ములుగు(గజ్వేల్): రంజాన్ పర్వదినం సందర్భంగా బీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన కార్యదర్శి మహ్మద్ జుబేర్‌పాష సోమవారం మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాత్రి ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసినట్లు ఆయన పేర్కొన్నారు.
సీపీఎం మహాసభల
ప్రతినిధిగా మల్లారెడ్డి
సిద్దిపేటఅర్బన్: తమిళనాడులోని మదురైలో ఏప్రిల్ 2 నుంచి 6 వరకు ఐదు రోజుల పాటు జరగనున్న సీపీఎం జాతీయ మహాసభల ప్రతినిధిగా పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర స్థాయిలో ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన నాయకులను జాతీయ మహాసభలకు ప్రతినిధులుగా ఆహ్వానిస్తారని పేర్కొన్నారు. మల్లారెడ్డి జాతీయ మహాసభలకు ప్రతినిధిగా ఎంపికవడం పట్ల పార్టీ శ్రేణులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.
ఆర్టీసీ సేవలపై సర్వే
సిద్దిపేటకమాన్: ఆర్టీసీ నుంచి అందుతున్న సేవలపై సర్వే నిర్వహించారు. ఈ మేరకు సోమవారం సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్‌లో డిపో మేనేజర్ రఘు ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ రీజినల్ మేనేజర్ కృష్ణమూర్తి హాజరై మాట్లాడారు. సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశానుసారం సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ప్రయాణికులతో మాట్లాడి, ఆర్టీసీ నుంచి అందుతున్న సేవలపై సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
‘వట్టికోట’ పదవీ విరమణ
వర్గల్(గజ్వేల్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచగిరి నాచారం గుట్ట లక్ష్మీనృసింహస్వామి దేవస్థాన ఉప ప్రధాన అర్చకుడు వట్టికోట కృష్ణమాచార్యులు సోమవారం పదవీ విరమణ పొందారు. 45 ఏళ్ల పాటు సుధీర్ఘకాలం ఆయన నాచగిరీశుని సన్నిధిలో సేవలందించారు. రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారం పొందారు. పదవీ విరమణ సందర్భంగా ఆలయ ముఖమండపంలో ఆయనను దేవస్థాన సిబ్బంది, అర్చకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంలో తనకు ప్రతి ఒక్కరి సహకారం అందిందన్నారు. అదేస్థాయిలో ఆలయ అభివృద్ధి కోసం అందరూ కృషిచేయాలన్నారు. సీనియర్ అసిస్టెంట్ సుధాకర్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆలయ అర్చకులు జగన్నాథాచార్యులు, హరిప్రసాద్‌శర్మ, నాగరాజుశర్మ, నరేందర్‌గౌడ్, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.
కేసీఆర్‌ను కలిసిన బీఆర్‌ఎస్ నేత
కేసీఆర్‌ను కలిసిన బీఆర్‌ఎస్ నేత