
మిగిలింది ఒక్క రోజే..
నిబంధనల అమలుపై అనుమానాలు
మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల తగ్గింపు వ్యవహారంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికారులు నిబంధనలు పాటించడం లేదని విమర్శలు కూడా వస్తున్నాయి. పన్నుల వసూలు లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలనే ఆరాటామా..? ఇతర కారణాలో తెలియదు కానీ కొందరికి పన్నులు తగ్గించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ కారణాలతో ప్రాపర్టీ టాక్స్ తగ్గించాలని ఆయా మున్సిపాలిటీల్లో ఎంతోమంది దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తులను స్వీకరించిన అధికారులు.. నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. పెండింగ్‌లో ఉన్న ట్యాక్స్ మొత్తం రికవరీ చేసి, ఆ తర్వాత టాక్స్ తగ్గింపునకు సంబంధించిన ప్రక్రియను చేపట్టాలి. దీనికి తగినంత సమయం కూడా తీసుకోవాలి. కానీ అందుకు భిన్నంగా తగ్గించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆస్తి పన్నుల వసూళ ్లలక్ష్యం పూర్తయ్యేనా?
● సిద్దిపేట, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలు ముందంజ
● ఆ రెండు ప్రాంతాల్లో80శాతానికిపైగా వసూలు
● వెనుకబడిన హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల
గజ్వేల్: జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్–ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్‌తోపాటు చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో సిద్దిపేట ఏటా రూ. 16.81కోట్లకుపైగా ఆదాయంతో అగ్రస్థానంలో ఉంది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ రూ.4.81కోట్లతో రెండోస్థానంలో ఉండగా.. మిగతా మున్సిపాలిటీలు రూ.1.5–3కోట్లతో తర్వాత స్థానాలను ఆక్రమిస్తున్నాయి.
సిద్దిపేట, గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌లో..
సిద్దిపేట మున్సిపాలిటీలో 36,136 ఇళ్లు ఉండగా ఆస్తి పన్నుల రూపంలో రూ.16.81కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. ఈనెల 29 వరకు రూ.14కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ.2.81కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఈ లెక్క ప్రకారం 83.28శాతం లక్ష్యాన్ని సాధించారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 12,419 ఇళ్లు ఉన్నాయి. ఆస్తి పన్ను రూపంలో రూ.4.81కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా ఈనెల 29నాటికి రూ.3.92 కోట్ల పన్నులు వసూలు చేశారు. 81.50శాతం లక్ష్యాన్ని సాధించారు. గతంలో ఈ మున్సిపాలిటీ 95శాతానికిపైగా లక్ష్యాన్ని సాధించగలిగింది. కానీ ఈసారి మల్లన్నసాగర్ నిర్వాసితుల కాలనీ ఇందులో కలవడం, ఆ కాలనీలో అనుకున్న స్థాయిలో పన్నుల వసూలు జరగక వెనుకబడినట్లు అధికారులు చెబుతున్నారు.
వసూళ్లలో నత్తనడక..
హుస్నాబాద్ మున్సిపాలిటీలో 7,286 ఇళ్లకు రూ.1.73కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయడం లక్ష్యంగా ఉంది. కానీ ఈనెల 29వరకు 1.28కోట్ల మాత్రమే వసూలు చేసి 73.99శాతం లక్ష్యాన్ని సాధించారు. దుబ్బాకలో 6,209 ఇళ్లు ఉన్నాయి. రూ.2.03కోట్ల ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యానికి రూ.1.48కోట్లు రాబట్టారు. ఇకపోతే చేర్యాల మున్సిపాలిటీలో 5,162 ఇళ్లకు రూ.3.06కోట్లు వసూళ్లు వసూలు చేయాల్సి ఉంది. ఈనెల 29వరకు కేవలం రూ.1.95కోట్లు వసూలు చేసి 63.73లక్ష్యాన్ని సాధించారు. రాష్ట్రంలోని 139 మున్సిపాలిటీల్లో ఒకటి, రెండు మినహా మిగతావి వందశాతం లక్ష్యాన్ని సాధించకపోవడంతో ఉగాది, రంజాన్ సెలవులను సైతం రద్దు చేసి ఆస్తిపన్నుల వసూళ్ల స్పెషల్ డ్రైవ్‌కు ఆదేశాలిచ్చారు. మొత్తానికి ఈనెల 31 తేదీ మాత్రమే మిగిలిఉంది.
జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూలు లక్ష్యం వందశాతం పూర్తికావడం అనుమానంగానే ఉంది. సిద్దిపేట, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీల్లో ఈనెల 29 వరకు 80శాతానికిపైగా వసూళ్లు చేపట్టారు. హుస్నాబాద్, దుబ్బాక మున్సిపాలిటీలు మాత్రం వెనుకబడ్డాయి. ఈ నెలాఖరు వరకు గడువు నేపథ్యంలో ఏ మేరకు లక్ష్యాన్ని సాధిస్తారో వేచి చూడాల్సిందే.