కొండపోచమ్మ ఆదాయం రూ. 8 లక్షలు | - | Sakshi
Sakshi News home page

కొండపోచమ్మ ఆదాయం రూ. 8 లక్షలు

Published Sun, Apr 13 2025 7:54 AM | Last Updated on Sun, Apr 13 2025 7:54 AM

కొండప

కొండపోచమ్మ ఆదాయం రూ. 8 లక్షలు

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): కొండపోచమ్మ ఆలయానికి హుండీ ద్వారా రూ. 8 లక్షల ఆదాయం సమకూరినట్లు దేవాదాయశాఖ సిద్దిపేట డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయలక్ష్మి, ఈఓ రవికుమార్‌ తెలిపారు. జాతర ఉత్సవాలకు సంబంధించిన 59 రోజుల అమ్మవారి హుండీని లెక్కించారు. హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్‌ నరేశ్‌, సిబ్బంది మహేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కనకయ్య, లక్ష్మణ్‌, హరి, చందు, చిన్నా, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి గింజకూ మద్దతు ధర

డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి

కొండపాక(గజ్వేల్‌): ప్రతి గింజకూ మద్దతు ధర అందించేలా ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి, అంకిరెడ్డిపల్లి, బందారం గ్రామాల్లో శనివారం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని తూర్పార పట్టాక పాసింగ్‌ చేయాలన్నారు. సన్న రకం ధాన్యం క్వింటాలుకు మద్దతు ధరకు అదనంగా రూ. 500 బోనస్‌ను ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు లింగారావు, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ సురేందర్‌రావు, నాయకులు వెంకటేశంగౌడ్‌, సుదర్శన్‌, పర్శరాములు, ప్రభాస్‌, నరేందర్‌ రావు, నర్సింగరావు, రైతులు, పీఏసీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సాగు నీరు అందిస్తాం

మద్దూరు(హుస్నాబాద్‌): దూల్మిట్ట మండలంలోని కొండాపూర్‌, బెక్కల్‌ గ్రామాల రైతులకు సాగు నీరు అందించేందుకు కృషి చేస్తానని జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. గండిమావరం రిజర్వాయర్‌ నుంచి కాలువల ద్వారా నీటిని గ్రామంలోని బయ్యన చెరువులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. కాలువ నిర్మాణానికి సంబంధించి స్థల పరిశీలన వెంటనే చేపట్టాలని శనివారం జిల్లా ఇరిగేషన్‌ డీఈ శ్రవణ్‌కు సూచించారు. అంతకుముందు కొండాపూర్‌ గ్రామంలో జైబాపు, జైభీమ్‌, జై సంవిధాన్‌ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానపరుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ జీవన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, కమలాకర్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

వక్ఫ్‌బోర్డు బిల్లు

రద్దు చేయాలి

చేర్యాల(సిద్దిపేట): వక్ఫ్‌ బోర్డు బిల్లు రద్దు చేయకుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పై యుద్ధం తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి అందె అశోక్‌ అన్నారు. శనివారం చేర్యాల పట్టణంలోని జనగామ–సిద్దిపేట రహదారిపై ముస్లింలతో కలిసి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌బోర్డు బిల్లు తీసుకురావడం దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేవిధంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం విభజించి పాలన చేస్తున్నదని ఆరోపించారు. మతాల, రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వక్ఫ్‌బోర్డు బిల్లును రద్దు చేయకుంటే భవిష్యత్తులో తరిమికొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మజీద్‌, ముఖీమ్‌, భూమయ్య, యాదగిరి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

కొండపోచమ్మ ఆదాయం  రూ. 8 లక్షలు 
1
1/2

కొండపోచమ్మ ఆదాయం రూ. 8 లక్షలు

కొండపోచమ్మ ఆదాయం  రూ. 8 లక్షలు 
2
2/2

కొండపోచమ్మ ఆదాయం రూ. 8 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement