మంత్రి ఈద్ ముబారక్
హుస్నాబాద్: రంజాన్ పండుగ సందర్భంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం పట్టణంలోని ముస్లిం నేతలు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపి స్వీట్స్ తినిపించారు. మాజీ ఎంపీటీసీ ఎండీ హస్సేన్‌తో పాటు పలువురి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, చిత్తారి రవీందర్ ఉన్నారు.


