
విద్వేషకర పోస్టులుపెడితే కేసులు: సీపీ
సిద్దిపేటకమాన్: సోషల్ మీడియాలో విద్వేషకర, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా పోస్టులు చేసిన వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సీపీ అనురాధ హెచ్చరించారు. ఆమె మాట్లాడుతూ అలాగే మార్ఫింగ్ ఫొటోలు, రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్ట్ పెడితే చర్యలు తప్పవన్నారు. ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించవద్దన్నారు. విద్వేషకర పోస్టుల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే పోలీసు కమిషనర్ కంట్రోల్ రూంనంబర్ 87126 67100కు సమాచారం అందించాలన్నారు.
నిధులు మంజూరు చేయండి
కేంద్రమంత్రికి బీజేపీ కిసాన్ మోర్చా వినతి
బెజ్జంకి(సిద్దిపేట): పలు అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం కరీంనగర్‌లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. 24 గ్రామాలలో మౌలిక వసతుల కోసం రూ.2కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కలిపాక రాజు, నాయకులు బుర్ర మల్లేశం, సతీష్‌రెడ్డి, అమర్ పాల్గొన్నారు.
టెన్త్ మూల్యాంకనాన్ని
పక్కాగా చేపట్టాలి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పక్కాగా చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న మూల్యాంకన కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్‌లకు సలహాలు, సూచనలు అందించారు. మూల్యాంక కేంద్రం వద్ద విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేసిన మౌలిక సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పరీక్షల సహాయ అధికారి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
కొమురవెల్లిలో భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు గంగిరేణి చెట్టు, ఆలయ ముఖ మండపాలలో పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. కొందరు గుట్టపైన కొలువుతీరిన ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామి వారిని యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవాస్థానం ఈఓ (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్) ఏ.భాస్కర్‌రావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ అన్నపూర్ణ, ఏఈఓ బుద్ది శ్రీనివాస్ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

విద్వేషకర పోస్టులుపెడితే కేసులు: సీపీ

విద్వేషకర పోస్టులుపెడితే కేసులు: సీపీ

విద్వేషకర పోస్టులుపెడితే కేసులు: సీపీ