
గాలివాన బీభత్సం
● తడిసిన పొద్దు తిరుగుడు ధాన్యం ● ధర్మారెడ్డిపల్లిలో కూలిన కోళ్ల ఫారం షెడ్డు ● 1,500 కోళ్లు మృతి
గజ్వేల్‌రూరల్: గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షంతో చేతికందిన పంటలు నేలకూలాయి. మరో పది రోజుల్లో చేతికందుతాయనుకున్న వరి, మొక్కజొన్న, ఉల్లి పంటలు గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షానికి నేలవాలాయి. అంతేగాకుండా మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోగల మామిడి తోటలు సైతం దెబ్బతిన్నాయి. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో విక్రయించేందుకు తీసుకువచ్చిన పొద్దు తిరుగుడు ధాన్యం తడిసిపోయింది. ఇదిలా ఉంటే గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లిలో పౌల్ట్రీ రైతు లింగాల శ్రీనివాస్‌గౌడ్‌కు చెందిన కోళ్ల ఫారంలోని పైకప్పు రేకులు వర్షానికి కూలిపోవడంతో అందులో ఉన్న సుమారు 1500 వరకు కోళ్లు మృతి చెందగా, మరో వెయ్యి కోళ్ల వరకు గాయపడ్డాయని బాధిత రైతు వాపోయాడు.
పలుచోట్ల వడగళ్లు
వర్గల్(గజ్వేల్): మండలంలో గురువారం సాయంత్రం పలుగ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. జబ్బాపూర్, నెంటూరు, మైలారంలో వడగళ్లు పడ్డాయి. గాలివాన తోడవడంతో వరిపైర్లు నేలవాలాయని రైతులు తెలిపారు. గౌరారం రాజీవ్‌రహదారిపై వరద ప్రవాహంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. నెంటూరు వద్ద గాలిదుమారానికి రోడ్డుకు అడ్డంగా చెట్లు కూలాయి.
గౌరారం వద్ద రాజీవ్ రహదారిపై
వరద ప్రవాహం

గాలివాన బీభత్సం

గాలివాన బీభత్సం

గాలివాన బీభత్సం