
సన్న బియ్యం పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి
● ఎలాంటి పొరపాట్లు జరగవద్దు ● కలెక్టర్ మనుచౌదరి
కొండపాక(గజ్వేల్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించాచారు. కొండపాక మండలం బందారంలోని రేషన్ దుకాణంలో సన్న బియ్యం పంపిణీని పరిశీలించారు. అలాగే లబ్ధిదారులకు బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా మనుచౌదరి మాట్లాడుతూ పేదలు కడుపు నిండా ఆహారం తీసుకునేలా ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందన్నారు. పథకం నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు అలసత్వం జరగవద్దన్నారు. లబ్దిదారుల పేర్లను ఈ పాస్ మిషన్‌న్‌లో అప్‌లోడ్ చేశాకే బియ్యాన్ని అందజేయాలన్నారు. లబ్ధిదారులు ఎక్కడి నుంచైనా రేషన్ బియ్యాన్ని పొందవచ్చన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ నాయక్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
డైట్ మెనూ తప్పనిసరి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రతి రోజు విధిగా డైట్ మెనూ పాటించాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మైనార్టీ వేల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. గురుకుల పాఠశాల ప్రాంగణంలో తరగతి గదులు, వంటశాల, డార్మెటరీ, మరుగుదొడ్ల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం ఐదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. రోజూ దినపత్రికలు చదవాలన్నారు. అనంతరం పరీక్షలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట అర్బన్ మండల తహసీల్దార్ సలీం, గురకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.