౌకర్యాల కల్పన వంటి తొమ్మిది అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచి మెతుకుసీమలోని 24 పల్లెలు పురోగతిలో ఫ్రంట్‌రన్నర్‌గా నిలిచాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 2022–23 నాటికి దేశంలోని గ్రామ పంచాయతీలు సాధించిన పురోగతి ఆధారంగా మార్కుల జాబితాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఇటీవల ప్రకటించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు గణనీయమైన మార్కులు సాధించాయి. తొమ్మిది అంశాల ఆధారంగా... కేంద్రప్రభుత్వం పంచాయతీ ముందస్తు సూచి(అడ్వాన్స్మెంట్ ఇండెక్స్) పేరుతో ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని 1,615 గ్రామ పంచాయతీలు దరఖాస్తు చేశాయి. పేదరిక నిర్మూలన, పంచాయతీలలో జీవనోపాధి పెంపు, ఆరోగ్యం, చిన్నారులకు అనుకూలమైన సౌకర్యాల కల్పన, తాగునీరు, పారిశుద్ధ్యం, పచ్చదనం, మౌలిక వసతుల కల్పన, సామాజిక భద్రత, సుపరిపాలన, మహిళల స్వావలంబనకు అనుకూలమైన విధానాలు అనే అంశాల ఆధారంగా గ్రామ పంచాయతీలకు దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం మార్కులను కేటాయించింది. ఇందులో 24 పంచాయతీలు ఫ్రంట్‌రన్నర్‌గా నిలవడం విశేషం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ పంచాయతీకీ అచీవర్స్ హోదా దక్కలేదు. ప్రస్తుతం గౌరవెల్లి ప్రాజెక్ట్‌లో ముంపునకు గురైన గ్రామం గుడాటిపల్లి 39.39 మార్కులతో ‘ఈ’గ్రేడ్‌లో నిలిచింది. అలాగే బీ గ్రేడ్‌లో నిలిచిన పటేల్‌గూడ, సుల్తానాపూర్ గ్రామాలు అమీన్పూర్ మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి.ఫ్రంట్ రన్నర్స్‌గా నిలిచిన గ్రామ పంచాయతీలు ఇవేగ్రేడ్ మార్కులు పంచాయతీలు ఏ(అచీవర్స్) 90 నుంచి 100 0 బీ(ఫ్రంట్ రన్నర్స్) 75 – 89 24 సీ(పెర్ఫార్మర్) 60 – 74 1,419 డీ(యాస్పిరెంట్) 40 – 59 171 ఈ(బిగినర్) 39 01 ఉమ్మడిజిల్లాలో బీ గ్రేడ్‌లో 24, సీ గ్రేడ్‌లో 1,419, డీ గ్రేడ్‌లో 171 జీపీలు ఏ పంచాయతీకి దక్కని అచీవర్స్ హోదామెదక్ జిల్లా నార్సింగి మండలంలోని వల్లూరు గ్రామం తొమ్మిది అంశాలలో ఆదర్శంగా నిలిచింది. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణతోపాటు వైకుంఠథామం, డంపింగ్‌యార్డు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, తాగునీటి సరఫరాను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. దీంతో 77.90మార్కులు సాధించింది. దీంతో గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.– సిద్దిపేట జిల్లాలో... మిట్టపల్లి(77.59), చెక్కల్(77.24), అంగడి కిష్టాపూర్(77.5), బుస్సాపూర్(77.05), కట్కూర్(76.58) గురువన్నపేట(75.94), మల్లంపల్లి(75.9), రాఘవాపూర్(75.55), బైరాన్‌పల్లి(75.38), పొన్నాల(75.36), కురేళ్ల(75.24) – మెదక్‌లో... వల్లూర్(77.9), నారాయణపూర్(77.67), మనోహరాబాద్(75.2)– సంగారెడ్డిలో పటేల్గుడా(79.67 మార్కులు), సూల్తానాపూర్(78.87), మైకోడ్(78.63), మల్చల్స్(78.3), చిటుకుల్(77.48), ఎద్దుమల్లారం(77.3),కొత్తాపూర్ (75.89), ఇలాపూర్(75.77), జనకంపేట్(75.18)ఏ గ్రేడ్‌లో నిలిచేందుకు కృషి సిద్దిపేట అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామ పంచాయతీలలో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. గ్రామాల్లో నర్సరీల నిర్వహణ, పచ్చదనం పెంపు ఇలా విభాగాల సమన్వయంతో ముందుకు సాగి ఉన్న గ్యాప్‌లను పూర్తి చేసి త్వరలో ఏ గ్రేడ్‌లో నిలిచేందుకు కృషి చేస్తాం. – దేవకీ దేవి, డీపీఓ, సిద్దిపేటసిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామం అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామంలో 939 గృహాలుండగా 3,184 జనాభా ఉన్నారు. 2009–10లో నిర్మల్ పురస్కారం, 2021లో పారిశుద్ధ్య నిర్వహణలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జాతీయ అవార్డు వచ్చింది. గ్రామ పంచాయతీ భవనంపై సోలార్‌ను ఏర్పాటు చేసి సౌరవిద్యుత్‌ను వినియోగిస్తున్నారు. మిట్టపల్లి గ్రామం 77.59 మార్కులు సాధించడంతో పంచాయతీ కార్యదర్శి విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక: ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు మున్సిపాలిటీలోని చేర్వాపూర్, చెల్లాపూర్ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్లు కై లాసం, నరేష్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వనిత భూంరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లారెడ్డి, ఏఓ ప్రవీణ్‌కుమార్ తదితరులు ఉన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కృషిడీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి గజ్వేల్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో ‘జై బాపు జై భీమ్, జై సంవిధాన్’కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలు దక్కాలనే సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సంవిధాన్ పాదయాత్ర సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, నాయకులు సమీర్, మొనగారి రాజు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు: సీపీ అనురాధ సిద్దిపేటకమాన్: ఆన్లైన్ బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట సీపీ అనురాధ హెచ్చరించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఎవరైనా క్రికెట్, ఇతర బెట్టింగ్‌లకు పాల్పడితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. యువత బెట్టింగ్ యాప్‌ల మోజులో పడి బంగారు భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు. అప్పుల చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని చెప్పారు. బెట్టింగ్ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బెట్టింగ్‌పై సమాచారం తెలిస్తే డయల్ 100 లేదా పోలీసు కంట్రోల్ రూం నంబర్ 8712667100కు సమాచారం అందించాలని సూచించారు. వాటర్ షెడ్ పథకం వినియోగించుకోవాలి డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య చిన్నకోడూరు(సిద్దిపేట): వాటర్ షెడ్ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య సూచించారు. బుధవారం మండల పరిధిలోని చౌడారం గ్రామంలో పర్యటించి వాటర్ షెడ్ పథకం గురించి ప్రజలకు వివరించారు. ఈ పథకంపై 16న గ్రామంలో అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పనుల పరిశీలన, కొత్త పనులు ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. చౌడారంతోపాటు సమీప గ్రామాల ప్రజలు రావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జనార్దన్, ఎంపీఓ సోమిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
నాణ్యమైన ఆహారం అందించాలి
దుబ్బాక: విద్యార్థులకు రుచికరమైన నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. బుధవారం దుబ్బాక మండలం హబ్షీపూర్లోని జ్యోతి బాపులే తెలంగాణ బీసీ బాలుర గురుకులాన్ని సందర్శించారు. వంట గదిలో అన్నం, కూరలను పరిశీలించి రుచి చూశారు. తాజా కూరగాయలను వాడాలని, వంటగది పరిసర ప్రాంతాలు ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, కొత్త డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని కోరారు. అనంతరం 8వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు. సదుపాయాలు బాగున్నాయా అని అడిగారు. స్టడీ అవర్స్‌లో గణితం సమస్యలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలని సూచించారు. ప్రిన్సిపాల్ భూపాల్‌రెడ్డి గురుకులంలో 391 మంది విద్యార్థులు ఉంటున్నారని ఇందుకు సంబంధించి పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభుదాసు, తహసీల్దార్ సంజీవ్‌కుమార్, ఎంపీడీవో భాస్కరశర్మ తదితరులు ఉన్నారు.కలెక్టర్ మను చౌదరి -
కూలీలకు వసతులు కల్పించాలి: డీపీఓ దేవకీదేవి
నంగునూరు(సిద్దిపేట): ఉపాధిహామీ పనులు నిర్వహించే స్థలంలో కూలీలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని డీపీఓ, మండల స్పెషలాఫీసర్ దేవకీదేవి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నంగునూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఈజీఎస్ సిబ్బందికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి రోజు 150 మందకి మించకుండా కూలీలను ఏర్పాటు చేసుకొని పనులు చేయించాలన్నారు. పనులు చేయించే స్థలంలో వర్క్‌షెడ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫాస్టెయిడ్ బాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎండీపీఓ లక్ష్మణప్ప, టీఏ, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు. -
మొదటి వెయ్యి రోజులే ముఖ్యం
చేర్యాల(సిద్దిపేట): గర్భిణిలకు మొదటి వెయ్యి రోజులు ఎంతో ముఖ్యమని సీడీపీఓ రమాదేవి అన్నారు. పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు పట్టణ పరిధిలోని అంగన్వాడీ కేంద్రం–6లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సీ్త్ర తాను గర్భిణీ అని తెలిసినప్పటి నుంచి పుట్టిన బిడ్డ రెండేళ్ల వయస్సు వచ్చే సమయాన్ని మొదటి 1000 రోజులు అంటారన్నారు. ఈ సమయంలో గర్భిణిలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై వివరించారు. బిడ్డ పుట్టిన వెంటనే గంటలోపు బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఒక పూట పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పోషణ అభియాన్ బ్లాక్ కో–ఆర్డినేటర్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు. సీడీపీఓ రమాదేవి పోషణ పక్వాడ అవగాహన సదస్సు -
మహారాష్ట్ర, కర్ణాటకల్లో వైన్ టూరిజం..
ప్రస్తుతం మన రాష్ట్ర అవసరాలకు మహారాష్ట్ర నుంచి ద్రాక్షను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేకాకుండా అక్కడి ప్రభుత్వం రైతులకు విరివిగా సబ్సిడీలను అందిస్తుండటంతో సాగు క్రమంగా పెరుగుతోంది. మరో ముఖ్యమైన అంశమేమిటంటే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ‘వైన్ టూరిజం’ ట్రెండ్ కొనసాగుతోంది. ద్రాక్ష తోటలు సాగుచేస్తున్న రైతులు.. తమ తోటలను ‘ఎకో టూరిజం’ ప్రాంతాలుగా అభివృద్ధి చేసుకుంటున్నారు. తోటల్లో ఎక్కువగా వైన్ వైరెటీగా చెప్పుకునే రేసిన్ రకం ద్రాక్షను సాగు చేస్తున్నారు. అంతేకాకుండా తోటల్లోనే వైన్ ఉత్పత్తి యూనిట్లను సైతం ఏర్పాటుచేసి.. తమ తోటల్లో వచ్చే పర్యాటకులకు తక్కువ ధరకు వైన్ అందిస్తున్నారు. ప్రస్తుతం లిక్కర్‌కు వైన్‌ను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. లిక్కర్లో అల్కాహాల్ శాతం 46శాతం వరకు ఉంటే వైన్‌లో కేవలం 8–10శాతం అల్కాహాల్ ఉండటం వల్ల ప్రత్యేకించి యువతతోపాటు అన్ని వయసుల వారు వైన్ సేవించడానికి మక్కువ చూపుతున్నారు. తమ కళ్లముంగిటే సహజమైన పద్ధతుల్లో వైన్ దొరుకుతుండటంతో దీనిని ఇష్టంగా సేవిస్తున్నారు. -
పేదల నడ్డివిరుస్తున్న మోదీ సర్కార్
సిద్దిపేటఅర్బన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి పేదల నడ్డివిరుస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ మండిపడ్డారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిద్దిపేటలోని గాంధీ చౌరస్తా వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మంద పవన్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి, సామాన్య ప్రజలపై భారం మోపుతూ వంట గ్యాస్ ధరలను పెంచడం దారుణమన్నారు. వంట గ్యాస్‌పై ఏకంగా రూ.50 పెంచడం, పెట్రోల్, డీజిల్‌పై రూ.2 పెంచి ఆయిల్ కంపెనీలు భరించాలని ప్రకటించడం దుర్మార్గమని అన్నారు. పేదల జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా ప్రదాని మోదీ పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్, శంకర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు బన్సీలాల్, మల్లేశం, జనార్ధన్, చంద్రం, నరేష్, నాయకులు సంపత్, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. పెంచిన గ్యాస్ ధరను తగ్గించాల్సిందే సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం -
ఇళ్ల పనులు వేగిరం చేయండి
బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని తక్షణం అరికట్టాలికొమురవెల్లి(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులకు సూచించారు. మంగళవారం మండలంలోని కేజీబీవీ పాఠశాలతో పాటు పోసాన్పల్లిలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాల్లో ఇబ్బందులు ఎదురైతే సంబంధిత అధికారులను సంప్రదించాలని లబ్ధిదారులకు సూచించారు. అదే విధంగా ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన ఇసుకను వెంటనే అందించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. పనులు వేగవంతమైతే బిల్లులు వెంటనే చెల్లిస్తామని లబ్ధిదారుకుల భరోసా ఇచ్చారు. అంతకు ముందు కేజీబీవీ పాఠశాల విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆడపిల్లలు అన్నిరంగాల్లో ముందు ఉండాలని అన్నారు. అనంతరం పోసాన్పల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడంతో పాటు రైతులకు ధాన్యం విక్రయించే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దివ్య, ఎంపీడీఓ శ్రీనివాస వర్మ, హౌసింగ్ పీడీ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.సిద్దిపేటరూరల్: తొగుట మండలం కాన్గల్ గ్రామంలో బర్డ్‌ఫ్లూతో 15వేల కోళ్లు మృత్యువాత పడటంపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం కలెక్టరేట్లో పశుసంవర్ధక శాఖ అధికారులతో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అత్యవసర సమావేశమయ్యారు. బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయిన క్రమంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా, మనుషులకు సోకకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వైరస్ సోకిన కోళ్లను శాసీ్త్రయ పద్ధతిలో భూమిలో పూడ్చి వేయాలన్నారు. ఫారంలో పనిచేసే సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని, కిలోమీటరు లోపు కోడిగుడ్లు అమ్మకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ అశోక్‌కుమార్, డీఎంహెచ్ఓ పల్వాన్‌కుమార్, సీఐ మల్లేశ్‌గౌడ్, డీపీఆర్ఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ కోళ్ల మృత్యువాతపై అదనపు కలెక్టర్ అత్యవసర సమావేశం అధికారులకు దిశా నిర్దేశం -
ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలి
న్యాయమూర్తి స్వాతిరెడ్డి సిద్దిపేటకమాన్: ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. జిల్లా జైలును న్యాయమూర్తి మంగళవారం సందర్శించి, న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. జైలులోని వంట గది, స్టోర్‌ను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ఖైదీలకు అడ్వకేట్స్ ఉండాలని తెలిపారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ వారానికి మూడు సార్లు జైలును సందర్శిస్తారని, అడ్వకేట్స్ లేని వారికి లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ వికాస్, జైలు, న్యాయసేవ సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం: డీపీఓ దేవకీదేవి అక్కన్నపేట(హుస్నాబాద్): మహిళలు బాగుంటేనే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) దేవకీదేవి అన్నారు. అక్కన్నపేట మండలం కట్కూర్లో మంగళవారం రుతు ప్రేమపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యకర సమాజం దిశగా సాగాలన్నారు. రుతుస్రావం సమయంలో మహిళలు వినియోగించే శానిటరీ ప్యాడ్స్ డంపింగ్ యార్డుల్లో గుట్టలుగా పేరుకుపోతున్నాయని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ భానోతు జయరాం, ఎంపీఓ మోహన్ నాయక్, పంచాయతీ కార్యదర్శి స్వరూప, మహిళలు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి గజ్వేల్: పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకుడు గుంటుకు శ్రీనివాస్ ఇంట్లో సన్నబియ్యం–సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం చరిత్రాత్మకమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదల పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేక.. ప్రతిపక్షాలు తప్పుడు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మొనగారి రాజు, సుఖేందర్‌రెడ్డి, గుంటుకు ఆంజనేయులు, మల్లేశం, మహేశ్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ గజ్వేల్: నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని ఏడీఏ బాబునాయక్ హెచ్చరించారు. మంగళవారం గజ్వేల్‌లోని రైతువేదికలో విత్తన డీలర్ల సమావేశం నిర్వహించారు. ఏడీఏ మాట్లాడుతూ లైసెన్సులు కలిగిన డీలర్లు మాత్రమే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయించాలన్నారు. అధిక ధరలకు విక్రయించినా, నకిలీ విత్తనాలను అమ్మినా సహించేదిలేదన్నారు. ప్రతి డీలర్ తప్పనిసరిగా స్టాక్ రిజిస్టర్ నిర్వహించాలన్నారు. సమావేశంలో వ్యవసాయాధికారి నాగరాజు, ఏఈవోలు, డీలర్లు పాల్గొన్నారు. -
సాగు పెంపునకు ఏం చేద్దాం?
గజ్వేల్: దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోనే ద్రాక్ష సాగుకు బీజం పడింది. 1890లో ఎనాబ్–ఇ–సాహి ద్రాక్ష రకాన్ని హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ బక్వీర్ అనే వ్యక్తి సాగు చేశారు. ఆ తర్వాత కాలం 1960లో దివంగత హార్టికల్చరిస్ట్ శంకర్పిల్లై ఇదే రకాన్ని అభివృద్ధి చేసి నగరంలో సాగు చేశారు. హెక్టారుకు 105 టన్నుల దిగుబడిని సాధించి ప్రపంచ రికార్డు సాధించారు. దీని ద్వారా ద్రాక్ష సాగుకు తెలంగాణ పుట్టినిల్లుగా మారింది. ఇదే క్రమంలో పదిహేనేళ్ల క్రితం వరకు రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలే ఈ తోటల సాగుకు ఆధారంగా ఉండేవి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా కొంత విస్తీర్ణం సాగయ్యేది. ఆయా జిల్లాల్లో మొత్తంగా ఏటా 50వేల ఎకరాలకుపైగా తోటలు సాగులోకి వచ్చేవి. విదేశాలకు ఎగుమతి చేసేందుకు దోహదపడే రకాలను ఇక్కడి రైతులు ప్రధానంగా సాగుచేసేవారు. విదేశాలకే కాకుండా ఇక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కూడా ద్రాక్ష ఎగుమతి అయ్యేది. సాధారణంగా ఎకరా ద్రాక్ష తోట సాగు చేయాలంటే నిపుణులైన కూలీలు, ఎరువులు, ఫంగీసైడ్స్, ఇతర అవసరాలు కలుపుకొని ఎకరాకు రూ.10లక్షల వరకు పెట్టుబడి అవసరముంటుంది. ఇంత భారీ పెట్టుబడి పెట్టినా 2006 వరకు రైతులు లాభాలు బాగానే గడించారు. ఆ తర్వాత కాలంలో తోటలు తెగుళ్ల బారిన పడటం వరుసగా చోటుచేసుకుంది. దీంతో రైతులు భారీగా నష్టాలు చవిచూశారు. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి కూడా వారికి ప్రోత్సాహాం కరువైంది. ఈ దశలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకొని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో రైతులు ద్రాక్ష తోటలను తొలగించి తమ భూములను ప్లాట్లుగా మార్చారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యాన శాఖ, సిద్దిపేట జిల్లా ములుగులోని కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యానవర్సిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ అమలుచేయడానికి నిర్ణయించారు. ఈ క్రమంలోనే ములుగు యూనివర్సిటీ పరిధి రాజేంద్రనగర్‌లోని ద్రాక్ష పరిశోధన కేంద్రంలో ఇటీవల గ్రేప్ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌హెచ్‌యూ మాజీ ఛాన్స్లర్ డాక్టర్ శిఖామణి, ద్రాక్ష సాగులో తనకుంటూ ప్రత్యేకతను చాటుకున్న మేడ్చల్ జిల్లా శామీర్‌పేటకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగుపై తగ్గడానికి గల కారణాలపై సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్‌కు సమీపంలోని ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలోని భూములన్నీ రియల్ వ్యాపారం కారణంగా బడా బాబులు చేతులకు వెళ్లిపోవడం, ద్రాక్ష సాగుకు కూలీలు సమస్యగా మారడం, పెట్టుబడి లక్షల్లో ఉండటం, ఎరువులు, క్రిమిసంహారకాల నిర్వహణ కష్టతరంగా మారడం వంటి కారణాల వల్ల క్రమంగా సాగు పడిపోతోంది. ఈ క్రమంలోనే ఏటా కొత్తగా ద్రాక్ష సాగు పెరిగేలా ఏంచేయాలనే అంశంపైనా కూడా పలు నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు అవగాహన కల్పించి ఈ నేలలకు అనుకూలమైన రకాలను ఎంచుకొని సాగు చేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. -
బందారం కథలలో తెలంగాణ జీవితం
సిద్దిపేటకమాన్: బందారం కథలలో తెలంగాణ జీవితం ఉన్నదని సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన సిద్దారెడ్డి ‘బందారం కథలు’ పుస్తకావిష్కరణ సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కథలు వస్తే పల్లె బతుకుల గుండె ఆవిష్కరణ అవుతుందన్నారు. సిదారెడ్డి పీడిత పక్షపాతి అన్నారు. సాహిత్యంలో మానవీయ సంబంధాలు ఉండాలని అన్నారు. ఈ పుస్తకం ద్వారా సాహిత్య చరిత్రలో బందారం గ్రామం నిలబడుతుందన్నారు. సభలో సిద్దారెడ్డి, మరసం అధ్యక్షుడు రంగాచారి, ప్రముఖ కవులు పొన్నాల బాలయ్య, అంజయ్య, యాదగిరి, పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు. మల్లన్న ఆలయ ఉద్యోగిపై కేసుకొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో ప్లంబర్‌గా విధులు నిర్వహిస్తున్న సార్ల విజయ్‌కుమార్‌పై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజుగౌడ్ తెలిపారు. గత నెల 26న ఆలయంలో ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆరెళ్ల మహేష్, ప్లంబర్ విజయ్‌కుమార్ గొడపడ్డారు. దీంతో సార్ల విజయ్‌కుమార్ అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహేష్‌పై కేసు నమోదు చేశారు. ఈ విషయమై తనకు అన్యాయం జరిగిందంటూ.. ముందుగా విజయ్‌కుమార్ తనపై దాడి చేశారని పోలీసు ఉన్నతాధికారులకు విన్నపించారు. విషయాన్ని విచారించిన పోలీసులు విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు.ఈ విషయం కొమురవెల్లిలో చర్చనీయాంశగా మారింది. -
కొమురవెల్లి నూతన ఈఓగా అన్నపూర్ణ
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయ ఈఓగా అన్నపూర్ణ బాధ్యతలు స్వీకరించారు. అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామాంజనేయులును దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో నగరంలోని చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి దేవాస్థానం అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణకు మల్లన్న ఆలయ ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆమె సోమవారం స్వామివారిని దర్శించుకున్న అనంతరం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్‌రెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. నేడు బందారం కవితల పుస్తకావిష్కరణ సిద్దిపేటకమాన్: తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి రచించిన బందారం కథల పుస్తకావిష్కరణ మంగళవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించనున్నట్లు మంజీర రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రంగాచారి తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ సభకు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి కవులు, సాహితీ వేత్తలు హాజరై విజయవంతం చేయా లని కోరారు. కార్యక్రమంలో యాదగిరి, భగవాన్‌రెడ్డి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు చర్యలు చేర్యాల(సిద్దిపేట): వేసవి కాలం దృష్ట్యా బస్సులో ప్రయాణం చేస్తూ బస్టాండ్‌లో వేచి చూసే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ రఘు అన్నారు. సోమవారం స్థానిక బస్టాండ్‌లో రూ.80వేల ఖర్చుతో ఏర్పాటు చేసిన చల్లని నీటి శుద్ధి యంత్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సిబ్బంది ఉన్నారు. జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి బీసీ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి సిద్దిపేటరూరల్: మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరుతూ బీసీ సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ మనుచౌదరికి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీ మహనీయుల జయంతి ఉత్సవాలు జరిపేందుకు బడ్జెట్లో కనీసం నిధులు కూడా నామమాత్రంగానే కేటాయిస్తున్నారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడమే కానీ ఆచరణలో మాత్రం లేదన్నారు. తమతో కలెక్టర్ స్పందిస్తూ పూలే జయంతి నిర్వహణకు బడ్జెట్ లేదన్నారన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో భోజనం ఏర్పాట్లు చేస్తామని చెప్పినప్పటికీ కలెక్టర్ నామమాత్రంగా స్పందించారన్నారు. జిల్లాకు చెందిన బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్‌గౌడ్ , జిల్లా ఇన్చార్జి మంత్రిగా బీసీ వర్గానికి చెందిన కొండా సురేఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బీసీ మహానీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో శ్రీహరియాదవ్, ప్రభాకర్‌వర్మ, నవీన్‌గౌడ్, మామిండ్ల ఐలయ్య, ప్రశాంత్, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. -
చెల్లింపులు అధికం.. సమస్యలు అనేకం
దుబ్బాక డబుల్ బెడ్రూంల వ్యూ అసంపూర్తిగా డబుల్ బెడ్రూంల నిర్మాణాలు ● పనులు పూర్తికాకుండానే అధిక పేమెంట్ ● అధికారుల పర్యవేక్షణ లోపం ● కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం ● దుబ్బాక పట్టణంలో పేదల ఇళ్ల దుస్థితిదక్కించుకున్న పనులు పూర్తయి నెలలు గడిచినా ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడం చూశాం.. కానీ ఇక్కడ మాత్రం సీన్ రీవర్స్.. కాంట్రాక్టర్‌కు అడ్వాన్స్ పేమెంట్ల పేరుతో అధికారులు ఇష్టారాజ్యంగా చెల్లించారు. ఓ వైపు పనులు వంద శాతం పూర్తికాకున్నా.. చెల్లించాల్సిన వాటి కంటే ఎక్కువే పేమెంట్ చేశారు. దుబ్బాక పట్టణంలో 948 డబుల్ బెడ్రూంల నిర్మాణాలను రెండు ఏజెన్సీలకు అప్పగించారు. అందులో 876 డబుల్ బెడ్రూంల నిర్మాణాలు జరగగా అందులో పది శాతం వరకు మైనర్ పనులు మిగిలే ఉన్నాయి. రెండేళ్ల కిత్రం పేమెంట్లు పూర్తి చేసినా సదరు కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయకపోవడం గమనార్హం.రూ. 5.30లక్షల చొప్పున.. ఒక్కో డబుల్ బెడ్రూం నిర్మాణానికి రూ.5.30లక్షల చొప్పున చెల్లిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. ఆ డబ్బులు సరిపోవని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అధికారులు అడ్వాన్స్ పేమెంట్లు చేయించి నిర్మాణాలు ప్రారంభించారు. 948 డబుల్ బెడ్రూంల నిర్మాణాలను సదరు కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. కొంత స్థలం తక్కువగా ఉండటంతో 876 డబుల్ బెడ్రూంల పనులు ప్రారంభించారు. వీటి నిర్మాణాలకు రూ.46,42,80,000 అవుతుంది. అయితే రెండేళ్ల కిత్రం రూ.46,47,22,256 చెల్లించారు. ఒక వైపు వంద శాతం పనులు పూర్తి కానప్పటికీ రూ.4,42,256 అధికంగా చెల్లించారు. నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతోనే అధికంగా చెల్లింపులు జరిగాయని తెలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి డబుల్ బెడ్రూంలలో పెండింగ్‌లో ఉన్న మైనర్ పనులు పూర్తి చేసి అర్హులకు అందించాలని ప్రజలు కోరుతున్నారు. సాక్షి, సిద్దిపేట: దుబ్బాక పట్టణం బల్వంతపూర్ రోడ్లో మోడల్ కాలనీగా 2017లో జీ ప్లస్ టూ తో డబుల్ బెడ్రూంల నిర్మాణాలను ప్రారంభించారు. వెయ్యి డబుల్ బెడ్రూంలు మంజూరు కాగా 948 నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. అందులో బల్వంతపూర్ రోడ్లో జీ ప్లస్ టూతో ఒక్కో బ్లాక్‌లో 12 చొప్పున 66 బ్లాక్‌లు, మల్లయిపల్లి రోడ్లో ఏడు బ్లాక్‌లు ఇలా మొత్తంగా 876 డబూల్ బెడ్రూంల నిర్మాణాలు జరిగాయి. వీటిలో 588 డబుల్ బెడ్రూంలను లబ్ధిదారులకు అందించారు. ఇంకా 288 డబుల్ బెడ్రూంలలో పలు మైనర్ పనులు మిగిలిపోయాయి. డోర్లు, కిటికీలు, పెయింటింగ్, మరుగుదొడ్లు, కరెంట్ వైరింగ్ పనులు మిగిలిపోయాయి. మిగిలిన వాటికి లబ్ధిదారుల పేర్లను పూర్తి స్థాయిలో ప్రకటించలేదు. దీంతో నిరుపేదలు ఇంటి అద్దెను చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఎక్కువ పేమెంట్ జరగలేదు దుబ్బాకలో నిర్మించిన డబుల్ బెడ్రూంల విషయమై కాంట్రాక్టర్‌కు ఎక్కువ పేమెంట్ చేయలేదు. రికార్డ్ చేసిన విధంగా బిల్లులను అందించాం. బెడ్రూంలలో అసంపూర్తిగా పనులు ఉంటే పరిశీలించి చేయిస్తాం. – శ్రీనివాస్‌రెడ్డి, ఇన్చార్జ్ ఈఈ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ -
స్వరూపకు న్యాయం జరిగేదెప్పుడో?
సాక్షి, వరంగల్: అడవుల్లో తుపాకీ పట్టి ఆ తరువాత జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు.. తనకు లొంగుబాటు సమయంలో ప్రకటించిన పునరావాస ఫలాల కోసం అధికారుల చుట్టూ 13 ఏళ్లుగా ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుత సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామానికి చెందిన పాశం స్వరూప ఆడవిలో దాదాపు తొమ్మిదేళ్లు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో చివరగా సిరొంచ కమాండర్‌గా పనిచేస్తూ 2012లో పోలీసులకు లొంగిపోయింది. ఆ సమయంలో పునరావాసం కింద 500 గజాల ఇంటిస్థలం, ఐదెకరాల వ్యవసాయ భూమి ఇస్తామని పోలీసు అధికారులు ప్రకటించారు. రెవెన్యూ భూమి కేటాయించి నివేదిక సైతం ఇచ్చారు. కానీ అలాట్మెంట్ చేయలేదు. ఆమె కుటుంబపోషణ కోసం కొమురవెల్లి దేవస్థానం ప్రాంగణంలో కట్టెలు, పూలు అమ్ముకుంటూనే, జనజీవన స్రవంతిలో తనకు ప్రభుత్వం పునరావాసం కింద ఇస్తానన్న భూమి కోసం ఇంకా పోరాటం సాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో వరంగల్ కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ సెల్‌కు వచ్చి మరోసారి కలెక్టర్ డాక్టర్ సత్యశారదకు తన బాధను ఏకరువు పెట్టుకున్నారు. ఇప్పటికై నా సంబంధిత పత్రాలు నాకు ఇచ్చి భూమి కేటాయించి నా కుటుంబానికి భరోసా ఇవ్వాలి’అని స్వరూప కన్నీటి పర్యంతమయ్యారు. -
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం కావాలి
గజ్వేల్: సంపూర్ణ ఆరోగ్యమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని, ఇందుకోసం వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని గజ్వేల్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం ఆస్పత్రి సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ కలుషితమైన ఆహారం, నీరు, గాలికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య పరిరక్షణ మన చేతుల్లోనే ఉంటుందని చెప్పారు. ప్రజల్లో ఆరోగ్యంపై స్పృహను పెంచడమే లక్ష్యంగా ర్యాలీని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ రాము, డ్యూటీ డాక్టర్ నవ్యరావు, డాక్టర్ తర్జనితోపాటు సిబ్బంది పాల్గొన్నారు. -
వైద్య సేవలపై నిర్లక్ష్యం తగదు
సిద్దిపేటకమాన్: వైద్య సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్ఓ పల్వన్‌కుమార్ అన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్యాధికారులు, సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యం మన హక్కుగా సిబ్బంది భావించి వైద్య సేవలు అందించాలన్నారు. మాతా, శిశు మరణాలు జరగకుండా వ్యాధి నిరోధక టీకాలు సమయానికి అందించాలన్నారు. గర్బిణులకు, చిన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి డీఎంహెచ్ఓ పల్వన్‌కుమార్ -
రాజ్యాంగం మార్చే కుట్ర
వర్గల్(గజ్వేల్): దేశంలో రాజ్యాంగం మార్చే కుట్ర జరుగుతోందని, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడదామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ప్రీతమ్ అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ నినాదంతో గ్రామస్థాయి పాదయాత్రను సోమవారం మండల కేంద్రం వర్గల్తోపాటు గౌరారంలో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేసారి రిజర్వేషన్లు ఎత్తివేస్తే ప్రజలు తరిమికొడతారని, మెల్లమెల్లగా వాటిని తీసే ప్రక్రియ చేపడుతున్నారని ఆరోపించారు. గచ్చిబౌలి భూములపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం అక్కడ చెట్లు నరకలేదని, జింకలు, నెమళ్లను చంపలేదని స్పష్టం చేశారు. పదేళ్లు దోచుకున్న డబ్బుతోనే బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరంలో కులగణన చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. గురుకులం అందరిది ఒకే కులం అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదేనన్నారు. పేదవారికి సన్నబియ్యం పంచిన ఘనత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. మన డబ్బు తింటూ ఫామ్‌హౌస్‌లో పడుకున్న వాళ్లను నిద్రలేపాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా వర్గల్లో సన్నబియ్యం లబ్ధిదారుడు అయ్యగల్ల యాదగిరి ఇంట్లో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి తదితరులతో కలిసి కుటుంబీకులతో సహపంక్తి భోజనం చేశారు. పాదయాత్ర కార్యక్రమంలో ఆయనతోపాటు యూత్‌కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి రంగారెడ్డి, రాష్ట్ర యూత్‌కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, మండల పార్టీ అధ్యక్షుడు సందీప్‌రెడ్డి, ప్రభుదాస్‌గౌడ్, భానుప్రసాద్, సాయిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గచ్చిబౌలి భూములపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం సన్నబియ్యం పంపిణీ ఘనత కాంగ్రెస్‌దే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ప్రీతమ్ -
నెత్తిన ‘బండ’
నేటి నుంచి ఒక్కో సిలిండర్‌పై రూ.50 పెంపు● రూ.855 నుంచి రూ.905లకు చేరిన ధర ● జిల్లా వ్యాప్తంగా 3.23లక్షల కనెక్షన్లు ● ప్రతి నెలా రూ.సుమారు 75లక్షల భారం సాక్షి, సిద్దిపేట: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. కేంద్రం ఒక్కో సిలిండర్ పై ఏకంగా రూ.50లు పెంచింది. ఇప్పటికే బియ్యం, నూనె, పప్పులు వంటి నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలపై తాజాగా పెరిగిన గ్యాస్ ధర మరింత భారం కానుంది. ప్రస్తుతం 14.2కిలోల గ్యాస్ సిలిండర్ రూ.855 ఉండగా రూ.50లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో రూ.905లకు చేరింది. జిల్లా వ్యాప్తంగా 3,23,500 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో ప్రతి నెలా ఒక్కో సిలిండర్ చొప్పున 1.5లక్షల మంది వినియోగిస్తున్నారు. దీంతో కుటుంబాలపై ప్రతి నెలా దాదాపుగా రూ.75లక్షల భారం పడనుంది. ఈ పెంపు ఉజ్వల పథకం కింద తీసుకున్న కనెక్షన్లకు సైతం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రేషన్ కార్డు కలిగిన పేద, మధ్య తరగతి కుటుంబాలకు రూ.500లకు సిలిండర్‌ను అందజేస్తోంది. జిల్లాలో 1,62,257 మందికి రూ. 500లకే గ్యాస్ సిలిండర్‌ను ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద రూ. 500లకు అందజేస్తున్న సిలిండర్ ధరను సైతం రూ.550లకు పెంచడంతో మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు పెంచుతుందా? అనే నిర్ణయం తేలాల్సి ఉంది. మహాలక్ష్మి లబ్ధిదారుల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ఈ ధర ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్కువగా పడనుంది. -
దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మోదీ
బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రధాని మోదీ దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. ఆదివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పార్టీని ముందుకు నడిపించడమే కాకుండా దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. మొదట ఇద్దరు ఎంపీలతో మొదలైన పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి చరిత సృష్టించిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంచంద్రరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
పీసీసీ చీఫ్‌ను కలిసిన సూర్యవర్మ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఆదివారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసినట్లు జిల్లా ఆర్టీఏ (రీజినల్ ట్రాన్స్పోర్ట్ అఽథారిటీ) సభ్యు డు డాక్టర్ సూర్యవర్మ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారన్నారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారన్నా రు. యువతకు ప్రతినెలా తప్పకుండా రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, పోలీసు వ్యవస్థకి ప్రజలకి వారధిలా ఉండాలని సూచించారన్నారు. ట్రైకార్ రుణాలువిడుదల చేయండి హుస్నాబాద్: బకాయి పడిన రూ.219 కోట్ల ట్రైకార్ రుణాలు వెంటనే విడుదల చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మాలోతు సత్యం నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత రాష్ట్ర ప్రభుత్వం ట్రైకార్ సంస్థ ద్వారా గిరిజన యువతి, యువకుల నుంచి వేలాదిగా దరఖాస్తులు స్వీకరించిందన్నారు. అందులో నుంచి కొంత మందికి రుణాలు మంజూరు చేస్తూ లబ్ధిదారులను గుర్తించిందన్నారు. వీరి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడానికి చెక్‌లను రెడీ చేసి క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖకు పంపిందన్నారు. ప్రస్తుతం వీరందరూ రాజీవ్ యువ వికాసం పథకంలో రుణాల కోసం కొత్తగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇప్పటికే రుణాలు తీసుకున్నట్లుగా చూపిస్తోందన్నారు. పెండింగ్‌లో ఉన్న రుణాలను విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశాడు. లేనిపక్షంలో గిరిజన సంక్షేమ భవన్‌ను ముట్టడిస్తామని సత్యం నాయక్ హెచ్చరించారు. సమావేశంలో లంబాడి ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు భూక్యా కృష్ణ నాయక్, నాయకులు ఉన్నారు. దుర్గమ్మా.. దండాలమ్మాపాపన్నపేట(మెదక్): ఏడుపాయల పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున అమ్మవారిని పూజారులు పట్టువస్త్రాలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఒడి బియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
‘నెక్లెస్’ సుందరం.. నడక భయానకం
కోమటి చెరువు (నెక్లెస్ రోడ్డు)పై నడక భయానకంగా మారుతోంది. రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన సింథటిక్ ట్రాక్‌పై మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. రాత్రి అయ్యిందంటే చాలు అక్కడే మకాం వేస్తున్నారు. అంతేకాక తాగిన సీసాలను పగులగొట్టి విచ్చలవిడిగా పారేస్తున్నారు. రోజూ తెల్లవారుజామునే సుమారు 500 మందికిపైగా వాకర్స్ నెక్లెస్ రోడ్డుపై నడక సాగిస్తుంటారు. గాజు సీసాలను కొందరు గమనించక గాయాలపాలవుతున్నారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి మందుబాబులను కట్టడి చేయాలని వాకర్స్ కోరుతున్నారు. –సిద్దిపేటజోన్ -
చెత్త.. నో చింత!
తిలకించి.. పులకించిరాములోరి కల్యాణంకమనీయం.. వైభవంగా శ్రీరామనవమి వేడుకలుఎక్కడికక్కడే శుద్ధి ● సిద్దిపేట బల్దియా వినూత్న ఆలోచన ● స్వచ్ఛత లక్ష్యంగా అడుగులు ● మరిన్ని కంపోస్టు యార్డులఏర్పాటుకు చర్యలుస్మార్ట్ సిటీ లక్ష్యంగా సిద్దిపేట బల్దియా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తోంది. చెత్త సేకరణ ప్రక్రియ సత్ఫలితాలు అందిస్తున్న క్రమంలో మరింత స్వచ్ఛత కోసం పారిశుద్ధ్య విభాగం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎక్కడికక్కడే చెత్తను శుద్ధి చేసేందుకు సంకల్పించింది. వార్డుల్లో సేకరించిన తడి చెత్తను సుదూరంలో ఉన్న కంపోస్టు యార్డులకు తరలించడం పారిశుద్ధ్య విభాగానికి సవాల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడి చెత్తను అక్కడే పునర్వినియోగం చేసేలా చర్యలు చేపడుతున్నారు. పట్టణంలో పలుచోట్ల ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం అందించారు. సిద్దిపేటజోన్: సిద్దిపేట పట్టణంలో రికార్డుల ప్రకారం ప్రతి రోజు 25మెట్రిక్ టన్నుల తడి చెత్త ఉత్పత్తి అవుతోంది. సేకరించిన తడి చెత్తను ప్రస్తుతం మందపల్లి, పశువుల ఆస్పత్రిలో, లింగారెడ్డిపల్లి, స్వచ్ఛబడిలోని ప్రాసెసింగ్ యూనిట్లకు తరలించి సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. బల్దియాలో 43 వార్డులు ఉండడం, విలీన వార్డులు పట్టణానికి సరిహద్దుల్లో ఉన్న నేపథ్యంలో తడి చెత్త తరలింపు అంశం బల్దియాకు వ్యయ ప్రయసాలతో కూడుకుంటోంది. పారిశుద్ధ్య కార్మికుల మీద వత్తిడి పడకుండా అదనంగా కంపోస్టు యార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని మున్సిపాలిటీ గుర్తించింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు. వేసవిలో మరో చిక్కు.. వేసవిలో పారిశుద్ధ్య విభాగానికి కొత్త చిక్కు ఏర్పడుతోంది. హరిత సిద్దిపేట దిశగా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. దీంతో వేసవిలో ఎండు ఆకుల సమస్య ఏర్పడుతోంది. పెద్ద ఎత్తున రోజూ ఎండిన ఆకులను ట్రాక్టర్ల కొద్దీ సేకరించి కంపోస్టు యార్డులకు తరలించాల్సి వస్తోంది. తరలించిన ఎండు ఆకులను సేంద్రియ ఎరువుల తయారీలో వాడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఎక్కడికక్కడే కంపోస్టు యార్డులు ఏర్పాటు చేయడమే మేలని బల్దియా భావిస్తోంది. రెండు లక్షల కిలోల విక్రయాలు.. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు ప్రాసెసింగ్ యూనిట్లలో ఇప్పటివరకు సుమారు రెండు లక్షల 30 వేల కిలోల సేంద్రియ ఎరువును విక్రయించారు. వర్మీ కంపోస్టు ఎరువు కిలో రూ.10కాగా, సెమి వర్మీ కంపోస్టు ధర 3 నుంచి 4 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువుల తయారీపై ఫోకస్ పెట్టడం విశేషం.పార్కుల్లో ప్రాసెసింగ్ యూనిట్లు మున్సిపాలిటీ పరిధిలోని పలు పార్కుల్లో తడి చెత్తను వర్మీ కంపోస్టుగా మార్చే ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా హౌసింగ్ బోర్డ్, మైత్రి వనం, నెహ్రు పార్కు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎర్ర చెరువు, కోమటి చెరువు, నర్సాపూర్ చెరువు ప్రాంతాల్లో పార్కుల్లో కంపోస్టు యార్డుల ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అందుకు అవసరమైన ప్రక్రియ పనులను మున్సిపల్ అధికారులు వేగవంతం చేస్తున్నారు. సౌలభ్యం కోసమే.. ఎక్కడి చెత్తను అక్కడే శుద్ధి చేసే ప్రక్రియ వేగవంతం చేస్తున్నాం. ఇప్పటికే 4చోట్ల యూనిట్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరిన్ని ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. – ఆశ్రిత్ మున్సిపల్ కమిషనర్ -
కళలు, సంప్రదాయాలను ప్రోత్సహిద్దాం
● రుక్మాభట్ల గేయ రామాయణం అద్భుతం ● ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేటజోన్: కళలు, సంప్రదాయాలను ప్రోత్సహించి, భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామలీల గేయ రామాయణ వాగ్గేయకారుడు రుక్మాభట్ల నరసింహా స్వామిని శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రుక్మాభట్ల గేయ రామాయణం రచించి తన జీవితాన్ని శ్రీరాముడికి అంకితం చేశారని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉగాది పురస్కారం తీసుకున్న రుక్మాభట్లకు పద్మశ్రీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నేటి సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగి పాత తరం వాళ్ళను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సిద్దిపేట ఎందరో గొప్ప వారిని అందించిందని కళలకు కాణాచిగా అభివర్ణించారు. ఆధునిక యుగంలో మరుగున పడిపోయిన కళలు, సంప్రదాయాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ఈ సందర్భంగా రుక్మాబాట్ల గేయ రామాయణ గానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ రోజాశర్మ పాల్గొన్నారు. అన్నదాతలకు ఇబ్బందులు రావొద్దు సిద్దిపేటజోన్: నియోజకవర్గ పరిధిలోని అన్నదాతలకు ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే హరీశ్ రావు సూచించారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐకేపీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భూ సేకరణకు ఒక్క పైసా ఇవ్వలేచిన్నకోడూరు(సిద్దిపేట): జిల్లాలోని ప్రాజెక్టుల కింద చిన్న కాలువల కోసం భూ సేకరణకు ప్రభుత్వం ఒక్క పైసా విడుదల చేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఆదివారం మండల పరిధిలోని చౌడారం మీదుగా బిక్కబండకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం భూసేకరణ చేసి కాలువలు తవ్వి రైతులకు నీళ్లు ఇవ్వడానికే కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. ఎడాదిన్నర కాలంలో ఒక్క ఎకరా కూడా ప్రాజెక్టుల కింద భూసేకరణ చేయలేదన్నారు. కాళేశ్వరం ద్వారా సిద్దిపేట నియోజకవర్గంలో 52 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నామన్నారు. ఇది కేసీఆర్ ఘనత అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కాలువలు నిర్మించే వరకు పోరాడుతాం
దుబ్బాకరూరల్: నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూర్తి చేసేవరకు పోరాడుతామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం పోతారం గ్రామంలో ఎమ్మెల్యే దంపతులు సీతారాముల కల్యాణమహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న చెరువులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయని అన్నారు. ఇంకా అక్కడక్కడా కాలువలు పూర్తి కాలేదని వాటిని పూర్తి చేసే దాకా పోరాడుతానని తెలిపారు. శ్రీరామనవమి రోజున తన సొంత గ్రామమైన పోతారం చెరువుకు నీళ్లు రావడం సంతోషంగా ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో నిండిన చెరువును పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య కార్యకర్తలతో సమావేశం దుబ్బాక: క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్‌లో ఈ నెల 27 జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు నియోజక వర్గం నుంచి భారీ సంఖ్యలో శ్రేణులు హాజరుకావాలన్నారు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కార్యకర్తలు అంకుఠిత దీక్షతో పనిచేయాలన్నారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు బానాల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, నాయకులు ఉన్నారు.ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి -
జగ్జీవన్‌రాంకు ఘన నివాళి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబుజగ్జీవన్‌రాం 118వ జయంతి ఉత్సవాలను సిద్దిపేటలో శనివారం ఘనంగా నిర్వహించారు. బీజేఆర్ చౌరస్తాలోని జగ్జీవన్‌రాం విగ్రహానికి జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సుభాష్ చంద్రబోస్, అధికారులు, కాంగ్రెస్, బీజేపీ, ఉపాధ్యాయ, కులసంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతకు ముందు దళిత సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. జగ్జీవన్ ఆశయాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, డీఆర్ఓ నాగరాజమ్మ, ఎస్సీ అభివృద్ధి శాఖ జిల్లా అధికారి హమీద్, పెర్క పర్శరాములు, లింగంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. దళిత సంఘాల నాయకుల నిరసన డాక్టర్ బాబు జగ్జీవన్ రాం జయంతి ఉత్సవాలలో సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్, ఇతర జిల్లా స్థా యి నాయకులు పాల్గొనలేదని దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. -
ఇక ఆస్తుల విస్తీర్ణం డిజిటలైజేషన్
ఇళ్లు, స్ధలాల వివాదాలకు చెక్ ● సమస్త వివరాలతో ప్రాపర్టీ కార్డు ● మాస్టర్ ప్లాన్‌కు సులభతరం ● పారదర్శకంగా ఇంటి పన్నుల కుదింపు ● మున్సిపాలిటీకి పెరగనున్న ఆదాయంహుస్నాబాద్: ఇక ముందు రెవెన్యూ రికార్డులు పక్కాగా, పారదర్శకంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించింది. ఇళ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు, వివాద స్ధలాలకు స్వస్తి పలికేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ఇండియా ల్యాండ్స్ రికార్డ్స్ మాడర్నైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్ట్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ (నక్షా) కార్యక్రమాన్ని చేపట్టింది. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటి, విస్తీర్ణాన్ని నక్షా సర్వేతో జల్లెడ పట్టి డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేయనున్నారు. ప్రతి ఇంటి యజమానికి ఆస్తి హక్కును కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలను ఎంపిక చేయగా, అందులో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ ఉంది. హుస్నాబాద్‌లో మున్సిపల్ రికార్డుల ప్రకారం 7,343 ఇళ్లు ఉన్నాయి. నక్షా ఏరియల్ సర్వేతో ఆస్తుల విస్తీర్ణాన్ని డిజిటల్ పద్ధతిలో నమోదు చేయనున్నారు. బహుళ అంతస్తుల భవనాలు ఉండే పట్టణాలు, ఇరుకుగా ఉండే చోట్ల హెలికాప్టర్‌ను ఉపయోగించి వాటికి ప్రత్యేకమైన కెమెరాలను బిగించి సర్వే పూర్తి చేశారు. పట్టణంలో 48 చోట్ల సర్వే సరిహద్దులను ఏర్పాటు చేశారు. ఏరియల్ సర్వే ద్వారా పట్టణ విస్తీర్ణాన్ని నిర్ధారించి కచ్చిమైన పట్టణ మ్యాప్‌ను తయారు చేయనున్నారు. ప్రతి ఇంటికి త్రీడీ కెమెరాతో మ్యాపింగ్ చేస్తారు. ప్రస్తుతం మున్సిపల్ పరిధిలో విస్తృతంగా సర్వే చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్‌కు సులభతరం మౌలిక వసతుల కల్పన, రోడ్లు, మంచి నీటి సౌకర్యం, ఇలా పలు అంశాల్లో పట్టణాన్ని అభివృద్ధి చేయాలంటే మాస్టర్ ప్లాన్ అవసరం. ప్రస్తుత నక్ష ప్రకారం ఇళ్లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్ధలు, రహదారులు, వ్యాపార, వాణిజ్య దుకాణాలు, ప్రైవేట్, ప్రభుత్వ స్ధలాల ఆస్తుల లెక్కలు పక్కాగా తెలుస్తోంది. రెవెన్యూ, మున్సిపాలిటీ, సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ పైలెట్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. సర్వే కొనసాగిస్తున్న అధికారులు త్వరలోనే ఇంటింటికి తిరిగి ఇంటి ఆస్తుల వివరాలను పూర్తి స్ధాయిలో సేకరించనున్నారు. సర్వే పూర్తి చేసిన తర్వాత ప్రాపర్టీ కార్డును జారీ చేయనున్నారు. ఆస్తి పన్నుల లెక్కా పక్కా నక్షా సర్వే ద్వారా ప్రతి ఇంటి ఆస్తి వివరాలు గుర్తిస్తారు. ప్రస్తుతం ఒక ఇంటి (గ్రౌండ్ ఫ్లోర్)అనుమతితో రెండు, నుంచి మూడు ఫ్లోర్లు వేస్తున్నారు. మున్సిపల్ రికార్డులో ఎన్ని అంతస్తులు ఉన్న ఒక ఇంటికే పన్ను వసూలు చేస్తున్నారు. దీంతో మున్సిపల్ ఆదాయానికి గండికొడుతున్నారు. ప్రస్తుతం ఏడాది ఇంటి పన్నుల వసూళ్లు రూ.1.72 కోట్లు ఉండగా, ఈ సర్వేతో ఆదాయం రెట్టింపు కానుంది. ఈ సర్వే ద్వారా బహుళ అంతస్తుల లెక్క తేలుతుంది. ఆస్తి పన్నును మదింపు చేసుకొని ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఇంటి యజమానికి ప్రాపర్టీ కార్డు ప్రస్తుతం ప్రతిదానికి ఆధార్ కార్డు కీలకంగా మారింది. ఆధార్ తరహాలోనే ఇంటి యజమానికి ప్రాపర్టీ కార్డు ఇవ్వబోతున్నారు. ఈ కార్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. స్కాన్ చేస్తే పూర్తి వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. ఇంటి యజమాని పేరు, ఆస్తి పన్నుల వివరాలు, విస్తీర్ణం, భూముల సర్వే నంబర్లు, అనుమతి తీసుకున్న నంబర్, ప్లాన్, నల్లా కనెక్షన్ ఇలా పూర్తి స్ధాయి వివరాలు ప్రాపర్టీ కార్డులో ఉంటుంది.సర్వేతో పట్టణ సమగ్ర ప్రణాళికనక్షా సర్వేతో పట్టణ సమగ్ర ప్రణాళిక రూపొందుతుంది. ప్రతి ఇంటి ఆస్తి హద్ధు లు నిర్ణయిస్తాం. యజమానికి ఆస్తి హక్కును కల్పిస్తాం. మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతగానో దోహదపడుతుంది. ఆస్తి పన్నుల నిర్ణయంతో పారదర్శకంగా ఆదాయాన్ని పెంచుకునే వీలు ఉంటుంది. ప్రతి ఇంటికి ప్రాపర్టీ కార్డును జారీ చేయనున్నాం. ఈ కార్డుతో రుణాలు పొందవచ్చు. – మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ -
సన్‌ఫ్లవర్ రైతులను ఆదుకోండి
మంత్రి తుమ్మలకు ఎమ్మెల్యే హరీశ్ విజ్ఞప్తిసిద్దిపేటజోన్: సిద్దిపేట నియోజకవర్గం సన్ ఫ్లవర్ రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే హరీశ్‌రావు శనివారం ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. చిన్నకోడూరు మండల రైతుల సమస్యలను తెలుసుకున్న హరీశ్.. మంత్రికి ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. మండలంలోని రైతులు 18 వేల క్వింటాళ్ల దిగుబడి సన్ ఫ్లవర్ సాగు చేసినట్టు పేర్కొన్నారు. అందులో 5 వేల క్వింటాళ్లు పీఏసీఎస్ ద్వారా, మరో 2 వేల క్వింటాళ్లు మార్కెట్ కమిటీ ద్వారా కొనుగోలు చేసినట్టు తెలిపారు. మిగతా 11 వేల క్వింటాళ్ల సన్‌ఫ్లవర్ మిగిలిందని, దీనితో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీరాముడు చూపిన మార్గం అనుసరణీయం ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఆదర్శప్రాయుడు శ్రీరాముడు చూపిన మార్గం మనందరికీ అనుసరణీయమని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. హక్కుల కంటే బాధ్యత గొప్పద న్నది రామతత్వం, కష్టంలో కలిసి నడవాల న్నది సీతాతత్వం అన్నారు. శ్రీరాముడు కష్టా ల్లో మనో నిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగి విజయం సాధించారన్నారు. మానవ అవతారమూర్తులైన సీతారాములు ధర్మసంస్థాపనకు నిలువుటద్దంగా నిలిచారన్నారు. శ్రీరాముని అనుగ్రహంతో అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాధించాలన్నారు. -
అంకిరెడ్డిపల్లి వాసికి డాక్టరేట్ పట్టా
కొండపాక(గజ్వేల్): మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లికి చెందిన తోట శారద పేదరికం, అంగవైకల్యాన్ని జయించి కాకతీయ యూనివర్సిటీలో డాక్టరేట్ పట్టానందుకున్నారు. ఆమెది పేద కుటుంబం. ఐత చంద్రయ్య సాహిత్యం సమగ్ర పరిశీలన అంశంపై యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసింది. శారీరక అంగవైకల్యం ఉన్నప్పటికీ డాక్టరేట్‌ను సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లి పట్టాను దక్కించుకుంది. దీంతో గ్రామస్తులు శారదకు అభినందించారు. శ్రీరామనవమికి నాచగిరి సిద్ధం నేడు సీతారాముల కల్యాణం వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి క్షేత్రంలోని శ్రీరామాలయం శ్రీరామనవమి మహోత్సవానికి ముస్తాబైంది. శ్రీలక్ష్మీ నృసింహుని గర్భగుడి చెంతనే గుహలో శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్రమూర్తి, ఆ పక్కనే ఆంజనేయ స్వామి కొలువుదీరారు. ఆదివారం శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఆలయ ప్రాంగణంలో విశాలమైన కల్యాణ వేదికను సిద్ధం చేశారు. ఉదయం 10.30 గంటలకు జగదభిరాముని కల్యాణోత్సవం జరుగుతుంది. భక్తజనులు కల్యాణ మహోత్సవ వైభవాన్ని ప్రత్యక్షంగా తిలకించి తరించాలని ఆలయ ఈఓ విశ్వనాథశర్మ కోరారు. కొమురవెల్లి ఈవోగా అన్నపూర్ణ నియామకంకొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ నూతన ఈవోగా అన్నపూర్ణను నియమించారు. ఈ మేరకు దేవాదాయశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న అన్నపూర్ణకు కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఆలయ ఈవోగా పని చేస్తున్న రామాంజనేయులును దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. సోమవారం అన్నపూర్ణ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. కొత్త పెన్షన్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తాం: చంద్రారెడ్డిప్రశాంత్నగర్(సిద్దిపేట): కొత్త పెన్షన్ సవరణ బిల్లును తీసుకురావడంతో ప్రస్తుత పెన్షనర్ల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని, అందువల్ల కొత్త పెన్షన్ సవరణ బిల్లును వ్యతిరేకిద్దామని విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త సవరణతో భవిష్యత్‌లో పాత పెన్షన్ పొందుతున్న విశ్రాంత ఉద్యోగులను రెండుగా విభజించనున్నట్లు తెలిపారు. దీంతో పెన్షన్‌దారులకు ఇబ్బందులు ఉంటాయన్నారు. కేంద్రం వెంటనే కొత్త పెన్షన్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర కల్పించాలి హుస్నాబాద్‌రూరల్: వడ్లకు ప్రభుత్వ మద్ధతు ధర చెల్లించాలని రైతులు శనివారం రాత్రి ఆందోళనకు దిగారు. హుస్నాబాద్‌లో వ్యాపారులు రైతుల నుంచి పచ్చి వడ్లను కొనుగోలు చేస్తున్నారు. క్వింటాలుకు రూ.1,900లు చెల్లిస్తామని చెప్పిన వ్యాపారులు తూకం వేసిన తర్వాత రూ.1760లు చెల్లించడంతో రైతులు గోమాత మిల్లు ఎదుట ఆందోళనకు దిగారు. మద్ధతు ధర రూ.2,330లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజల అభ్యున్నతే ధ్యేయం గజ్వేల్‌రూరల్: అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పాలన సాగిస్తున్నదని ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని శ్రీగిరిపల్లిలో సన్నబియ్యం పంపిణీని శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు కుమార్, గణేశ్, కరుణాకర్, మహేశ్, నర్సిహులు, సురేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వివరాలు 8లో uపంట నష్టానికి పరిహారమేదీ?అకాల వర్షాలతో వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు గజ్వేల్: అకాల వర్షాలతో రైతులు నష్టపోవడం సహజ పరిణామంగా మారుతోంది. ఈనెల 3న కురిసిన వర్షాలకు జిల్లాలోని వందలాది ఎకరాల్లో ప్రధాన పంటలకు నష్టం జరిగింది. అధికారులు క్షేత్రస్థాయిలో నష్టం అంచనా వేసే పనిలో ఉన్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదికలు పంపినా.. పరిహారం అందుతున్న దాఖలాలు కనిపించడం లేదు. కనీసం పంటల బీమా పథకం అమలై ఉంటే రైతులకు కొంత ఉపశమనం కలిగేది. కానీ ప్రభుత్వం నుంచి పరిహారం రాక, బీమా సౌకర్యం అమలుకు నోచుకోక రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి 3.52 లక్షల ఎకరాల్లో వరి, 22వేల ఎకరాల్లో మొక్కజొన్న, 11వేల ఎకరాల్లో పొద్దుతిరుగుడు, మరో 5వేల ఎకరాల్లో ఇంతర పంటలు సాగులోకి వచ్చాయి. పంటలు చేతికొచ్చే సమయంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. వరి, మొక్కజొన్న పంటలకు వందలాది ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ప్రత్యేకించి గజ్వేల్ నియోజకవర్గంలో అకాల వర్షం తీవ్ర ప్రభావాన్ని చూపింది. వర్షం ధాటికి గెలలు కట్టిన వరి నేలవాలి వడ్లు పూర్తిగా రాలిపోయాయి. చేతికందే దశలో మొక్కజొన్న పంట సైతం నేలవాలి కంకులు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే ఒక్కో రైతుకు లక్షల్లో పంట నష్టం వాటిల్లింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. నివేదికలకే పరిమితం అకాల వర్షాలు కురిసిన సందర్భంలో వ్యవసాయాధికారులు హడావిడిగా క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపి ప్రభుత్వానికి నివేదికలు పంపడానికి పరిమితమవుతున్నారనే తప్పా.. పరిహారం మాత్రం అందటం లేదు. ఏటా ఇదే పరిస్థితి నెలకొంటున్నది. ప్రస్తుతం కూడా పంట నష్టం అంచనా వేసే పనిలో ఉన్నామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. న్యూస్‌రీల్ బీమా లేక ఏటా తప్పని ఇబ్బందులు రైతన్నను నిండా ముంచిన వర్షాలు -
జూన్‌లో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ
● ఆధునిక టెక్నాలజీతో నిర్మాణం ● ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి నంగునూరు(సిద్దిపేట): అత్యాధునిక టెక్నాలజీతో నంగునూరు మండలం నర్మేటలో నిర్మి స్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని జూన్‌లో ప్రారంభిస్తామని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా ములుగు, ఎల్లాయిగూడ, రంగ నాయకసాగర్లోని ఆయిల్‌పామ్ నర్సరీల స్థితిగతులను, పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. సిద్దిపేట, జనగామ జిల్లాల వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో సాగు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం నర్మేటలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీని సందర్శించారు. వివిధ గ్రామాల నుంచి రైతులు తెచ్చిన ఆయిల్ గెలలను పరిశీలించి వారితో మాట్లాడారు. ఫ్యాక్టరీలో జరుగుతున్న నిర్మా ణం పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగుకు జనగామ, సిద్దిపేట జిల్లాలోని భూములు అనువుగా ఉన్నాయని, పెద్ద ఎత్తున సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. చిన్న, చిన్న పనులను పూర్తి చేసి జూన్ నాటికి ఫ్యాక్టరీని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి, జనరల్ మేనేజర్ ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాన్న తిడతాడనే భయంతో ఉరేసుకొని ఆత్మహత్య
సిద్దిపేటరూరల్: ఉరేసుకొని యువకుడు ఆత్మ హత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పుల్లూరుకు చెందిన కర్రె సంజీవ్(18) వారం రోజుల కిందట స్నేహితులతో కలిసి దొంగతనానికి పాల్పడ్డాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో తండ్రి బాలయ్యతో కలిసి భోజనం చేసి పడుకుంటానని చెప్పి లోనికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. కొద్దిసేపటికి ఇంటికి ఓ వ్యక్తి వచ్చి సంజీవ్ ఉన్నాడా.. అని తండ్రిని అడిగాడు. ఇంట్లో పడుకున్నాడని చెబుతూ గది తలుపులు తెరిచి చూడగా సంజీవ్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సాయంతో కిందికి దింపి చూడగా అప్పటికే మృతి చెందాడు. సంజీవ్ దొంగతనం చేసిన విషయం చిన్న కుమారుడు తండ్రికి చెప్పాడు. నాన్న తిడతాడనే భయంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని, తన కుమారుడి మరణంపై ఎలాంటి అనుమానం లేదని బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఒకే తాటిపైకి రెవెన్యూ ఉద్యోగులు
● భూభారతితో రైతులకు మెరుగైన సేవలు ● త్వరలో అవుట్ సోర్సింగ్‌కు శుభవార్త ● ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి ● ఉమ్మడి మెదక్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం సిద్దిపేటఅర్బన్: రెవెన్యూ శాఖలోని ఉద్యోగులందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేటలో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని, రెవెన్యూ ఉద్యోగులకూ భరోసా ఉంటుందని చెప్పారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం జరుగుతుందని చెప్పారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రతకు సంబంధించి త్వరలోనే ప్రభు త్వం శుభవార్త చెబుతుందని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు సానుకూలంగా ఉందన్నారు. ఆప్షన్ల ద్వారా రెవెన్యూ శాఖల్లోకి వస్తున్న గ్రామ పరిపాల న అధికారులు (జీపీవో) సర్వీసుపరమైన అభద్రత కు గురికావాల్సిన అవసరం లేదన్నారు. వీరందరికి కామన్ సర్వీస్, పదోన్నతులు ఉంటాయన్నారు. ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారిని నియమించడం వల్ల రైతులకు రెవెన్యూ సేవలు చేరువ కావడంతో పాటు ఉద్యోగులకు పెద్ద ఎత్తున పదోన్నతులు లభిస్తాయని ఆయన వివరించారు. రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలి భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలని లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను క్రమంగా సాధించుకుంటున్నామని, సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను సాధించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భూభారతి చట్టంతో తహసీల్దార్లకు, ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాల వికేంద్రీకరణ జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని, సమస్యపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్టు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి వెంకట్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు చల్లా శ్రీనివాస్, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాములు, రమేష్, టీజీజీఏ జనరల్ సెక్రెటరీ పూల్‌సింగ్, టీ జీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.రాంరెడ్డి, భిక్షం, సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దర్శనం గౌడ్, టీజీటీఏ మహిళా విభాగం అధ్యక్షురాలు రాధ, సీసీఎల్ఏ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణచైతన్య, రాంబాబు, కోశాధికారి మల్లేశం, టీజీఆర్ఎస్ఏ మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
కోహెడరూరల్(హుస్నాబాద్): ప్రతి వ్యక్తి రాజ్యాంగ పరిరక్షణకు ముందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా శుక్రవారం మండలంలోని చెంచెల్ చెర్వుపల్లిలో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో శ్రమించి రాసిన రాజ్యాంగం పట్ల కేంద్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పాదయాత్రలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని వివరిస్తూ మందుకు సాగాలని కార్యకర్తలకు సూచించారు. -
సాగునీటి ఇబ్బందులు తలెత్తొద్దు
● కాలువల పనులు వేగిరం చేయాలి ● నీటిపారుదల సమీక్షలో హరీశ్‌రావు సన్‌ఫ్లవర్ కేంద్రాలు కొనసాగించండి సిద్దిపేట రూరల్: సన్‌ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు కొనసాగించేలా చొరవ చూపాలని కలెక్టర్ మనుచౌదరిని ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. శుక్రవారం కలెక్టర్‌ను కలిసి పలు సమస్యలు వివరించారు. నియోజకవర్గ పరిధిలోని చిన్నకోడూర్ ప్రాంత రైతులు సన్ ఫ్లవర్ పెద్ద ఎత్తున సాగు చేసినట్లు వివరించారు. కాళేశ్వరం కాలువల నిర్మాణాలకు భూసేకరణలో జాప్యం జరుగుతోందని, పనులను వేగవంతం చేయాలని కోరారు.సిద్దిపేటజోన్: రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తవద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో మల్లన్న, రంగనాయకసాగర్ కాల్వల స్థితిగతులు, నీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ వచ్చే యాసంగి పంట వరకు శాశ్వతంగా కాల్వలు ఏర్పాటు చేయాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇర్కోడ్ లిఫ్ట్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో సాగునీటి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. పాలనలో సీఎం ఫెయిల్ భూముల అమ్మకాల పేరిట మూగ జీవాల గోస పోసుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డిని చివరికి మూగ జీవాలు కూడా క్షమించవని హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన వరంగల్ రజతోత్సవ సభసన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైడ్రా పేరిట విధ్వంసం చేసి పేద ప్రజల జీవితాలను నాశనం చేశారన్నారు. రేవంత్‌రెడ్డి పాలన ఫెయిల్ అయ్యిందని, ఆయనను తిట్టని ఊరు లేదన్నారు. రుణమాఫీ అమలు సగం వరకు సాగిందని, ఇక కాదని సీఎం చేతులు ఎత్తివేశారని విమర్శించారు. వానాకాలం రైతుబంధు లేదన్నారు. రేవంత్ రెడ్డికి పాలన చేయడం రావట్లేదని, ఆయన మాటలు అన్ని బోగస్ అని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల చేర్యాల, మద్దూరు, బచ్చన్న పేట, జనగామలలో 50 వేల ఎకరాల పంట ఎండిపోయిందన్నారు. ప్రభుత్వం పై వత్తిడి తెచ్చి రంగనాయకసాగర్ లోకి నీళ్లు తేవడం వల్లే సిద్దిపేట నియోజకవర్గంలో ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదని, ప్రభుత్వ వైఫల్యాలను వరంగల్ సభలో ఎండగడతామన్నారు. -
నాణ్యమైన భోజనం అందించండి
● విద్యార్థుల కోసం పోచమ్మ ఆలయం వద్ద బస్సులు ఆపండి ● అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ● బాలికల వసతి గృహం తనిఖీప్రశాంత్నగర్(సిద్దిపేట): పట్టణంలోని మెదక్ రోడ్డు పోచమ్మ ఆలయం వద్ద ఆర్టీసీ బస్సులు ఆపాలంటూ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్.. డీఎంకు ఫోన్లో సూచించారు. బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బస్సులు ఆపేలా చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలికల బీసీ వసతి గృహాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోచమ్మ ఆలయం వద్ద బస్సుల నిలుపడంలేదని దృష్టికి తెచ్చారు. వెంటనే అదనపు కలెక్టర్ స్పందిస్తూ డీఎంతో ఫోన్లో మాట్లాడారు. అలాగే మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుందా? అని తెలుసుకున్నారు. ఇరుకుగదులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు తెలుపగా, త్వరలోనే సమస్యను పరిష్కరించనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు అందించే ఆహార పరిమాణం పెంచాలని హాస్టల్ వార్డెన్‌కు సూచించారు. స్టోర్ రూంలో బియ్యం, కూరగాయలు, ఇతర అహార పదార్థాలను పరిశీలించారు. బియ్యం నిల్వల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వార్డెన్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి నాగరాజమ్మ, మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్, సిద్దిపేట అర్బన్ తహశీల్దార్ సలీం తదితరులు పాల్గొన్నారు. -
● కొందరు ఆర్థిక ఇబ్బందులతో దూరం ● పైలెట్ ప్రాజెక్ట్‌గా 26 మండలాల్లో26 గ్రామాలు ఎంపిక ● ముగ్గు పోసింది 2,667 మందిలో 533 మందే ● ఇప్పటి వరకు బేస్మింట్ లెవల్ వరకు నిర్మించింది 78 ఇళ్లే
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ముందడుగు పడటం లేదు. పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి అర్హులకు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా 26 మండలాల్లోని 26 గ్రామాల్లో 2,667 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలతో పలువురు లబ్ధిదారులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. – సాక్షి, సిద్దిపేట ఉచితంగా ఇసుక సరఫరా చేయాలి మాకు సొంత ఇల్లు లేదు. ఇటీవల ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. అయితే ఇసుక సమస్య ఉండటం వల్ల ఇంటి నిర్మాణం ప్రారంభించడం ఆలస్యం అవుతోంది. అధికారులు ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తే మాకు ఆర్థికంగా భరోసా కల్పించినట్లు అవుతుంది. – పొన్నబోయిన యాదయ్య, లబ్ధిదారుడు, ధర్మారంజిల్లా వ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్ట్‌లో ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో 533 మంది మాత్రమే ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోశారు. అందులో ఇప్పటి వరకు 78 గృహాలు మాత్రమే బెస్మింట్ స్థాయి వరకు నిర్మించారు. మంజూరు పత్రాలను అందజేసి 75రోజులవుతున్నా చాలా మంది ఇంటి నిర్మాణాలను ప్రారంభించలేదు. ప్రస్తుతం నిర్మించే వారికి మొదటి బిల్లు రాగానే ప్రారంభిస్తామని.. మరి కొందరు ఇసుక కొరతతో.. ఇంకొందరు ముగ్గు పోసినా ఆర్థిక ఇబ్బందులతో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. 2.30లక్షల మంది దరఖాస్తు జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కోసం 2,30,483 మంది దరఖాస్తు చేశారు. వాటిని క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి అర్హులను ఎంపిక చేశారు. సొంత ఇంటి స్థలం ఉండి పక్కా ఇల్లు లేనివారు 76,337 మంది. అసలే ఇంటి స్థలం లేనివారు 34,404. అనర్హులుగా 1,19,742 మందిని గుర్తించారు. వీరిలో ప్రభుత్వం మంజూరు చేసే నియోజకవర్గానికి 3,500 ఇళ్లలో ఎంపిక చేయనున్నారు. 400 నుంచి 600 ఫీట్లలోపు స్థలంలోనే ఇంటి నిర్మాణం సడలింపు ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.●ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారు ఇంటి నిర్మాణం బెస్మింట్ లెవల్ వరకు నిర్మించిన వారికి మొదటి బిల్లు కోసం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం. త్వరలో మొదటి బిల్లు బ్యాంక్ అకౌంట్లో జమఅవుతాయి. కొంత మంది మంచి ముహూర్తాలు లేవని కొందరు, పాత ఇంటినికూల్చివేసేందుకు ఇంకొందరు సమయం తీసుకుంటున్నారు. – దామోదర్, పీడీ, హౌసింగ్ -
దెబ్బతిన్న పంటల పరిశీలన
గజ్వేల్: మండల పరిధి ధర్మారెడ్డిపల్లి, సంగుపల్లి, కోమటిబండ, జాలిగామ, గజ్వేల్ పట్టణ శివార్లలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను గజ్వేల్ ఏడీఏ బాబునాయక్, వ్యవసాయాధికారి నాగరాజులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ప్రాథమిక అంచనాల ప్రకారం మొక్కజొన్న 54, వరి 126 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. వర్గల్ మండలంలో.. వర్గల్(గజ్వేల్): అకాల వర్షాలు, గాలివాన, వడగళ్ల కారణంగా వర్గల్ మండలంలో దెబ్బతిన్న పంటలను, ఉద్యాన తోటలను శుక్రవారం వ్యవసాయ, ఉద్యాన అధికారులు పరిశీలించారు. మండల వ్యవసాయాధికారి శేషశయన, ఉద్యాన అధికారి రమేష్, ఏఈఓలతో కలిసి నెంటూరు, జబ్బాపూర్, మైలారం, చౌదరిపల్లిలో మొక్కజొన్న పైర్లు, కూరగాయలు, పండ్ల తోటలు పరిశీలించారు. మైలారంలో గాలివాన తాకిడికి శేఖర్‌కు చెందిన మొక్కజొన్న చేలు నేలకొరిగింది. చౌదరిపల్లి సమీప మామిడి తోటలో కాయలు రాలిపోయాయి. పంట నష్టం 33 శాతం లోపే ఉందని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. -
జీవజాతులను కాపాడుకుందాం
● పర్యావరణంతోనేమానవజాతికి మనుగడ ● సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సుధాకర్‌రెడ్డి సిద్దిపేటఎడ్యుకేషన్: రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా జీవజాతులను గుర్తించి పరిరక్షించవచ్చని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) హైదరాబాద్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సుధాకర్‌రెడ్డి అన్నారు. పర్యావరణ సమతుల్యత సమగ్రాభివృద్ధి అనే అంశంపై సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతరించి పోతున్న జీవజాతులను పరిరక్షించుకోవాలని తద్వారా పర్యావరణం సమతుల్యంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ జీవజాతులను కాపాడుకునేందుకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. వరల్డ్‌వైడ్ లైఫ్ ఫండ్ స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల మాట్లాడుతూ పర్యావరణం బాగుంటేనే మానవజాతికి మనుగడ ఉంటుందన్నారు. ప్రొఫెసర్ రామనాథన్ మాట్లాడుతూ నీటి కాలుష్యంతో సముద్రంలోని జీవజాతులకు నష్టం వాటిల్లుతోందన్నారు. సముద్రజీవజాతులకు పొంచి ఉన్న ప్రమాదాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ సదస్సుకు ఆయా రాష్ట్రాల నుంచి పరిశోధనా పత్రాలు వచ్చాయాన్నారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు ప్రదర్శించిన వాల్‌పోస్టర్లను పరిశీలించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. -
చదువుతోపాటు నైపుణ్యం ముఖ్యం
● కష్టపడితే ఏదైనా సాధ్యమే ● మంత్రి పొన్నం ప్రభాకర్ ● నాగసముద్రాలలో మహాత్మాగాంధీ విగ్రహం ఆవిష్కరణకోహెడరూరల్(హుస్నాబాద్): విద్యార్థులకు చదువుతోపాటు నైపుణ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చని బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండలంలోని నాగసముద్రాల గ్రామంలోని మోడల్ స్కూల్లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని కలెక్టర్ మనుచౌదరితో కలిసి ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో అహింసా పద్ధతిలో ఉద్యమాన్ని నడిపిన బాపూజీ విగ్రహాన్ని పాఠశాలలో ఆవిష్కరించుకోవడం ఆభినందనీయమన్నారు. మహనీయుల నుంచి స్ఫూర్తిని పొంది ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్ణయించుకుని వాటి సాధనకు నిరంతరం కష్టపడాలన్నారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడే 32 మండలాలకు గాను 29 మోడల్ స్కూల్ లు తీసుకువచ్చానన్నారు. స్కూల్స్‌లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వాతంత్య్ర చరిత్ర, తెలంగాణ ఉద్యమం, సైన్స్‌లపై అవగాహన అవసరమన్నారు. విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతి రోజు జరుగుతున్న అంశాలపై అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా మంత్రి ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నాణ్యమైన ఆహారం అందించాన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పాతురి సుధాకర్‌రెడ్డి, గాంధీ జ్ఞాన్ ఫౌండేషన్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, ఆర్డీఓ రామూర్తి, తహసీల్దార్ సురేఖ, ఎంపీడీఓ కృష్టయ్య తదితరులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచండిహుస్నాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు ధీటుగా తయారు చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు కల్పిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. తెలంగాణ భవిష్యత్‌కు విద్యార్థులే ఆస్తి అని అందరూ బాగా చదువుకొని భవిష్యత్‌కు పునాదులు వేయాలని మంత్రి కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఎంఈఓ బండారి మనీల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. -
విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించాలి
డీఈఓ ఎల్లంకి శ్రీనివాస్‌రెడ్డి కొండపాక(గజ్వేల్): చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమేనని, వారిలో సృజనాత్మకత పెంపొందించాలని డీఈఓ ఎల్లంకి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దుద్దెడలోని ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పాఠశాలల్లో చదువుతో పాటు ఆటలు, పాటలను నేర్పించాలని అన్నారు. పిల్లలను ప్రైవేటుకు పంపించకుండా సర్కారు బడులకు పంపేలా తల్లిదండ్రులు, యువకులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆయిల్‌పామ్ పంట కోత షురూ గజ్వేల్: మండల పరిధి అక్కారంలో మొదటి కోతకు వచ్చిన లక్ష్మణ్ ఆయిల్‌పామ్ తోటను ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, ఏడీఏ బాబునాయక్లు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పంట కోతను ప్రారంభించారు. నాలుగేళ్లుగా సాగుచేస్తున్న ఆయిల్‌పామ్ తొలిసారి కోతకు రావడం పట్ల రైతు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఈవోలు జ్యోతి, మాధవి, ఆయిల్ఫామ్ ఫీల్డ్ అసిస్టెంట్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. వీహెచ్ ప్రత్యేక పూజలు ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో, మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు ఽశుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు హనుమంతరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ సతీష్, మహేందర్‌రావు, దాస అంజయ్య, భిక్షపతి, అర్జున్ పాల్గొన్నారు. యశోదారెడ్డి కథలు భావితరాలకు స్ఫూర్తి సిద్దిపేటఎడ్యుకేషన్: యశోదారెడ్డి కథలు భావితరాలకు స్ఫూర్తినిస్తాయని గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ రాజిరెడ్డి మహేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో శుక్రవారం తెలుగు శాఖ ఆధ్వర్యంలో యశోదారెడ్డి కథాసాహిత్యంపై విస్తృతోపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజిరెడ్డి మహేందర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. 60 ఏళ్ల క్రితమే తెలంగాణ భాషను, సంస్కృతిని పరిరక్షించే దృక్పథంతో యశోదారెడ్డి రాసిన కథలు భావితరాలకు స్ఫూర్తినిస్తాయన్నారు. తెలంగాణ భాషాసంస్కృతి పరిరక్షణకు కృషిచేసిన వారిలో యశోదారెడ్డి ముందువరుసలో ఉంటారన్నారు. ఎచ్చమ్మ కథలు, మాఊరి ముచ్చట్లు తదితర కథలను విద్యార్థులు చదివి వాటిపై అవగాహన పెంపొందించుకోవడం తప్పనిసరన్నారు. కళాశాల తెలుగుశాఖ అధ్యక్షులు డాక్టర్ మట్టా సంపత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ యశోదారెడ్డి సాహిత్యసృజన తెలంగాణ భాషకు, యాసకు జీవగర్ర, పుట్టు కుల్లలు అని కొనియాడారు. కార్యక్రమంలో అధ్యాపకులు పిట్లదాసు, నారోజు వెంకటరమణ, నరేష్, శైలజ, సంపత్‌కుమార్, రామస్వామి, నర్సింలు, సాయిసురేశ్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. -
సిరుల ‘బ్రహ్మోత్సవం’
నాచగిరికి రూ.16 లక్షల ఆదాయం వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహుని నవాహ్నిక బ్రహ్మోత్సవాలు కాసుల వర్షం కురిపించాయి. గత నెల 19 నుంచి పన్నెండు రోజులపాటు కొనసాగిన ఉత్సవాలలో ఆలయానికి రూ.16.13 లక్షల ఆదాయం సమకూరింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 వేల మంది భక్తులు క్షేత్రాన్ని సందర్శించారు. దర్శనం, అభిషేకం, అర్చన, సేవా టికెట్లు తదితర సేవల ద్వారా మొత్తం రూ.16,13,328 ఆదాయం లభించినట్లు ఈఓ విశ్వనాథశర్మ పేర్కొన్నారు. చట్టాలపై అవగాహన అవసరం నంగునూరు(సిద్దిపేట): చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా లీగల్ అఽథారిటీ సర్వీసెస్ కార్యదర్శి స్వాతిరెడ్డి సూచించారు. గురువారం అక్కెనపల్లి మోడల్ స్కూల్లో విద్యార్థులకు చట్టపరమైన హక్కులు, బాధ్యతలు, చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థి దశలో చెడు అలవాట్లకు బానిసలుగా మారితే జీవితం నాశనమవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా షీటీమ్, సైబర్ నేరాలు, నూతన చట్టాలు, ఈవ్‌టీజింగ్, పోక్సో, సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలపై ఎస్ఐ ఎండీ ఆసిఫ్ వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జానయ్య తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించండినంగునూరు(సిద్దిపేట): విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందజేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. గురువారం నర్మేట కస్తూర్భాగాంధీ పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, రిజిస్టర్లు, మధ్యాహ్న భోజనం, గోదాంలో నిల్వ ఉన్న కూరగాయలు, బియ్యాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? అని ఆరా తీశారు. ఆమె వెంట డీపీఓ దేవకీదేవి, తహసీల్దార్ సరిత, ఎంఈఓ దేశిరెడ్డి, ఎంపీడీఓ లక్ష్మణప్ప, స్పెషలాఫీసర్ తదితరులు ఉన్నారు. విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యం కావాలి: డీఈఓ మద్దూరు(హుస్నాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రేబర్తి, గాగ్గిళ్లాపూర్ గ్రామాల్లోని పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యా సంవత్సరం క్యాలెండర్ అమలు విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న బోధనపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సమష్టిగా విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడాలన్నారు.అనంతరం రేబర్తి పాఠశాల వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారికి అధించారు. 6 నుంచి బీజేపీ ఆవిర్భావ వేడుకలు జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఈ నెల 6 నుంచి 12 వరకు నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ తెలిపారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో శంకర్ మాట్లాడారు. ఈనెల 6న జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ ఉంటుందన్నారు. 7న ప్రతి క్రియాశీల కార్యకర్త ఇంటిపై జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. 8,9తేదీలలో మండలాల వారీగా క్రియాశీల సభ్యులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. 10, 11, 12న గావ్ ఛలో, బస్తీచలో అభియాన్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో వివిధ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
గాలివాన బీభత్సం
● తడిసిన పొద్దు తిరుగుడు ధాన్యం ● ధర్మారెడ్డిపల్లిలో కూలిన కోళ్ల ఫారం షెడ్డు ● 1,500 కోళ్లు మృతి గజ్వేల్‌రూరల్: గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షంతో చేతికందిన పంటలు నేలకూలాయి. మరో పది రోజుల్లో చేతికందుతాయనుకున్న వరి, మొక్కజొన్న, ఉల్లి పంటలు గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షానికి నేలవాలాయి. అంతేగాకుండా మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోగల మామిడి తోటలు సైతం దెబ్బతిన్నాయి. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో విక్రయించేందుకు తీసుకువచ్చిన పొద్దు తిరుగుడు ధాన్యం తడిసిపోయింది. ఇదిలా ఉంటే గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లిలో పౌల్ట్రీ రైతు లింగాల శ్రీనివాస్‌గౌడ్‌కు చెందిన కోళ్ల ఫారంలోని పైకప్పు రేకులు వర్షానికి కూలిపోవడంతో అందులో ఉన్న సుమారు 1500 వరకు కోళ్లు మృతి చెందగా, మరో వెయ్యి కోళ్ల వరకు గాయపడ్డాయని బాధిత రైతు వాపోయాడు. పలుచోట్ల వడగళ్లు వర్గల్(గజ్వేల్): మండలంలో గురువారం సాయంత్రం పలుగ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. జబ్బాపూర్, నెంటూరు, మైలారంలో వడగళ్లు పడ్డాయి. గాలివాన తోడవడంతో వరిపైర్లు నేలవాలాయని రైతులు తెలిపారు. గౌరారం రాజీవ్‌రహదారిపై వరద ప్రవాహంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. నెంటూరు వద్ద గాలిదుమారానికి రోడ్డుకు అడ్డంగా చెట్లు కూలాయి.గౌరారం వద్ద రాజీవ్ రహదారిపై వరద ప్రవాహం -
నీరివ్వకుంటే ఉద్యమమే..
● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి హెచ్చరిక ● కుంటలు, చెరువులు, సాగునీటి కాల్వల పరిశీలన దుబ్బాక: ‘మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో దుబ్బాక నియోజకవర్గం సర్వం కోల్పోయింది. ముందుగా ప్రాజెక్టు నుంచి నీరు మాకు ఇవ్వాలి.. లేకుంటే హైదరాబాద్‌కు వెళ్లే నీటిని అడ్డుకుంటామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం రైతులు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి దుబ్బాక, పెద్దగుండవెల్లి గ్రామాల్లో కుంటలు, చెరువులు, సాగునీటి కాల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు, ప్రధాన కాల్వలు నిర్మిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉప కాల్వలను కూడా నిర్మించడం లేదని విమర్శించారు. ఏడాది కాలంగా మల్లన్నసాగర్ ఉపకాల్వల నిర్మాణం చేపట్టి పంటలకు నీరందించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వల నిర్మాణం లేకపోవడంతో వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే కాల్వల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. సన్నబియ్యం అంటూ కొబ్బరికాయలు కొడుతున్న కాంగ్రెస్ నాయకులకు రైతుల బాధలు పట్టవా అని ప్రశ్నించారు. రైతే దేశానికి వెన్నెముక దౌల్తాబాద్ (దుబ్బాక): అన్నం పెట్టే రైతును నిర్లక్ష్యం చేస్తే దేశం వెనుకబాటు తనానికి కారణమవుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండల పరిధి గాజులపల్లిలోని పటేల్ చెరువు కాలువ నుంచి మల్లన్న సాగర్‌జలాలు విడుదల చేశారు ఈ మేరకు ఎమ్మెల్యే పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పాదయాత్ర రసాభాస
సిద్దిపేటరూరల్: కాంగ్రెస్ పాదయాత్ర రసాభాసగా మారింది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించడాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేపట్టారు. గురువారం మండల పరిధిలోని తోర్నాల గ్రామంలో పాదయాత్రను నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలు సమన్యాయాన్ని పొందారన్నారు. ఇదిలా ఉండగా తోర్నాల గ్రామంలో ప్రధాన వీధుల నుంచి పాదయాత్ర చేపడుతున్న క్రమంలో మండల అధ్యక్షుడి విషయంలో నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఒకరినొకరు తోసుకోవడంతో గందరగోళంగా మారింది. అక్కడే ఉన్న పోలీసులు, నాయకుల జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగించారు. ప్రధానంగా మండలానికి అధ్యక్షుడు ఉన్నారా? లేరా? అసలు అధ్యక్షుడు ఎవరు? అనే అనుమానాలను ప్రజలు, నాయకులు లేవనెత్తారు. గ్రామాల్లో కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో మండల అధ్యక్షుడిగా ఎవరికి గుర్తింపు ఇవ్వాలో తెలియడం లేదంటూ పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కార్యక్రమంలో ముత్యాల బుచ్చిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పాండు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయకుల మధ్య వాగ్వాదం మండల అధ్యక్షుడి విషయమై గొడవ -
మున్సిపల్ కమిషనర్‌కు ప్రశంసాపత్రం
సిద్దిపేటజోన్: మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ ప్రశంసా పత్రం అందుకున్నారు. గురువారం హైదరాబాద్‌లోని చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ (సీడీఎంఏ)శ్రీదేవి చేతుల మీదగా పత్రం అందుకున్నారు. 84.15శాతం పన్ను వసూలు చేసినందుకు గాను ప్రభుత్వం అభినందించి ప్రశంసా పత్రం అందజేసింది. సిద్దిపేట మున్సిపాలిటీ పాలకవర్గం సిబ్బంది, పట్టణ ప్రజల సహకారంతో మెరుగైన లక్ష్యం సాధించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. హుస్నాబాద్ కమిషనర్‌కు.. హుస్నాబాద్: మున్సిపాలిటీలో అత్యధికంగా ఇంటి పన్నులు వసూలు చేసినందుకు కమిషనర్ మల్లికార్జున్ సైతం ప్రశంసా పత్రం అందుకున్నారు. 2023–24 సంవత్సరానికి 76 శాతం ఇంటి పన్నులు వసూలు చేయడంతో కమిషనర్ ప్రశంసలు అందుకున్నారు. -
విత్తన సబ్సిడీకి పదేళ్లుగా ప్రభుత్వం మంగళం పాడింది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రైతులు ప్రైవేటు మార్కెట్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఏటా కోట్లల్లో భారం తప్పడం లేదు. సబ్సిడీ మాటను పక్కన పెడితే పూర్తి ధర చెల్లించినా మార్కెట్లో నాణ్యమైన వి
గజ్వేల్: జిల్లాలో ప్రతి ఏటా వానాకాలం సీజన్లో 5.50లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తుంటాయి. వరి 3.50లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చే అవకాశముంది. ఇందుకోసం జిల్లాకు వివిధ రకాల వరి విత్తనాలు 60వేల క్వింటాళ్లకుపైగా అవసరమవుతాయి. గతంలో తెలంగాణ సోనా విత్తనాలు క్వింటాలుకు రూ.3,400కుపైగా ఎంటీయూ రకం రూ.3,100కుపైగా ధరకు లభించాయి. వచ్చే వానాకాలంలో ధర ఏవిధంగా ఉండబోతుందో ఎదురుచూడాల్సి ఉంది. కాగా కంది ఈసారి 60వేల ఎకరాల్లో సాగులోకి వస్తుందని అంచనా ఉండగా.. 3,053క్వింటాళ్లకుపైగా విత్తనాలు అవసరం. ఈ విత్తనం ధరపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. సోయాబీన్ 120ఎకరాల్లో సాగులోకి వస్తుందనే అంచనా ఉండగా.. 30క్వింటాళ్ల విత్తనం అవసరమున్నది. ఈ విత్తనం కూడా గతంలో క్వింటాలుకు రూ. 9800కు లభించింది. వీటి కొత్త ధరలు కొద్ది రోజుల్లోనే రానున్నాయి. దాదాపుగా పెరుగుదల ఉంటుందనే భావిస్తున్నారు. రైతులపై రూ. కోట్లల్లో భారం ప్రభుత్వం గతంలో వరి, మొక్కజొన్న, పెసర్లు, మినుమలు, కందులు, పొద్దు తిరుగుడు, శనగలు తదితర విత్తనాలను సబ్సిడీపై అందించేది. వీటిపై రైతులకు 33నుంచి 50శాతం సబ్సిడీ వర్తించేది. ప్రస్తుతం పచ్చిరొట్టె విత్తనాలకు మాత్రమే సబ్సిడీ కొనసాగుతుండగా, మిగతా వాటికి పూర్తిగా ఎత్తేశారు. జిల్లా రైతులకు 60వేల క్వింటాళ్ల మేర వరి విత్తనాల అవసరమవుతాయని అంచనా. వీటి ధర తక్కువలో తక్కువగా క్వింటాలుకు రూ.3వేల వరకు లెక్కిస్తే రైతులు రూ.18కోట్ల మేర విత్తనాలకు ఖర్చు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఈ విత్తనాలపై కనీసం 25శాతం సబ్సిడీ అందించినా రైతులపై రూ.4.5కోట్ల భారం తప్పేది. కానీ సబ్సిడీని పునరుద్ధరించే అవకాశమే కనిపించడం లేదు. ఇదే తరహాలో మొక్కజొన్న, కంది, సోయాబీన్, పెసర్లు, మినుములపై భారం తప్పని పరిస్థితి నెలకొన్నది. పత్తి బీటీ–2 విత్తనాలపై వాత ఇప్పటికే ప్రారంభమైంది. బీటీ–2 ప్యాకెట్ గతేడాది రూ.864ఉండగా...ఈసారి రూ.901కు పెంచారు. దీని ప్రకారం ఒక్కో ప్యాకెట్‌పై రూ.37అదనపు భారం పడనున్నది. జిల్లా రైతాంగానికి సీజన్లో 4.5లక్షల వరకు విత్తన ప్యాకెట్లు అవసరముంటాయి. పెరిగిన ధర ప్రకారం రైతులపై రూ.1.66కోట్ల మేర భారం పడనుంది. నాణ్యమైన విత్తనమే లక్ష్యం వచ్చే వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతులకు నాణ్యమైన విత్తనం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. విత్తన ప్రాసెసింగ్ సీజన్ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. ప్రాసెసింగ్ విధానంపై నిఘా పెడతాం. ఈసారి కూడా పోలీసుశాఖ సహకారంతో టాస్క్‌ఫోర్స్ కమిటీగా ఏర్పడి విత్తన ప్రొసెసింగ్, ప్యాకింగ్‌లో లోపాలు జరగకుండా చూస్తాం. విత్తనాల పంపిణీ ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనసాగనుంది. – రాధిక, జిల్లా వ్యవసాయాధికారి పర్యవేక్షణ తప్పనిసరి జిల్లాలోని గజ్వేల్ ప్రాంతం విత్తన ప్రాసెసింగ్‌కు ప్రధాన కేంద్రంగా మారింది. ప్రత్యేకించి ములుగు, వర్గల్, మర్కూక్, గజ్వేల్ మండలాలు విత్తన కంపెనీలకు అడ్డాగా మారాయి. సిద్దిపేటలోనూ కంపెనీలు వస్తున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో 40కిపైగా కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. కానీ గతంలో కొన్ని కంపెనీలు ప్రాసెసింగ్ సక్రమంగా చేయకుండా, నాణ్యతా పరీక్షలతో ప్రమేయం లేకుండా విత్తనాలను మార్కెట్లోకి వదలడం, రిజక్ట్ అయిన విత్తనాలను తిరిగి ప్యాకింగ్ చేయాలనుకోవడం వంటి అక్రమాలు గతంలో వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఈసారైనా విత్తన ప్రాసెసింగ్‌పై పర్యవేక్షణను మరింత పకడ్బందీగా చేపట్టాల్సిన అవసరం ఉంది. రైతులకు ఏటా తప్పని నష్టాలు తీరు మారితేనే ఉపశమనం విత్తనోత్పత్తి సీజన్ ప్రారంభం -
సన్న బియ్యం పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి
● ఎలాంటి పొరపాట్లు జరగవద్దు ● కలెక్టర్ మనుచౌదరి కొండపాక(గజ్వేల్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించాచారు. కొండపాక మండలం బందారంలోని రేషన్ దుకాణంలో సన్న బియ్యం పంపిణీని పరిశీలించారు. అలాగే లబ్ధిదారులకు బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా మనుచౌదరి మాట్లాడుతూ పేదలు కడుపు నిండా ఆహారం తీసుకునేలా ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందన్నారు. పథకం నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు అలసత్వం జరగవద్దన్నారు. లబ్దిదారుల పేర్లను ఈ పాస్ మిషన్న్లో అప్లోడ్ చేశాకే బియ్యాన్ని అందజేయాలన్నారు. లబ్ధిదారులు ఎక్కడి నుంచైనా రేషన్ బియ్యాన్ని పొందవచ్చన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ నాయక్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డైట్ మెనూ తప్పనిసరి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రతి రోజు విధిగా డైట్ మెనూ పాటించాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మైనార్టీ వేల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. గురుకుల పాఠశాల ప్రాంగణంలో తరగతి గదులు, వంటశాల, డార్మెటరీ, మరుగుదొడ్ల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం ఐదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. రోజూ దినపత్రికలు చదవాలన్నారు. అనంతరం పరీక్షలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట అర్బన్ మండల తహసీల్దార్ సలీం, గురకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. -
అతిథులొచ్చాయోచ్..
గురువారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025దేశీయ పక్షులతో సైబీరియన్ కొంగలువిదేశాల నుంచి వలస వచ్చిన సైబీరియన్ కొంగలు సందడి చేస్తున్నాయి. దేశ వాలీ పక్షులతో కలిసి ఆహారాన్వేషణ సాగిస్తున్నాయి. పంట పొలాలు, అడుగంటుతున్న చెరువులు, కుంటల్లోని పురుగులను, చేపలను వేటాడి తింటున్నాయి. మండల కేంద్రమైన మిరుదొడ్డి పెద్ద చెరువులో సందడి చేస్తున్న దేశీయ పక్షులతో పాటు, సైబీరియన్ కొంగలను ‘సాక్షి’కెమెరా క్లిక్‌మనిపించింది. – మిరుదొడ్డి(దుబ్బాక)న్యూస్‌రీల్ -
పాపన్న స్ఫూర్తితో అసమానతలపై పోరాడుదాం
కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అరుణ్చేర్యాల(సిద్దిపేట): సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో నేటి యువత సమాజంలోని అసమానతలపై పోరాడాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్‌కుమార్ సూచించారు. బుధవారం పాపన్న 315వ వర్ధంతిని పురష్కరించుకుని స్థానిక పాత బస్టాండ్ వద్ద ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం అరుణ్ మాట్లాడుతూ సామాన్య కల్లు గీత కార్మిక కుటుంబంలో పుట్టిన పాపన్న సమాజం బాగుండాలని కోరుకున్నారని, అందు కోసం కల్లుగీసే కత్తిని పక్కన పెట్టి ఖడ్గం చేతపట్టాడన్నారు. మొగలు సైన్యంపై తిరగబడి విజయం సాధించి ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత సమాజంలో జరుగుతున్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా గీత కార్మికులను పట్టించుకోవడం లేదని, రోజు రోజుకూ గీత వృత్తి అంతరించిపోతోందన్నారు. భారత రాజ్యాంగంలో అంబేడ్కర్ చెప్పిన విధంగా అన్ని రంగాల్లో సమానత్వం కోసం పాటుపడాలని, బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సర్వాయి పాపన్న, కంటమయ్య, రేణుక ఎల్లమ్మల స్ఫూర్తితో ఉద్యమం చేస్తామని అందుకు గీత కార్మికులందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గీత కార్మిక సంఘం నాయకులు నర్సింహులు, కనకయ్య, సిద్దిరాములు, బుచ్చిరాములు, గణేష్, రాములు, రాజు, సత్తయ్య, రాజయ్య, గోపాల్, ఐలయ్య, యాదగిరి, నరేష్, శ్రీనివాస్, చందు, వెంకటేష్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్ల పంట పండింది
జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ పంటల ఉత్పత్తి పెరగడంతో పలు మార్కెట్లకు ఆదాయం పెరిగింది. గతేడాది వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ శాఖ జిల్లా పరిధిలోని 14 మార్కెట్లకు రూ.35 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఈ యేడాది మార్చి 31 నాటికి రూ.33.94కోట్లు ఫీజుల రూపంలో వసూలైంది. లక్ష్యానికి చేరువలోకి రావడమేకాక, గతేడాది కంటే ఎక్కువ ఆదాయం సమకూరింది. వచ్చిన ఆదాయం వివరాలు.. (రూ.లలో) మార్కెట్ 2024–25 2023–24సిద్దిపేట 361.04 366.24చిన్నకోడూరు 187.12 162.77నంగనూరు 127.51 80.41తొగుట 70.06 35.08దౌల్తాబాద్ 150.05 86.89కొండపాక 138.29 73.00మిరుదొడ్డి 141.92 58.27దుబ్బాక 195.70 195.43బెజ్జంకి 269.61 267.54హుస్నాబాద్ 456.57 403.47కోహెడ 121.37 112.12గజ్వేల్ 481.23 346.73చేర్యాల 481.04 357.84వంటిమామిడి 212.76 173.06సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని 14 వ్యవసాయ మార్కెట్లలో ఫీజుల రూపంలో అధికంగా డబ్బులు వసూలు చేసి గజ్వేల్ టాప్‌లో నిలువగా, తొగుట మార్కెట్ లాస్ట్‌లో నిలిచింది. నిర్దేశించిన లక్ష్యం కంటే చిన్నకోడూరు, నంగనూరు, మిరుదొడ్డి, బెజ్జంకి, గజ్వేల్, చేర్యాలలో అధికంగా ఆదాయం వచ్చింది. కోహెడ, సిద్దిపేట, తొగుట, దౌల్తాబాద్, కొండపాక, దుబ్బాక, హుస్నాబాద్, ఒంటిమామిడి మార్కెట్లు మార్కెటింగ్ శాఖ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేదు. పౌరసరఫరాల సంస్థ ద్వారా ధాన్యం, మార్కెఫెడ్ ద్వారా పొద్దుతిరుగుడు గింజలు, సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు మార్కెట్ ఫీజులతో ఆదాయం మార్కెట్లకు వస్తోంది. పెరిగిన ఆదాయం 2023–24 సంవత్సరానికి రూ.27.18కోట్లు రాగా 2024–25కు రూ.33.94కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది కంటే రూ.6.76 కోట్ల ఆదాయం పెరిగింది. మార్కెట్ ఫీజులు, లైసెన్స్ రెన్యూవల్స్, వ్యవసాయ శాఖ చెక్ పోస్టుల ద్వారా మార్కెట్లకు ఆదాయం వస్తోంది. పలు చోట్ల రైతు బజార్, సమీకృత మార్కెట్, మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లతో పాటు గదుల అద్దెల ద్వారా, పశువుల సంత ద్వారా ఆదాయం సమకురుతోంది. దీంతో కొన్ని మార్కెట్లకు ప్రతి యేడాది ఆదాయం పెరుగుతూ వస్తోంది.జిల్లా వ్యాప్తంగా రూ.33.94 కోట్ల ఆదాయం గజ్వేల్‌లో ఎక్కువ.. తొగుటలో తక్కువ గతేడాది రూ.27.18 కోట్లే.. లక్ష్యం చేరుకోని పలు మార్కెట్లు గతేడాది కంటే అధిక ఆదాయం జిల్లాలో వ్యవసాయ శాఖ చెక్ పోస్టులను కట్టుదిట్టం చేశాం. కార్యదర్శులందరూ సమష్టి కృషితో గతేడాది కంటే అధిక ఆదాయం వచ్చింది. నిర్దేశించిన టార్గెట్‌ను పలు మార్కెట్లు చేరుకోలేదు. వాటిపై ప్రత్యేక ఫోకస్ పెడతాం. రైతులు పండించిన పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నాం. – నాగరాజు, మార్కెటింగ్ అధికారి -
మిషన్ భగీరథ ఎస్ఈగా వెంకట్‌రెడ్డి
సిద్దిపేటజోన్: జిల్లా మిషన్ భగీరథ సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ)గా వెంకట్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం ఆయన కలెక్టర్ మనుచౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు. వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇటీవల ఎస్ఈ చారి పదవీ విరమణ పొందడంతో మహబూబ్‌నగర్ జిల్లా గ్రిడ్ ఈఈగా పనిచేసిన వెంకట్ రెడ్డి పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన ఇన్చార్జ్ డీటీఓ సిద్దిపేటరూరల్: జిల్లా రవాణా శాఖ ఇన్చార్జి అధికారిగా బాధ్యతలు స్వీకరించిన క్రిష్టఫర్ బుధవారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. డీటీఓగా ఉన్న కొండల్‌రెడ్డి పదవీ విరమణ పొందారు. దీంతో గజ్వేల్ రవాణా శాఖ అధికారిగా కొనసాగుతున్న క్రిష్టఫర్‌ను ఇన్చార్జ్ డీటీఓగా ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.పథకాలు సద్వినియోగం చేసుకోండి అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సిద్దిపేటజోన్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అద నపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రం భారత్‌నగర్‌లోని 35 రేషన్‌షాప్‌లో ఆమె సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇక ప్రతి నెలా సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని, పేదలు ఉపయోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి తనూజ, తహసీల్దార్ సలీమ్ మియ్యా పాల్గొన్నారు. కమ్యూనికేషన్ సీఐగా శ్యాంసుందర్ సిద్దిపేటకమాన్: పోలీసు కమిషనరేట్ కమ్యూనికేషన్ సీఐగా శ్యాంసుందర్ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు శ్యాంసుందర్ సీపీ అనురాధను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత మెరుగుపర్చాలని సీపీ సీఐకి సూచించారు. ఆన్లైన్ మోసాలపై అప్రమత్తత అవసరం సిద్దిపేటకమాన్: ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్‌లు, సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహనతోపాటు, అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పీఎస్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ వాసుదేవరావు సూచించారు. సైబర్ జాగృక్ దివాస్ సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ విద్యార్థినులకు సైబర్ నేరాలపై బుధవారం వారు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తులు చేసే ఫోన్ కాల్స్, మేసేజ్‌లకు ఎవరూ స్పందించకూడదని తెలిపారు. ఏటీఎం పిన్, ఓటీపీ, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు ఇతరులకు తెలపకూడదని సూచించారు. ఆన్లైన్ బెట్టింగ్‌ల జోలికి వెళ్లకూడదన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
రాజ్యాంగాన్ని అవమానిస్తే సహించం
గజ్వేల్: భారత రాజ్యాంగాన్ని అవమాన పరిచేవిధంగా పాలన కొనసాగిస్తున్న బీజేపీ తీరును ప్రజ ల్లో ఎండగడతామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మ న్ ప్రీతమ్ అన్నారు. టీపీసీసీ పిలుపుమేరకు ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ నినాదంతో నిర్వహిస్తున్న గ్రామస్థాయి పాదయాత్రను బుధవారం గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రీతమ్ మాట్లాడుతూ నిండు పార్లమెంట్లో భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కేంద్రమంత్రి అమిత్‌షా అవమానించారని మండిపడ్డారు. అంబేడ్కర్‌పై అహంకారపూరితంగా చేసిన వ్యాఖ్యలను దేశ ప్రజలంతా గమనించారన్నారు. గ్రామస్థాయి పాదయాత్రల ద్వారా బీజేపీ విధానాలను ప్రజల్లో తిప్పి కొడతామని హెచ్చరించారు. డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమీటీ చైర్మన్ వంటేరు నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, నాయకులు పాల్గొన్నారు. బీజేపీ తీరును ప్రజల్లో ఎండగడతాం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ప్రీతమ్ అక్కారంలో ‘జై బాపు, జై భీమ్,జై సంవిధాన్’ పాదయాత్ర పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి -
దుండగులను శిక్షించాల్సిందే
మిరుదొడ్డి(దుబ్బాక): ప్రజా యుద్ధనౌక గద్దర్‌పై కాల్పులు జరిపిన వారిని శిక్షించాల్సిందేనని డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్) జాతీయ కార్యదిర్శి పి. శంకర్ డిమాండ్ చేశారు. నిందితులను శిక్షించడంలో పాలకుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ ఈ నెల 6న హైదరాబాద్‌లో నిర్వహించే ‘ప్రశ్నించే గొంతులు–అణచివేత’లపై నిరసన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల పరిధిలోని లింగుపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం గద్దర్ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్దర్‌పై కాల్పులు జరిపిన వారిని శిక్షించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వమైనా దుండగులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘం నాయకులు జోగ్గారి బాల్ నర్సు, నర్సింహులు, మహేష్, రాజు, భిక్షపతి, బాలరాజు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
చలివేంద్రాలతో ఎంతో మేలు
సిద్దిపేటకమాన్: ఎండల తీవ్రత పెరుగుతోందని, నిత్యం గ్రామాల నుంచి కేసుల నిమిత్తం కక్షిదారులు వస్తుంటారని వారి దాహార్తిని తీర్చడానికి చలి వేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని న్యాయమూర్తి బుధవారం ప్రారంభించారు. అనంతరం కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేసవిలో మంచినీటిని ఎక్కువగా తాగాలని సూచించారు. న్యాయమూర్తులు స్వాతిరెడ్డి, మిలింద్‌కాంబ్లి, చందన, తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్థన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తాటికొండ రమేష్‌బాబు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఆర్యవైశ్యులు రాజకీయంగా రాణించాలి
జగదేవ్‌పూర్(గజ్వేల్): ఆర్యవైశ్యులు రాజకీయంగా రాణించాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. బుధవారం జగదేవ్‌పూర్ మండల ఆర్యవైశ్య నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని స్థానిక ఎస్వీ ఫంక్షన్హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి సుజాతతో పాటు డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుజాత మాట్లాడుతూ సమాజ సేవలో ఆర్యవైశ్యులు ముందుంటారని, నూతన మండల కమిటీ సభ్యులు సైతం సామాజిక కార్యక్రమాల్లో ముందుండాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ఆర్యవైశ్య ప్రముఖులు శ్రీనివాసరావు, వెంకటేశం, నాగజ్యోతి, రామకృష్ణ, లక్ష్మణ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కోటి తలంబ్రాల దీక్ష అద్భుత ఘట్టం
జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ప్రియాంక గజ్వేల్‌రూరల్: కోటి తలంబ్రాల దీక్ష అద్భుత ఘట్టమని గజ్వేల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ప్రియాంక అన్నారు. భద్రాచల సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా 250 కిలోల గోటి తలంబ్రాలను సిద్ధం చేసేందుకు రామకోటి రామరాజుకు ఆ దేవస్థాన పాలకమండలి అప్పగించింది. గోటి తలంబ్రాలను సిద్ధం చేసి తిరిగి భద్రాచలంలో అప్పగించేందుకు తీసుకెళ్తున్న సందర్భంగా ప్రజ్ఞాపూర్‌లోని త్రిశక్తి అమ్మవారి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్జి ప్రియాంక మాట్లాడుతూ కోటి తలంబ్రాల దీక్షలో ప్రాంత ప్రజలను భాగస్వాములను చేయడం పట్ల రామకోటి రామరాజును అభినందించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో త్రిశక్తి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
చరిత్రాత్మకం: మంత్రి పొన్నం
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకంహుస్నాబాద్: దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించడం చరిత్రాత్మకమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని బుడగ జంగాల కాలనీలో తెల్లరేషన్ కార్డులదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 17,263 చౌక ధరల దుకాణాల ద్వారా 2.91 లక్షల రేషన్ కార్డులదారులకు సన్న బియ్యం పంపిణీ జరుగుతోందన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ఇంటికి చేరే ముందే వేరే వాళ్ళకు అమ్మడం, రేషన్ దుకాణాలకు వాపస్ ఇవ్వడం జరిగేదన్నారు. ఇక నుంచి సన్న బియ్యం అందరూ తీసుకుంటారన్నారు. అందరికీ ఆరోగ్యం బాగుండాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాలు కలగజేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం సన్న బియ్యం పఽథకం ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు. గజ్వేల్‌రూరల్: సన్నబియ్యం పంపిణీతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని ఆత్మకమిటీ చైర్మన్ మల్లారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ రేషన్ దుకాణంలో సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. గతంలో సరఫరా అయిన దొడ్డు బియ్యాన్ని తినకపోవడంతో అవి పక్కదారి పట్టేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు చెక్ పెట్టి, పేద ప్రజల కడుపు నింపే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇదిలా ఉండగా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సింగారంలో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమాల్లో ఏఎంసీ వైస్‌చైర్మన్ సర్ధార్‌ఖాన్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కేతకీలో కర్ణాటక ఎమ్మెల్సీల పూజలు
ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయంలో కర్ణాటక మాజీమంత్రి రాజశేఖర్ పాటిల్, ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ పాటిల్, భీమ్రావు పాటిల్ కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం ఆలయానికి వచ్చిన వారికి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మాజీ మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్, నాయకులు చంద్రశేఖర్ పాటిల్, మల్లయ్య స్వామి, రుద్రయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు. -
విగ్రహం తొలగించడం సరికాదు
సిద్దిపేటకమాన్: ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహం తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇది సరికాదని అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవిలయ్య అన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నంగునూరు మండలం ముండ్రాయి గ్రామంలో 16ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు పక్కన ఉన్న విగ్రహాన్ని తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఐదు గ్రామాలకు కూడలి వద్ద ఉన్న విగ్రహాన్ని తొలగించకుండా అక్కడ ఒక సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో బాబురావు, యాదగిరి, రాజు, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్‌సీయూ భూములు కాపాడండి
సీపీఎం జిల్లా నేత వెంకట్మావోచేర్యాల(సిద్దిపేట)/బెజ్జంకి(సిద్దిపేట)/మద్దూరు(హుస్నాబాద్): హెచ్‌సీయూ భూములను కాపాడాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొంగరి వెంకట్‌మావో పిలుపునిచ్చారు. యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ చేపట్టిన నిరసన కార్యక్రమాల సందర్భంగా మంగళవారం పలువురు ఎస్ఎఫ్ఐ, సీపీఎం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరన్నారు. యూనివర్సిటీ భూములను అమ్ముకొనే చర్యను వెంటనే మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో నాగరాజు, శ్రీహరి, ప్రభాకర్, మల్లేశం, కుమార్ తదితరులున్నారు. అదే విధంగా బెజ్జంకిలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి సాయికృష్ణ, అధ్యక్షుడు మహేశ్‌ను అరెస్టు చేశారు. మద్దూరు, దూల్మిట్ట మండలాల సీపీఎం కార్యదర్శులు ఎండీ షఫీ, రాజును పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.పోలీసుల అదుపులో సీపీఎం నాయకులు -
నిర్లక్ష్యం వహించే వైద్య సిబ్బందిపై చర్యలేవీ?
సీపీఎం జిల్లా నేత ఎల్లయ్యగజ్వేల్రూరల్: నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవడంలేదని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎల్లయ్య మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వాసుపత్రిలో ఆర్ఎంఓ డాక్టర్ రాముకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉదయం 10 గంటలు దాటినా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. చికిత్స కోసం వచ్చేవారికి వైద్యం అందించకుండా ఫోన్లు చూస్తూ కాలయాపన చేస్తున్నారని, దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరిస్తున్నారన్నారు. సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించేలా చొరవ చూపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రంగారెడ్డి తదితరులున్నారు. -
ఇందిరమ్మ డిజైన్లపై నిరుత్సాహం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు అంతగా ఉత్సాహం చూపడం లేదు. ఇళ్లను మంజూరు చేసిన రెండు నెలలు దగ్గర పడుతున్నా జిల్లాలో కనీసం 30 శాతం మంది లబ్ధిదారులు కూడా ముగ్గు పోసుకోలేదు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం సుమారు రెండు లక్షల వరకు దరఖాస్తులు రాగా, ఇందులో 1.36 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. సొంతంగా ఇంటి స్థలం ఆధారంగా ఎల్–1, ఎల్–2, ఎల్–3 జాబితాలుగా రూపొందించిన విషయం విదితమే. ఇందులో సొంత ఇంటి స్థలం ఉండి అర్హతలున్న వారికి ఈ ఇళ్ల నిర్మాణంలో మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ఇలా ఒక్కో మండలానికి ఒక గ్రామ పంచాయతీని ఎంపిక చేసి..ఆ గ్రామంలో ఉన్న లబ్ధిదారులందరికీ ఇళ్లు మంజూరు చేశారు. ఇలా జిల్లాలో మొదటి విడతలో 1,200 మంది లబ్ధిదారులకు గృహాలను మంజూరు చేశారు. ఈ ఏడాది జనవరిలో ఈ ఇళ్లను మంజూరు చేశారు. కానీ ఇప్పటి వరకు ఇందులో కేవలం 275 మంది లబ్ధిదారులే ముగ్గు పోసుకున్నారు. బేస్మెంట్ వరకు కట్టుకున్న లబ్ధిదారులు 21 మంది మాత్రమే కావడం గమనార్హం.ప్రారంభమైన ఇళ్ల నిర్మాణ పనులు ఇప్పటివరకు ముగ్గు పోసింది.. 30 శాతం మందే అతి తక్కువ విస్తీర్ణంలో నిర్మించుకునే ఇళ్లపై పెదవి విరుస్తున్న లబ్ధిదారులు వేరే డిజైన్లలో నిర్మించుకుంటే బిల్లులు మంజూరవుతాయా అని సందిగ్ధం -
చట్టాలపై అవగాహన అవసరం
జిల్లా జడ్జి స్వాతిరెడ్డి సిద్దిపేటరూరల్: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ, జడ్జి స్వాతిరెడ్డి విద్యార్థులకు సూచించారు. మంగళవారం చింతమడకలోని మహాత్మాజ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతిరెడ్డి మాట్లాడుతూ బాలల హక్కులపై ప్రతీ ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. విద్యార్థులు జీవితంలో విజయం సాధించాలంటే నిరంతరం కష్టపడాలన్నారు. అనంతరం ఎస్ఐ అపూర్వరెడ్డి మాట్లాడుతూ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో హక్కులపై అవగాహన ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మాధవీలత, అడ్వకేట్ అరవింద్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళల రక్షణకు పెద్దపీట సిద్దిపేటకమాన్: మహిళలు, చిన్నారుల రక్షణకు పెద్దపీట వేస్తున్నట్లు సీపీ అనురాధ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని షీటీమ్, యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అధికారులు, సిబ్బంది గత నెలలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. గత నెలలో 48మంది ఈవ్‌టీజర్లను పట్టుకుని కేసులు నమోదు చేసి, కౌన్సెలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. ఎవరైనా పోకిరీలు వేధించినా, వెంటపడినా డయల్ 100 లేదా షీటీమ్ వాట్సప్ నంబర్ 87126 67434కు సమాచారం అందించాలన్నారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశా.. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక: నియోజకవర్గ అభివృద్ధి కోస మే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో పాటు పలు అభివృద్ధి పనులు మంజూరు చేయాలని కోరిన వెంటనే సీఎం స్పందించడంతో కృతజ్ఞతలు తెలిపానన్నారు. దుబ్బాక రెవెన్యూ డివిజన్, రింగ్ రోడ్డుతో పాటు పలు రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. నాకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని, రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్ అడుగుజాడల్లోనే ముందుకు నడుస్తానని ఆయన అన్నారు. చక్రధర శర్మకు సన్మానం గజ్వేల్‌రూరల్: గౌరీభట్ల చిక్రధరశర్మను వీరశైవ లింగాయత్ సమాజం మంగళవారం సన్మానించింది. విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలను అందించింది. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండలం రిమ్మనగూడకు చెందిన గౌరీభట్ల చక్రధరశర్మ ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రిమ్మనగూడకు చెందిన వీరశైవ లింగాయత్ లింగ బలిజ సమాజం సభ్యులు చక్రధరశర్మ దంపతులకు శాలువా కప్పి సన్మానించారు. ‘యువ వికాసం’ సద్వినియోగం చేసుకోవాలి గజ్వేల్‌రూరల్: ప్రభుత్వం చేపట్టిన యువ వికాసం పథకాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని డీబీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణు సూచించారు. గజ్వేల్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి రంగాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. 14 వరకు గడువు పొడగించారని; ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నారాయణ, అరుణ్ పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
హుస్నాబాద్‌లోని ఈద్గా వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లింలుభక్తిశ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్ ముస్లింల అతి పెద్ద పండుగైన ఈద్–ఉల్–ఫితర్‌ను జిల్లా వ్యాప్తంగా సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనాలు చేసుకొని ఈద్ ముబారక్ చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు మైనార్టీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. – ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)ప్రార్థన చేస్తున్న చిన్నారిన్యూస్రీల్ -
మతాలకతీతంగా కలిసి నడుద్దాం
రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేటజోన్: మతాలకతీతంగా ప్రగతికి కలిసి నడుద్దామని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం రంజాన్ పర్వదినం సందర్భంగా స్థానిక ఎక్బాల్ మినార్ వద్ద రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ, ముస్లిం అనే భేదాలు లేకుండా సంతోషంగా పండుగలను నిర్వహించుకుంటున్నామని అన్నారు. కొంతమంది దుష్ట శక్తులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అందరూ ఓపిక, శాంతితో కలిసిమెలిసి ఉండి దేశ, రాష్ట్ర అభ్యున్నతికి సోదర భావంతో ఉండాలని సూచించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌తో పాటు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణంలోని పలువురు ముస్లిం సోదరుల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
మంత్రి ఈద్ ముబారక్
హుస్నాబాద్: రంజాన్ పండుగ సందర్భంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం పట్టణంలోని ముస్లిం నేతలు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపి స్వీట్స్ తినిపించారు. మాజీ ఎంపీటీసీ ఎండీ హస్సేన్‌తో పాటు పలువురి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, చిత్తారి రవీందర్ ఉన్నారు. -
బసవేశ్వరుడు చూపిన మార్గంలో నడవాలి
నారాయణఖేడ్: బసవేశ్వరుడు చూపిన మార్గంలోని నడుచుకోవాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ సూచించారు. నాగల్గిద్ద మండలం మావినెళ్లి గ్రామంలో జరుగుతున్న చెన్న బసవేశ్వర జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...మానవా ళికి బసవేశ్వరుడు ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో బాల్కి పీఠాధిపతి బసవలింగ పట్టదేవర, జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు నగేష్ షట్కార్, టీపీసీసీ సభ్యుడు శంకరయ్య స్వామి, యూత్ కాంగ్రెస్ నాయకులు సాగర్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాతర ఉత్సవాల్లో భాగంగా కుస్తీ పోటీలను నిర్వహించి గెలుపొందిన మల్లయోధులకు నగదు బహుమతులు అందజేశారు. -
నేటి నుంచి టోల్ మోత
వాహనదారులపై మరింత భారం తూప్రాన్: మండలంలోని అల్లాపూర్ శివారు 44వ నంబర్ జాతీయ రాహదారిపై ఏర్పాటు చేసిన టోల్గేట్ మీదుగా ప్రయాణం మరింత భారం కానుంది. 5 నుంచి 10 శాతం టోల్ రేట్లు పెంచినట్లు నేషనల్ హైవే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే వాహనదారులు టోల్గేట్ భారం అధికంగా ఉందని గగ్గోలు పెడుతుండగా, మరోమారు రేట్లు పెంచారు. అయితే ఏటా ఏప్రిల్ మొదటి వారంలో ధరలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించింది. పాత ధరలను చెల్లించలేకే కొందరు వాహనదారులు అల్లాపూర్, ఇమాంపూర్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. మరికొందరు పాలాట, శివ్వంపేట మండలం పోతారం గ్రామం మీదుగా వెళ్తున్నారు. నిత్యం ఈ టోల్గేట్ మీదుగా 12 నుంచి 15 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజువారి టోల్ గేట్ రూ. 12 లక్షల నుంచి రూ. 15 వరకు ఆదాయం ఉంటుంది. పెరిగిన ధరలతో వాహనదారుల జేబుకు చిల్లు పడనుంది. కాగా టోల్‌ప్లాజా ఏర్పాటు చేస్తున్న సమయంలో చుట్టూ 20 కిలోమీటర్ల వరకు వాహనదారులకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం రూ. 350 చెల్లించి నెలవారీ పాసులు పొందాలని అధికారులు సూచిస్తున్నారు. కాని టోల్‌ప్లాజా సమీప గ్రామాల ప్రజలు నిత్యం తూప్రాన్ పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సామగ్రి కోసం రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. ఇందుకు టోల్ రుసం ఎలా చెల్లించాలని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా నేషనల్ హైవే అధికారులు స్పందించి స్థానికులకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
కేసీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేత
ములుగు(గజ్వేల్): రంజాన్ పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర యువజన కార్యదర్శి మహ్మద్ జుబేర్పాష సోమవారం మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాత్రి ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసినట్లు ఆయన పేర్కొన్నారు. సీపీఎం మహాసభల ప్రతినిధిగా మల్లారెడ్డి సిద్దిపేటఅర్బన్: తమిళనాడులోని మదురైలో ఏప్రిల్ 2 నుంచి 6 వరకు ఐదు రోజుల పాటు జరగనున్న సీపీఎం జాతీయ మహాసభల ప్రతినిధిగా పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర స్థాయిలో ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన నాయకులను జాతీయ మహాసభలకు ప్రతినిధులుగా ఆహ్వానిస్తారని పేర్కొన్నారు. మల్లారెడ్డి జాతీయ మహాసభలకు ప్రతినిధిగా ఎంపికవడం పట్ల పార్టీ శ్రేణులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు. ఆర్టీసీ సేవలపై సర్వేసిద్దిపేటకమాన్: ఆర్టీసీ నుంచి అందుతున్న సేవలపై సర్వే నిర్వహించారు. ఈ మేరకు సోమవారం సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్‌లో డిపో మేనేజర్ రఘు ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ రీజినల్ మేనేజర్ కృష్ణమూర్తి హాజరై మాట్లాడారు. సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశానుసారం సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ప్రయాణికులతో మాట్లాడి, ఆర్టీసీ నుంచి అందుతున్న సేవలపై సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. ‘వట్టికోట’ పదవీ విరమణవర్గల్(గజ్వేల్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచగిరి నాచారం గుట్ట లక్ష్మీనృసింహస్వామి దేవస్థాన ఉప ప్రధాన అర్చకుడు వట్టికోట కృష్ణమాచార్యులు సోమవారం పదవీ విరమణ పొందారు. 45 ఏళ్ల పాటు సుధీర్ఘకాలం ఆయన నాచగిరీశుని సన్నిధిలో సేవలందించారు. రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారం పొందారు. పదవీ విరమణ సందర్భంగా ఆలయ ముఖమండపంలో ఆయనను దేవస్థాన సిబ్బంది, అర్చకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంలో తనకు ప్రతి ఒక్కరి సహకారం అందిందన్నారు. అదేస్థాయిలో ఆలయ అభివృద్ధి కోసం అందరూ కృషిచేయాలన్నారు. సీనియర్ అసిస్టెంట్ సుధాకర్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆలయ అర్చకులు జగన్నాథాచార్యులు, హరిప్రసాద్‌శర్మ, నాగరాజుశర్మ, నరేందర్‌గౌడ్, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. -
నేత్రపర్వం.. శతఘటాభిషేకం
వర్గల్(గజ్వేల్): ఉగాది పర్వదినవేళ నాచగిరీశుని సన్నిధిలో అష్టాత్తర శతఘటాభిషేకం నేత్రపర్వం చేసింది. గర్భగుడిలో విశేషాలంకరణలో కొలువైన లక్ష్మీనృసింహుల దివ్యదర్శనంతో భక్తజనావళి తరించింది. పన్నెండు రోజులు ఆధ్యాత్మిక పరిమళాలు పంచిన బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఆలయ ముఖమండపంలో అర్చకులు 108 కలశాలు స్థాపన చేశారు. మహాపూర్ణ కలశంతో ఆలయ ప్రదక్షిణ జరిపారు. నృసింహ నామాలు, మంత్రోచ్ఛారణల మధ్య గర్భగుడిలో మూలవరులకు మహాభిషేకం జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి హరిద్రలో పుణ్యస్నానాలాచరించారు. వేడుకలలో పాల్గొని, స్వామివారిని దర్శించుకుని తరించారు. -
రంజాన్ వేడుకలకు సిద్ధం
మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రంజాన్ పండుగ నిర్వహించుకునేందుకు జిల్లాలోని ముస్లింలు సిద్ధమయ్యారు. సోమవారం పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముస్లింలు తమ కుంటుబ సభ్యులు, మిత్రులతో సంతోషంగా రంజాన్ పండుగను నిర్వహించుకోవాలని మాజీమంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బెజ్జంకికి వ్యవసాయ కళాశాల మంజూరు బెజ్జంకి(సిద్దిపేట): మండలానికి గురుకుల మహిళా వ్యవసాయ కళాశాల మంజూరైనట్లు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహిస్తున్న ఈ కళాశాలను బెజ్జంకి మండలానికి మార్చుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నందన్నారు. వ్యవసాయ కళాశాలను మంజూరు చేసిందుకు సీఎం రేవంత్‌రెడ్డికి, సహకరించిన మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రత్నాకర్‌రెడ్డి, ఏఎంసీ వెస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అలరించిన కుస్తీ పోటీలు కల్హేర్(నారాయణఖేడ్): ఉగాది ఉత్సవాల నేపథ్యంలో మండలంలోని మార్డిగ్రామంలో, సిర్గాపూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కుస్తీ పోటీలు విశేషంగా అలరించాయి. విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతి అందజేశారు. చివరి కుస్తీ పోటీ విజేతకు వెండి కడియం అందజేశారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు గుర్రపు మశ్చేందర్, బీఆర్ఎస్ నాయకులు సంజీవరావు, మాజీ ఎంపీటీసీ రాజుకుమార్ సిగ్రె, తదితరులు పాల్గొన్నారు. సంతాప ర్యాలీ సంగారెడ్డి జోన్: ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంతాపాన్ని తెలియజేస్తూ ఆదివారం యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం, సంగారెడ్డి నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో శాంతిర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో యూసీఎఫ్ అధ్యక్షుడు రూబెన్రెడ్డి, ఉపాధ్యక్షుడు మధుమోహన్, జనరల్ సెక్రటరీ సునీల్ జయ కుమార్ పాల్గొన్నారు. -
ఉద్యోగ విరమణ ఫలమేదీ?
ప్రాజెక్ట్ టీచర్లు ఆయాలు దుబ్బాక 02 13 సిద్దిపేట 0 24 చేర్యాల 01 18 హుస్నాబాద్ 05 13 గజ్వేల్ 04 22 ● అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఎదురు చూపులు ● 9 నెలలుగా ప్రయోజనాలు అందక అవస్థలు ● జిల్లాలో రిటైర్డు అయిన 12 మంది టీచర్లు, 90 మంది ఆయాలు అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు ఉద్యోగ విరమణ పొందారు.. కానీ నేటికీ ప్రయోజనాలు అందలేదు. 65 ఏళ్లు నిండిన వారిని ప్రభుత్వం పదవీ విరమణ ప్రకటించింది. అంగన్వాడీ టీచర్‌కు రూ.2లక్షలు, ఆయాకు రూ.లక్ష చొప్పున ఇస్తామని తెలిపింది. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతోపాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలదే ముఖ్య పాత్ర. గతంలో వీరికి ఉద్యోగ విరమణ గడువు ఉండేది కాదు. కానీ గతేడాది జూన్ 30వ తేదీకి 65 ఏళ్లు నిండిన అంగన్వాడీలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న టీచర్లు, ఆయాలు మొత్తం 102 మంది ఉద్యోగ విరమణ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సాక్షి, సిద్దిపేట: అంగన్ వాడీ టీచర్లు, ఆయాల్లో కొందరు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సేవలు అందించారు. 1985లో విధుల్లో చేరిన వారు గతేడాది జూన్30న ఉద్యోగ విరమణ చేశారు. నాలుగు దశాబ్దాల కాలంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారు వివిధ రకాల ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బూత్‌లెవల్ అధికారిగా, పల్స్ పోలియో, వివిధ సర్వేలను విజయవంతం చేయడంలో కీలక పాత్రను పోషించారు. ప్రతి చిన్న కార్యక్రమానికి వారిని వినియోగించారు. పదవీ విరమణ పొంది 9నెలలు గడిచినా ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అందించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఉద్యోగికై నా ఉద్యోగ విరమణ తర్వాత ఎంతో కొంత డబ్బులు వస్తే వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుంది. టీచర్. ఆయాగా విధులు నిర్వర్తించినప్పుడు నెల నెల జీతం వచ్చేది. పదవీ విరమణ డబ్బులైనా వస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయని వాపోతున్నారు. ఇదేనా గుర్తింపు? నాలుగు దశాబ్దాల పాటు చిన్నారులు. బాలింతలు, గర్భిణులు సేవలందించిన వారికి ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు ఇదేనా అని అంగన్ వాడీ యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్లను వెంటనే విడుదల చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పదవీ విరమణ పొందిన అంగన్వాడీ టీచర్లకు పింఛన్ నెలకు రూ. 6వేలు, ఆయాలకు రూ. 4వేలు అందించాలని యూనియన్ నాయకులు విన్నవించారు.. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రిటైర్మెంట్ బెన్ఫిట్స్ ఇప్పించాలని రిటైర్డ్ అయిన టీచర్లు, ఆయాలు కోరుతున్నారు. -
అందరికీ శుభాలు కలగాలి
హుస్నాబాద్: నూతన తెలుగు సంవత్సరాది నుంచి అందరికీ శుభాలు కలగాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణం కార్యక్రమంలో మంత్రి పొన్నం దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. షడ్రుచుల పచ్చడి, బక్ష్యాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మట్లాడుతూ సమృద్ధిగా పాడి పంటలతో అందరూ సుఖంగా జీవించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆకుల రజిత, మాజీ కౌన్సిలర్లు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. మున్సిపల్ అభివృద్ధికి రూ.10 కోట్లు మున్సిపల్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు రూ.10 కోట్లు మంజూరైనట్లు సీడీఎంఏ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. చైతన్య పాఠశాల నుంచి పెట్రోల్ బంక్ వరకు సెంట్రల్ లైటింగ్ ప్లాంటేషన్ కోసం రూ.కోటి, మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు వరకు రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణం కోసం రూ.5 కోట్లు మంజురయ్యాయి. అలాగే కొత్త చెరువు సుందరీకరణకు రూ.2కోట్లు, హుస్నాబాద్ మున్సిపల్ స్వాగత తోరణాల ఏర్పాటుకు రూ.1.20 కోట్లు మంజూరయ్యాయన్నారు. నూతన జంక్షన్ల అభివృద్ధి కోసం రూ.80 లక్షలు మంజూరయ్యాయి. ప్లాస్టిక్‌ను నివారిద్దాం.. ప్లాస్టిక్‌ను నివారిద్దామని, స్టీల్ గ్లాస్లు మేలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం పట్టణంలోని హోటల్ యాజమానులకు స్టీల్ గ్లాస్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగడం వల్ల అనారోగ్యాలకు గురవుతామన్నారు. పట్టణంలో 50 హోటల్స్ ఉన్నాయని, ప్రతి హోటల్‌కు వంద గ్లాస్‌ల చొప్పున పంపిణీ చేశామన్నారు. చిన్న గ్రామాల్లో 500 కిట్స్, పెద్ద గ్రామాల్లో 1000 కిట్స్ చొప్పున స్టీల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు -
ఆధ్యాత్మికతతోనే గుణాత్మక మార్పు
●వారి అకౌంట్లలోనే జమ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలుగా పదవీ విరమణ పొందిన వారి వివరాలను పంపించాం. వారికే నేరుగా బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం నిర్ణయించిన డబ్బులు జమ కానున్నాయి. –లక్ష్మీకాంతరెడ్డి, డీడబ్ల్యూఓసిద్దిపేటజోన్: ఆధ్యాత్మికతతోనే మనుషుల్లో గుణాత్మక మార్పు సాధ్యమని, ఆదిశగా ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి స్థానిక బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రుక్మాబాట్ల నర్సింహాశర్మ పంచాంగ శ్రవణం చేశారు. పంచాంగ శ్రవణ కార్యక్రమానికి వచ్చిన వారిని ఉద్దేశించి హరీశ్‌రావు మాట్లాడారు. మనిషి సత్ మార్గంలో పయనించాలని, అందుకు ఆధ్యాత్మికత అవసరమన్నారు. రేపటి తరానికి సంస్కృతి నేర్పిద్దామన్నారు. విదేశాల్లో పండుగలు, దేవాలయాలు, పూజలు చేస్తూ మన సంస్కృతి కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సమాజాన్ని నడిపించే బాధ్యత అందరిపై ఉందన్నారు. కోమటి చెరువు వద్ద టీటీడీ ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేయనున్నట్టు తెలిపారు. అనంతరం పలువురు కవులను సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ రోజాశర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, పరిషత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మ దేవాలయంలో పూజలు చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని కొండెంగలకుంటలో పెద్దమ్మ దేవాలయ వార్షికోత్సవాల్లో హరీశ్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దమ్మ ఆశీస్సులు మనందరిపై ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. రేపటి తరాలకు సంస్కృతిని నేర్పిద్దాం ఎమ్మెల్యే హరీశ్ రావు -
మిగిలింది ఒక్క రోజే..
నిబంధనల అమలుపై అనుమానాలు మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల తగ్గింపు వ్యవహారంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికారులు నిబంధనలు పాటించడం లేదని విమర్శలు కూడా వస్తున్నాయి. పన్నుల వసూలు లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలనే ఆరాటామా..? ఇతర కారణాలో తెలియదు కానీ కొందరికి పన్నులు తగ్గించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ కారణాలతో ప్రాపర్టీ టాక్స్ తగ్గించాలని ఆయా మున్సిపాలిటీల్లో ఎంతోమంది దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తులను స్వీకరించిన అధికారులు.. నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. పెండింగ్‌లో ఉన్న ట్యాక్స్ మొత్తం రికవరీ చేసి, ఆ తర్వాత టాక్స్ తగ్గింపునకు సంబంధించిన ప్రక్రియను చేపట్టాలి. దీనికి తగినంత సమయం కూడా తీసుకోవాలి. కానీ అందుకు భిన్నంగా తగ్గించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆస్తి పన్నుల వసూళ ్లలక్ష్యం పూర్తయ్యేనా? ● సిద్దిపేట, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలు ముందంజ ● ఆ రెండు ప్రాంతాల్లో80శాతానికిపైగా వసూలు ● వెనుకబడిన హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల గజ్వేల్: జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్–ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్‌తోపాటు చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో సిద్దిపేట ఏటా రూ. 16.81కోట్లకుపైగా ఆదాయంతో అగ్రస్థానంలో ఉంది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ రూ.4.81కోట్లతో రెండోస్థానంలో ఉండగా.. మిగతా మున్సిపాలిటీలు రూ.1.5–3కోట్లతో తర్వాత స్థానాలను ఆక్రమిస్తున్నాయి. సిద్దిపేట, గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌లో.. సిద్దిపేట మున్సిపాలిటీలో 36,136 ఇళ్లు ఉండగా ఆస్తి పన్నుల రూపంలో రూ.16.81కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. ఈనెల 29 వరకు రూ.14కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ.2.81కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఈ లెక్క ప్రకారం 83.28శాతం లక్ష్యాన్ని సాధించారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 12,419 ఇళ్లు ఉన్నాయి. ఆస్తి పన్ను రూపంలో రూ.4.81కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా ఈనెల 29నాటికి రూ.3.92 కోట్ల పన్నులు వసూలు చేశారు. 81.50శాతం లక్ష్యాన్ని సాధించారు. గతంలో ఈ మున్సిపాలిటీ 95శాతానికిపైగా లక్ష్యాన్ని సాధించగలిగింది. కానీ ఈసారి మల్లన్నసాగర్ నిర్వాసితుల కాలనీ ఇందులో కలవడం, ఆ కాలనీలో అనుకున్న స్థాయిలో పన్నుల వసూలు జరగక వెనుకబడినట్లు అధికారులు చెబుతున్నారు. వసూళ్లలో నత్తనడక.. హుస్నాబాద్ మున్సిపాలిటీలో 7,286 ఇళ్లకు రూ.1.73కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయడం లక్ష్యంగా ఉంది. కానీ ఈనెల 29వరకు 1.28కోట్ల మాత్రమే వసూలు చేసి 73.99శాతం లక్ష్యాన్ని సాధించారు. దుబ్బాకలో 6,209 ఇళ్లు ఉన్నాయి. రూ.2.03కోట్ల ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యానికి రూ.1.48కోట్లు రాబట్టారు. ఇకపోతే చేర్యాల మున్సిపాలిటీలో 5,162 ఇళ్లకు రూ.3.06కోట్లు వసూళ్లు వసూలు చేయాల్సి ఉంది. ఈనెల 29వరకు కేవలం రూ.1.95కోట్లు వసూలు చేసి 63.73లక్ష్యాన్ని సాధించారు. రాష్ట్రంలోని 139 మున్సిపాలిటీల్లో ఒకటి, రెండు మినహా మిగతావి వందశాతం లక్ష్యాన్ని సాధించకపోవడంతో ఉగాది, రంజాన్ సెలవులను సైతం రద్దు చేసి ఆస్తిపన్నుల వసూళ్ల స్పెషల్ డ్రైవ్‌కు ఆదేశాలిచ్చారు. మొత్తానికి ఈనెల 31 తేదీ మాత్రమే మిగిలిఉంది. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూలు లక్ష్యం వందశాతం పూర్తికావడం అనుమానంగానే ఉంది. సిద్దిపేట, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీల్లో ఈనెల 29 వరకు 80శాతానికిపైగా వసూళ్లు చేపట్టారు. హుస్నాబాద్, దుబ్బాక మున్సిపాలిటీలు మాత్రం వెనుకబడ్డాయి. ఈ నెలాఖరు వరకు గడువు నేపథ్యంలో ఏ మేరకు లక్ష్యాన్ని సాధిస్తారో వేచి చూడాల్సిందే. -
జాన్ వెస్లీ అరెస్టు అప్రజాస్వామికం
సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి సిద్దిపేటఅర్బన్: పభుత్వ భూములను ఆక్రమించుకున్న రామోజీ గ్రూపు యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని పోరాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో పాటు రంగారెడ్డి జిల్లా నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. సిద్దిపేటలోని కార్మిక, కర్షక భవన్లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల క్రితం ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం స్థలాలను కేటాయిస్తే ఆ స్థలాలను రామోజీ యాజమాన్యం ఆక్రమించి పట్టాలున్న పేదలను స్థలంలోకి రాకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వం రామోజీ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు గోపాలస్వామి, శశిధర్ పాల్గొన్నారు. -
పదోన్నతులతో మరింత బాధ్యత
సీపీ అనురాధ సిద్దిపేటకమాన్: పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని సీపీ అనురాధ తెలిపారు. పోలీసు కమిషనరేట్ పరిధి భూంపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ఏఎస్ఐ నుంచి ఎస్ఐగా పదోన్నతి పొందిన జె.బాలమల్లయ్య, సీఏఆర్ హెడ్ క్వార్టర్లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున ఏ.వెంకట్‌రెడ్డి హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. దీంతో వారు మర్యాదపూర్వకంగా సీపీని గురువారం కలవడంతో వారిని సీపీ అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదోన్నతులు పొందిన సిబ్బంది రెట్టింపు ఉత్సాహాంతో ప్రజలకు సేవలందించాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కార్తీక్, రాష్ట్ర పోలీసు సంఘం ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. మహిళల రక్షణకు పెద్దపీట మహిళల రక్షణకు పెద్దపీట వేయాలని సీపీ అనురాధ తెలిపారు. గజ్వేల్ డివిజన్ పోలీసు అధికారులతో సీపీ కార్యాలయంలో పెండింగ్ కేసులపై గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీపీ మాట్లాడుతూ..పోక్సో, క్రైమ్ కేసులలో నిందితులను వెంటనే అరెస్టు చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ లేజర్ గన్‌తో కేసులు నమోదు చేయాలన్నారు. క్రికెట్ బెట్టింగ్స్పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రేపటి నుంచి సిటీ పోలీస్ యాక్ట్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈనెల 29 నుంచి సిటీ పోలీస్‌యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ అనురాధ తెలిపారు. ఏప్రిల్ 13 వరకు నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆమె తెలిపారు. -
కాయకల్ప బృందం సందర్శన
గజ్వేల్‌రూరల్: గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని కాయకల్ప బృందం గురువారం సందర్శించింది. హైదరాబాద్‌లోని గోల్కొండ ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని కాయకల్ప బృందం ప్రభుత్వాస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్, లేబర్రూమ్తో పాటు పలు వార్డులను పరిశీలించింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాయకల్ప బృందం సభ్యులు శ్రీనివాస్, పద్మావతి, విజేత, ఫాతిమ, మేరి, సుష్మిత, మనోజ్‌లతో పాటు ప్రభుత్వాస్పత్రి వైద్యులు పాల్గొన్నారు. -
బెల్ట్‌షాపులు తొలగించండి
అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక: పల్లెల్లో పచ్చని కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యం బెల్ట్ షాపులను తొలగించాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విన్నవించారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఏ గ్రామానికి వెళ్లినా బెల్ట్ షాప్‌లను తొలగించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. పల్లెల్లో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరుగుతుండటంతో యువత పెడదారి పడుతోందన్నారు. రోడ్డు ప్రమాదాలు సైతం జరుగుతుండటంతో ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అలాగే ఆర్థికంగా బాధిత కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్న ప్రభుత్వం.. ముందుగా బెల్ట్‌షాపులను తొలగించి అండగా నిలవాలన్నారు. బ్రిడ్జిని పూర్తి చేయండి దుబ్బాక నియోజకవర్గంలో కూడవెల్లి వాగుపై మిరుదొడ్డి మండలం అల్వాల వద్ద బ్రిడ్జి నిర్మాణం ఏళ్లుగా పిల్లర్ల దశలోనే నిలచిపోయిందని ప్రస్తావించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడితే నాలుగైదు మండలాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. వానాకాలంలో వరద వస్తే రాకపోకలు బంద్ అవుతాయని, దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం దీనిపై దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని కోరారు. దరఖాస్తుల గడువు పెంపు ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పొడిగించారు. 2024– 25 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువును మే 31 వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి హమీద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జమిలి ఎన్నికలపై అవగాహన కల్పించండి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఒకే దేశం, ఒకే ఎన్నికతో ప్రజాస్వామ్య అభివృద్ధికి నాంది పలుకుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ అన్నారు. గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఒకే దేశం, ఒకే ఎన్నిక జిల్లా కన్వీనర్ నలగామ శ్రీనివాస్ అధ్యక్షతన వర్క్ షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బైరి శంకర్ పాల్గొని మాట్లాడారు. దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జమిలీ ఎన్నికలు నిర్వహించాలని, ప్రధాని మోదీ సారథ్యంలో పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టారన్నారు. జమిలి ఎన్నికల పై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కోకన్వీనర్ తోడుపునూరి వెంకటేశం, పార్లమెంట్ కో కన్వీనర్ చింత సంతోష్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు గుండ్ల జనార్దన్, మండల కన్వీనర్లు, కో కన్వీనర్లు పాల్గొన్నారు. పేదల సేవలోనే సంతృప్తి దుబ్బాకటౌన్: నిరుపేదలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉందని కలెక్టరేట్ ఏఓ అబ్దుల్ రెహమాన్ అన్నారు. రంజాన్ పురస్కరించుకుని గురువారం దుబ్బాక పట్టణంలో బిస్మిల్లా బైతుల్ మాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 55 మంది పేద ముస్లిం మహిళలకు 20 రకాల నిత్యావసర సరుకులతో కూడిన తోఫా, చీరలు, రూ.500 నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ సేవయే మాధవసేవగా భావించి పేదలకు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ సలీం మియా, ట్రస్ట్ అధ్యక్షుడు చాంద్‌మియా తదితరులు పాల్గొన్నారు. -
పోచమ్మకు బోనాలు
ఆలోచన అదిరె.. దృష్టి మరలె దేవక్కపల్లెలో రెడ్డిసంఘం ఆధ్వర్యంలో గురువారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా మహిళలు బోనాలతో ఆలయానికి తరలివెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని రెడ్డి సంఘం నాయకులు ఆకాంక్షించారు. – బెజ్జంకి(సిద్దిపేట)పశుపక్షాదుల నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు దిష్టి బొమ్మలను ఏర్పాటు చేస్తుంటారు. కానీ మిరుదొడ్డి మండలం లక్ష్మీనగర్‌లో ఓ రైతు బీర పంట చుట్టూ చీరలను ఏర్పాటు చేశారు. నర దిష్టి తగలకుండా ఉండేందుకు ఇలా చీరలను ఏర్పాటు చేసినట్లు రైతు చెబుతున్నారు. చీరలను పంట చుట్టూ ఏర్పాటు చేయడంతో అటుగా వెళ్తున్న ప్రతి ఒక్కరూ ఆసక్తిగా దృష్టి సారిస్తుండటం విశేషం. – మిరుదొడ్డి(దుబ్బాక) -
మహనీయుల చరిత్రను చాటుదాం
సమష్టిగా పనిచేద్దాం.. లక్ష్యం సాధిద్దాం● పన్నుల వసూలులో మున్సిపాలిటీని అగ్రగామిగా నిలుపుదాం ● చైర్పర్సన్ మంజుల సిద్దిపేటజోన్: ఆస్తి పన్ను, నల్లా పన్నులు వందశాతం వసూలు చేసి రాష్ట్రంలో సిద్దిపేట మున్సిపాలిటీని మొదటి స్థానంలో నిలుపుదామని చైర్ పర్సన్ మంజుల సూచించారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందుకు పాలకవర్గం, అధికార యంత్రాంగం సమష్టిగా లక్ష్యం సాధించాలన్నారు. మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది గురువారం నాటికి రూ.14.28కోట్లు వసూలు చేసిందని, మిగతా రూ.1.36 కోట్లను వసూలు చేయాలన్నారు. ఈ నెలాఖరులోగా లక్ష్యం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పట్టణ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కౌన్సిల్ పక్షాన మున్సిపల్ రెవెన్యూ సిబ్బందిని అభినందించారు. నల్లా కనెక్షన్లు ఉండి తాగునీరు సరఫరా లేని ప్రత్యేక కేసులను అధికారులు పరిశీలించాలన్నారు. అలాగే పట్టణంలో చాలా పురాతన ఇళ్లు ఉన్నాయని, వాటికి ఫ్యామిలీ మెంబర్, మరణ పత్రాల ఆధారంగా పేర్ల మార్పిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఆశ్రీత్ కుమార్ మాట్లాడుతూ.. త్వరలో పట్టణంలో నీటి నల్లా కనెక్షన్లు ఉండి తాగునీరు రాని వాటిపై సమీక్ష చేస్తామన్నారు. పేర్ల మార్పిడి అంశంపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు రంజాన్, బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు వినోద్, సుందర్, లక్ష్మణ్, బ్రహ్మం, నాగరాజు రెడ్డి, విఠోభ, మల్లికార్జున్, సతీష్, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటరూరల్: బాబు జగ్జీవన్‌రావు, బీఆర్ అంబేడ్కర్ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో వివిధ దళిత సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహనీయుల చరిత్రను నేటి యువతరానికి తెలిజేసే బాధ్యత అందరిపై ఉందన్నారు. వచ్చే నెల 5న బాబు జగ్జీవన్‌రావు, 14న బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాన్నారు. ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష చొప్పున గ్రాంట్‌ను మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి ఎండీ హమీద్, వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ దళిత నాయకులతో సమావేశం -
క్రమబద్ధీకరణ కష్టాలు
● ఒక్కప్లాటు కోర్టు కేసులో ఉన్నా.. సర్వే నంబర్లోని అన్ని ప్లాట్లు నిషేధిత జాబితాలోకే.. ● ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ తీరు.. అంతంత మాత్రంగానే స్పందనసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎల్ఆర్ఎస్ ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మార్చి 31లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తే 25శాతం డిస్కౌంట్ ఇస్తామని పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేసి ప్రచారం చేస్తోంది. కానీ ఎల్ఆర్ఎస్ చెల్లించేందుకు క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్య లెవల్–1 స్థాయి అధికారుల వద్ద పరిష్కారమవుతుందా.. లెవల్– 2 అధికారుల పరిధిలోకి వస్తుందా..? లెవల్– 3 అధికారుల వద్దకు వెళ్లాలా తెలియక తికమకపడుతున్నారు. ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నిషేధిత జాబితా కష్టాలు.. ఒక లేఅవుట్లోని సర్వేనంబర్‌లో సుమారు 200 ప్లాట్లు ఉంటే.. అందులో ఒకటీ.. రెండు ప్లాట్లు కోర్టు కేసుల్లో ఉంటే.. ఆ సర్వే నంబర్లోని అన్ని ప్లాట్లను నిషేధిత (ప్రొహిబీటెడ్) జాబితాలో చూపిస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక చాలామంది దరఖాస్తుదారులు మున్సిపాలిటీ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సంబంధిత సబ్ రిజిస్ట్రార్ నుంచి ఎన్ఓసీ తీసుకుని ఎల్–1 స్థాయి అధికారులను కలిస్తే సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నారు. కనిపించని ఓపెన్ స్పేస్‌లు.. అనధికారిక వెంచర్లు వేసిన అక్రమార్కులు చాలా చోట్ల ప్రజా అవసరాల కోసం కేటాయించాల్సిన 10 శాతం స్థలాలను (టెన్ పర్సెంట్ ల్యాండ్)లను కూడా ప్లాట్లుగా చేసి సొమ్ము చేసుకున్నారు. ఆయా కాలనీల్లో బడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పార్కు వంటి వాటి నిర్మాణం కోసం ఈ స్థలాలను కేటాయించాలి. నిబంధనల ప్రకారం ఈ 10 శాతం భూమిని సంబంధిత మున్సిపాలిటీ గానీ, గ్రామపంచాయతీ తన అధీనంలోకి తీసుకోవాలి. కానీ సంబంధిత అధికారులు వెంచర్ నిర్వాహకులతో చేతులు కలపడంతో ఈ ప్రజావసరాల ల్యాండ్ కూడా పరాధీనమైపోయింది. కానీ, ఈ అనధికారిక లేఅవుట్లో ప్లాటు కొన్నందుకు లేని ఓపెన్ స్పేస్‌కు చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి దరఖాస్తుదారులకు ఏర్పడింది. డాక్యుమెంట్స్ షార్ట్‌ఫాల్ పేరుతో.. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో చాలామందికి డాక్యుమెంట్ షార్ట్‌ఫాల్ అని వెబ్సైట్లో చూపుతోంది. అయితే ఏ డాక్యుమెంట్ అవసరమో సాధారణ దరఖాస్తుదారులకు తెలియడం లేదు. సేల్‌డీడ్, ఈసీ, లింక్‌డాక్యుమెంట్లు, లేఅవుట్కాపీ డాక్యుమెంట్లు అవసరం ఉంటాయి. వీటిని నీర్ణీత సైజులో స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అయితే అంతగా అవగాహన లేని వారికి ఈ సాకేంతిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. హెల్ప్‌డెస్క్‌ల్లో సమాచారం అంతంతే.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని మండలాల్లో ఎంపీడీఓ కార్యాలయాలు, మున్సిపాలిటీ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఈ డెస్క్‌ల్లో పనిచేస్తున్న సిబ్బందికి చాలామందికి ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో ఉన్న సాంకేతిక అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండటం లేదు. వీరికి శిక్షణ ఇచ్చినప్పటికీ.. చాలామందిలో అవగాహన అంతంత మాత్రంగానే ఉంటోంది. దీంతో ఆయా మున్సిపాలిటీల నుంచి, మండలాల నుంచి దరఖాస్తుదారులు కలెక్టరేట్లకు తరలివస్తున్నారు. -
కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు
తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తు హార్డ్ కాపీలను (దరఖాస్తు ఫారం, రేషన్ కార్డు, ఆధార్ కార్డుల జీరాక్స్‌లను, అప్లికేషన్ ఐడీ నంబర్) స్వీకరిస్తున్నారు. ఇలా కార్యాలయానికి తీసుకవచ్చిన వారివే అప్రూవల్ చేస్తున్నారు. హార్డ్ కాపీలను అందజేయని వారివి పెండింగ్‌లో పెడుతున్నారు. ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థను తీసుకువచ్చినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు దారులకు కష్టాలు తప్పడం లేదు. పలువురు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సర్టిఫికెట్ల కోసం డబ్బులు సైతం వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
గజ్వేల్‌లో నీటి కష్టాలు
‘మిషన్ భగీరథ’కు పట్టినిల్లు అయిన గజ్వేల్‌లోనే మంచినీళ్ల కష్టాలు మొదలయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గడపకు నల్లా ద్వారా మంచినీటిని అందించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టింది. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ప్రధాని మోదీ 2016 ఆగస్టు 7న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కానీ నేడు ఈ ప్రాంతానికి సరిపడా నీటి సరఫరా జరగకపోవడంతో నీటి కష్టాలు తప్పడంలేదు. ● ‘మిషన్ భగీరఽథ’కు అంకురార్పణ జరిగిన చోటే తగ్గిన నీటి సరఫరా ● రోజువారీ వినియోగం 70ఎంఎల్డీ పైనే.. ● సరఫరా అవుతోంది... 60లోపే ● రాబోవు రోజుల్లో కొరత తీవ్రమయ్యే అవకాశం ● మల్లన్నసాగర్ పైపులైన్ పూర్తయితే సమస్యకు పరిష్కారం మల్లన్నసాగర్ జలాశయం నుంచి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు ప్రత్యేక పైప్‌లైన్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. మల్లన్నసాగర్ నుంచి వచ్చే జలాలు కొండపాక మండలం మంగోల్ డబ్ల్యూటీపీ (వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్)లో శుద్ధి జరిగి అక్కడి నుంచి సరఫరా అవుతాయి. ఇక్కడి నుంచి లకుడారం వద్ద నిర్మించిన జీఎల్బీ (గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)కి వస్తాయి. ఇక్కడి నుంచి ప్రస్తుతం సిద్దిపేట, జనగామ జిల్లాలకు ప్రత్యేక లైన్ ద్వారా ఇప్పటికే నీటి సరఫరా జరుగుతోంది. ఇక్కడి నుంచి రూ.210కోట్ల వ్యయంతో 16కిలోమీటర్ల పొడవున గజ్వేల్ మండలం అక్కారం సంపు వరకు లైన్ నిర్మాణం జరుగుతోంది. మరో నెల రోజుల్లో ఈ పనులు పూర్తయితే హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ నుంచి నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి తప్పనుంది. అక్కారం సంపు నుంచి కోమటిబండ మిషన్ హెడ్‌వర్క్స్‌కు గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు సరిపడనంతగా నీరు రానుంది. మల్లన్నసాగర్ లైన్ పూర్తయితేనే.. గజ్వేల్: ‘మిషన్ భగీరథ’ పథకం దేశం దృష్టిని ఆకర్షించింది. గతంలో సిద్దిపేట ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో కేసీఆర్.. మానేరు ద్వారా సిద్దిపేటకు వాటర్‌గ్రిడ్ తరహాలో అందించిన నీటి పథకం తీరును పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా ‘మిషన్ భగీరథ’కు శ్రీకారం చుట్టారు. తొలి ఫలాలను గజ్వేల్ అందుకుంది. కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుకగా 2015 జూన్ 2న గజ్వేల్ వాటర్‌గ్రిడ్‌కు (గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలు) రూ.1,055కోట్లు మంజూరు చేశారు. హైదరాబాద్‌కు గోదావరి జలాలను తరలించే పైప్‌లైన్ నుంచి నీటిని ట్యాపింగ్ చేసి ఈ ప్రాంతానికి అందిస్తున్నారు. ఇందులో భాగంగానే కొండపాకలోని హెచ్ఎండబ్ల్యూఎస్ (హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్)ప్రాంగణం నుంచి, ప్రజ్ఞాపూర్ వద్ద పైప్‌లైన్ నుంచి నీటిని ట్యాపింగ్ చేస్తున్నారు. ప్రజ్ఞాపూర్ నుంచి పైప్‌లైన్‌ను ట్యాపింగ్ చేసి ఆ నీటిని ఎత్తయిన ప్రదేశంలో ఉన్న గజ్వేల్ మండలం కోమటిబండ అటవీ ప్రాంతంలోని సంప్‌హౌస్‌కు తరలించి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా గజ్వేల్ నియోజకవర్గంలోని 244 హాబిటేషన్లలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని కలుపుకుని మరో 65 గ్రామాలకు నీటి సరఫరా చేస్తున్నారు. దుబ్బాకకు సైతం ఇక్కడి నుంచే.. దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, చేగుంట, దౌల్తాబాద్ మండలాల్లోని 213 గ్రామాలకూ ఇక్కడి నుంచే మంచినీటి సరఫరా జరుగుతోంది. సరఫరా 60ఎంఎల్డీలోపే.. ప్రస్తుతం కోమటిబండలోని ‘మిషన్ భగీరథ’ హెడ్వర్క్స్నుంచి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు రోజువారీగా 70ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) నీటిని సరఫరా చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 60ఎంఎల్డీలోపే సరఫరా అవుతోంది. ట్యాపింగ్ పాయింట్ నుంచి ఇంతే నీరు వస్తుండటం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి నిత్యం 8ఎంఎల్డీ నీరు రావాల్సి ఉండగా.. 5ఎంఎల్డీ మాత్రమే వస్తున్నాయని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో నీరు సరిపోక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. త్వరలోనే పైపులైన్ పూర్తిచేస్తాం మల్లన్నసాగర్ నుంచి వచ్చే పైప్‌లైన్ నిర్మాణం పూర్తయితే గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు ఇక ఇబ్బంది ఉండదు. త్వరలోనే ఈ పనులు పూర్తిచేసి హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ ట్యాపింగ్ మూసేస్తాం. ప్రస్తుతానికి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రయత్నిస్తున్నాం. –శ్రీనివాస్, ఈఈ, గజ్వేల్ మిషన్ భగీరథ ఈనెల 21న మున్సిపాలిటీ పరిధిలోని 3, 4, 15, 16 వార్డులకు చెందిన ప్రజలు కమిషనర్ గొల్కొండ నర్సయ్యకు మంచినీటి సమస్యపై వినతి పత్రం ఇచ్చిన సంగతి కూడా తెల్సిందే. నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపాలిటీకి నిత్యం 6.3 ఎంఎల్డీ నీరు రావాల్సి ఉంది. అయితే 5.5ఎంఎల్డీ మాత్రమే వస్తుండటంతో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. కొండపాక మండలం లకుడారం గ్రామంలోనూ పైప్‌లైన్ సమస్య వల్ల నాలుగైదు రోజులపాటు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. తర్వాత పునరుద్ధరించారు. కమిషనర్‌కు వినతి.. -
స్వశక్తితో ముందుకు సాగాలి
అదనపు కలెక్టర్ అగర్వాల్సిద్దిపేటజోన్: మహిళలు స్వశక్తితో సాధికారత వైపు అడుగులు వేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. బుధవారం సెట్విన్ కేంద్రంలో మహిళలకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు శిక్షణ ద్వారా మరింత నైపుణ్యం సాధించాలని సూచించారు. మహిళలకు రుణాలు, శిక్షణ తరగతులు, స్వయం ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సెట్విన్ ఇన్చార్జి అమినా భాను, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. నాణ్యమైన బియ్యం అందించండి దుబ్బాకరూరల్: మండలంలోని రామక్కపేట బాలికల గురకుల పాఠశాలను అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలోని వంట గదిని, కూరగాయలు, బియ్యాన్ని పరిశీలించారు. బియ్యం నాణ్యతగా లేక పోవడంతో వెంటనే సివిల్ సప్లై అధికారులతో మాట్లాడారు. నాణ్యమైన బియ్యాన్ని అందించాలని ఆదేశించారు. వంట విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శారద, జిల్లా సివిల్ సప్లై అధికారి తనూజ, తహసీల్దార్ సంజీవ్‌కుమార్ పాల్గొన్నారు. -
మండుటెండలో వరుస కట్టి.. బడిబాట పట్టి
మండుతున్న ఎండల నేపథ్యంలో ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. విద్యార్థులు తప్పని పరిస్థితుల్లో మిట్ట మధ్యాహ్నం వేళ ఎండలోనే బడికి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మిరుదొడ్డి బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం టెన్త్ పరీక్షలు జరుగుతుండటంతో మిగతా తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం వేళ పాఠాలను బోధిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్సీ, బీసీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు మండుటెండలో వరుసకట్టి బడికి వెళ్తుండగా ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. – మిరుదొడ్డి(దుబ్బాక) మండుటెండలో బడికి వెళ్తున్న విద్యార్థులు -
విద్యతోనే అట్టడుగు వర్గాల అభివృద్ధి
● ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ పురుషోత్తం ● జాతీయ సదస్సు ప్రారంభం సిద్దిపేటఎడ్యుకేషన్: విద్యతోనే సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ స్థాయి సదస్సును బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచేలా ఉన్నత విద్యలో సమూల మార్పులు రాబోతున్నాయన్నారు. వీటిని వెనకబడిన వర్గాలు అందిపుచ్చుకుంటేనే సామాజిక సమానత్వం సాధ్యమవుతుందన్నారు. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ తోట జ్యోతిరాణి మాట్లాడుతూ ప్రపంచీకరణ, కార్పొరేటీకరణ నేపథ్యంలో సామాజిక అంతరాలు మరింతగా పెరుగుతున్నాయని, వాటిని అధిగమించి అట్టడుగు వర్గాల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషిచేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ అట్టడుగు వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ప్రముఖ గాయకుడు దరువు ఎల్లన్న ఉద్యమ జ్ఞాపకాలు, పాటలతో విద్యార్థినీ, విద్యార్థులను అలరించారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ శ్రద్ధానందం మాట్లాడుతూ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి 60 పరిశోధనా పత్రాలు వచ్చాయన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ కళాశాలలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించిన అర్థశాస్త్ర విభాగం అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో దరువు ఎల్లన్న, డా. దివ్య తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో డాక్టర్ అనురాధతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలు
జిల్లా వ్యవసాయ అఽధికారి రాధిక జగదేవ్‌పూర్(గజ్వేల్): జాతీయ ఆహార భద్రత మిషన్‌లో భాగంగా రైతులకు సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలు పంపిణీ చేస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక తెలిపారు. బుధవారం మండలంలో మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలు, పీఎస్బీ, ట్రైకోడెర్మా విరిడిని పంపిణీ చేశామన్నారు. పంట మార్పిడి వల్ల చీడపీడల ఉధృతి తగ్గుతుందని తెలిపారు. ఎకరం వరిని పండించే నీటితో ఐదెకరాల మొక్కజొన్నను సాగు చేయవచ్చని వివరించారు. కార్యక్రమంలో ఏఓ వసంతరావు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. పంట మార్పిడి తప్పనిసరి మర్కూక్(గజ్వేల్): పంట మార్పిడితోనే చీడపీడల ఉధృతి తగ్గుతుందని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక తెలిపారు. మండంలోని నర్సన్నపేటలో బుధవారం మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు యాసంగిలో పత్తి పంట తీసిన తర్వాత మొక్కజొన్న పంటలను సాగుచేయడం వలన నీటిని ఆదాచేయడంతోపాటు పంటమార్పిడి జరుగుతుందని తెలిపారు. తద్వారా చీడపీడల ఉధృతిని తగ్గించవచ్చన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వసంతరావు, ఏఈఓ విష్ణు, రైతులు పాల్గొన్నారు. -
ఖాళీ బిందెలతో ధర్నా
కోహెడరూరల్(హుస్నాబాద్): తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. మండలంలోని సముద్రాల గ్రామంలో కొన్ని రోజులుగా తాగునీరు రావడం లేదంటూ పలువురు మహిళలు బుధవారం సిద్దిపేట–హుస్నాబాద్ రోడ్డుపై ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. సుమారు గంటకుపైగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చాలా రోజులుగా నీటి సమస్య ఉందని ఎంతకీ అధికారులు స్పందించకపోవడంతో చేసేదిలేక ఆందోళనకు దిగామని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మహిళలతో మాట్లాడి ధర్నా ను విరమింపజేశారు. లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించండి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు ఈ నెలాఖరులోగా తమ లైఫ్ సర్టిఫికెట్లను సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయాలలో సమర్పించాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి తెలిపారు. లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించని వారికి ఏప్రిల్ నెల పెన్షన్ నిలిపి వేస్తారన్నారు. మీసేవ కేంద్రం ద్వారా లేక పోస్టల్ డిజిటల్ పేమెంట్ పద్ధతి ద్వారా.. లేదంటే ప్రత్యక్షంగా లైఫ్ సర్టిఫికెట్లు అందించే అవకాశం ఉందన్నారు. దరఖాస్తుల ఆహ్వానం ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి జిల్లాలోని గిరిజన యువతీయువకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అఖిలేష్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన వారు ఏప్రిల్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వ్యాధి నిరోధక టీకాలివ్వండి రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ చైల్డ్ హెల్త్ అండ్ ఇమ్యునైజేషన్ అధికారి సుధీర సిద్దిపేటకమాన్: చిన్నపిల్లలకు, గర్భిణులకు ఇచ్చే వ్యాధి నిరోధక టీకాలు వంద శాతం అమలు చేయాలని రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ చైల్డ్ హెల్త్ అండ్ ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుధీర అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రిలోని చిన్న పిల్లల విభాగం, ఎస్ఎన్సీయూ వార్డును, సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను, జిల్లాలోని పలు పీహెచ్‌సీలను డీఎంహెచ్ఓ డాక్టర్ పల్వన్కుమార్తో కలిసి ఆమె బుధవారం పరిశీలించారు. చిన్న పిల్లలకు అందుతున్న ఆరోగ్య, వైద్య సేవలపై ఆరా తీసి, పలు రికార్డులను పరిశీలించారు. ఈ సంధర్బంగా సుధీర మాట్లాడుతూ.. ఆసుపత్రిలో పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పిల్లల ఆరోగ్యం, ఎదుగుదల పట్ల తల్లిపాల ప్రాముఖ్యత గురించి బాలింతలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ శాంతి, ఆర్‌ఎంఓలు పద్మజ, శ్రావణి, రాష్ట్ర బృందం, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నీటిని వృథా చేయొద్దు గజ్వేల్‌రూరల్: ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ నర్సయ్య సూచించారు. ఈ సందర్భంగా బుధవారం మిషన్ భగీరథ అధికారులను కలిసి నీటి సమస్యను వివరించారు. అనంతరం గజ్వేల్ పట్టణంలోని బా లుర, బాలికల ఎడ్యుకేషన్ హబ్‌లో పర్యటించి నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు. -
అరణ్య రోదన
మూగ వేదన..వన్యప్రాణులకు వేసవి గండం వేసవిలో మనుషులే కాదు.. ఇతర జీవులూ ఉష్ణతాపంతో ఉక్కిరిబిక్కిరి కావడం పరిపాటి. సమయానికి తాగునీరు దొరక్కపోతే అవస్థలు పడక తప్పదు. నిత్యం జనారణ్యంలో సంచరించే జంతువులు, పక్షులకు నీటి కొరత ఉండకపోవచ్చు గానీ.. వన్యప్రాణుల తిప్పలు అన్నీఇన్నీకావు. ఇప్పటికే ఎండల తీవ్రతతో వాగులు, వంకలు, చెలమలు వట్టిపోతున్నాయి. దీంతో వన్యప్రాణులు నీటి జాడ కోసం అల్లాడుతున్నాయి. అటవీ శాఖ అధికారులు సాసర్ పిట్లలో నీటిని నింపకపోవడంతో మూగరోదనతో అలమటిస్తున్నాయి. ‘సాక్షి’ బృందం పలు అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సాసర్ పిట్లను పరిశీలించగా పలు వాస్తవాలు వెలుగుచూశాయి. – సాక్షి, సిద్దిపేట కోహెడ మండలంలోని శనిగరంలో ఎండిపోయిన చెలమజిల్లాలోని 20 మండలాల్లో 23,336 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉంది. వీటిలో దుప్పులు, నెమళ్లు, మౌస్‌డీర్‌లు, జింకలు, అడవి పందులు ఇతరత్రా జంతువులు పెరుగుతున్నాయి. గతంలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు 126 సాసర్ పిట్స్, చెల మలను అందుబాటులోకి తీసుకవచ్చారు. వాటిలో నీటిని నింపితే అటవీ జంతువులు దాహంతో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి నీటిని తాగి ఉపశమనం పొందేవి. ప్రతి ఏటా ఫిబ్రవరి నుంచే నీటిని నింపేవారు. నెలలో నాలుగు నుంచి ఐదు సార్లు నీటిని నింపాలి. అయితే ఈ ఏడాది వేసవి కాలం ప్రారంభమై ఎండలు ముదురుతున్నా ఇప్పటి వరకు నీటిని నింపేందుకు అటవీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చెలమలు ఎండల తీవ్రతకు నీళ్లు పలు చోట్ల అడుగంటిపాయాయి. సిద్దిపేట అర్బన్ పార్క్‌లో నీటి ట్యాంకర్, ట్రాక్టర్ ఉన్న సైతం దానితో సాసర్ పిట్లలో నీళ్లు పోయడకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. నిధులు లేవని.. నిధులు లేవని సాసర్ పిట్లలో నీటిని పోసేందుకు చర్యలు చేపట్టడంలేదు. సోలార్ పంప్సెట్లు ఉన్నా వాటిని అటవీ అధికారులు పలు చోట్ల వినియోగంలోకి తీసుకురావడం లేదు. దీంతో అడవి జంతువులు తాగునీటి కోసం అల్లాడుతున్నాయి. తాగు నీటి కోసం అటవీ శాఖ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సాసర్ పిట్లలో నీటిని పోయాలని వన్యప్రేమికులు కోరుతున్నారు. దాహార్తితో విలవిల జిల్లాలో 23వేల హెక్టార్లలో అడవి వట్టిపోయిన చెలమలు నీరులేక చెత్తాచెదారంతో దర్శనమిస్తున్న సాసర్పిట్లు దృష్టి సారించని అధికారులు సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామ శివారులో 90 ఎకరాల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది. ఇందులో కొండ గొర్రెలు, జింకలు, అడవి పందులు, నెమళ్లు జీవనం కొనసాగిస్తున్నాయి. వీటి దాహార్తిని తీర్చేందుకు రెండు సాసర్ పిట్లను ఏర్పాటు చేశారు. అందులో ఒక దానిలో పూర్తిగా నీళ్లు లేవు, మరో దానిలో కొన్ని నీళ్లు మాత్రమే కన్పించాయి. పక్క ఫొటోలో కనిపిస్తున్నది సిద్దిపేట అర్బన్ పార్క్‌లో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన సాసర్ పిట్. అర్బన్ పార్క్ (తేజోవనం) దాదాపుగా 500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో జింకలు, నెమలి, మూషిక జింకలు, వివిధ పక్షులున్నాయి. వాటి దాహార్తిని తీర్చేందుకు గతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఐదు సాసర్ పిట్లను నిర్మించారు. వారానికి ఒకసారి వాటిని నీటిని నింపాలి. పార్కులోని నాలుగు సాసర్ పిట్లను పరిశీలించగా రెండు నీళ్లు లేక ఎండిపోయి ఉన్నాయి. మరో రెండింటిలో ఎప్పుడో పోసినవి కొన్ని నీళ్లుండగా దుర్వాసన వస్తోంది. చిన్నకోడూరు మండలం మైలారం, అల్లిపూర్, చౌడారం గ్రామాలలో మొత్తంగా 1,100 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి ఉంది. అందులో జింకలు, అడవి పందులు, నెమలిలు, హైనాలు, చిరుత పులులు ఉన్నాయి. తాగునీరు లభించకపోవడంతో రాత్రి వేళ గ్రామాల్లోకి హైనాలు వస్తున్నాయి. పలు మార్లు గొర్రెలపై దాడి చేసిన సంఘటనలున్నాయి. చౌడారం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సాసర్ పిట్లో పాకురు పట్టి.. కొద్దిగా నీళ్లు కనిపించాయి. నిధులు రాగానే.. సాసర్ పిట్లలో నీటిని పోసేందుకు నిధులు మంజూరుకాలేదు. దీంతో నీళ్లు పోయడం లేదు. నిధులు రాగానే నీటిని పోయడం ప్రారంభిస్తాం. కొన్ని కుంటల ద్వారా జంతువులకు కొంత వరకు దాహం తీరుతోంది. –జోజి, ఇన్చార్జ్ డీఎఫ్ఓ -
ప్రజా సమస్యలు పట్టించుకోరేం
అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిదుబ్బాక: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా పల్లెలను పట్టించుకోకపోవడంతో ప్రజల అవస్థలు అన్నీ ఇన్నీకావని మంగళవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి గళమెత్తారు. కేసీఆర్ హయాంలో గ్రామీణ ప్రగతి వికాసంతో పల్లెలు జాతీయ స్థాయిలో ప్రతిష్ట పొందగా నేడు కన్నీరు పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వడంలేదన్నారు. మాజీ సర్ప ంచ్‌ల చేసిన పనుల బిల్లులు ఇంత వరకు ఇవ్వకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై వెంటనే ప్రభు త్వం సమీక్షించి సమస్యలు పరిష్కరించాలన్నారు. వల్లభాపూర్‌ను నార్సింగ్ మండలంలో చేర్చండి ఉమ్మడి చేగుంట మండలంలోని వల్లభాపూర్‌ను నార్సింగ్ మండలంలో చేర్చాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అసెంబ్లీలో కోరారు. చేగుంట, నార్సింగ్ కొత్త మండలాలుగా ఏర్పాటయ్యాయన్నారు. వల్లాభాపూర్ను నార్సింగ్ మండలంలోకి, అలాగే భీమరావుపల్లిని చేగుంట మండలంలోకి చేర్చాలని విన్నవించారు. ఈ రెండు గ్రామాలు సాంకేతిక కారణాలతో ఓ మండలంలో ఉండాల్సిన గ్రామం మరో మండలంలో ఉన్నాయని, దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ రెండు గ్రామాలను సరిచేయాలని కలెక్టర్‌కు పలుసార్లు విన్నవించానన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. -
వాటర్ క్యూరింగ్‌కు చర్యలు
మిరుదొడ్డి(దుబ్బాక): అభివృద్ధి పనుల్లో కొరవడిన నాణ్యతపై అధికారులు స్పందించారు. సీసీ రోడ్ల పనుల్లో నాణ్యత కొరవడుతోందంటూ ఈ నెల 24న ‘సాక్షి’లో వచ్చిన ‘పనులు హడావిడి.. నాణ్యత కొరవడి’ అన్న పరిశీలనాత్మక కథనానికి జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. మండల కేంద్రమైన మిరుదొడ్డిలో నిర్మించిన సీసీ రోడ్డుకు వాటర్ క్యూరింగ్ చేయాల్సిందిగా అధికారులు కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. 15 రోజుల నుంచి వాటర్ క్యూరింగ్ లేని సీసీ రోడ్డుపై గడ్డిని పరిచి వాటర్ క్యూరింగ్‌కు చర్యలు చేపట్టారు. నేటి నుంచి మూడో విడత మూల్యాంకనం సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూడో విడత మూల్యాంకనం బుధవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10గంటలకు కెమిస్ట్రీ, కామర్స్, హిస్టరీ అధ్యాపకులు మూల్యాంకన కేంద్ర కార్యాలయంలో రిపోర్టు చేయాలని తెలిపారు. జిల్లాలోని అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్ అధ్యాపకులను రిలీవ్ చేయాలని సూచించారు. రేవంత్‌రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేర్యాల(సిద్దిపేట): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి ప్రజలు, నాయకులు క్షీరాభిషేకం చేశారు. కమలాయపల్లి, అర్జునపట్ల గ్రామాలను మద్దూరు మండలం నుంచి చేర్యాల మండలంలోకి కలుపుతూ గెజిట్ విడుదల చేసిన సందర్భంగా మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క, ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, జనగామ నియోజకవర్గఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి చిత్రపటాలకు కమలాయపల్లి గ్రామస్తులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమ గ్రామాలను చేర్యాల మండలంలో పూర్తి స్థాయిలో కలిపేందుకు కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సీఎంపై విమర్శలు తగవు డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి గజ్వేల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించడం తగదని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గజ్వేల్‌పై సీఎం సవతి తల్లి ప్రేమ చూపుతున్నారంటూ హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. గజ్వేల్ ప్రజలకు హరీశ్‌రావు 24గంటలూ అందుబాటులో ఉండి అభివృద్ధిని పరుగులెత్తిస్తారని గతంలో కేసీఆర్ చెప్పినా హరీశ్‌రావు ఏనాడూ పట్టించుకోలేదన్నారు. సిద్దిపేటలో వేగంగా అభివృద్ధి పనులు పూర్తయితే గజ్వేల్‌లో మాత్రం పెండింగ్‌లో పడ్డాయన్నారు. ఇందుకు హరీశ్‌రావే కారణమని ఆరోపించారు. సీల్డ్ టెండర్ల ఆహ్వానం ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలోని 27 పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలల్లో శానిటరీ ప్యాడ్స్ సరఫరా చేయడానికి సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెండర్ ఫారం ధర రూ.2000, ఈఎండీ ధర రూ.50వేలు ఉంటుందన్నారు. టెండర్ ఫారాలు ఈ నెల 28 వరకు విద్యాశాఖ కార్యాలయంలో పొందాలన్నారు. పూర్తి చేసిన ఫారాలను బాక్స్‌లో వేయాలన్నారు. సీల్డ్ టెండర్లను ఈ నెల 29న ఉదయం 11గంటలకు జేపీసీ కమిటీ ఆధ్వర్యంలో తెరుస్తామని తెలిపారు. -
లక్ష్యంతో చదివితే విజయం మీదే
సిద్దిపేటఎడ్యుకేషన్: స్పష్టమైన లక్ష్యం, నిర్ధిష్టమైన ప్రణాళికతో చదివితే సివిల్ సర్విసెస్‌లో విజయం సాధించవచ్చని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ సెంటర్, కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కళాశాలలో సివిల్ సర్విసెస్ పరీక్షలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డిగ్రీ తర్వాత విద్యార్థులకు ఎలాంటి కెరీర్‌ను ఎంచుకోవాలో కొంత ఆస్పష్టత ఉంటుందన్నారు. స్పష్టమైన ఆలోచనతో కెరీర్‌ను ప్లాన్ చేసుకోవాలని సూచించారు. భాషపై పట్టు, సబ్జెక్ట్ పరిజ్ఞానం ఉంటే తెలుగులో కూడా సివిల్స్‌లో విజయం సాధించవచ్చన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ దినపత్రికలను చదవాలని సూచించారు. తాను మొదటి సారి సివిల్స్ సాధించి విషయాన్ని విద్యార్థులకు వివరిస్తూ, అవసరమైన పుస్తకాలను అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో ఉండే పేపర్లు, మార్కుల విధానం, ఇట ర్వ్యూకు ఎలా సిద్ధం కావాలో, రిఫరెన్స్ పుస్తకాలు, నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి తదితర అంశాలను విపులంగా వివరించారు. అనంతరం విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. సుమారు రెండు గంటల పాటు సమయాన్ని కేటాయించి విద్యార్థులకు సివిల్స్ పరీక్షలపై అవగాహన కల్పించిన కలెక్టర్‌ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత అధ్యాపకులు సన్మానించి, జ్ఞాపికను అందించి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ విభాగం సెక్టోరల్ అధికారి రామస్వామి, కళాశాల టీఎస్కేసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఉమామహేశ్వరి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, సీఓఈ డాక్టర్ గోపాలసుదర్శనం, డాక్టర్ మధుసూదన్, ఏఓ సులేమాన్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టర్ మనుచౌదరి సివిల్స్‌పై విద్యార్థులకు అవగాహన -
హుస్నాబాద్‌కు ఇంజనీరింగ్ కళాశాల
నిర్మాణానికి రూ.44.12 కోట్లు మంజూరు ● విద్యార్థుల్లో హర్షాతిరేకాలు హుస్నాబాద్: స్థానికంగా ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి హుస్నాబాద్‌లో శాతవాహన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్థాపనకు అడ్మినిస్ట్రేటివ్ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కళాశాలలో బీటెక్ (సీఎస్ఈ), ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, బీటెక్ (ఐటీ), బీటెక్ (ఈసీఈ) ప్రతి ప్రొగ్రాంలో 60 సీట్లను కేటాయించారు. కళాశాల నిర్మాణం కోసం రూ.44.12 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటీవల ఇంజనీరింగ్ కళాశాల కోసం కలెక్టర్ మనుచౌదరి, శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఉమేష్ కుమార్ అనువైన స్థలాలను పరిశీలన చేశారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల కావాలన్న ఈ ప్రాంత ప్రజలు, విద్యార్థుల కల నెరవేరనుంది. హుస్నాబాద్‌లో డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు మాత్రమే ఉన్నాయి. పైచదువులు చదవాలంటే పట్టణాలు, నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. నియోజకవర్గంలో గిరిజన జనాభా అధికం. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. పొన్నం ప్రభాకర్‌ను గెలిపిస్తే మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఏదో ఒక విద్యాసంస్థ వస్తుందని విద్యార్ధి లోకం ఎదురు చూసింది. మెడికల్ కళాశాల ఏర్పాటుకు సైతం జిల్లెల్లగడ్డలో కలెక్టర్ పలు మార్లు స్థలాన్ని పరిశీలించారు. దీంతో ఈ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురించాయి. మెడికల్ కళాశాలకు అనుబంధంగా 250 పడకల ఆస్పత్రి ఉండాలనే నిబంధనతో మంత్రి పొన్నం ప్రభాకర్ 250 పడకల ఆస్పత్రిని మంజూరు చేయించడమే కాకుండా ఆస్పత్రి నిర్మాణానికి రూ.88 కోట్లు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. ప్రస్తుతం హుస్నాబాద్‌లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేయడంతో విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. అలాగే అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి, తోటపల్లి, జనగామ గ్రామాల్లోని 124.36 ఎకరాల భూమిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థల సేకరణపై గ్రామ సభల ద్వారా రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాలకు ఏటు చూసిన 40 కి.మీ. పరిధిలో హుస్నాబాద్ కేంద్ర బిందువుగా ఉంది. ఎల్కతుర్తి నుంచి హుస్నాబాద్ మీదుగా సిద్దిపేట వరకు జాతీయ రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇన్ని హంగులతో విద్యాసంస్ధలు, ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటైతే హుస్నాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా, విద్యాపరంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. -
గరుడోత్సవ వైభవం
నాచగిరిలో నేత్రపర్వంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు గరుడ వాహనంపై లక్ష్మీనృసింహస్వామివారు వర్గల్(గజ్వేల్): నాచగిరి క్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వం చేస్తున్నాయి. మంగళవారం రాత్రి స్వామివారి పెద్దగరుడ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. రాత్రి 10 గంటలకు గరుడోత్సవం ప్రారంభమై అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగింది. ఆలయ ఈఓ విశ్వనాథశర్మ పర్యవేక్షణలో అర్చక పరివారం గరుడాళ్వారు(గరుత్మంతుడు)ను పట్టువస్త్రాలు, వివిధ రకాల పూలమాలికలతో అలంకరించారు. ప్రత్యేక పూజల అనంతరం లక్ష్మీసమేత స్వామివారు గరుడ వాహనం అధిష్టించి పురవీథులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. -
నాణ్యత కొరవడి
పనులు హడావుడి..అభివృద్ధి పనుల్లో నాణ్యత కొరవడుతోంది. గడువు ముంచుకొస్తుండటం.. పనులు హడావుడిగా చేపడుతుండటం.. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులు మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించేందుకు ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా రూ.74.92కోట్లతో 766 సీసీ రోడ్లను మంజూరు చేశారు. ఇప్పటి వరకు రూ.33కోట్లతో పలుచోట్ల నిర్మాణాలు పూర్తికాగా.. నిర్మించిన ఏడు రోజులకే పగుళ్లు ఏర్పడుతున్నాయి. దీంతో నిధులన్నీ వృథా అవుతున్నాయి. మరోవైపు ఈ నెలాఖరులోగా మిగతా రోడ్ల నిర్మాణం పూర్తి కాకపోతే నిధులు రద్దవుతాయి. పనులు జరుగుతున్న తీరుపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా అనేక విషయాలు వెలుగుచూశాయి. -
నష్టపోయిన రైతులను ఆదుకోండి
సిద్దిపేటరూరల్: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు తక్షణం నష్టపరిహారం అందజేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లిలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించా రు. ఆయన మాట్లాడుతూ దెబ్బతిన్న పంటలను అంచనా వేసి వెంటనే ఇన్పుట్ సబ్సిడీ కింద ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. వరంగల్ డిక్లరేషన్‌లో ఎన్నో మాటలు చెప్పిన కాంగ్రెస్ నేటికీ అమలు చేయలేదన్నారు. రైతులకు రూ.2లక్షలు మాఫీ చేస్తానని చెప్పి పూర్తి స్థాయిలో మాఫీ చేయలేదన్నారు. రైతు భరోసా పేరిట ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వలేదన్నారు. వెంటనే వర్షాకాలం, యాసంగి పంటల రైతు భరోసా రూ.15వేల చొప్పున అందించాలన్నారు. స్వశక్తితో ఎదగాలిసిద్దిపేటజోన్: నేటి యువత స్వశక్తితో ఎదగాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధిలోని మహిళలు, యువతుల కోసం ఆదివారం స్థానిక విపంచి ఆడిటోరియంలో మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడితే విజయం ఖాయమన్నారు. కష్టపడిన వారు జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారన్నారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు దెబ్బతిన్న పంటల పరిశీలన -
కంటి దీపాలకు కనుచూపెవరు?
సుగుణమ్మ ముగ్గురు కుమారులూ అంధులేమెదక్జోన్: ‘పెళ్లయిన మూడేళ్లకు మొదటి సంతానంలో కొడుకు పుట్టాడని ఆనందపడ్డాం. విశ్వనాథం అని కాశీ విశ్వనాథుడి పేరు పెట్టుకున్నాం. బుడిబుడి అడుగులు వేస్తుంటే సంబరపడ్డాం. కానీ.. మా సంతోషం ఎంతో కాలం నిలవలేదు. మా కుమారుడికి కళ్లు కనిపించవని వైద్యులు పిడుగులాంటి వార్త చెప్పారు. వరుసగా మరో ఇద్దరు కొడుకులకు సైతం అంధత్వం రావటంతో మా తలరాత ఇంతే అని సరిపెట్టుకున్నాం. చిన్నపాటి హోటల్ నడుపుకుంటూ పిల్లలను సాదుకుంటుండగా.. విధి పగ బట్టినట్లుగా కేన్సర్ మహమ్మారి నా భర్తను కాటేసింది. ఐదేళ్లకు చిన్నకొడుకు నీటి గుంతలో పడి మరణించాడు. దీంతో మా కుటుంబం చిన్నాభిన్నమైంది. ఉన్న ఇద్దరితో ఎలాగోలా నెట్టుకొస్తున్నా.. నేను పోయాక నా బిడ్డలను ఎవరు చూస్తారో..? తలుచుకుంటే కన్నీళ్లు ఆగడం లేదు’అని ఎనిమిది పదుల వయసులో సుగుణమ్మ ఆందోళన చెందుతుంది. ఎన్నో ఆస్పత్రులు తిరిగినా.. మెదక్ పట్టణానికి చెందిన కందుకూరి కృష్ణ, సుగుణమ్మ దంపతులకు ముగ్గురు మగ సంతానం. పెద్ద కొడుకు విశ్వనాథం, రెండో కొడుకు సంతో ష్, చిన్న కొడుకు రాము.. పుట్టిన ముగ్గురు అంధులే కావటంతో తమ బిడ్డల భవిష్యత్ కోసం ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్, సరోజినిదేవి, చైన్నెలోని శంకర్ నేత్రాలయం లాంటి ప్రముఖ ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆశలు వదులుకొని పట్టణంలో చిన్నపాటి హోటల్ ఏర్పాటుచేసి జీవనం సాగించారు. కుటుంబం సాఫీగా సాగుతున్న తరుణంలో.. 2009లో ఇంటి పెద్ద కృష్ణకు కేన్సర్ సోకింది. ఎలాగైనా బతకాలని.. తనకేమైనా జరగరానిది జరిగితే అంధులైన తన బిడ్డల భవిష్యత్ ఏంటని ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. అయినా ఫలితం లేకపోవటంతో కృష్ణ మరణించాడు. దీంతో కుటుంబ బాధ్యత పూర్తిగా సుగుణమ్మపై పడింది. ఉన్న హోటల్‌ను నడపలేని పరిస్థితి ఏర్పడింది. చిన్నపాటి కిరాణం నడుపుకుంటూ జీవిస్తుండగా.. 2014లో చిన్నకొడుకు రాము ఏడుపాయల దుర్గమ్మ దర్శనానికి స్నేహితుల సహాయంతో వెళ్లాడు. అక్కడ బహిర్భూమికి వెళ్లి నీటి గుంతలో పడి మరణించాడు. పింఛనే పెద్ద ఆసరా ఉన్న ఇద్దరు కొడుకులను ప్రభుత్వ పెన్షన్‌తో సాదుకుంటోంది సుగుణమ్మ. ప్రస్తుతం ఆమెకు వృద్ధాప్యం మీద పడుతోంది. వయసు 80 ఏళ్లు. శరీరం సహకరించకున్నా అతికష్టం మీద వారికి వంట చేసి పెడుతోంది. తన తదనంతరం బిడ్డల పరిస్థితి ఏంటని మనోవేదనకు గురవుతోంది. తన పెద్ద కొడుకు విశ్వనాథంకు 40 ఏళ్లు ఉండగా.. పెళ్లి చేయాలని ఎంతగానో ఆరాట పడుతోంది. చిన్న కొడుకు నీటి గుంతలో పడి మృతి ఇంటి పెద్దను కాటేసిన కేన్సర్ అంధులైన కొడుకులకు పిల్లనివ్వని దైన్యం నేను కనుమూస్తే నా బిడ్డలకు దిక్కెవరు? తల్లడిల్లుతున్న మాతృమూర్తి -
తాగునీటి సమస్య రానివ్వొద్దు
అక్కన్నపేట(హుస్నాబాద్): వేసవి కాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్‌లోని ఐడీఓసీ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ మూడు జిల్లాల అదనపు కలెక్టర్లు, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో మంచి నీటి సమస్యతో పాటు ఏ ఇతర సమస్యలు తలెత్తిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. నీటి కొరత ఉన్న గ్రామాల్లో తాత్కాలిక బావులు, బోర్లను అద్దెకు తీసుకొని నీటిని అందించాలన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్లు నియోజకవర్గానికి 3,500ఇళ్లు మంజూరయ్యాయని మంత్రి పొన్నం చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని అధికారులకు ఆదేశించారు. ఇల్లు లేని పేదలకు మొదటి ప్రాధాన్యత కల్పించాలన్నారు. రూ.20లక్షలు మంజూరు ఎల్కత్తురి మండలం దామర గ్రామంలో తాగునీటి ఇబ్బందులు ఉండడంతో ధర్మసాగర్ నుంచి దామర వరకు పైపులైన్ నిర్మాణానికి రూ.20లక్షలు తక్షణమే మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అదేవిధంగా తాగునీటి సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి సమస్యపై ఫిర్యాదు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి రేషన్ షాపుల ద్వారా ప్రతి పేదవాడికి సన్నబియ్యం ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. మీ సేవ, ప్రజా పాలన ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో అర్హుల ఎంపిక పూర్తి చేయగానే రేషన్ కార్డులను పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, ఆర్డీఓ రామ్మూర్తి, అధికారులు పాల్గొన్నారు. ముందస్తు చర్యలు చేపట్టండి పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ మంత్రి పొన్నం ప్రభాకర్కాటమయ్య కిట్లతో రక్షణహుస్నాబాద్: తాటి చెట్లు ఎక్కే గీత కార్మికులకు కాటమయ్య కిట్లు రక్షణగా నిలుస్తున్నాయని మంత్రి పొన్నం అన్నారు. ఆదివారం పట్టణంలోని తిరుమల గార్డెన్లో గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేశారు. అంతకు ముందు పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ ఏసీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటి దశలో 10 వేలు, రెండో దశలో 10 వేలు కిట్లను పంపిణీ చేశామన్నారు. జూన్ తరువాత రాష్ట్రంలో 40 లక్షల తాటి వనాలు, 40 లక్షల ఈత మొక్కలను పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్‌పై అవగాహన కల్పించారు. -
నాణ్యత కొరవడి
పనులు హడావుడి..అభివృద్ధి పనుల్లో నాణ్యత కొరవడుతోంది. గడువు ముంచుకొస్తుండటం.. పనులు హడావుడిగా చేపడుతుండటం.. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులు మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించేందుకు ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా రూ.74.92కోట్లతో 766 సీసీ రోడ్లను మంజూరు చేశారు. ఇప్పటి వరకు రూ.33కోట్లతో పలుచోట్ల నిర్మాణాలు పూర్తికాగా.. నిర్మించిన ఏడు రోజులకే పగుళ్లు ఏర్పడుతున్నాయి. దీంతో నిధులన్నీ వృథా అవుతున్నాయి. మరోవైపు ఈ నెలాఖరులోగా మిగతా రోడ్ల నిర్మాణం పూర్తి కాకపోతే నిధులు రద్దవుతాయి. పనులు జరుగుతున్న తీరుపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా అనేక విషయాలు వెలుగుచూశాయి. -
నష్టపోయిన రైతులను ఆదుకోండి
సిద్దిపేటరూరల్: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు తక్షణం నష్టపరిహారం అందజేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లిలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించా రు. ఆయన మాట్లాడుతూ దెబ్బతిన్న పంటలను అంచనా వేసి వెంటనే ఇన్పుట్ సబ్సిడీ కింద ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. వరంగల్ డిక్లరేషన్‌లో ఎన్నో మాటలు చెప్పిన కాంగ్రెస్ నేటికీ అమలు చేయలేదన్నారు. రైతులకు రూ.2లక్షలు మాఫీ చేస్తానని చెప్పి పూర్తి స్థాయిలో మాఫీ చేయలేదన్నారు. రైతు భరోసా పేరిట ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వలేదన్నారు. వెంటనే వర్షాకాలం, యాసంగి పంటల రైతు భరోసా రూ.15వేల చొప్పున అందించాలన్నారు. స్వశక్తితో ఎదగాలిసిద్దిపేటజోన్: నేటి యువత స్వశక్తితో ఎదగాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధిలోని మహిళలు, యువతుల కోసం ఆదివారం స్థానిక విపంచి ఆడిటోరియంలో మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడితే విజయం ఖాయమన్నారు. కష్టపడిన వారు జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారన్నారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు దెబ్బతిన్న పంటల పరిశీలన -
గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్‌గా మల్లారెడ్డి
గజ్వేల్: మండల పరిధి బయ్యారం గ్రామానికి చెందిన మద్దూరి మల్లారెడ్డిని గజ్వేల్ ఆత్మ(అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ)కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో ఆయనతోపాటు మరో 24 మందిని డైరెక్టర్లుగా నియమించారు. ప్రభుత్వం తనకు చైర్మన్‌గా అవకాశం కల్పించడంపై మల్లారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. నేటి నుంచి రెండో విడత మూల్యాంకనం సిద్దిపేట ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ రెండో విడత జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి నిర్వహిస్తున్నట్లు ఇంటర్ విద్యాధికారి రవీందర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, గురుకులాలు, కేజీబీవీలలో భౌతిక శాస్త్రం, అర్థశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రాల అధ్యాపకులను మూల్యాంకనం కోసం రిలీవ్ చేయాలన్నారు. టాలెంట్ టెస్టులతో మరింత ప్రతిభ ఎంపీ రఘునందన్‌రావు కొండపాక(గజ్వేల్): టాలెంట్ టెస్టులతో విద్యార్థుల్లో ప్రతిభ మరింత పెరుగుతుందని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. కుకునూరుపల్లిలో ఎంపీ జన్మదినం పురస్కరించుకొని కుకునూరుపల్లిలో బీజేపీ, ఎంఆర్ఆర్ యువసేన సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం టాలెంట్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదల కోసం కేంద్రం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మనోహర్, మండల అధ్యక్షుడు అనుముల సంపత్‌రెడ్డి, ఎంఆర్ఆర్ యువసేనా అధ్యక్షుడు సదానందగౌడ్, నాయకులు పాల్గొన్నారు. ఉగాది కవి సమ్మేళనం ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): వెన్నెల సాహితీ సంగమం ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో వంగర నరసింహారెడ్డి అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించారు. అనంతరం కవులకు సురవరం ప్రతాపరెడ్డి స్మారక సాహిత్య పురస్కారాలు అందించారు. దెబ్బతిన్న పంటలపై ప్రభుత్వానికి నివేదిక జిల్లా వ్యవసాయ అధికారి రాధిక సిద్దిపేటఅర్బన్: ఈదురుగాలులతో కూడిన కురిసిన వర్షాలతో దెబ్బతిన్న పంటలపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక అన్నారు. ఆదివారం అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలో మొక్కజొన్న పంటను ఏఓ శ్రీనాథ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు రోజులుగా కురిసిన వర్షాల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ప్రాథమిక అంచనా మేరకు ఒక్క ఎన్సాన్ పల్లిలోనే సుమారు 20 ఎకరాలలో మొక్కజొన్న పంట నేలకొరిగిందన్నారు. నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వానికి నివేదించి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు. పంటల పరిశీలనసిద్దిపేటరూరల్: మండల వ్యవసాయాధికారి నరేశ్ దెబ్బతిన్న పంటలను ఆదివారం పరిశీలించారు. శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగళ్ళ వర్షం పలు పంటలు దెబ్బతిన్నాయి. చింతమడక, సీతారాంపల్లి, ఆంకంపేట, మాచాపూర్, రాఘవాపూర్ గ్రామాల్లోని పంటలను క్షేత్రస్థాయిలో తిరుగుతూ పరిశీలించారు. -
అడ్రస్‌లేని మాస్టర్‌ప్లాన్, యూజీడీ
మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తామని అధికారులు చెప్పడమే తప్ప ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. పట్టణంలోని ప్రధాన రోడ్లు సైతం విస్తరణకు నోచుకోకపోవడంతో ఇరుకు రోడ్లతో నిత్యం నరకయాతనకు గురువుతున్నారు. హబ్షీపూర్ చౌరస్తా నుంచి దుబ్బాక బస్టాండ్ వరకు నాలుగులేన్ల రోడ్డు, బస్టాండ్ నుంచి కొత్త రోడ్డు మీదుగా గాంధీ విగ్రహం, తెలంగాణ తల్లి చౌరస్తా, లాల్ బహుద్దూర్ చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తాల మీదుగా ముస్తాబాద్ రోడ్డు వెడల్పు చేస్తామని అధికారులు మార్కింగ్ పెట్టి వదిలేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా నేటికీ నోచుకోవడంలేదు. -
జిల్లాలో పలుచోట్ల వర్షం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు చిరుజల్లులు కురవడంతో ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. కొన్ని గ్రామాల్లో ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. దీంతో రైతులు కాస్త ఇబ్బంది పడ్డారు. బెజ్జంకిలో వడగళ్లు.. బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని పలు గ్రామాలలో ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. గాలి దుమారానికి బెజ్జంకి, కల్లెపల్లి, రేగులపల్లె, గుగ్గిల్ల, గాగిళ్లాపూర్ తదితర గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. నేటి నుంచి ఇంటర్ మూల్యాంకనంసిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు మూల్యాంకన కేంద్రం కన్వీనర్, జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్‌రెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్) లో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. తెలుగు, పొలిటికల్ సైన్స్, గణితం, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సంబంధించిన ఎగ్జామినర్లు సకాలంలో కార్యాలయంలో రిపోర్టు చేయాలని చెప్పారు. సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆయా సబ్జెక్టుల ఎగ్జామినర్లను వెంటనే రిలీవ్ చేయాలన్నారు. మూల్యాంకన కేంద్రంలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని అన్నారు. ఎగ్జామినర్లు సమయపాలన పాటించాలని, లేనట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉపాధి కూలీలకు వసతులు తప్పనిసరి అక్కన్నపేట(హుస్నాబాద్): మండల పరిధిలోని మల్లంపల్లి, చౌటపల్లిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను శుక్రవారం జిల్లా అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి బాలకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు ముదురుతున్న కొద్దీ పనుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పని ప్రదేశాల్లో నీడ, తాగునీరు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ చేశారు. అలాగే కూలీల సమస్యలు, పని ప్రదేశంలో వసతులపై కూలీలను అడిగి తెలుసుకున్నారు. తప్పకుండా పనిప్రదేశంలో సౌకర్యాలను కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ భానోతు జయరాం, ఎంపీఓ గుగులోతు మోహన్‌నాయక్, ఉపాధి హామీ ఏపీఓ ప్రభాకర్, టెక్నికల్ అసిస్టెంట్ నీలిమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. -
తొలిరోజు 99.91శాతం హాజరు
పది పరీక్షలు ప్రారంభం ● పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 79 పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు మొదటి పేపరు తెలుగు–1ను రాశారు. తల్లిదండ్రులు, బంధువులు విద్యార్థులను పరీక్ష కేంద్రాల వద్దకు తీసుకురావడంతో అంతా సందడిగా మారింది. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 277 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 14,114 మందికి 14,101 మంది విద్యార్థులు హాజరయ్యారు. 13 మంది గైర్హాజరయ్యారు. 99.91శాతం హాజరు నమోదు అయ్యింది. కలెక్టర్ మనుచౌదరి పారుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎస్ఆర్కే డీజీ స్కూల్, శ్రీచైతన్య పాఠశాలలను సందర్శించి, విద్యార్థుల పరీక్షలు రాస్తున్న తీరును పరిశీలించారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, సీపీ అనురాధ, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అబ్జర్వర్ పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. -
రోడ్లపైనే సంతలు..
జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన దుబ్బాక పశువుల సంత, కూరగాయల సంతల్లో కనీస సౌకర్యాలు లేవు. ప్రతి శనివారం తెలంగాణ తల్లి చౌరస్తాలో రోడ్డుపైనే కూరగాయల సంత నిర్వహిస్తుండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. దుంపలపల్లి రోడ్డులో ఎలాంటి వసతులు లేకపోవడంతో ఎర్రటి ఎండలోనే పశువుల సంత కొనసాగుతోంది. సుందరీకరణ తూచ్..రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన పార్కులు, జిమ్‌లు, చౌరస్తాల ఆధునీకరణ, చెరువు కట్టల సుందరీకరణ ముందుకు సాగడంలేదు. చెరువుకట్టపై ఏర్పాటు చేసిన జీమ్ పరికరాలు ధ్వంసమైనా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఇక తెలంగాణ తల్లి చౌరస్తా, ఛత్రపతి శివాజీ చౌరస్తాలు సైతం అధికారుల పర్యవేక్షణ లోపించడంతో బోసిపోయి కనిపిస్తున్నాయి. -
పాడుబడ్డ బావులు.. రోడ్లపైనే చెత్త
కోట్ల రూపాయలు వెచ్చించి మున్సిపాలిటీలోని లచ్చపేట వార్డులో డంపుయార్డు ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికి పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు. దీంతో పట్టణంలోని దుంపలపల్లి రోడ్డులోని టీటీడీ కల్యాణమండపం ముందర, అలాగే ఆ ప్రక్కనే ఉన్న పాడుబడ్డ బావిప్రాంతాన్ని, చీకోడ్ శివారులో ఎల్లమ్మ టెంపుల్, ధర్మాజీపేట రోడ్డుతో పాటు ఇలా చాల ప్రాంతాలు చెత్తతో నిండిపోతున్నాయి. దీంతో ప్రజలు నిత్యం కుక్కలు, దోమలు, దుర్వాసనతో నరకయాతన పడుతున్నారు. నివాస ప్రాంతాల్లోనే చెత్త పోసి నిప్పు పెడుతుండటం గమనార్హం. ఇక డబుల్ బెడ్రూం కాలనీల్లో చూస్తే పారిశుధ్యం అధ్వానంగా మారింది. ఇళ్ల పక్కనే చెత్త కుప్పలు పేరుకపోయినా పట్టించుకున్న నాథుడే లేరు. రూ.73 లక్షలతో కొత్తగా నిర్మించిన ఎఫ్ఎస్టీపీ కేంద్రం కూడా ఇంకా మనుగడలోకి రాలేదు. -
కేసీఆర్ తీరును ఎండగడతాం●
● డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ● గజ్వేల్‌కు చేరుకున్న పాదయాత్రగజ్వేల్: ఓట్లేసి గెలిపించిన గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా వ్యవహరిస్తున్న కేసీఆర్ తీరును ఎండగట్టేందుకే పోరుబాట పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. కలెక్టరేట్ నుంచి రాజ్‌భవన్ వరకు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం సాయంత్రం గజ్వేల్ మండలం కొడకండ్లకు చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామంలోని కేఎన్ఆర్ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సారెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండాలని, లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో గజ్వేల్ ప్రాంతంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలను సైతం వెలికితీస్తామన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల గజ్వేల్‌లో ఎన్నో పనులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. మరీ ముఖ్యంగా మల్లన్నసాగర్ నిర్వాసితుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయన్నారు. పాదయాత్రగా గవర్నర్ వద్దకు వెళ్లి కేసీఆర్‌ను భర్తరఫ్ చేయాలని ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో గృహనిర్మాణ సంస్థ మాజీ చైర్మన్ మడుపు భూంరెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, నాయకులు రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. కొండపాకమీదుగా సాగిన పాదయాత్ర కొండపాక(గజ్వేల్): నర్సారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం రెండో రోజు కొండపాక, కుకునూరుపల్లి మండలాల మీదుగా సాగింది. పాదయాత్రకు కాంగ్రెస్ నాయకులు, రైతులు, ప్రలు ఘన స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అన్ని వర్గాలకూ అన్యాయం
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు అన్యాయం చేసేవిధంగా ఉంది. వ్యవసాయం, విద్య, సంక్షేమ పథకాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మరోమారు మోసం చేసేవిధంగానే బడ్జెట్‌ను రూపొందించారు. పేదల సంక్షేమానికి పెద్దపీట డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి గజ్వేల్: తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి బడ్జెట్లో పెద్దపీట వేసింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రూ.56,084 కోట్లను కేటాయించారు. రైతు సంక్షేమం, నీటిపారుదల తదితర అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యంలేదు మంద పవన్, సీపీఐ జిల్లా కార్యదర్శి బడ్జెట్లో విద్యకు 7.57 శాతం, వైద్యానికి 6 శాతం నిధులు కేటాయించారు. దీని వల్ల ఆ రెండు రంగాలు అభివృద్ధి చెందే అవకాశం లేదు. నీటి పారుదులకు రూ.23,373 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ.5,907 కోట్లు కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. హామీలకు, బడ్జెట్‌కు పొంతన లేదు మల్లారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి సిద్దిపేటఅర్బన్: కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు పొంతన లేదు. ఈ యేడాది కూడా హామీలను అమలుచేసే పరి స్థితి కనిపించడంలేదు. వెనక్కి తీసుకొని ప్రజా సంక్షేమ బడ్జెట్‌ను రూపొందించాలి. -
‘జిజ్ఞాస’లో భేష్
సిద్దిపేటఎడ్యుకేషన్: ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల జిజ్ఞాస రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ స్థానాల్లో నిలిచి భేష్ అనిపించుకుంది. మైక్రోబయాలజీ విభాగం డా.మధన్మోహన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘టూత్‌బ్రష్‌ల పరిశుభ్రత’ ప్రాజెక్టుకు ప్రథమ, తెలుగు విభాగం డా.మట్ట సంపత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ‘వరకవిసిద్ధప్ప’ ప్రాజెక్టుకు, ఆంగ్ల విభాగం బాలకిషన్ ఆధ్వర్యంలో చేసిన పరిశోధన ‘కృత్రి మ మేధస్సు పాత్ర’కు ద్వితీయ బహుమతులు లభించాయి. వాటితో పాటు చరిత్ర విభాగంలో డాక్టర్ కొండల్‌రెడ్డి పర్యవేక్షణలో హస్తకళలు–గొల్లభామచీరలు అనే పరిశోధనకు తృతీయ బహుమతి లభించింది. ఈ సందర్భంగా బుధవారం ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, సీఈఓ డా.గోపాలసుదర్శనం, డా.మధుసూదన్, డా.ఉమామహేశ్వరి, పిట్లదాసు, డా.శ్రద్ధానందం తదితరులు విద్యార్థులను అభినందించారు. -
‘పదోతరగతి’ ఎంతో కీలకం
చేర్యాల(సిద్దిపేట): విద్యార్థి జీవితంలో పదోతరగతి ఎంతో కీలకమైందని, కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ విద్యార్థినులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆమె కేజీబీవీని సందర్శించి 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చదువుకున్న పాఠశాలకు కలెక్టర్ హోదాలో రావాలన్నారు. అలాగే హాస్టల్లో తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, పరిసరాలను పరిశీలించి హాస్టల్ నిర్వహణ, బోధన తీరుపై అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల పంపిణీపై ఆరా తీశారు. అలాగే కుర్మవాడ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి కేంద్రంలో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందజేస్తున్న భోజనం, పిల్లలతో టీచర్లు ఉంటున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట స్థానిక తహసీల్దార్ సమీర్ అహ్మద్‌ఖాన్, ఎంపీడీఓ మహబూబ్ అలీ, మున్సిపల్ కమిషనర్ నాగేందర్, ఆర్ఐ రాజేదర్రెడ్డి ఉన్నారు.అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ -
బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్
గజ్వేల్: మాజీ సీఎం కేసీఆర్ అందుబాటులో ఉండటం లేదని, సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలకు అందుబాటులో ఉండని ఎమ్మెల్యే కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో బీజేపీ గజ్వేల్ నాయకులు బుధవారం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటుకు ‘వాంటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే, టు–లెట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్’ పోస్టర్లను అతికించారు. అనంతరం అక్కడే బైఠాయించి ‘గుర్తున్నారా సారూ–గజ్వేల్ ప్రజలు’, ‘కేసీఆర్ రాజీనామా చేయాలి’ అనే నినాదాలతో ఫ్లకార్డులు పట్టుకొని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ సైదా అక్కడికి చేరుకొని ఆందోళన విరమింపజేశారు. బీజేపీ నేతలు జశ్వంత్‌రెడ్డి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో బీజేపీ నేతలపై బీఆర్ఎస్ నాయకులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడిచేసిన వారిని చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ కృషి వల్లే గజ్వేల్ అభివృద్ధిలో యాభై యేళ్లు ముందుకు వెళ్లిందన్నారు. మెదక్ ఎంపీ రఘనందన్‌రావు గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి ఒక్క అభివృద్ధి పనైనాని చేయగలిగారా?, సోయి లేకుండా క్యాంపు కార్యాలయంపై దాడి చేస్తారా? అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం గజ్వేల్ అభివృద్ధికి ఏమీ చేయలేదని వాపోయారు. పాదయాత్ర చేస్తాం: డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డికాంగ్రెస్ నాయకులు గురువారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేస్తామని, అనంతరం హైదరాబాద్‌లో పాదయాత్ర నిర్వహించి +రాజ్‌భవన్‌లో కూడా వినతి పత్రం అందజేస్తామని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి తెలిపారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడి పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ ఫిర్యాదు వేడెక్కిన గజ్వేల్ రాజకీయం -
3
యంగ్ ఇండియా స్కూళ్లుసాక్షి, సిద్దిపేట: జిల్లాకు మూడు యంగ్ ఇండియా స్కూళ్లు రాబోతున్నాయి. 2025–2026 సంవత్సరానికిగాను రూ.3.04,965 కోట్లతో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అందులో జిల్లాకు ప్రత్యేకంగా కేటాయింపులు ఏమీ లేనప్పటికీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలలో లబ్ధిదారులకు ఫలాలు అందనున్నాయి. అందులో భాగంగా మహిళలకు చేయూత; పల్లె, పట్టణాల అభివృద్ధికి నిధులు రానున్నాయి. జిల్లాకు ప్రత్యేకంగా నిధులు కేటాయించక పోవడంతో ప్రజలు నిరాశ చెందారు. కార్పొరేట్ స్థాయి వసతులతోపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లో చదువుకోలేని వారి కోసం కార్పొరేట్ స్థాయి వసతులతో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోంది. తొలివిడతలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం తంగళ్లపల్లిలో నిర్మాణ పనులకు ఇప్పటికే శంకుస్థాపన చేశారు. ఈ సారి బడ్జెట్లో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో సైతం త్వరలో ఏర్పాటు చేయనున్నారు. దీంతో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందనుంది. మహిళలకు చేయూత మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇప్పటికే బ్యాంక్ లింకేజీ రుణాలను అందజేస్తున్నారు. అలాగే క్యాంటీన్లను ఏర్పాటు చేయిస్తున్నారు. తాజాగా ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు, మినీ గోదాములు నిర్వహిస్తారని ప్రకటిం చారు. ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆ రైస్ మిల్లుల్లోనే మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి సరఫరాచేసే బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించనున్నారు. అలాగే మహిళా సమాఖ్యల ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి 150 అద్దె బస్సులు కేటాయించారు. త్వరలో మరో 600 బస్సులను కేటాయిస్తామని ప్రకటించడంతో మహిళా సంఘాల సభ్యులకు లబ్ధి చేకూరనుంది. మొదటి ఫేస్‌లో జిల్లాకు బస్సులేమీ దక్కకపోయినా త్వరలో కేటాయించే అవకాశాలున్నాయి. జిల్లాలో 18,274 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉండగా అందులో 1,94,714 మంది సభ్యులున్నారు.ఆరు గ్యారెంటీలకు పెద్దపీట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీల అమలు కోసం రూ.56,084 కోట్లు కేటాయించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 2,30,483 మంది దర ఖాస్తు చేసుకొన్నారు. అందులో ఇంటి స్థలం ఉండి ఇళ్లులేని వారు 86,968 మంది, స్థలం, ఇళ్లు లేనివారు 34,404 మందిగా గుర్తించారు. అందులో పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా జనవరి 26వ తేదీన 26 మండలాల్లో ఒక్కో గ్రామంలో 2,585 ఇళ్లను మంజూరు చేశారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా వాటిలో పూర్తి స్థాయిలో ఎంపికలు జరగలేదు. ఈ సారి బడ్జెట్లో కేటాయింపు వల్ల అర్హులందరికీ సొంతింటి కల నెరవేరనుంది. ఇప్పటికే గృహజ్యోతి, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలు కొనసాగుతున్నాయి. కోమటిచెరువు పర్యాటకం పూర్తయ్యేనా?జిల్లాలో కోమటిచెరువు పర్యాటక అభివృద్ధి మధ్యలోనే నిలిచిపోయింది. శిల్పారామం, నెక్లెస్ రోడ్, బీచ్ పనులు యేడాదిన్నరగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అలాగే రంగనాయకసాగర్ దగ్గర పర్యాటక అభివృద్ధి అర్ధాంతరంగా నిలిచి పోయాయి. ఈ సారి బడ్జెట్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకం కోసం రూ.775 కోట్లు కేటాయించారు. ఆ నిధుల నుంచి కోమటి చెరువు, రంగనాయకసాగర్ దగ్గర పర్యాటక అభివృద్ధికి నిధులు కేటాయించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. పల్లె, పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యం మహిళలకు చేయూత పర్యాటకానికి నిధులొచ్చేనా? బడ్జెట్లో జిల్లాకు అంతంత మాత్రమేపల్లె, పట్టణాల అభివృద్ధి రాష్ట్ర బడ్జెట్లో పురపాలకశాఖకు రూ.17,677 కోట్లు కేటాయించారు. దీంతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలోని 115 వార్డులకు నిధులు రానున్నాయి. దీంతో పట్టణాలు అభివృద్ధి చెందనున్నాయి. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులకు కూడా మోక్షం కలిగే అవకాశం ఉంది. పంచాయతీ రాజ్‌కు రూ.31,605 కోట్లు కేటాయించారు. దీంతో జిల్లాలోని 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డులు అభివృద్ధి చెందనున్నాయి. అలాగే పెండింగ్‌లో ఉన్న బిల్లులు సైతం విడుద లయ్యే అవకాశం ఉంది. -
ఆధ్యాత్మిక సంరంభం
వర్గల్(గజ్వేల్): వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య నాచగిరి శ్రీలక్ష్మీ నృసింహ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నాచగిరి శ్రీక్షేత్రం శ్రీమధుసూదనానంద సరస్వతి బుధవారం సాయంత్రం జ్యోతి ప్రజ్వలనచేసి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. వేదపండితులు పాంచరాత్ర ఆగమ పద్ధతిలో ఉత్సవ పూజలకు శ్రీకారం చుట్టారు. కోనేరు ప్రాంతం నుంచి పుట్టమన్ను తెచ్చి ముఖమండపంలో విశ్వక్సేనారాధన, స్వస్తి పుణ్యహవాచనం, అంకురార్పణం, నీరాజనం, మంత్రపుష్పాది పూజలు నిర్వహించారు. నేడు ధ్వజారోహణం బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ధ్వజారోహణ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గరుడాళ్వారుకు మహా నివేదన చేసి బ్రహ్మోత్సవ బాధ్యతలను అప్పగిస్తారు. రాత్రి భేరీ పూజ నిర్వహించి సకల దేవతలకు ఆహ్వానం పలుకుతారు.బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ -
ఇండస్ట్రియల్ వద్దే వద్దు..
అక్కన్నపేట(హుస్నాబాద్): ‘ప్రాణాలైనా ఇస్తాం.. కానీ ఇండస్ట్రియల్ పార్కుకు భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. మండల పరిధిలోని చౌటపల్లిలో బుధవారం ఆర్టీఓ రామ్మూర్తి ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి భూ సేకరణ కోసం గ్రామసభ నిర్వహించారు. సభకు చౌటపల్లి, జనగామ, తోటపల్లి గ్రామాల పరిధిలో భూములు కోల్పుతున్న రైతులు హాజరయ్యారు. చౌటపల్లిలో 83.36 ఎకరాలకు గాను 162 మంది, జనగామలో 15.20 ఎకరాలకు గాను 12 మంది, తోటపల్లిలో 25.20 ఎకరాలకు గాను 21 మంది రైతుల భూములను కోల్పోతున్నారు. మొత్తం 124.36 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి భూ సేకరణ చేయనున్నట్లు గ్రామసభలో తహసీల్దార్లు అనంతరెడ్డి, రవీందర్ చదవి వినిపించారు. ఈ సందర్భంగా రైతులు అభ్యంతరాలు, వినతి పత్రాలను సమర్పించారు. పచ్చని భూముల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయడమేమిటని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా భూములు లాక్కొని తమ కడుపు కొట్టొద్దని వేడుకొన్నారు. గ్రామసభ ముగిసిన తర్వాత చౌటపల్లి గ్రామ మహిళ రైతులు తమ భూములు ఇవ్వబోమంటూ నిరసన తెలిపారు. కాలుష్య రహిత ‘ఇండస్ట్రియల్’ కాలుష్యం వెదజల్లే కంపెనీలను ఎట్టిపరిస్థితుల్లో ఏర్పాటు చేయబోమని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారని ఆర్డీఓ రామ్మూర్తి చెప్పారు. ప్రజాప్రయోజనాల కోసం రైతులందరూ తప్పకుండా సహకరించాలని, భూములు కోల్పోతున్న వారికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏసీపీ సతీశ్, తహసీల్దార్లు అనంతరెడ్డి, రవీందర్, ఎంపీడీఓ జయరాం, ఎంపీఓ మోహన్‌నాయక్, ఆర్ఐ యాదగిరి, జాహిద్, రాజయ్య, సీనియర్ అసిస్టెంట్ రాజు, పంచాయతీ కార్యదర్శులు సతీశ్ తదితరులు పాల్గొన్నారు. భూములు లాక్కొని పొట్టకొట్టొద్దు గ్రామసభలో రైతుల ఆందోళన -
రాజగోపాల్‌పేటకు రాష్ట్రస్థాయి బహుమతి
నంగునూరు(సిద్దిపేట): పాలిటెక్నిక్ కళాశాలల రాష్ట్రస్థాయి సృజన టెక్‌ఫెస్ట్ 2025 పోటీలో రాజగోపాల్‌పేట కళాశాల విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించారు. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన పోటీలలో కళాశాల నుంచి విద్యార్థి చంద్రశేఖర్ బృందం ‘అత్యవస ర వాహనాల కోసం ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ’ ఐఓటీ ఆధారిత మొబైల్ యాఫ్‌ను ఆవిష్కరించారు. అధ్యాపకుడు రాజమౌళి పర్యవేక్షణలో చేపట్టిన ఈ ప్రయోగానికి రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. ఈ సందర్భంగా ఆ విద్యార్థులు చంద్రశేఖర్, కావ్య, జ్యోత్స్న, ప్రకర్ణ, రితేశ్, ముదాసీర్ను ప్రిన్సిపాల్ గోవర్ధన్, అధ్యాపకులు రాజు, అభినవ్, రాజేశ్ తదితరులు అభినందించారు. నూతన డీఎంగా వెంకన్న హుస్నాబాద్: హుస్నాబాద్ ఆర్టీసీ డిపో డీఎంగా ఎన్.వెంకన్న బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీఎంగా పనిచేసిన వెంకటేశ్వర్లు కాచిగూడ డిపోకు బదిలీపై వెళ్లారు. అనంతరం డిపోలో ఎన్.వెంకన్న ఆధ్వర్యంలో జనవరి, ఫిబ్రవరి 2025కు గాను ఉద్యోగులకు ప్రగతిచక్ర అవార్డులను ప్రదానం చేశారు. అలాగే బెస్ట్ ఈపీకే, బెస్ట్ కేఎంపీఎల్ క్యాష్ అవార్డులను అందజేశారు. గేట్ ఫలితాల్లో సత్తా చాటిన రైతుబిడ్డ చిన్నకోడూరు(సిద్దిపేట): గేట్ ఫలితాల్లో సింగిరెడ్డి శ్రావణ్‌రెడ్డి ఆల్ ఇండియా 807వ ర్యాంకు సాధించాడు. మండల పరిధిలోని మాచాపూర్‌కు చెందిన సింగిరెడ్డి నిర్మల, ఆదిరెడ్డి దంపతుల రెండో కుమారుడు శ్రావణ్‌రెడ్డి. వారిది సాధారణ రైతు కుటుంబం కావడంతో మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే విద్యనభ్యసించాడు. బుధవారం వెలువడిన గేట్ ఫలితాల్లో ఈసీ బ్రాంచ్‌లో 807వ ర్యాంకు సాధించాడు. దీంతో మిత్రులు, గ్రామస్తులు శ్రావణ్‌ను అభినందించారు. రాజరాజేశ్వర.. అందుకో పుష్పార్చనదుబ్బాక: అక్బర్పేట–భూంపల్లి మండలంలోని చౌదర్‌పల్లిలోని పార్వతీ సహిత దుబ్బరాజేశ్వరస్వామి ఆలయంలో బుధవారం మూడు లక్షల పుష్పాలతో స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా హరహర మహాదేవ నామస్మరణతో ఆలయం మారుమోగింది. నేడు జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ సిద్దిపేట ఎడ్యుకేషన్: జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్‌ను సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో నిర్వహించనున్నట్లు కార్యక్రమ నోడల్ ఆఫీసర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, కోఆర్డినేటర్ డా.శ్రద్ధానందం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మేడ్చల్, జనగామ, సిద్ది పేట జిల్లాలకు సంబంధించిన ఫెస్టివల్ ఇక్కడ జరగనున్నట్లు తెలిపారు. 150 మందిని ఎంపిక చేశామని, అలాగే 20, 21న జిల్లాస్థాయి ఎంపిక కార్యక్రమం ఉంటుందని తెలిపారు. -
మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక
వర్గల్(గజ్వేల్): నాచగిరి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మాజీ సీఎం కేసీఆర్‌కు మంగళవారం నాచగిరి ఆలయ ఈఓ విశ్వనాథ శర్మ ఆహ్వాన పత్రిక అందజేశారు. వేదపండితుల మహదాశీర్వచనం అనంతరం ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు. ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఆయన వెంట మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఉన్నారు. మంత్రి కొండా సురేఖకు.. రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖను నాచగిరి స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వా నిస్తూ డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డితో కలిసి ఆలయ ఈఓ ఉత్సవ ఆహ్వాన పత్రిక అందజేశారు. దపండితులు మంత్రికి మహదాశీర్వచనం చేసి, ప్రసాదం అందజేశారు. పరీక్షలంటే భయం వద్దు దుబ్బాకటౌన్: పదోతరగతి విద్యార్థులు ఎటువంటి భయం లేకుండా, ఆత్మ విశ్వాసంతో పరీక్షలకు సన్నద్ధం కావాలని తెలంగాణ మోడల్ స్కూల్ డిప్యూటీ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ సూచించారు. మండంలోని లచ్చపేట మోడల్ స్కూల్‌ను మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో పలు రికార్డులను తనిఖీ చేసి, విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమయాన్ని వృథా చేయకుండా పరీక్షలపై దృష్టి సారించాలన్నారు. ఇటీవల సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న విద్యార్థి హర్షవర్ధన్‌ను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బుచ్చిబాబు, ఉపాధ్యాయులు ఉన్నారు. హాస్టల్ వెల్ఫేర్ అధికారిగా బెజ్జంకి యువకుడు బెజ్జంకి(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం వెలువరిచిన హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకాలకు బెజ్జంకి యువకుడు జడల చంద్రశేఖర్ ఎంపికయ్యారు. టీపీఎస్పీ నిర్వహించిన పరీక్షలలో రాష్ట్రస్థాయిలో 184వ ర్యాంకు, జోనల్ స్థాయిలో 24వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయనను గ్రామస్తులు, యువకులు అభినందించారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాధిక చిన్నకోడూరు(సిద్దిపేట): ఎరువులను అధిక ధరలకు విక్రయించే డీలర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాధిక హెచ్చరించారు. స్థానిక ఎరువుల దుకాణాలను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని, కృత్రిమ కొరత సృష్టిస్తే లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. అనంతరం పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఆమె వెంట మండల వ్యవసాయశాఖ అధికారి జయంత్ కుమార్, ఏఈఓలు ఉన్నారు. 12 మంది డిబార్ కోహెడ(హుస్నాబాద్): ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభమైన పదిరోజులలో జిల్లా వ్యాప్తంగా 12 మంది విద్యార్థులు డిబార్ అయ్యారని డీఐఈఓ రవీందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక పరీక్ష కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఇంటర్మీడియెట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలో భాగంగా ఐదుగురు విద్యార్థులు కాఫీ కొడుతూ పట్టుబడినట్లు చెప్పారు. -
ఆర్థిక అక్షరాస్యతతోనే అభివృద్ధి
కలెక్టర్ మనుచౌదరిసిద్దిపేటఎడ్యుకేషన్: ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన ఉంటే అది వారి స్వయం అభివృద్ధితోపాటు దేశాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల కామర్స్ విభాగాధిపతి డాక్టర్ గోపాల సుదర్శనం రచించిన ‘ఆర్థిక అక్షరాస్యత’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. కళాశాలలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ. ప్రస్తుత పరిస్థితుల్లో ఆదాయ వనరులు పెరిగినా, సరైన ఆర్థిక పరిజ్ఞానం లేక వెనుకబడుతున్నారన్నారు. ఆర్థిక సంస్థల విధి విధానాలు, పన్నులు, వాటి మదింపు పద్ధతులు, పొదుపు, పెట్టుబడి తదితర అంశాల గురించి రచయిత ఈ పుస్తకంలో వివరించారని ప్రశంసించారు. అధ్యాపకులు విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణను, పొదుపు ప్రాధాన్యాన్ని బోధించాలని సూచించారు. అనంతరం పుస్తక రచయిత డాక్టర్ గోపాల సుదర్శనం మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యతలో వెనుకబడిన వారు వ్యాపారాల్లో దివాలాతీసి, అప్పులుచేసి కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. అందుకే సమర్థవంతమైన ఆర్థిక ప్రణాళిక, భద్రత గురించి ఈ పుస్తకంలో వివరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా.సునీత, రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ అయోధ్యరెడ్డి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ మధుసూదన్, ఇంగ్లిష్ విభాగాధిపతి మామిడాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గరిమా టీచర్ !
టెన్త్ విద్యార్థులకు 45 నిమిషాల పాటు బోధన దుబ్బాక: నిత్యం ఎన్నో పనుల ఒత్తిడితో ఉంటే అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ లెక్కల టీచర్‌గా మారారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 45 నిమిషాల పాటు పదోతరగతి విద్యార్థులకు గణితం, ఫిజిక్స్‌కు సంబంధించిన అంశాల గురించి బోధించారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం పరిసరాలు, భోజనశాలను పరిశీలించారు. అన్నం మెత్తగా ఉండడంతో వెంటనే సివిల్ సప్లయ్ డీఎంకు ఫోన్‌చేసి నాణ్యమైన బియ్యం ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంజీవ్‌కుమార్, ఎంపీడీఓ భాస్కరశర్మ, ఎంఈఓ ప్రభుదాసు తదితరులు ఉన్నారు. శతశాతం సాధించాలి సిద్దిపేటరూరల్: బ్యాంకర్లకు వివిధ సెక్టార్లో ఇచ్చిన లక్ష్యాలను శతశాతం సాధించేలా బ్యాంకర్లు, అధికారులు సమష్టి కృషితో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో బ్యాంకర్లు, పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ పథకాలు, కార్యక్రమాల అమలులో నిర్ధేశించిన లక్ష్యాలను అమలు చేయాలన్నారు. జిల్లాలో మంజూరైన రుణాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం ఆలస్యం కాకుండా చూడాలని ఆదేశించారు. లక్ష్య సాధనలో ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని చెప్పారు. అనంతరం నాబార్డు జారీ చేసిన పొటెన్షియల్ లింకేజీ ప్లాన్ 2025–26 ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎల్డీఎం హరిబాబు, డీఆర్డీఓ జయదేవ్‌ఆర్యా, నాబార్డ్ డీడీఎం నిఖిల్, యుడీఐ ఆర్ఎం వికాస్ తదితరులు పాల్గొన్నారు. ఓటుహక్కు నమోదు చేసుకోండి 18యేళ్లు నిండిన వారంతా ఓటుహక్కును నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. దుబ్బాక ఐఓసీ కార్యాలయంలో వివిధ రాజకీయపార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటుహక్కు నమోదుకు నాయకులు సహకరించాలన్నారు. తహసీల్దార్ సంజీవ్‌కుమార్, ఆర్ఐ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఒత్తిడికి దూరంగా ఉండాలి
జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి గజ్వేల్: పదోతరగతి విద్యార్థులు ఒత్తిడికి దూరంగా ఉండి పరీక్షలకు సిద్ధమైతేనే ఉత్తమ ఫలితాలు సాధించగలరని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మండలంలోని బూర్గుపల్లి ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, టీవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంగ్లిష్ ల్యాబ్, లైబ్రరీని మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో హెచ్ఎం కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు సత్యనారాయణ, శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, రఫీక్, అర్జు న్, కవిత, ప్రసన్నలక్ష్మి, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం గజ్వేల్‌రూరల్/కొండపాక(గజ్వేల్): జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల బాలుర, బాలికల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీల భర్తీకి విద్యార్థులు దరఖా స్తు చేసుకోవాలని జిల్లా డీసీఓ శివప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 6వ తరగతిలో ప్రవేశానికి 2025 ఆగస్టు 31 నాటికి 12యేళ్లలోపు ఉండాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మరో రెండేళ్ల మినహాయింపు ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు రూ.లక్షా 50 వేలు, పట్టణ ప్రాంత విద్యార్థులు రూ.2 లక్షల ఆదాయ పరిమితి మించ కూడదని, ఆసక్తిగల విద్యార్థులు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 15 నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని, ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు https://mjptbewreir.teanfana.gov.inను సంప్రదించాలని సూచించారు. -
బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు
ముస్తాబైన నాచగిరి క్షేత్రం ● నేటి నుంచి అంగరంగౖ వెభవంగా శ్రీలక్ష్మీనృసింహస్వామివారి వేడుకలు ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు వర్గల్(గజ్వేల్): హరిద్రనది పరవళ్లు, ప్రకృతి రమణీయతలతో అలరారే సహజసిద్ధ కొండగుహల్లో స్వయంభుగా శ్రీలక్ష్మీనారసింహుడు కొలువుదీరిన భవ్యక్షేత్రం నాచారం గుట్ట నాచగిరి శ్రీలక్ష్మీనృ సింహ క్షేత్రం. మండలంలోని నాచగిరి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శ్రీ క్రోధి నామ సంవత్సర పాల్గుణ బహుళ పంచమి బుధవారం 11వ తేదీ నుంచి శ్రీవిశ్వావసు నామ చైత్ర శుద్ధ పాడ్యమి ఆదివారం 30 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. అందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాదుకు చేరువలో.. హైదరాబాదుకు 55 కిలోమీటర్లు, 44వ నెంబర్ జాతీయ రహదారి తూప్రాన్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో నాచగిరి ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి ప్రజ్ఞాపూర్ మీదుగా కూడా నాచగిరికి చేరుకోవచ్చు. నాచగిరి క్షేత్రానికి ఆర్టీసీ సౌకర్యం ఉంది. ఆకర్షణీయంగా.. ఉత్సవాలను పురస్కరించుకొని ప్రధాన ఆలయం, రాజగోపురం, తూర్పుద్వారం, ఉత్తరద్వారం, సభా మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుద్దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. భక్తు లు బసచేసేందుకు సత్రాలు సిద్ధం చేశారు. క్షేత్ర పరిసరాలలో పిచ్చిమొక్కలు, ముళ్లపొదల తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. నాచగిరి వద్ద హరిద్రనది వాగుక్షేత్ర ప్రాశస్త్యం నాచగిరిపై శేషశాయి మాదిరి గుహలో స్వామి స్వయంభుగా కొలువుదీరారు. క్షేత్రం ఎదుట పరవళ్లు తొక్కుతూ సాగిపోయే హరిద్రనది హల్దీవాగు రమణీయ దృశ్యకావ్యంలా గోచరిస్తుంది. కొండ గుహలో కొలువైన శ్రీవారిని దర్శించుకుంటే శత్రుబాధ, భూత, ప్రేత, పిశాచ బాధలు తొలగిపోతాయని, దీర్ఘరోగములు నయమవుతాయని, కుటుంబ శాంతి, వివాహం, సంతానం సమకూరుతుందని భక్తులు విశ్వసిస్తారు. -
లక్ష్యంతో చదివితేనే ఉన్నత స్థాయికి..
మిరుదొడ్డి(దుబ్బాక): ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో చదివితేనే ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకుంటారని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. సంకల్ప్ సేవా ఫౌండేషన్, ఎస్ఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం మిరుదొడ్డి మండల పరిధిలో టెన్త్ విద్యార్థులకు ఎగ్జామినేషన్ కిట్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అత్యున్నతమైన గౌరవం, విలువ లభించాలంటే చదువొక్కటే మార్గమన్నారు. అనుకున్నది సాధించాలంటే పట్టుదలతో చదివి మంచి ఫలితాలను సాధించాలన్నారు. ఉపాధ్యాయులపై అసహనం .. ఎగ్జామినేషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో దేశ రాష్ట్రపతి ఎవరు అన్న ప్రశ్నకు విద్యార్థులు సరైన సమాధానం చెప్పకపోవడంతో మెదక్ ఎంపీ విస్మయం వ్యక్తం చేశారు. దేశ ప్రథమ పౌరురాలు ఎవరో తెలియని విద్యార్థులకు ఏం విద్యాబోధన చేస్తున్నారని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రతి పాఠశాలలో ప్రధాని, రాష్ట్రపతి, రాష్ట్ర సీఎం ఫొటోలను ఏర్పాటు చేయాలని ఎంఈఓ ప్రవీణ్ బాబును ఆదేశించారు. ఇదిలా ఉండగా ఎంపీగా గెలుపొందింన తర్వాత తొలి సారిగా మిరుదొడ్డి మండల కేంద్రానికి వచ్చిన మెదక్ ఎంపీ మాధ వనేని రఘునందన్ రావుకు పలువురు రైతులు, అంగన్వాడీ టీచర్లు వినతులు అందజేశారు. వినతులను పరిష్కరించంచేందుకు కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్ఆర్కే వ్యవస్థాపకుడు శివరామ కృష్ణ, దక్షిణ మధ్య ధర్మ జాగరణ ప్రముఖ్ అమర లింగం, ఎంఈఓ ప్రవీణ్ బాబు పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్ రావు -
పంటలు కాపాడాలంటూ ఆందోళన
దుబ్బాక: మల్లన్నసాగర్ కాలువ ద్వారా నీటిని అందించి ఎండుతున్న పంటలు కాపాడాలని సోమవారం దుబ్బాకలో రైతులు ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ దుబ్బాకకు కన్నతల్లి లాంటి పెద్దచెరువులోకి మల్లన్నసాగర్ నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు కాల్వ పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. పెద్దచెరువును నింపితే 1500 ఎకరాలకు పైగా పంటలు సాగులోకి వస్తాయన్నారు. వెంటనే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ రఘునందన్‌రావు స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో రైతులు రాజమల్లు, రాంచంద్రం, జోగయ్య, యాదగిరి, రాజయ్య, బాబు, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. -
అదనపు పీపీగా ఆత్మారాములు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఆత్మారాములును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు ఆత్మారాములు విధులు నిర్వహించనున్నారు. ఆయన మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆత్మారాములును కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఎండీ రఫీయోద్దీన్, డీసీసీ లీగల్ సెల్ అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు డయల్ యువర్ డీఎం
గజ్వేల్‌రూరల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్(జీపీపీ) ఆర్టీసీ డిపో పరిఽధిలో మంగళవారం ‘డయల్ యువర్ డీఎం’ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్సులలో రాకపోకలు సాగించే ప్రయాణికులకు సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని జీపీపీ ఆర్టీసీ డిపో మేనేజర్ పవన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటిని పరిష్కరించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు 99592 26270 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు, సూచనలు తెలపాలన్నారు. నాచగిరి హుండీ ఆదాయం రూ.15.42 లక్షలు వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రంలో సోమవారం హుండీ కానుకలు లెక్కించారు. గడచిన 88 రోజులలో భక్తులు వేసిన కానుకల ద్వారా ఆలయానికి రూ.15,42,922 ఆదాయం సమకూరినట్లు కార్యనిర్వహణాధికారి విశ్వనాథశర్మ తెలిపారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి పర్యవేక్షణలో హుండీలను తెరిచారు. హైదరాబాద్ భ్రమరాంబిక సేవాసమితి సభ్యులు, శివకేశవ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ఆలయసిబ్బంది హుండీ కానుకల లెక్కింపులో పాల్గొన్నారు. వర్గీకరణ తర్వాతే నియామకాలు చేపట్టాలి ఎమ్మార్పీఎస్ నిరసన దీక్షలు ప్రారంభం గజ్వేల్: ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గజ్వేల్‌లో నిరసన దీక్షలను ప్రారంభించారు. ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఉబ్బని ఆంజనేయులు మాదిగ అధ్వర్యంలో ఈ దీక్షలు చేపట్టారు. ఎంఈఎఫ్(మాదిగ ఉద్యోగుల సమాఖ్య) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరిమాదిగ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఉద్యోగాల నియామకాలను ఆపేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ) రాష్ట్ర నాయకులు మైస రాములు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బుడిగే మహేశ్ తదితరులు పాల్గొన్నారు. కుష్ఠు రహిత సమాజాన్ని నిర్మిద్దాం డీఎంహెచ్ఓ డాక్టర్ పల్వన్‌కుమార్ సిద్దిపేటకమాన్: కుష్ఠు రహిత సమాజాన్ని నిర్మించేందుకు జిల్లాలో సోమవారం నుంచి ఈ నెల 30వరకు క్షేత్రస్థాయిలో ఆశాకార్యకర్తల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ పల్వన్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ముందస్తుగా గుర్తించి చికిత్స అందిస్తామన్నారు. కుష్ఠు వ్యాధిపై ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 882 టీంల ద్వారా సర్వే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. వైద్య సిబ్బంది గృహ సందర్శనకు వచ్చినపుడు ప్రజలు సహకరించాలన్నారు.బీజేపీతోనే బీసీల అభివృద్ధిజగదేవ్పూర్(గజ్వేల్): బీజేపీతోనే దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. సోమవారం గొల్ల, కురుమ సంఘం ఆధ్వర్యంలో కొండపోచమ్మ ఆలయ అవరణలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సన్మానం కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న ఆయనను సంఘం నేతలు సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు ఐలయ్యయాదవ్, నాయకులు భాస్కర్, రాజు, నర్సింహులు, రమేశ్ పాల్గొన్నారు. -
రిజర్వాయర్ పంప్‌హౌస్ వద్ద ధర్నా
మద్దూరు(హుస్నాబాద్): లద్నూరు రిజర్వాయర్‌లోకి సాగునీరు విడుదల చేయాలని రైతులు బొమ్మకూరు రిజర్వాయర్ పంప్‌హౌస్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ మేరకు గ్రామ మాజీ ఎంపీటీసీ గుజ్జుక సమ్మయ్య మాజీ సర్పంచ్ జీడికంటి సుదర్శన్‌లు రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న రిజర్వాయర్‌లోకి సాగునీరు విడుదల చేయకపోవడంతో పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బావులు, బోర్లు వట్టిపోవడంతో పంటలకు నీరు అందడంలేదన్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. ఇప్పటికై నా రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయాలన్నారు. -
తాగునీటికీ తండ్లాటే
కొండపాక(గజ్వేల్): గ్రామాల్లో తాగునీటికీ తండ్లాట తప్పడంలేదు. మిషన్ భగీరథ పథకం మంచి నీటి సరఫరాను పట్టించుకునేవారేలేరు. దీంతో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుకునూరుపల్లి మండలం లకుడారంలో సుమారు 1800 జనాభా ఉంటుంది. కోమటి బండ నుంచి గ్రామానికి భగీరథ పథకం నుంచి నీరు సరఫరా చేసేవారు. ఈక్రమంలో గ్రామానికి నీటి సరఫరా అయ్యే పైపులైన్ దెబ్బతిన్నది. పది రోజలవుతున్నా మరమ్మతుకు నోచుకోవడంలేదు. దీంతో గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా ఒక్కసారే సరఫరా చేస్తుండటంతో స్థానికులు పిల్లపాపలతో క్యూ కట్టాల్సి వస్తోంది. వ్యవసాయ బోరుబావుల నుంచి తెచ్చుకుందామన్నా ఎండాకాలం కావడంతో రైతులు అడ్డుచెబుతున్నారు. అధికారులు స్పందించి భగీరథా పథకం ద్వారా తాగు నీరు సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నారు. ఈవిషయమై గ్రిడ్ ఏఈ వెంకటేశ్‌ను వివరణ కోరగా కోమటిబండ వద్ద నీటి కొరత ఏర్పడటంతో నీటి సమస్య ఏర్పడిందన్నారు. రెండు మూడు రోజుల్లో నీరు సరఫరా అయ్యేలా చూస్తామన్నారు. లకుడారంలో నీటి గోస ట్యాంకర్ ద్వారా సరఫరా బిందెడు నీటి కోసం పిల్లాపాపలతో క్యూ -
సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోండి
దుబ్బాక: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు అధ్వానంగా మారాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సోమ వారం అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే దృష్టిసారించాలన్నారు. హాస్టళ్ల నిర్వహ ణ కొరవడటం.. నాణ్యమైన భోజనం అందడటంలేదన్నారు. కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా అర్థం చేసుకోవాలన్నారు. హబ్షీపూర్ గురుకులంలో 7 వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారన్నారు. విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా విషయం బయటకు రానివ్వడంలేదన్నారు. ఏ హాస్టల్‌కు వెళ్లినా ఫుడ్‌పాయిజన్, సిబ్బంది సక్రమంగా ఉండక సౌకర్యాలు సరిగ్గా లేక అవస్థలు పడుతున్నారన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకోవడంలేదు.. అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి -
రోడ్డెక్కిన రైతులు
దుబ్బాకటౌన్: తలాపునే గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ నీరు అందక పంటలు ఎండుతున్నాయని రైతులు మండిపడ్డారు. చేగుంట, దౌల్తాబాద్ మండలాల రైతులు దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ చౌరస్తాలో సోమవారం రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. దౌల్తాబాద్ మండలం మాచిన్ పల్లి, నర్సంపల్లి, చేగుంట మండలం పోతన్‌పల్లి, పోతంశెట్టిపల్లి, మక్కరాజుపేట, చందాయిపేట, కాసాన్‌పల్లి, తదితర గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. సాగునీరు అందించి పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి అక్కడికివచ్చి వారితో మాట్లాడారు. సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల ధర్నాను విరమింప జేశారు. కార్యక్రమంలో దౌల్తాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాములు, ఉపాధ్యక్షుడు స్వామి, ఇరిగేషన్ అధికారులు తదితరులున్నారు. -
పొట్ట దశలో పుట్టెడు కష్టాలు
పక్క చిత్రంలో రైతు పేరు శతవేణి కొమురయ్య.. కోహెడ మండలం రామచంద్రాపూర్‌కు చెందిన ఈ రైతు.. మోయతుమ్మెద వాగు శివారులో మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. వరి సాగు చేశాడు. పంట పొట్ట దశలో ఉండగా.. నీరందక పొలం ఎండిపోయింది. ఇప్పటికే పంట కోసం రూ.80వేల వరకు పెట్టుబడి పెట్టారు. పంట ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒక్క రైతు పరిస్థితే కాదు జిల్లాలో పంటలు సాగు చేస్తున్న దాదాపు అందరిదీ ఇదే దుస్థితి.సాక్షి, సిద్దిపేట: జిల్లాలో గత అక్టోబర్ వరకు వర్షాలు కురిశాయి. దీంతో యాసంగిలో వరి సాగుకు ఏమాత్రం ఢోకా లేదని భావించారు. చెరువులు, వాగులు, బోరుబావులపై ఆధారపడి.. ఎక్కువ మంది రైతులు వరి సాగుకే మొగ్గు చూపారు. వారందరూ ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారు. పెరుగుతున్న ఎండలకు బోరుబావుల్లో భూగర్భజలాలు అడుగంటాయి. కొత్త బోర్లు వేసినా.. ఫలితం కానరావడంలేదు. పొట్టదశలో ఉన్న వరి పైరును కాపాడుకోలేని నిస్సహాయస్థితిలో జీవాలకు మేతగా వదిలేస్తున్నారు. వరి, మొక్కజొన్న పంటల పరిస్థితి చూసి, జిల్లా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరో నెల రోజుల్లో చేతికి.. మరో నెల నుంచి నెలన్నర రోజుల్లో చేతికి వచ్చే పంటలు ఎండిపోతున్నాయి. కొన్ని చోట్ల వరి పొలాలను రైతులు అర్ధంతరంగా వదిలేస్తున్నారు. మరికొందరు కొత్త బోర్లను తవ్వుతున్నా.. నీటి జాడ అందడంలేదు. కొందరు ట్యాంకర్లతో నీటి తడులందిస్తూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎండిపోయిన పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించి రైతులకు సూచనలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3.50లక్షల ఎకరాల్లో సాగవుతుండగా వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం 2,094 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. జిల్లాలో సగటున భూగర్భ జలాలు 12.13మీటర్ల లోతుకు పడిపోయాయి. మండలం ఎండిపోయిన ఎకరాలు చేర్యాల 300 కొమురవెల్లి 350 దూల్మిట్ట 15 మద్దూరు 15 దుబ్బాక 168 కొండపాక 190 అక్కన్నపేట 305 కోహెడ 152 జగదేవ్‌పూర్ 58 హుస్నాబాద్ 91 సిద్దిపేట అర్బన్ 45 తొగుట 48 సిద్దిపేట రూరల్ 50 మిరుదొడ్డి 77 దౌల్తాబాద్ 25 బెజ్జంకి 45 రాయపోల్ 40 చిన్నకోడూరు 20 అక్బర్పేట భూంపల్లి 90నీరందక పంట పొలాలన్నీ నెర్రలు ఇప్పటికే 2వేల ఎకరాలకుపైగా ఎండిన పంటలు మండుతున్న ఎండలతో అడుగంటుతున్న భూగర్భ జలాలు చేసేదిలేక జీవాలకు మేతగా పంట చేన్లు ఆదుకోవాలని కోరుతున్న రైతులు -
పర్యాటక కేంద్రంగా మహాసముద్రం
● రూ.10 కోట్లతో ప్రతిపాదనలు ● మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి హుస్నాబాద్‌రూరల్: డివిజన్ కేంద్రానికి సమీపంలోని మహాసముద్రంను పర్యాటక కేంద్రంగా సుందరీకరణ చేస్తున్నామని, ఇందుకు రూ.10 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆదివారం ఉమ్మాపూర్‌లోని మహాసముద్రాన్ని పరిశీలించి, అభివృద్ధి పనులపై స్థానిక నాయకులతో చర్చించారు. నిధులు మంజూరు కాగానే పనులను ప్రారంభిస్తామన్నారు. పోతారం(ఎస్) జాతీయ రహదారి నుంచి బైరోని చెరువు, మహాసముద్రం వరకు రోడ్డు నిర్మాణం చేసి పర్యటక కేంద్రానికి కావల్సిన పనులను పూర్తి చేయడానికి పర్యటక శాఖ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. హుస్నాబాద్ ప్రాంతానికి పొరుగు జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందన్నారు. మంత్రి వెంట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ చందు తదితరులు ఉన్నారు. -
పోటెత్తిన భక్తజనం
కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తొమ్మిదవ ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. వచ్చేవారం బ్రహ్మోత్సవాలు ముగియనుండటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. గంగిరేణు చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. – కొమురవెల్లి(సిద్దిపేట) -
కాళేశ్వరంతో గోదావరి పరవళ్లు
చిన్నకోడూరు(సిద్దిపేట): కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పల్లెల్లో గోదావరి నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఆదివారం రంగనాయక సాగర్ ప్రధాన కాల్వ నుంచి చిన్నకోడూరు బెల్లంకుంటకు సాగు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్న కాంగ్రెస్ నేతలు చిన్నకోడూరుకు వచ్చి చూడాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్లే రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీలో కూడా గట్టిగా కొట్లాడుతాని.. ప్రజల కష్ట సుఖాల్లో అందుబాటులో ఉంటానని అన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.అక్రమ కేసులకు భయపడను సిద్దిపేటజోన్: నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీలో గళం ఎత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో పలువురి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బెదిరేదిలేదన్నారు. సాగునీరు లేక దుబ్బాక, చేర్యాల ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయం పడిపోయిందని, కేసీఆర్ హయంలో రాష్ట్రం పురగమనంలో ఉంటే కాంగ్రెస్ పాలనలో తిరోగమనంలోఉందన్నారు. పెట్టుబడులు తగ్గి రాష్ట్ర పరిస్థితి అధ్వనంగా మారిందని విమర్శించారు.అంతకు ముందు బీఆర్ఎస్ సభ్యత్వం ఉండి ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబాలకు బీమా చెక్కులు అందజేశారు.ఎమ్మెల్యే హరీష్‌రావు -
సమస్యల మోత..
సోమవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2025గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీఅభివృద్ధి ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’లా మారింది. కేసీఆర్ ప్రాతినిథ్య నియోజకవర్గంలోని ఈ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్‌గా కీర్తించారు. అంతేకాదు.. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు నమూనాగా మార్చాలని గత ప్రభుత్వం భావించింది. ఈ మేరకు భారీ ప్రాజెక్టులు సైతం వచ్చాయి. కానీ ప్రధాన పనులన్నీ పెండింగ్‌లో ఉండటం ఆదర్శ పట్టణం స్ఫూర్తికి గండిపడుతోంది. ఫలితంగాసమస్యలు తీరక మున్సిపాలిటీ ప్రజలు అష్టకష్టాలుపడుతున్నారు. – గజ్వేల్ నాచగిరి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈఓ విశ్వనాథశర్మ పలువురు.. ప్రముఖులకు బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిలను వేర్వేరుగా కలిసి ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. యువత ఉపాధికి కృషి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాకలో మహిళా జాబ్‌మేళా దుబ్బాక: యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో మహిళా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు. ఎన్నో కంపెనీలు హైదరాబాద్‌కు తీసుకురావడం జరిగిందన్నారు. ఫాక్స్‌కాన్ మల్టినేషనల్ కంపెనీ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కంపెనీలో సెల్‌ఫోన్ విడిభాగాలు తయారు అవతాయన్నారు. కంపెనీకి సెలక్ట్ అయినవారికి మంచి భవిష్యత్త్ ఉంటుందన్నారు. అభివృద్ధిపై దృష్టి సారించండి దుబ్బాక మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఆదివారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, అధికారులతో సమీక్షించారు. సందర్భంగా కలెక్టర్‌కు ఫోన్ చేసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. అనంతరం పంచాయతీ రాజ్ అధికారులతో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించారు. నియోజకవర్గంలోని పలు బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. చెక్కుల అందజేత అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని పెద్దతండా, జనగామ గ్రామాల్లో లబ్ధిదారులకు ఆదివారం ఆయా గ్రామాల నాయకులు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. పెద్దతండా గ్రామ పరిధిలోని పంజాగుట్టతండాకు చెందిన గుగులోతు లకపతికి మంజూరైన రూ.60వేల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాంబాబునాయక్, భాస్కర్‌నాయక్, జమిలాల్నాయక్, నరసింహనాయక్, తిరుపతినాయక్ తదితరులు పాల్గొన్నారు.హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్న గజ్వేల్ మున్సిపాలిటీ స్థిరనివాసమేర్పరుచుకోవడానికి అనువైన పట్టణం. ఇప్పటికే గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్ కల్చర్ పెరుగుతోంది. కానీ పాలకుల నిర్లక్ష్యం పట్టణానికి శాపంగా మారుతోంది. పెండింగ్‌లో ఉన్న ప్రధాన పనులను పూర్తి చేయగలిగితే పట్టణ ప్రతిష్ట మరింతగా పెరగనుంది. పట్టణంలో రూ.156కోట్ల వ్యయంతో చేపట్టిన యూజీడీ(అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) పనులు లోపభూయిష్టంగా చేపట్టడం సమస్యగా పరిణమించింది. పనుల్లో నాణ్యతాలోపం బయటపడుతోంది. రూ.45కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో సదరు కాంట్రాక్టర్ పనులను వందశాతం పూర్తిచేయకుండానే చేతులేత్తేశారు. ఫలితంగా వర్షం కురిసిన సందర్భంలో, పైప్లైన్లు లీకేజీతో మురుగునీరు చాంబర్ల నుంచి బయటకు ఉబికి వస్తోంది. దీంతో దుర్గంధం వ్యాపిస్తోంది. పెండింగ్‌లో బస్టాండ్ల నిర్మాణం పట్టణంలో తూప్రాన్ రోడ్డువైపు రూ.10కోట్ల వ్యయంతో అధునాతన హంగులతో బస్టాండ్ నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. కానీ రింగు రోడ్డు అనుసంధానం పూర్తికాకపోవడంతో ఈ బస్టాండ్‌కు బస్సులు రాక నిరుపయోగంగా మారింది. మరో రూ.7కోట్లకుపైగా వ్యయంతో పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పక్కన నిర్మిస్తున్న మూవింగ్ బస్టాండ్, ప్రజ్ఞాపూర్‌లో రాజీవ్‌రహదారిపై నిర్మిస్తున్న మరో బస్టాండ్ పెండింగ్‌లో ఉండటం ప్రయాణికులకు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. నత్తనడకన రోడ్డు విస్తరణ మున్సిపాలిటీలోని కోటమైసమ్మ గుడి వైపు వెళ్లే రోడ్డును 1.3 కిలోమీటర్ల మేర 70ఫీట్లుగా విస్తరించాలని నిర్ణయించారు. ఈ పనులకు రూ.12కోట్లు వెచ్చిస్తున్నారు. కొన్నేళ్లుగా పనులు సాగు...తూనే ఉన్నాయి. ప్రత్యేకించి ఎంపీడీఓ కార్యాలయం నుంచి కోటమైసమ్మ గుడి వరకు పూర్తిస్థాయిలో పనులు చేపట్టలేదు. బీటీ కొంత వేసి, కొంత పెండింగ్‌లో ఉంచారు. రోడ్డుకు ఇరు పక్కలా డ్రైనేజీ పనులు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయి. రోడ్డు విస్తరణ సందర్భంలో ఎంతోమంది ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వీరిలో కొందరికీ మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. ఇంకా చాలా మందికి ఇళ్లు అందాల్సి ఉంది. డబుల్ ఇళ్లపై తరుచూ ఆందోళనలు మున్సిపాలిటీకి మొత్తం 1,250 ఇళ్ల మోడల్ కాలనీని మంజూరు చేశారు. ఈ కాలనీ 156 బ్లాకులుగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఒక్కో బ్లాకులో కింద నాలుగు, పైన నాలుగు(మొత్తం 8 ఇళ్లు) రెండు ఫ్లోర్లుగా నిర్మాణం జరిగింది. ఒక్కో ఇల్లు 570 చదరపు గజాల విస్తీర్ణంలో కాలనీలో అన్ని రకాల వసతులను కల్పించారు. కానీ పంపిణీ వ్యవహారం ఏళ్ల తరబడి నానుతూ వస్తోంది. వివిధ రకాల ఆందోళనల తర్వాత 2023 మార్చి 21న తుది డ్రా నిర్వహించి 1100మందిని ఎంపిక చేశారు. వివిధ కారణాల వల్ల గృహప్రవేశాలు నిలిచిపోగా ఈ అంశంపై తరుచూ రచ్చ కొనసాగుతోంది. డంపింగ్ యార్డు భద్రత గాలికి మున్సిపాలీటీలోని డంపింగ్ యార్డులో ఏటా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం మున్సిపాలీటీ పరిధిలో కొత్తగా ఏర్పడిన ఆర్అండ్ఆర్ కాలనీలతో కలుపుకొని 15వేలకుపైగా ఇళ్లు ఉన్నాయి. జనాభా 80వేల పైచిలుకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిత్యం ఉత్పత్తి అవుతున్న చెత్త 20మెట్రిక్ టన్నుల పైనే. చెత్తలోని వివిధ రకాల పదార్థాల వల్ల మంటలు వ్యాపించి డంపింగ్ యార్డులో తరుచూ వందలాది టన్నుల చెత్త దగ్ధమవుతోంది. ఈ పొగ పట్టణంలో వ్యాపిస్తూ ప్రజారోగ్యానికి శాపంగా మారుతోంది. కాలనీల్లో రోడ్లు అధ్వానం మున్సిపాలిటీ పరిధిలో 80కిలోమీటర్ల పొడవునా అధ్వానంగా ఉన్న అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మార్చడానికి సుమారుగా రూ.120 కోట్ల నిధులు అవసరమని గత బీఆర్ఎస్ హయాంలో ప్రతిపాదించారు. కానీ రెండేళ్ల క్రితం ఇందులో కేవలం రూ. 22.87కోట్లు మాత్రమే నిధులు విడుదలయ్యాయి. దీంతో అరకొరగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి వదిలేశారు. అంతర్గత రోడ్లు సక్రమంగా లేని లక్ష్మీప్రసన్ననగర్ కాలనీ, భారత్ నగర్, ప్రజ్ఞాపూర్‌లోని పలు వార్డులు, అదేవిధంగా విలీన గ్రామాలైన క్యాసారం, ముట్రాజ్‌పల్లి గ్రామాల్లోని ప్రజలు నరకం చవిచూస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణ గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతున్నాం. ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ప్రాధాన్యత క్రమంలో, దశల వారీగా పరిష్కరించడానికి కృషి చేస్తాం. – గొల్కొండ నర్సయ్య, మున్సిపల్ కమిషనర్ప్రమాదాలకు చెక్ పెట్టాలి గజ్వేల్ పట్టణంలో రింగు రోడ్డు పనులు పూర్తికాకపోవడంతో భారీ వాహనాలు పట్టణంలోకి వస్తున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తి ప్రమాదాలు జరుగుతున్నాయి. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై ప్రయాణమంటేనే జంకే పరిస్థితి ఏర్పడింది. రింగు రోడ్డు అనుసంధానం పూర్తి చేసి ప్రమాదాలకు చెక్ పెట్టాలి. – బారు అరవింద్, మున్సిపాలిటీమున్సిపాలిటీలో అంతర్భాగం కాదా? మున్సిపాలిటీలో విలీన గ్రామాలైన క్యాసారం, ముట్రాజ్‌పల్లి, రాజిరెడ్డిపల్లి, సంగుపల్లి, సంగాపూర్లలో యూజీడీ నిర్మించాలని ఏళ్లతరబడి కోరుతున్నాం. అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మేము మున్సిపాలిటీలో అంతర్భాగం కాదా? మాపై ఎందుకు ఈ నిర్లక్ష్యం. – ప్రవీణ్, క్యాసారం గ్రామస్తుడు తగ్గిన భగీరఽథ నీటి సరఫరా.. మున్సిపాలిటీకి నిత్యం 7.5 ఎంఎల్డీ(మిలియన్ లీటర్స్ ఫర్ డే) నీరు అవసరం. ప్రస్తుతం 5ఎంఎల్డీ నీటి సరఫరా మాత్రమే జరుగుతోంది. దీనివల్ల భవిష్యత్తులో నీటి గండం తలెత్తే ప్రమాదం ఉంది. పట్టణంలో కొత్త కాలనీలకు ఇంకా మిషన్ భగీరథ కనెక్షన్లు వందల సంఖ్యలో ఇవ్వాల్సి ఉంది. దీనిపై అధికారుల కార్యాచరణ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.న్యూస్‌రీల్ యూజీడీ నిర్మాణం లోపభూయిష్టం కాలనీల్లో తరుచూ మురుగు ప్రవాహం పారిశుద్ధ్య లోపంతో సతమతం రింగు రోడ్డు పూర్తి కాక.. ట్రాఫిక్ ఇక్కట్లు ఇళ్లు పంపిణీకి నోచుకోక తరుచూ ‘డబుల్’ రచ్చ కాలనీల్లో అంతర్గత రోడ్లు కచ్చ వానొస్తే లోతట్టు కాలనీల్లో వణుకే గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీవాసుల కష్టాలు వర్ణనాతీతం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ స్వరూపం సుందరీకరణ పనులకు బ్రేక్ మూడేళ్ల క్రితం మున్సిపల్ పాలకవర్గం పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి సంకల్పించింది. ఈ క్రమంలోనే పట్టణంలోని మహనీయుల విగ్రహాల జంక్షన్లను అందంగా తీర్చిదిద్ది, వాటర్ ఫౌంటెన్లను ఏర్పాటు చేయాలని, ‘లవ్ జీపీపీ’ పేరిట స్వాగత ద్వారాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఇందుకోసం రూ.2కోట్లు నిధులు కూడా విడుదల చేసిన సంగతి తెల్సిందే. ఈపనులు అరకొరగా సాగి బ్రేక్ పడ్డాయి. పూర్తికానీ రింగు రోడ్డు అనుసంధానం రూ.230కోట్లతో చేపట్టిన రింగు రోడ్డు అనుసంధానం పూర్తికాకపోవడంతో ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ధర్మారెడ్డిపల్లి–జాలిగామ గ్రామాల మధ్య 1.5కిలోమీటర్ల పొడువున పెండింగ్‌లో ఉన్న పనులను ప్రస్తుతం చేపడుతున్నారు. సిటిజన్స్ క్లబ్ భవనం వద్ద సుమారు 250మీటర్ల మేర పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మొత్తం 24కిలోమీటర్లకు ఇప్పటివరకు 22కిలోమీటర్ల మేర పూర్తయినా ఉపయోగం లేకుండాపోయింది. ఒకవేళ రింగు రోడ్డు నిర్మాణం పూర్తయి ఉంటే ట్రక్కులు ఇతర భారీ వాహనాలు పట్టణంలోకి రాకుండా రింగు రోడ్డు గుండా వెళ్లిపోయే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం భారీ వాహనాలన్నీ పట్టణంలోని ప్రధాన రహదారి గుండా వెళ్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. ఫలితంగా ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. విలీన గ్రామాల యూజీడీ ప్రతిపాదనకు మంగళం మున్సిపాలీటీలో విలీనమైన ముట్రాజ్‌పల్లి, క్యాసారంతోపాటు మధిర గ్రామాలైన సంగాపూర్, రాజిరెడ్డిపల్లి, సంగుపల్లిల్లో రెండో విడతలో యూజీడీ పనులు చేపట్టడానికి నిర్ణయించారు. సుమారు 40కిలోమీటర్లకుపైగా ఆయా గ్రామాల్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ అవసరమని గుర్తించారు. ఇందుకోసం రూ.49కోట్లు అవసరమని ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. కానీ ఈ ప్రతిపాదనలకు దాదాపుగా మంగళం పాడారు. -
దళితులంటే బీఆర్ఎస్ నేతలకు చిన్నచూపు
● డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఫైర్ ● గజ్వేల్‌లో కేటీఆర్, జగదీశ్వర్రెడ్డిలదిష్టిబొమ్మలు దహనం గజ్వేల్: దళితులంటే బీఆర్ఎస్ నేతలకు చిన్నచూపు అని, ప్రజలు బుద్ధి చెప్పినా, అధికారం కోల్పోయినా వారిలో మార్పు రావడం లేదని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మండిపడ్డారు. స్పీకర్‌పై జగదీశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం గజ్వేల్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులంటే బీఆర్ఎస్కు మొదటి నుంచి చిన్నచూపు ఉందని ఆరోపించారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి అగౌరవపరిచే విధంగా మాట్లాడడం తగదన్నారు. జగదీశ్వర్‌రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్‌రెడ్డి, మాజీ కార్పోరేషన్ చైర్మన్ భూంరెడ్డి, యూత్‌కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ సర్ధార్‌ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీపీసీసీ నాయకులు సాజిద్‌బేగ్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక కేంద్రంగా మహాసముద్రం
● రూ.10 కోట్లతో ప్రతిపాదనలు ● మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి హుస్నాబాద్‌రూరల్: డివిజన్ కేంద్రానికి సమీపంలోని మహాసముద్రంను పర్యాటక కేంద్రంగా సుందరీకరణ చేస్తున్నామని, ఇందుకు రూ.10 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆదివారం ఉమ్మాపూర్‌లోని మహాసముద్రాన్ని పరిశీలించి, అభివృద్ధి పనులపై స్థానిక నాయకులతో చర్చించారు. నిధులు మంజూరు కాగానే పనులను ప్రారంభిస్తామన్నారు. పోతారం(ఎస్) జాతీయ రహదారి నుంచి బైరోని చెరువు, మహాసముద్రం వరకు రోడ్డు నిర్మాణం చేసి పర్యటక కేంద్రానికి కావల్సిన పనులను పూర్తి చేయడానికి పర్యటక శాఖ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. హుస్నాబాద్ ప్రాంతానికి పొరుగు జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందన్నారు. మంత్రి వెంట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ చందు తదితరులు ఉన్నారు. -
శిక్షణతో పాటు ఉపాధి కల్పించాలి
సిద్దిపేటరూరల్: జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులు, ఉన్నత చదువులు చదువుకునే వారికి అన్ని రంగాల్లో నైపుణ్యాలు పొందేలా శిక్షణ కల్పించి, ఉపాధి పొందేలా అధికారులు చొరవ చూపాలనని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ సమావేశాన్ని అదనపు కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డీఆర్డీఓ, పరిశ్రమల కేంద్రం, సెట్విన్, కార్మికశాఖ, ఉపాధి, పలు శిక్షణ శాఖల ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మాణ రంగం, టైలరింగ్, ఇందిరమ్మ ఇళ్ల కోసం మెసీ్త్రల ట్రైనింగ్, కూలీ ట్రైనింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో శిక్షణ ఇవ్వడం కోసం కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. వాటితో పాటుగా బ్యాంకింగ్, ఇతర రంగాల్లో ప్రతిభ చూపేలా పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ జయదేవ్‌ఆర్యా, డీఆర్ఓ, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నాగరాజమ్మ, డీఏఓ రాధిక, సెట్విన్ కోఆర్డినేటర్ అమీనాభాను, లేబర్ కమిషనర్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ -
లక్ష్యంపైనే గురి పెట్టండి
కొమురవెల్లి(సిద్దిపేట): విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులను పక్కన పెట్టి అనుకున్న లక్ష్యంపైనే గురిపెట్టాలని జిల్లా కలెక్టర్ మిక్కిలేని మనుచౌదరి సూచించారు. మండలంలోని గురువన్నపేట పాఠశాలలో ఎఫ్.ఎల్.ఎన్ (ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ) ప్రోగ్రాం ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు డీఈవో శ్రీనివాస్‌రెడ్డితో కలసి ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...జిల్లాలో ఏఐ ద్వారా విద్యాబోధన చేసేందుకు 31 పాఠశాలలు ఎంపిక చేసి ప్రస్తుతం 29 పాఠశాలలో ప్రారభించామన్నారు. జిల్లాలో రూ.30 కోట్లతో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా టాయిలెట్స్, అదనపు తరగతి గదులు, ప్రహరీగోడలు తదితర నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు భాషపై పట్టు ఉంటే విజయం సాధిస్తారని తెలిపారు. విద్యార్థులు ప్రతీరోజు వార్త పత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఇష్టమైన రంగాలలో కష్టపడితే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. బడిలో నేర్పిన విలువలే పాటిస్తారు విద్యార్థులకు స్టేజ్ ఫియర్ లేకుండా ప్రతీ రోజు ఒక్కో విద్యార్థితో వర్తమానం అంశాలపై మాట్లాడించాలని, పాఠశాలలో నేర్పిన విలువలు జీవితాంతం పాటిస్తారని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులు, పాఠశాల ప్రహరీగోడ, 5 కంప్యూటర్లను వెంటనే మంజూరు చేస్తానని హామీనిచ్చారు. వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరిగితే పాఠశాలకు బస్సు, అదనపు తరగతి గదులు, సైన్స్‌ల్యాబ్‌లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి రామస్వామి, ఏఎస్వో భాస్కర్, తహసీల్దార్ దివ్య, ఎంపీడీవో శ్రీనివాస వర్మ, ఎంఈవో రమేశ్, ఎస్ఐ రాజు, పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు బి.రాజు, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు. ఇష్టమైన రంగాల్లో కృషి చేస్తే సత్ఫలితాలు కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి -
గజ్వేల్ కాంగ్రెస్‌లో గ్రూపుల గోల
● తారస్థాయికి తూంకుంట,బండారు మధ్య విభేదాలు ● ఇరువర్గాల మధ్య సయోధ్యకుమైనంపల్లి యత్నాలు ● కలసిపని చేయాలని నిర్ణయంగజ్వేల్: గజ్వేల్ కాంగ్రెస్ గ్రూపులపై అధిష్టానం సీరియస్‌గా ఉంది. వాటిని చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. గ్రూపుల గోలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొంత కాలంగా డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు వర్గాల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహిస్తున్న విషయం విదితమే. గతేడాది డిసెంబర్ 3న ములుగు మండలం బండతిమ్మాపూర్‌లో సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాక్షిగా రెండు వర్గాల విభేదాలు రచ్చకెక్కిన విషయం కూడా తెలిసిందే. ఆ తర్వాత కూడా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర పార్టీకి కొత్త ఇన్‌చార్జీగా మీనాక్షి నటరాజన్ వచ్చిన సందర్భంలో గజ్వేల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకా కావడం, బీఆర్ఎస్ ఇక్కడ పటిష్టంగా ఉన్న తరుణంలో కాంగ్రెస్‌లో విభేదాలు ఇదే తరహాలో కొనసాగితే... నష్టం తప్పదని గ్రహించి రెండు వర్గాల మధ్య చర్చలు జరపాలని సూచించినట్లు తెలిసింది. ఈ బాధ్యతలను మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే హన్మంతరావుకు అప్పగించారు. ఈ క్రమంలో మైనంపల్లి రెండు వర్గాలతో సయోధ్య చర్చలు జరిపే పనిలో ఉన్నారు. ఈ మేరకు కొన్ని రోజుల కింద సిద్దిపేటలో ఇరు వర్గాల మధ్య జరిపారు. తాజాగా శనివారం మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని తన నివాసం పక్కన ఉన్న ఓ ఆలయంలో మరోసారి చర్చలు జరిపారు. కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు గజ్వేల్‌కు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌గా మారాయి. మైనంపల్లి ఆధ్వర్యంలో జరుగుతున్న చర్చలు ఫలిస్తే రెండు వర్గాలు ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉంది. -
మాటలే తప్ప చేతలేవీ..?
● మైనార్టీలకు అన్యాయం చేసిన సర్కార్ ● కేబినెట్లో వారికి చోటేది..? ● హామీల అమలులో విఫలం ● సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజంరామచంద్రాపురం(పటాన్చెరు): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి మాటలు తప్ప చేతలు శూన్యమని మండిపడ్డారు. శనివారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్‌నగర్‌లో మాజీ సర్పంచ్ మల్లెపల్లి సోమిరెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మైనార్టీల సంక్షేమానికి రూ.4వేల కోట్లు ఇస్తానని హామీనిచ్చిందన్నారు. అయితే గత బడ్జెట్లో రూ.3వేల కోట్లు మాత్రమే కేటాయించి ఇప్పటివరకు కేవలం రూ.వెయ్యికోట్లే ఖర్చు చేసిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీ యువతకు, మహిళలకు కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని, దానితోపాటు సకాలంలో షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక సాయం అందించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మత ఘర్షణలు పెచ్చుమీరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి కేబినెట్లో ఒక మైనార్టీ మంత్రి కూడా లేరని కనీసం వారికి ఎమ్మెల్సీ సీటు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ లౌకికవాద పార్టీ అని చెప్పుకుంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీతో ఉన్న అనుబంధాన్ని వ్యక్త పరిచారని గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే మైనార్టీల కాంగ్రెస్‌కు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే కారణంతెల్లాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడటానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని హరీశ్‌రావు ఆరోపించారు. గత ప్రభుత్వ హాయాంలో తెల్లాపూర్ ప్రజల అవసరాల కోసం రూ.500 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమిని కేటాయించి అందులో కోట్లాది రూపాయలతో ఫంక్షన్ హాల్‌ను నిర్మించామని అయితే ఇప్పటికీ అది ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదని మండిపడ్డారు. అదేవిధంగా వెజ్ నాన్‌వెజ్ మార్కెట్ కోసం నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులను వెనక్కి తీసుకుందని విమర్శించారు. పెండింగ్ నిధులను ఇచ్చి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతకుముందు తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయాన్ని ఆనుకొని నిర్మించిన ఫంక్షన్ హాల్, అసంపూర్తిగా ఉన్న వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను ఆయన సందర్శించారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి, రసమయి బాలకిషన్, గువ్వల బాల్‌రాజ్, మాజీ వైస్ చైర్మన్ రాములుగౌడ్, సీనియర్ నాయకులు ఎల్లయ్య, బాల్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, గోవర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
పంటలను కాపాడండి
● దేవాదుల మూడవ ఫేజ్ మోటార్లుఆన్ చేయండి ● సర్కార్ నిర్లక్ష్యంతోనేఎండిపోతున్న పంటలు ● అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిచేర్యాల(సిద్దిపేట): దేవాదుల ప్రాజెక్టు నుంచి మూడవ ఫేజ్ మోటార్లు ఆన్‌చేసి సాగునీరు అందించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన అసెంబ్లీలో దేవాదుల నీటి విడుదలపై మాట్లాడారు. జనగామ నియోజకవర్గం పరిధిలోని చేర్యాల ప్రాంతం దేవాదుల ఆయకట్టు పరిధిలో ఉందని, ప్రస్తుతం వరి, ఇతర పంటలు నీరులేక ఎండిపోతున్నాయని తెలిపారు. కాబట్టి దేవాదుల మూడవ ఫేజ్ కింద సాగునీరు అందించాలని కోరారు. దేవాదుల మొదటి, రెండవ ఫేజ్ పూర్తి కాగా, మూడవ ఫేజ్ నిర్మాణ పనులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి నీరు వస్తున్న క్రమంలో అత్యవసరంగా నీటిని విడుదల చేసి, ఎండుతున్న పంటలను కాపాడాలని కోరారు. జనగామ నియోజకవర్గ పరిధిలో సుమారు 1.50లక్షల ఎకరాలు దేవాదుల ఆయకట్టు కిందికి వస్తుందని చెప్పారు. జిల్లాలో 5.14లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, కేవలం 3లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి, 34 రోజులుగా పంపు మోటార్లు ఆగిపోయేటట్టు చేశారని ఆరోపించారు. దీంతో రూ.600 కోట్ల మేర రైతులు నష్టపోయేలా చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయకట్టు, కాల్వ పరిధి కాకున్నా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తపాస్‌పల్లి రిజర్వాయర్ వద్దకు వచ్చి నీళ్లు కావాలని జులుం చేయడం ఏమిటని పల్లా ప్రశ్నించారు. ఆయకట్టు ప్రతిపాదనలతో సంబంధం లేకుండా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గండిరామారం నుంచి నీటిని తరలించడం రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేయడమే అన్నారు. దేవాదుల పంప్‌హౌజ్ వద్ద పంపు ఆపరేటర్లు నిరసన తెలిపే సమయంలో తాను ప్రత్యేక శ్రద్ధ వహించడంతోనే ప్రస్తుతం కొద్ది పాటి నీటి విడుదలకు కారణమైందన్నారు. తాను చెప్పేది అబద్ధమైతే ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ విసిరారు.