3 | - | Sakshi
Sakshi News home page

3

Published Thu, Mar 20 2025 7:58 AM | Last Updated on Thu, Mar 20 2025 7:59 AM

యంగ్‌ ఇండియా స్కూళ్లు

సాక్షి, సిద్దిపేట: జిల్లాకు మూడు యంగ్‌ ఇండియా స్కూళ్లు రాబోతున్నాయి. 2025–2026 సంవత్సరానికిగాను రూ.3.04,965 కోట్లతో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అందులో జిల్లాకు ప్రత్యేకంగా కేటాయింపులు ఏమీ లేనప్పటికీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలలో లబ్ధిదారులకు ఫలాలు అందనున్నాయి. అందులో భాగంగా మహిళలకు చేయూత; పల్లె, పట్టణాల అభివృద్ధికి నిధులు రానున్నాయి. జిల్లాకు ప్రత్యేకంగా నిధులు కేటాయించక పోవడంతో ప్రజలు నిరాశ చెందారు.

కార్పొరేట్‌ స్థాయి వసతులతో

పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రైవేట్‌ స్కూళ్లో చదువుకోలేని వారి కోసం కార్పొరేట్‌ స్థాయి వసతులతో ప్రభుత్వం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేస్తోంది. తొలివిడతలో హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని కోహెడ మండలం తంగళ్లపల్లిలో నిర్మాణ పనులకు ఇప్పటికే శంకుస్థాపన చేశారు. ఈ సారి బడ్జెట్‌లో ప్రతి నియోజకవర్గంలో యంగ్‌ ఇండియా స్కూల్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాల్లో సైతం త్వరలో ఏర్పాటు చేయనున్నారు. దీంతో పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందనుంది.

మహిళలకు చేయూత

మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇప్పటికే బ్యాంక్‌ లింకేజీ రుణాలను అందజేస్తున్నారు. అలాగే క్యాంటీన్లను ఏర్పాటు చేయిస్తున్నారు. తాజాగా ప్రతి మండలంలో మహిళలతో రైస్‌ మిల్లులు, మినీ గోదాములు నిర్వహిస్తారని ప్రకటిం చారు. ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆ రైస్‌ మిల్లుల్లోనే మిల్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకి సరఫరాచేసే బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించనున్నారు. అలాగే మహిళా సమాఖ్యల ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి 150 అద్దె బస్సులు కేటాయించారు. త్వరలో మరో 600 బస్సులను కేటాయిస్తామని ప్రకటించడంతో మహిళా సంఘాల సభ్యులకు లబ్ధి చేకూరనుంది. మొదటి ఫేస్‌లో జిల్లాకు బస్సులేమీ దక్కకపోయినా త్వరలో కేటాయించే అవకాశాలున్నాయి. జిల్లాలో 18,274 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉండగా అందులో 1,94,714 మంది సభ్యులున్నారు.

ఆరు గ్యారెంటీలకు పెద్దపీట

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీల అమలు కోసం రూ.56,084 కోట్లు కేటాయించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 2,30,483 మంది దర ఖాస్తు చేసుకొన్నారు. అందులో ఇంటి స్థలం ఉండి ఇళ్లులేని వారు 86,968 మంది, స్థలం, ఇళ్లు లేనివారు 34,404 మందిగా గుర్తించారు. అందులో పైలెట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా జనవరి 26వ తేదీన 26 మండలాల్లో ఒక్కో గ్రామంలో 2,585 ఇళ్లను మంజూరు చేశారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా వాటిలో పూర్తి స్థాయిలో ఎంపికలు జరగలేదు. ఈ సారి బడ్జెట్‌లో కేటాయింపు వల్ల అర్హులందరికీ సొంతింటి కల నెరవేరనుంది. ఇప్పటికే గృహజ్యోతి, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌, రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకాలు కొనసాగుతున్నాయి.

కోమటిచెరువు

పర్యాటకం పూర్తయ్యేనా?

జిల్లాలో కోమటిచెరువు పర్యాటక అభివృద్ధి మధ్యలోనే నిలిచిపోయింది. శిల్పారామం, నెక్లెస్‌ రోడ్‌, బీచ్‌ పనులు యేడాదిన్నరగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అలాగే రంగనాయకసాగర్‌ దగ్గర పర్యాటక అభివృద్ధి అర్ధాంతరంగా నిలిచి పోయాయి. ఈ సారి బడ్జెట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకం కోసం రూ.775 కోట్లు కేటాయించారు. ఆ నిధుల నుంచి కోమటి చెరువు, రంగనాయకసాగర్‌ దగ్గర పర్యాటక అభివృద్ధికి నిధులు కేటాయించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

పల్లె, పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యం

మహిళలకు చేయూత

పర్యాటకానికి నిధులొచ్చేనా?

బడ్జెట్‌లో జిల్లాకు అంతంత మాత్రమే

పల్లె, పట్టణాల అభివృద్ధి

రాష్ట్ర బడ్జెట్‌లో పురపాలకశాఖకు రూ.17,677 కోట్లు కేటాయించారు. దీంతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలోని 115 వార్డులకు నిధులు రానున్నాయి. దీంతో పట్టణాలు అభివృద్ధి చెందనున్నాయి. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులకు కూడా మోక్షం కలిగే అవకాశం ఉంది. పంచాయతీ రాజ్‌కు రూ.31,605 కోట్లు కేటాయించారు. దీంతో జిల్లాలోని 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డులు అభివృద్ధి చెందనున్నాయి. అలాగే పెండింగ్‌లో ఉన్న బిల్లులు సైతం విడుద లయ్యే అవకాశం ఉంది.

31
1/2

3

32
2/2

3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement