
సిరుల ‘బ్రహ్మోత్సవం’
నాచగిరికి రూ.16 లక్షల ఆదాయం
వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహుని నవాహ్నిక బ్రహ్మోత్సవాలు కాసుల వర్షం కురిపించాయి. గత నెల 19 నుంచి పన్నెండు రోజులపాటు కొనసాగిన ఉత్సవాలలో ఆలయానికి రూ.16.13 లక్షల ఆదాయం సమకూరింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 వేల మంది భక్తులు క్షేత్రాన్ని సందర్శించారు. దర్శనం, అభిషేకం, అర్చన, సేవా టికెట్లు తదితర సేవల ద్వారా మొత్తం రూ.16,13,328 ఆదాయం లభించినట్లు ఈఓ విశ్వనాథశర్మ పేర్కొన్నారు.
చట్టాలపై అవగాహన అవసరం
నంగునూరు(సిద్దిపేట): చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా లీగల్ అఽథారిటీ సర్వీసెస్ కార్యదర్శి స్వాతిరెడ్డి సూచించారు. గురువారం అక్కెనపల్లి మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు చట్టపరమైన హక్కులు, బాధ్యతలు, చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థి దశలో చెడు అలవాట్లకు బానిసలుగా మారితే జీవితం నాశనమవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా షీటీమ్, సైబర్ నేరాలు, నూతన చట్టాలు, ఈవ్‌టీజింగ్, పోక్సో, సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలపై ఎస్‌ఐ ఎండీ ఆసిఫ్ వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జానయ్య తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం
అందించండి
నంగునూరు(సిద్దిపేట): విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందజేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. గురువారం నర్మేట కస్తూర్భాగాంధీ పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, రిజిస్టర్లు, మధ్యాహ్న భోజనం, గోదాంలో నిల్వ ఉన్న కూరగాయలు, బియ్యాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? అని ఆరా తీశారు. ఆమె వెంట డీపీఓ దేవకీదేవి, తహసీల్దార్ సరిత, ఎంఈఓ దేశిరెడ్డి, ఎంపీడీఓ లక్ష్మణప్ప, స్పెషలాఫీసర్ తదితరులు ఉన్నారు.
విద్యార్థుల అభ్యున్నతే
లక్ష్యం కావాలి: డీఈఓ
మద్దూరు(హుస్నాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రేబర్తి, గాగ్గిళ్లాపూర్ గ్రామాల్లోని పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యా సంవత్సరం క్యాలెండర్ అమలు విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న బోధనపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సమష్టిగా విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడాలన్నారు.అనంతరం రేబర్తి పాఠశాల వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారికి అధించారు.
6 నుంచి బీజేపీ
ఆవిర్భావ వేడుకలు
జిల్లా అధ్యక్షుడు శంకర్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఈ నెల 6 నుంచి 12 వరకు నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ తెలిపారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో శంకర్ మాట్లాడారు. ఈనెల 6న జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ ఉంటుందన్నారు. 7న ప్రతి క్రియాశీల కార్యకర్త ఇంటిపై జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. 8,9తేదీలలో మండలాల వారీగా క్రియాశీల సభ్యులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. 10, 11, 12న గావ్ ఛలో, బస్తీచలో అభియాన్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో వివిధ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సిరుల ‘బ్రహ్మోత్సవం’

సిరుల ‘బ్రహ్మోత్సవం’