సిద్దిపేటరూరల్: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు తక్షణం నష్టపరిహారం అందజేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లిలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించా రు. ఆయన మాట్లాడుతూ దెబ్బతిన్న పంటలను అంచనా వేసి వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ కింద ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. వరంగల్ డిక్లరేషన్‌లో ఎన్నో మాటలు చెప్పిన కాంగ్రెస్ నేటికీ అమలు చేయలేదన్నారు. రైతులకు రూ.2లక్షలు మాఫీ చేస్తానని చెప్పి పూర్తి స్థాయిలో మాఫీ చేయలేదన్నారు. రైతు భరోసా పేరిట ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వలేదన్నారు. వెంటనే వర్షాకాలం, యాసంగి పంటల రైతు భరోసా రూ.15వేల చొప్పున అందించాలన్నారు.
స్వశక్తితో ఎదగాలి
సిద్దిపేటజోన్: నేటి యువత స్వశక్తితో ఎదగాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధిలోని మహిళలు, యువతుల కోసం ఆదివారం స్థానిక విపంచి ఆడిటోరియంలో మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడితే విజయం ఖాయమన్నారు. కష్టపడిన వారు జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారన్నారు.
ఎమ్మెల్యే హరీశ్‌రావు
దెబ్బతిన్న పంటల పరిశీలన