
అసంపూర్తి పనులు పూర్తి చేయిస్తాం
దుబ్బాక: ‘చెల్లింపులు అధికం.. సమస్యలు అనేకం.. అసంపూర్తిగా డబుల్ బెడ్రూంల నిర్మాణాలు’పేరిట ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈమేరకు బుధవారం జిల్లా హౌసింగ్ పీడీ దామోదర్‌రావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఇతర అధికారులతో కలిసి పట్టణంలోని డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా పలు బ్లాక్‌లలో డబుల్ బెడ్రూంలు అసంపూర్తిగా ఉండటంపై సంబంధిత కాంట్రాక్టర్‌తో పీడీ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయిస్తామని, అలాగే అలాట్‌మెంట్ చేయకున్నా డబుల్ బెడ్రూంలలో ఉంటున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా అధికారులు వచ్చిన విషయం తెలుసుకొని ‘సాక్షి’ప్రతినిధి అక్కడికి వెళ్లగా అప్పటికే అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మా బ్లాక్‌లలోకి రాలేరని రోడ్డు వైపు మంచిగా ఉన్న వాటినే అధికారులు చూసి పోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణాలు పూర్తి కాకుండానే అడ్వాన్స్‌గా కాంట్రాక్టర్‌కు అధిక పేమెంట్ చేయడంపై సంబంధిత అధికారులు పారదర్శకంగా విచారణ చేపట్టాలని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ విషయం జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే త్వరలో కలెక్టర్‌ను కలిసి విన్నవిస్తామన్నారు.
జిల్లా హౌసింగ్ పీడీ దామోదర్‌రావు

అసంపూర్తి పనులు పూర్తి చేయిస్తాం