విత్తన సబ్సిడీకి పదేళ్లుగా ప్రభుత్వం మంగళం పాడింది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రైతులు ప్రైవేటు మార్కెట్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఏటా కోట్లల్లో భారం తప్పడం లేదు. సబ్సిడీ మాటను పక్కన పెడితే పూర్తి ధర చెల్లించినా మార్కెట్‌లో నాణ్యమైన వి | - | Sakshi
Sakshi News home page

విత్తన సబ్సిడీకి పదేళ్లుగా ప్రభుత్వం మంగళం పాడింది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రైతులు ప్రైవేటు మార్కెట్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఏటా కోట్లల్లో భారం తప్పడం లేదు. సబ్సిడీ మాటను పక్కన పెడితే పూర్తి ధర చెల్లించినా మార్కెట్‌లో నాణ్యమైన వి

Published Fri, Apr 4 2025 8:14 AM | Last Updated on Fri, Apr 4 2025 8:14 AM

విత్త

విత్తన సబ్సిడీకి పదేళ్లుగా ప్రభుత్వం మంగళం పాడింది. గతం

గజ్వేల్‌: జిల్లాలో ప్రతి ఏటా వానాకాలం సీజన్‌లో 5.50లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తుంటాయి. వరి 3.50లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చే అవకాశముంది. ఇందుకోసం జిల్లాకు వివిధ రకాల వరి విత్తనాలు 60వేల క్వింటాళ్లకుపైగా అవసరమవుతాయి. గతంలో తెలంగాణ సోనా విత్తనాలు క్వింటాలుకు రూ.3,400కుపైగా ఎంటీయూ రకం రూ.3,100కుపైగా ధరకు లభించాయి. వచ్చే వానాకాలంలో ధర ఏవిధంగా ఉండబోతుందో ఎదురుచూడాల్సి ఉంది. కాగా కంది ఈసారి 60వేల ఎకరాల్లో సాగులోకి వస్తుందని అంచనా ఉండగా.. 3,053క్వింటాళ్లకుపైగా విత్తనాలు అవసరం. ఈ విత్తనం ధరపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. సోయాబీన్‌ 120ఎకరాల్లో సాగులోకి వస్తుందనే అంచనా ఉండగా.. 30క్వింటాళ్ల విత్తనం అవసరమున్నది. ఈ విత్తనం కూడా గతంలో క్వింటాలుకు రూ. 9800కు లభించింది. వీటి కొత్త ధరలు కొద్ది రోజుల్లోనే రానున్నాయి. దాదాపుగా పెరుగుదల ఉంటుందనే భావిస్తున్నారు.

రైతులపై రూ. కోట్లల్లో భారం

ప్రభుత్వం గతంలో వరి, మొక్కజొన్న, పెసర్లు, మినుమలు, కందులు, పొద్దు తిరుగుడు, శనగలు తదితర విత్తనాలను సబ్సిడీపై అందించేది. వీటిపై రైతులకు 33నుంచి 50శాతం సబ్సిడీ వర్తించేది. ప్రస్తుతం పచ్చిరొట్టె విత్తనాలకు మాత్రమే సబ్సిడీ కొనసాగుతుండగా, మిగతా వాటికి పూర్తిగా ఎత్తేశారు. జిల్లా రైతులకు 60వేల క్వింటాళ్ల మేర వరి విత్తనాల అవసరమవుతాయని అంచనా. వీటి ధర తక్కువలో తక్కువగా క్వింటాలుకు రూ.3వేల వరకు లెక్కిస్తే రైతులు రూ.18కోట్ల మేర విత్తనాలకు ఖర్చు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఈ విత్తనాలపై కనీసం 25శాతం సబ్సిడీ అందించినా రైతులపై రూ.4.5కోట్ల భారం తప్పేది. కానీ సబ్సిడీని పునరుద్ధరించే అవకాశమే కనిపించడం లేదు. ఇదే తరహాలో మొక్కజొన్న, కంది, సోయాబీన్‌, పెసర్లు, మినుములపై భారం తప్పని పరిస్థితి నెలకొన్నది. పత్తి బీటీ–2 విత్తనాలపై వాత ఇప్పటికే ప్రారంభమైంది. బీటీ–2 ప్యాకెట్‌ గతేడాది రూ.864ఉండగా...ఈసారి రూ.901కు పెంచారు. దీని ప్రకారం ఒక్కో ప్యాకెట్‌పై రూ.37అదనపు భారం పడనున్నది. జిల్లా రైతాంగానికి సీజన్‌లో 4.5లక్షల వరకు విత్తన ప్యాకెట్లు అవసరముంటాయి. పెరిగిన ధర ప్రకారం రైతులపై రూ.1.66కోట్ల మేర భారం పడనుంది.

నాణ్యమైన విత్తనమే లక్ష్యం

వచ్చే వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతులకు నాణ్యమైన విత్తనం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. విత్తన ప్రాసెసింగ్‌ సీజన్‌ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. ప్రాసెసింగ్‌ విధానంపై నిఘా పెడతాం. ఈసారి కూడా పోలీసుశాఖ సహకారంతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీగా ఏర్పడి విత్తన ప్రొసెసింగ్‌, ప్యాకింగ్‌లో లోపాలు జరగకుండా చూస్తాం. విత్తనాల పంపిణీ ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనసాగనుంది.

– రాధిక, జిల్లా వ్యవసాయాధికారి

పర్యవేక్షణ తప్పనిసరి

జిల్లాలోని గజ్వేల్‌ ప్రాంతం విత్తన ప్రాసెసింగ్‌కు ప్రధాన కేంద్రంగా మారింది. ప్రత్యేకించి ములుగు, వర్గల్‌, మర్కూక్‌, గజ్వేల్‌ మండలాలు విత్తన కంపెనీలకు అడ్డాగా మారాయి. సిద్దిపేటలోనూ కంపెనీలు వస్తున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో 40కిపైగా కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. కానీ గతంలో కొన్ని కంపెనీలు ప్రాసెసింగ్‌ సక్రమంగా చేయకుండా, నాణ్యతా పరీక్షలతో ప్రమేయం లేకుండా విత్తనాలను మార్కెట్‌లోకి వదలడం, రిజక్ట్‌ అయిన విత్తనాలను తిరిగి ప్యాకింగ్‌ చేయాలనుకోవడం వంటి అక్రమాలు గతంలో వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఈసారైనా విత్తన ప్రాసెసింగ్‌పై పర్యవేక్షణను మరింత పకడ్బందీగా చేపట్టాల్సిన అవసరం ఉంది.

రైతులకు ఏటా తప్పని నష్టాలు తీరు మారితేనే ఉపశమనం విత్తనోత్పత్తి సీజన్‌ ప్రారంభం

విత్తన సబ్సిడీకి పదేళ్లుగా ప్రభుత్వం మంగళం పాడింది. గతం1
1/1

విత్తన సబ్సిడీకి పదేళ్లుగా ప్రభుత్వం మంగళం పాడింది. గతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement